political-news-img

రంగుల హోలీకి ‘మత్తు’ రంగు.... ఆరుగురు అరెస్టు

హోలీ అంటే రంగులు, సందడి, మిఠాయిలు… కొంచెం టమాటాలు, కోడిగుడ్లు కూడా ఎగిరిపడితే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కానీ ఈసారి హైదరాబాద్‌ లోని దూల్పేట్–నాంపల్లి ప్రాంతాల్లో మాత్రం రంగుల హోలీకి అదనంగా “మత్తు రంగు” కూడా జతైంది. గంజాయితో తయారుచేసిన బంగ్‌తో హుషారుగా తయ్య తక్కలు ఆడుతుండగా ఎస్‌టిఎఫ్ అంజిరెడ్డి బృందం, దూల్పేట్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి రంగు నీళ్లు చల్లేశారు!పండుగ హుషారులో “భంగ్ భంగ్” అంటూ సంబరాలు చేసు కుంటున్న వారిపై ఒక్కసారి గా దాడులు జరగడంతో రంగుల మధ్య రచ్చ మొదలైంది. తగ్గేదేలే అనే టైపులో పోలీసులు మొత్తం 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడు చోట్ల దాడులు చేసి మూడు కేసులు నమోదు చేసి ఆరుగురు మందిని అరెస్ట్ చేశారు. హోలీ హడావుడి నేరుగా ఎక్సైజ్ స్టేషన్ వరకూ చేరింది.హోలీ సందర్భంగా బేగం బజార్‌లో 860 గ్రాముల బంగ్ పట్టుకున్నారు చింతమని చందర్ సింగ్, సోహెల్ సింగ్‌ల “రంగుల వ్యాపారం” అక్కడితో ముగిసింది. ఇకపోతే హౌస్ నెంబర్ 15-7-585 వద్ద 812 గ్రాముల బంగ్ స్వాధీనం చేసుకున్నారు. భరత్ రాజ్, నందన్ యాదవ్, మహేష్‌ల హోలీ ప్లాన్‌కు బ్రేక్ పడింది.అలాగేచూడి బజార్ హౌస్ నెంబర్ 14-8-155లో 950 గ్రాముల గంజాయి బంగ్ బయటపడింది. సాగర్ శర్మ, అజయ్ శర్మల సంబరం పోలీస్ స్టేషన్‌లో ముగిసింది.పండుగ అంటే పూలు, రంగులు… కానీ కొందరికి మాత్రం “మత్తు రంగులే” అసలు హోలీలా మారింది. రంగులతో ఆడుకోవచ్చు, కానీ చట్టంతో కాదు అంటూ పోలీసులు హెచ్చరించారు.

Publish Date: Mar 3, 2026 9:24PM

political-news-img

మార్చి 6 నుంచి 99 రోజుల యాక్షన్ ప్లాన్ : సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 10 రకాల థీమ్స్‌తో 5 స్థాయిలలో ఈ యాక్షన్ ప్లాన్ సాగనుంది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమలు జరపాలని నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక సమావేశాన్ని నిర్ణయించారు. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు ముఖ్యమంత్రి తెలిపారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నాని తెలిపారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావుని తెలిపారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నాని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే..కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని సీఎం తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మొదలు… ముఖ్యమంత్రి వరకు ఇటు ప్రజా ప్రతినిధుల వ్యవస్థ, అటు కార్యనిర్వాహక వ్యవస్థ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలతో అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు చెల్లించాలి’’ అని సీఎం అన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సీఎస్‌, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.

Publish Date: Mar 3, 2026 9:14PM

political-news-img

టీటీడీ ఛైర్మన్‌పై విష ప్రచారానికి కోర్టు అడ్డుకట్ట..!

టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడుపై జరుగుతున్న విష ప్రచారానికి కోర్టు అడ్డుకట్ట వేసింది. హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేస్తూ, ఇకపై ఆయనపై ఎలాంటి అసత్య వార్తలు ప్రసారం లేదా ప్రచారం చేయరాదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలు, వీడియోలను తక్షణమే తొలగించాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు గూగుల్, ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుమలపై కుట్రలో భాగంగా, ఇటీవల టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా దుష్ప్రచారం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Publish Date: Mar 3, 2026 8:31PM

political-news-img

కల్వకుంట్ల కవిత అరెస్ట్

మూసీ నదిని ఆక్రమించి భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మాణం వద్ద ఉధృత వాతావరణం నెలకొంది..నార్సింగిలో మూసీ నదిని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలతో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్దకు వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కవిత బైఠాయించారు. దీంతో పోలీసులు కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పేదల ఇండ్లు కూల్చేసే అధికారులు, అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ వెంచర్ మీకు కనిపించడం లేదా?” అంటూ జాగృతి నాయ కులు, కార్యకర్తలు, స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.

Publish Date: Mar 3, 2026 8:12PM

political-news-img

విలాసాలకు అలవాటుపడి...చైన్ స్నాచర్‌గా మారిన టెకీ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉంటూ విలాసాలకు అలవాటు పడి, దొంగతనాలను వృత్తిగా మార్చుకున్న ఒక మోస్ట్ వాంటెడ్ ‘హాబిచ్యువల్ అఫెండర్’ను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు రూ. 40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన నిందితుడు మదనపల్లి మండలం, ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కోరకూటి రాజేష్ (35). వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రాజేష్, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు. *మూడు ప్రధాన నేరాల్లో నిందితుడు రాజేష్ ప్రధానంగా మూడు ప్రధాన నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.. ఫిబ్రవరి 16న మదనపల్లి బీసెంట్ రోడ్డులోని ఒక ఇంట్లో చొరబడి భారీగా బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. గత ఏడాది మార్చి 24న దేవాలయం వీధి సందులో ఒక ముసలి ఆమె వద్ద నుండి 30 గ్రాముల *బంగారు గొలుసును లాక్కెళ్ళాడు (చైన్ స్నాచింగ్) ఇదే ఏడాది ఫిబ్రవరి 6న మళ్ళీ దేవాలయం వీధిలోనే మరో వృద్ధురాలి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించాడని పోలీసులు వెల్లడించారు. నిందితున్ని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లి అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటాద్రి పర్యవేక్షణలో, మదనపల్లి 1 టౌన్ సిఐ కె. రాజా రెడ్డి, సి.సి.ఎస్ ఇన్ స్పెక్టర్ ఎం. చంద్రశేఖర్, ఎస్.ఐ ఎస్.కె రహమతుల్లా, సి.సి.ఎస్ ఎస్.ఐ ఎం.కె నరసింహులు వారి బృందం మార్చి 3న ఉదయం 8:30 గంటలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసులకు సంబంధించిన మొత్తం రికవరీని పూర్తి చేశారు. జిల్లా ఎస్పీహెచ్చరిక ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, "యువత చెడు అలవాట్లకు బానిసలై నేరాల బాట పట్టడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతుంది. చదువుల్లో రాణించి జీవితంలో పైకి రావాలి తప్ప, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డులను అందజేశారు.

Publish Date: Mar 3, 2026 7:03PM

political-news-img

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి హతం

ఇరాన్ ప్రభుత్వంలోని కీలక నేతలను ఇజ్రాయెల్ వరుసగా హతం చేస్తుంది. ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ రక్షణ కొత్త మంత్రి మజీద్ ఇబెన్ అల్-రెజా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. మంత్రిగా నిన్ననే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం..ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి అమీర్‌ నాసిర్‌జాదే మృతిచెందిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో తాత్కాలిక రక్షణ మంత్రిగా మజీద్‌ను నియమించింది. రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే నూతన రక్షణ మంత్రి మృతిచెందడంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. సోమవారం బాధ్యతలు స్వీకరించిన మజీద్‌ ఇబెన్‌ అల్‌-రెజా మృతిచెందడంపై ఇరాన్ రక్షణ వర్గాల్లో కలకలం రేగుతోంది. దాడులు ఎక్కడ జరిగాయి? ఆయుధాలను ఉపయోగించారా అనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతిని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.

Publish Date: Mar 3, 2026 6:44PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img