మగువల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. ఆరోగ్యకరమైన బరువే..!

Publish Date:Jan 17, 2025

Advertisement

 

ఆరోమగువలగ్యానికి శ్రీరామ రక్ష.. ఆరోగ్యకరమైన బరువే..!ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పటి మహిళల ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా చాలా దారుణ స్థితికి దిగజారింది.  ముఖ్యంగా చాలామంది మహిళలు అధిక బరువు సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల మార్పుల కారణంగా,  ఒత్తిడి కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.. మహిళలు  సరైన బరువు ఉంటే ఈ సమస్యలు అసలు ఉండనే ఉండవనీ.. దీని గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో మహిళల ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి కూడా ఒక ప్రత్యేక రోజును జరుపుకోవడం మొదలుపెట్టారు.  ప్రతి ఏడాది జనవరి నెలలో మూడవ గురువారాన్ని మహిళల ఆరోగ్యకరమైన బరువు దినోవత్సంగా కేటాయించారు. ఇది అంత పరిచయమైన దినోత్సవం కాకపోయినా మహిళల కోణంలోనూ, మహిళల ఆరోగ్య పరంగా గమనిస్తే ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగినదే..

ఎవరిని అయినా మొదట చూడగానే వారి శారీరక రూపాన్నే చూస్తాం.  లావుగా ఉంటే అబ్బో ఎంత లావో అని.. సన్నగా ఉంటే బక్కగా ఉన్నారని అంటుంటాం. అయితే కొందరు లావు ఉన్నా ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు.  మరికొందరు సన్నగా ఉన్నా చాలా ఇబ్బందికరంగా, అనారోగ్యంగా,  ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ లావుగా ఉంటే అదేదో రోగమున్నట్టు,  సన్నగా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు భావిస్తారు కొందరు. కానీ ఆరోగ్యంగా ఉండటం అనేది కేవలం బరువు ద్వారా నిర్ణయించడం జరగదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది ఆరోగ్యకరమైన బరువును నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణం. ఇటీవల, ఆరోగ్యకరమైన బరువును కొలవడానికి కొత్త ప్రమాణాలు అభివృద్ధి చేస్తున్నారు.  ఇవి  BMI కంటే మరింత ఖచ్చితమైనవిగా ఉంటాయట. చాలా మంది మహిళలు  సరైన బరువుకు రావడానికి చాలా కష్టపడతారు. అధిక బరువు ఉన్నవారు అయితే బరువు తగ్గడం కోసం కడుపు మాడ్చుకుంటారు. సన్నగా ఉన్నవారు సరైన బరువుకు చేరడానికి అనారోగ్యకరమైన తిండి కూడా తింటారు. ఈ కారణాల వల్ల చాలా మంది ప్రాణాంతక సమస్యలలోకి జారుకుంటారు.  మరికొందరు మహిళలు బరువు మీద దృష్టి పెట్టరు. అందుకే కనీసం ఈ రోజు అయినా మహిళలు తమ బరువు విషయంలో ఆలోచించి సరైన బరువును  చేరుకోవడానికి ప్రణాళికలు వేసుకుని ప్రయత్నాలు చేసి లక్ష్యాలు చేరుకోవాలి.

బరువు చేరుకోవడానికి ఏం చేయాలి?

సరైన బరువు చేరుకోవడానికి డైట్ మెయింటైన్ చేయాలి.  ఆరోగ్యకరమైన, పోషకాహారం తీసుకోవాలి. వేపుళ్లు, నూనెలో వేయించిన ఆహారాలు,  ఫాస్ట్ ఫుడ్,  ఇన్స్టంట్ ఫుడ్ మొదలైనవి అవాయిడ్ చేయాలి. సమతుల్య ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించాలి. పాలు, పండ్లు, ఆకుకూరలు,  కూరగాయలు బాగా వినియోగించాలి.

ఆహారం తీసుకోవడానికి తగినట్టు శారీరకంగా చురుగ్గా ఉండాలి.  రోజూ వ్యాయామం, నడక,  యోగా, సైక్లింగ్ వంటివి  ఏవో ఒకటి ఫాలో అవుతూ ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రతిరోజూ ధ్యానం చేయాలి.  ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలి.  ఆహారం, వ్యాయామం,  ధ్యానం విషయాలలో ఎప్పుడూ ఏమాత్రం రాజీ పడకూడదు.


                                 * రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.