2021లో టాప్ గూగుల్ ట్రెండ్స్ ఏంటో తెలుసా..?

Publish Date:Dec 9, 2021

Advertisement

బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. వెంట‌నే జ‌నాలంతా గూగుల్‌లో వెతికారు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ తెలుసుకున్నారు. రావ‌త్ అనే కాదు.. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మాచారం కావాల‌న్నా.. గూగుల్ త‌ల్లిని అడిగేస్తుంటారు. క‌రోనా టైమ్‌లో అయితే.. గూగులే అంద‌రికీ దిక్చూచిగా నిలిచింది. ఇక క్రికెట్ మ్యాచ్‌లు అయితే.. గూగుల్‌లో లైవ్ అప్‌డేట్స్ చూడాల్సిందే. ఇలా.. 2021లో గూగుల్‌లో మోస్ట్ ట్రెండింగ్‌గా నిలిచిన టాపిక్స్ ఏంటో తెలుసా...? తాజాగా, 2021లో భారతీయులు గూగుల్‌ లో ఎక్కువగా వెతికిన సమాచారానికి సంబంధించిన జాబితాను గూగుల్ విడుదల చేసింది. అవేంటంటే....

లాస్ట్ ఇయ‌ర్‌లానే.. ఈ ఏడాది కూడా కరోనా, వ్యాక్సినేష‌న్ టాపిక్‌ టాప్‌లో నిలుస్తుంది అనుకున్నారు. కానీ, క‌రోనా సెర్చ్‌ను దాటేసి.. క్రికెట్ దూసుకుపోయింది. ఇండియాలో ఐపీఎల్‌కు ఎంత ఆద‌ర‌ణ ఉందో చాటిచెప్పింది. ఈ ఏడాది ఎక్కువ మంది ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌ గురించి ఎక్కువగా వెతికారు. టాప్‌ 10 జాబితాలో ఐపీఎల్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా.. కొవిన్‌ పోర్టల్ సెకండ్ ప్లేస్‌లో, ఐసీఐసీఐ టీ20 వరల్డ్‌ కప్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో యూరో కప్‌, టోక్యో ఒలింపిక్స్‌ నిలిచాయి. 

1. ఐపీఎల్ |   2. కొవిన్ పోర్టల్‌ |   3. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ |   4. యూరో కప్‌ |   5. టోక్యో ఒలింపిక్స్‌ |   6. కొవిడ్ వ్యాక్సిన్‌ |   7. ఫ్రీ ఫైర్‌ రిడీమ్ కోడ్‌ |   8. కోపా అమెరికా   9. నీరజ్‌ చోప్రా |   10. ఆర్యన్‌ ఖాన్‌

 

మూవీ కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సూర్య నటించిన జై భీమ్‌ సినిమా గురించే గూగుల్‌ చేశారు. జై భీమ్‌ తర్వాత ఎక్కువగా షేర్షా సినిమా గురించి వెతికారు. ఇక మిగ‌తా టాప్ 10 మూవీ సెర్చెస్ ఏంటంటే..

1. జై భీమ్‌ | 2. షేర్షా | 3. రాధే | 4. బెల్‌బాటమ్‌ | 5. ఎటర్నల్స్‌ | 6. మాస్టర్‌ | 7. సూర్యవంశీ | 8. గాడ్జిల్లా vs కాంగ్ | 9. దృశ్యం 2 | 10. భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా  

 

వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలిపింక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో ఇండియాకు గోల్డ్ మెడ‌ల్‌ అందించిన నీరజ్‌ చోప్రా గురించి ఎక్కువ మంది యూజర్స్ గూగుల్ చేశారు. తర్వాత షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్ కోసం వెతకగా, మూడో స్థానంలో నటి షెహనాజ్‌ గిల్‌, నాలుగులో రాజ్‌ కుంద్రా, ఐదులో ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు. ఇక టాప్ 10లో ఉన్నావారు ఎవ‌రంటే...

1. నీరజ్‌ చోప్రా | 2. ఆర్యన్‌ ఖాన్‌ | 3. షెహనాజ్‌ గిల్‌ | 4. రాజ్‌ కుంద్రా | 5. ఎలాన్‌ మస్క్‌ | 6. విక్కీ కౌశల్ | 7. పీవీ సింధు | 8. బజరంగ్‌ పునియా | 9. సుశీల్‌ కుమార్‌ | 10. నటాషా దలాల్‌  

Near Me అంటూ అందుబాటులో ఉన్న సేవల గురించి వెతికే జాబితాలో ఎక్కువ మంది కొవిడ్‌కు సంబంధించిన సమాచారం గూగుల్ చేశారట. 

1. కొవిడ్ వ్యాక్సిన్‌ |   2. కొవిడ్ టెస్ట్‌ |   3. ఉచిత ఫుడ్ డెలివరీ |   4. ఆక్సిజన్ సిలిండర్‌ |   5. కొవిడ్ ఆస్పత్రి |   6. టిఫిన్‌ సర్వీస్‌ |   7. సీటీ స్కాన్‌ |   8. టేకవుట్ రెస్టారెంట్ |   9. ఫాస్టాగ్‌ |   10. డ్రైవింగ్ స్కూల్‌  

What is.. అంటే ఏమిటీ.. అంటూ నెటిజ‌న్లు ఆస‌క్తిగా సెర్చ్ చేసిన అంశాలు ఈ ఏడాదిలో చాలానే ఉన్నాయి. అందులో ప్ర‌ముఖంగా సెర్చ్ చేసిన టాపిక్స్ ఇవే...

1. బ్లాక్‌ఫంగస్‌ | 2. ఫాక్టోరియల్ ఆఫ్‌ హన్రెండ్‌ | 3. తాలిబన్‌ | 4. అఫ్గాన్‌లో ఏం జరుగుతోంది | 5. రెమెడెసివిర్‌ | 6. స్క్వేర్‌ రూట్‌ ఆఫ్‌ 4 | 7. స్టెరాయిడ్ | 8. టూల్‌కిట్‌ | 9. స్క్విడ్‌ గేమ్‌ | 10. డెల్టా ప్లస్ వేరియంట్   

How To.. ఎలా చేయాలి అంటూ ఎక్కువ మంది గూగుల్ చేసిన టాపిక్స్ ఏంటంటే.. 

1. కొవిడ్ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ | 2. వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ | 3. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవడం | 4. పాన్‌-ఆధార్‌ లింక్‌ | 5. ఇంట్లోనే ఆక్సిజన్ తయారీ | 6. ఇండియాలో క్రిప్టోకరెన్సీ కొనుగోలు | 7. బనానా బ్రీడ్ తయారీ | 8. ఐపీఓ కేటాయింపులు | 9. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు | 10. మార్కుల పర్సంటేజ్ లెక్కింపు  

ఇక‌, వంటల కేటగిరీలో ర‌క‌ర‌కాల డిషెష్ గురించి శోధించారు నెటిజ‌న్లు. వాటిలో పుట్టగొడుగులు, ఆవిరి కుడుములు, మెతీ మటర్‌ మలాయి, పాలక్‌, చికెన్‌ సూప్‌ల గురించి ఎక్కువగా వెతికినట్లు గూగుల్ సంస్థ‌ తెలిపింది. 

ఇక న్యూస్ త‌దిత‌ర అంశాల్లో.. టాప్ 10 గూగుల్ టాపిక్స్‌...

1. టోక్యో ఒలిపింక్స్‌ | 2. బ్లాక్ ఫంగస్‌ | 3. అఫ్గాన్ వార్తలు | 4. పశ్చిమబెంగాల్ ఎన్నికలు | 5. ట్రాపికల్‌ సైక్లోన్‌ | 6. లాక్‌డౌన్‌ | 7. సూయజ్‌ కెనాల్ క్రైసిస్‌ | 8. రైతుల నిరసన | 9. బర్డ్‌ ఫ్లూ | 10. సైక్లోన్‌ యాస్‌  

By
en-us Political News

  
విరాట్ కోహ్లీ. ఈ పేరు విన‌గానే.. సూప‌ర్ బ్యాట్స్‌మేన్‌.. డాషింగ్ బ్యాట్స్‌మెన్‌.. టెరిఫిక్ కెప్టెన్‌.. అగ్రెసివ్ యాటిట్యూడ్‌.. ఖ‌త‌ర్నాక్ ఫీల్డ‌ర్‌.. ఇలాంటి స్టేట్‌మెంట్సే గుర్తుకు వ‌స్తాయి. కానీ, ఈ ప‌రుగుల యంత్రం ఖాతాలో తాజాగా ఓ ప‌ర‌మ చెత్త‌ రికార్డు జ‌మ అయింది. 
మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరుతో ఇండియా టుడే స‌ర్వే. గ‌తంలో చేసిన స‌ర్వేలోనే జ‌గ‌న్ గ్రాఫ్ దారునంగా ప‌త‌న‌మైంద‌ని తేలింది. లేటెస్ట్‌గా మ‌రో స‌ర్వే కూడా చేసింది ఇండియా టుడే. మ‌న రాష్ట్రానికి చెందిన మీడియా సంస్థ కాదు కాబ‌ట్టి.. ఎల్లో మీడియా అనే అబాంఢాలు వేసే అవ‌కాశ‌మే లేదు. సో.. ఈ స‌ర్వే నివేదిక కాస్త రియ‌లిస్టిక్‌గా ఉంటుంద‌ని న‌మ్మొచ్చు. మూడ్ ఆఫ్ ది నేషన పేరుతో ఇండియా టుడే విడుదల చేసిన పోల్‌లో ఏపీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 
ఎన్నికల సందర్భంగా ఇచ్చీ హామీలు అన్నీ అమలు చేయడం, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వనికీ సాధ్యంకాదు. కానీ, ఏవో కొన్ని ఉచితాలు తప్ప, ఇచ్చిన హామీలు ఏవీ, ముఖ్యంగా సుస్థిర అభివృద్ధికి ఆడగా నిలిచే హామీలు ఏవీ  అమలు చేయని ఘనత మాత్రం నిస్సందేహంగా వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. 
ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకొనేందుకు బ‌రిలో దిగింది టీమిండియా. మొద‌ట బ్యాటింగ్ చేసి.. సౌత్ ఆఫ్రికాకి 287 ప‌రుగుల‌ భారీ టార్గెట్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. రిష‌భ్ పంత్ చెల‌రేగి పోయాడు. చివ‌రాఖ‌రిలో బౌల‌ర్లు శార్దూల్‌ ఠాకూర్‌, అశ్విన్ స్టో అండ్ స్ట‌డీగా ప‌రుగులు సాధించి భారీ స్కోరుకు కార‌ణ‌మ‌య్యారు. విరాట్ కోహ్లీ డ‌కౌట్ కావ‌డం ఒక్క‌టే కాస్త నిరాశ ప‌రిచే అంశం.
కేఎల్ రాహుల్‌కు గోల్డెన్ టైమ్ న‌డుస్తున్న‌ట్టుంది. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టూర్‌లో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఆ జోష్ అలా కంటిన్యూ అవుతుండ‌గానే.. లేటెస్ట్‌గా వెడ్డింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ల‌వ‌ర్ క‌మ్ బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టిని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్నాడు కేఎల్ రాహుల్. ఈ అప్‌డేట్ ఇటు బాలీవుడ్‌.. అటు క్రికెట్‌వుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. 
ఎన్నికలు అన్నతర్వాత హామీలు ఇవ్వవలసిందే. అమలు చేయడం చేయక పోవడం తర్వాతి విషయం. అయితే ఓ వంక ఏపీలో అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిన సీపీఎస్ రద్దు, హామీని ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో వినిపించడం కొంచెం ఆసక్తిగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తమ ప్రతి అధికారంలోకి వస్తే, సీపీఎస్ రద్దు చేస్తామని హమీనిచ్చారు. ఆ హామీకి స్పందించిన  ఉద్యోగులు గంప గుత్తగా వైసీపీకి ఓటేశారు. వైసీపీ గెలిచింది. హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నర సంవత్సరాలు అయింది. అయినా, సీపీఎస్ రద్దు హామీ మాత్రం నెరవేరలేదు. అంతేకాదు, అది అయ్యేది కాదని, ముఖ్యమంత్రి చేతులు ఎత్తేశారు. ఇప్పడు ఏపీలో రోడ్డెక్కిన ఉద్యోగులు  సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి అది అమలు చేయక పోగా పీఆర్సీ, హెచ్ఆర్ఎకు ఎసరు తెచ్చారని ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. 
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. బీజేపీ నుంచి ముగ్గురు మంత్రులు మరి కొందరు ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ (ఎస్పీ) తీర్ధం పుచ్చుకున్నారు. మరో వంక ఎస్పీ ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ములాయం సింగ్ యాదవ్ రెండవ కోడలు అపర్ణ, ములాయం తోడల్లుడు, మాకీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కమలం గూటికి చేరారు. కాంగ్రెస్, బీఎస్పీ కూడా పోటీలో ఉన్నా ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్ వాదీ కూటమి మధ్యనే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ చాలా కాలం తర్వాత ఒంటరిగా బరిలో నిలుస్తోంది.అంతే కాకుండా, సర్వేలన్నీ హస్తం పార్టీకి సింగిల్ డిజిట్ చూపిస్తున్నా, కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా మాత్రం దూకుడుగా ముందుకు సాగుతున్నారు. 
క‌నిపిస్తే దాడులు.. కుదిరితే కేసులు.. వీలైతే హ‌త్య‌లు.. ఏపీలో వైసీపీ మూకల ఆగ‌డాల‌కు అంతేలేకుండా పోతోంది. ఇటీవ‌ల ప‌ల్నాడులో చంద్ర‌య్య‌ను వైసీపీ నాయ‌కులు న‌డిరోడ్డుపై దారుణంగా చంపేస్తే.. తాజాగా గుడివాడ‌లో టీడీపీ నేత బోండా ఉమాపై మ‌రోసారి హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. గుడివాడ‌లో గోవా క‌ల్చ‌ర్ తీసుకొచ్చి.. కె క‌న్వెన్ష‌న్‌లో గ‌బ్బు గ‌బ్బు చేసిన ఘ‌ట‌న‌పై.. టీడీపీ నిజ‌నిర్థార‌ణ క‌మిటీ కొడాలి నాని ఇలాఖాలో అడుగుపెట్టింది. టీడీపీ నాయ‌కుల రాక‌న త‌ట్టుకోలేని.. వైసీపీ మూక‌లు వారిపై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. 
బండ్ల గణేశ్ ఎపిసోడ్ గుర్తుందిగా! అప్ప‌ట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఒక‌వేళ తాను ఓడిపోతే.. 7' ఓ క్లాక్ బ్లేడ్‌తో మెడ కోసుకొని చ‌స్తా నంటూ స‌వాల్ చేశారు. ఆ త‌ర్వాత అస‌లా ఎన్నిక‌ల్లో బండ్ల గ‌ణేశ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెటే ఇవ్వ‌లేదు. ఆయ‌న పోటీనే చేయ‌లేదు. దీంతో.. కొంద‌రు ఉత్సాహ‌వంతులు 7' ఓ క్లాక్ బ్లేడ్ తీసుకొని ఆయ‌న ఇంటికెళ్లారు. బండ్ల గ‌ణేశ్ ఇంట్లో లేరు. అప్ప‌టి నుంచీ ఆయ‌న్ను బ్లేడ్ బాబ్జీ అంటున్నారు. ఆ త‌ర్వాత అదే విష‌యాన్ని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తే.. ఊరుకోండి.. ఫ్లో లో ఎన్నెన్నో అంటాం.. అవ‌న్నీ చేస్తామా ఏంటి? అంటూ బండ్ల గ‌ణేశ్ కామెడీ చేశారు. సేమ్ టూ సేమ్‌.. అలాంటి సంద‌ర్భ‌మే ఇప్పుడు ఏపీలో తెర‌మీద‌కు వ‌చ్చింది. 
ఆయ‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. రాష్ట్రంలోకే అత్యంత సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి. బాగా స‌మ‌ర్థ‌వంతుడు, ప‌నిమంతుడినే సీఎస్ ప‌ద‌విలో కూర్చొబెడ‌తారు. కానీ, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ చ‌ర్య‌లు ప‌లుమార్లు విమ‌ర్శ‌ల పాల‌య్యాయి. అసంబ‌ద్ద‌ నిర్ణ‌యాల‌తో ప్ర‌భుత్వానికి త‌ల‌వొంపులు తీసుకొస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే....
కృష్ణా జిల్లా గుడివాడలో క్యాషినో రగడ పెరిగిపోతూనే ఉంది. కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాషినో ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతల నిజనిర్ధారణ కమిటీ క్యాషినో కథ నిగ్గు తేల్చేందుకు యత్నించింది. కే కన్వెన్షన్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ,  బోండా ఉమ, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, ఆచంట సునీత, తంగిరాల సౌమ్య సహా ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పామర్రు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గుడివాడలో పరిస్థితులు మరింత తీవ్ర స్థాయికి వెళ్లిపోయాయి.
ప్ర‌భుత్వం పీఆర్సీ పంతం వీడ‌ట్లేదు. ఉద్యోగులు పీఆర్సీపై ప‌ట్టు వీడ‌ట్లేదు. ఎవ‌రికి వారే త‌గ్గేదేలే అంటూ స‌త్తా చాటుతున్నారు. పీఆర్సీ జీవోల‌తో ఉద్యోగుల జీతాల‌కు భారీ చిల్లు ప‌డుతోంది. ఆ జీవోలు వెంట‌నే ర‌ద్దు చేయాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కి పోరాడుతున్నారు. అయినా, పీఆర్సీలో ఎలాంటి మార్పు లేదంటూ.. ఆ జీవోల‌కు ఏపీ మంత్రివ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు, జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. 
కొవిడ్ కేసులు బీభ‌త్సంగా పెరుగుతున్నాయి. క‌ట్ట‌డి అదుపు త‌ప్పింది. విచ్చ‌ల‌విడి కేసుల‌తో క‌ల్లోలం మొద‌లైంది. బ‌స్సు, రైళ్ల ప్ర‌యాణంతో క‌రోనా ముప్పు మ‌రింత వ్యాపించే ప్ర‌మాదం ఉంది. అందుకే, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అల‌ర్ట్ అయింది. ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. ఈ నెల 21 నుంచి 24వరకు.. 4 రోజుల పాటు 55 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ర‌ద్దైన రైళ్ల జాబితా రిలీజ్ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.