political-news-img

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారబోతోందా?

తెలుగువన్ ‘వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే చర్చ.. అదే నియోజకవర్గాల పునర్విభజన. రాబోయే రోజుల్లో లోక్ సభ సీట్ల సంఖ్య పెరగబోతోందా? అలా పెరిగితే ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు లాభమా లేక భారీ నష్టమా? ప్రముఖ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్‌తో 'వాస్తవ వేదిక' ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడైన కీలక అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతానికి పట్టం కడుతూ, దక్షిణ భారతాన్ని విస్మరిస్తున్నారన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి చారిత్రక నేపథ్యంలో విభజన చిక్కులు నియోజకవర్గాల విభజన అనేది కేవలం జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని డోలేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. 1971 తర్వాత ఇందిరా గాంధీ హయాంలో సీట్లను స్తంభింపజేయడం వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన వివరించారు. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తూ, జనాభాను పెంచుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమనే వాదన బలంగా వినిపిస్తోందని రవిశంకర్ ప్రశ్నించారు. ఒకవేళ ఉత్తరాదికి 600 సీట్లు వచ్చి, దక్షిణాదికి కేవలం 200 చిల్లర సీట్లు వస్తే, ఢిల్లీలో దక్షిణాది ఎంపీల వాయిస్ వినిపించదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములాపై చర్చ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 50% జనాభా, 50% జిడిపి (GDP) ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఫార్ములాపై కూడా చర్చ జరిగింది. కేవలం జనాభాను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, ఆర్థిక అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ చేసిన సూచనలు ఆచరణలో సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా తోడ్పడుతున్నా, రాజకీయ ప్రాతినిధ్యంలో మాత్రం వెనుకబడిపోతున్నదని తెలుగువన్ ఎండీ తెలిపారు. రాజకీయ వ్యూహాలు - చంద్రబాబు వర్సెస్ జగన్ ఈ పునర్విభజన ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్రపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో జరిగిన విభజన సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన చాతుర్యంతో వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల విషయానికొస్తే, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉందని, సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్ ద్వారా లెక్కలు వేస్తే అది వైసీపీకే మేలు చేస్తుందని విశ్లేషించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగితే ఈ ప్రమాదాన్ని అడ్డుకోవచ్చని, కానీ లోకేష్ టీమ్ కేవలం అంకెలకు పరిమితమైతే నష్టం తప్పదని అభిప్రాయపడ్డారు. ప్రజా స్పందన మరియు రియల్ టైమ్ రియాక్షన్స్ ఈ చర్చపై సామాన్యుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. "మేము జనాభాను నియంత్రిస్తే మా సీట్లు తగ్గించడం ఏంటి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం అందరూ ఏకం కావాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ వివక్ష అనే పదం మళ్ళీ తెరపైకి రావడం బీజేపీకి దక్షిణ భారత్‌లో సవాలుగా మారేలా కనిపిస్తోంది. మోడీ-అమిత్ షా ద్వయం దక్షిణాదిపై వివక్ష చూపుతోందన్న విమర్శలపై కమలనాథులు ఎలా స్పందిస్తారో చూడాలి. ముగింపు మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తును, సమాఖ్య స్ఫూర్తిని ప్రభావితం చేసే అంశం. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు ఢిల్లీలో తమ ఉనికిని కాపాడుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి

Publish Date: Apr 16, 2026 9:29PM

political-news-img

హార్ట్ అటాక్ రాబోయే ముందు మన శరీరం ఇచ్చే ముందస్తు హెచ్చరికలు ఏమిటి!

నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ఈ ప్రత్యేక వీడియోలో, హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే ఆ ప్రమాదకరమైన సంకేతాల గురించి క్లియర్ గా వివరించడం జరిగింది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు: ముందస్తు లక్షణాలు: గుండెపోటు రావడానికి కొన్ని రోజుల ముందు శరీరంలో కనిపించే మార్పులు ఏమిటి? నిర్లక్ష్యం చేయకూడని నొప్పులు: కేవలం ఛాతీ నొప్పి మాత్రమేనా? లేక ఇతర శరీర భాగాల్లో వచ్చే నొప్పులు కూడా గుండెపోటుకు సంకేతాలా? అప్రమత్తత: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? ముందుజాగ్రత్త చర్యలు: ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే చేయాల్సిన పనులు ఏమిటి? మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకోసమే కాదు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. హార్ట్ అటాక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే ఆ ప్రమాదకరమైన సంకేతాలు ఏమిటో తెలుసుకోండి. ఈ లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. మరిన్ని ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Apr 16, 2026 8:10PM

political-news-img

మైక్రో ఫైనాన్స్ కేసులో ట్విస్ట్!

హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది. రామావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందుగా న్యాయవాది సుబ్బారావు మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ గాయని మంగ్లీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం మంగ్లీ కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ పంజాగుట్ట పోలీసులు ను ఆశ్రయించడంతో పాటు హైదరాబాద్ సీపీ, డీజీపీ లకు కూడా ఫిర్యాదు చేసింది.ఈ పరిణామాల మధ్య రామావత్ మధు విడుదల చేసిన వీడియో మరింత సంచలనం సృష్టించింది. మా గురువు హేమ కాంత్ రెడ్డి న్యాయవాది సుబ్బారావు, సరిత కలిసి ఒక గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. సరిత బాధితురాలు కాదు.. కానీ మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ బలే నటిస్తుంది. ముఖ్యంగా సరితను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వీడియో విడుదలైన కొద్దిసేపటికే సైబరాబాద్ పోలీసులు రామావత్ మధును అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దర్యాప్తు పురోగతిపై ఆసక్తి నెలకొంది.

Publish Date: Apr 16, 2026 8:09PM

political-news-img

వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గత రెండు రోజులుగా ఉత్కంఠ రేపిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీహరికి కుప్పం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 33 గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్న ఆయనకు న్యాయస్థానం నుంచి ఊరట లభించింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిబంధనల ప్రకారం 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉండగా, పోలీసులు ఆయనను సుదీర్ఘకాలం పాటు అజ్ఞాతంలో ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బుధవారం రోజంతా ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన చెందారు. అరెస్టు చేసిన 33 గంటల తర్వాతే శ్రీహరికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు, ఆపై కుప్పం కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు కావాలనే ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కాలయాపన చేశారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న న్యాయమూర్తి, శ్రీహరికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో, కుప్పం నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

Publish Date: Apr 16, 2026 7:58PM

political-news-img

లోక్‌సభలో ముందుకు 3 కీలక బిల్లులు...డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్టంభన!

దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణలకు సంబంధించిన ఈ బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటింగ్‌కు ముందు సుదీర్ఘ చర్చ జరగనుంది. మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెడతారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ అమలు కోసం నియోజకవర్గాల పునర్విభజన అవసరమని కేంద్రం వాదిస్తోంది. ఈ క్రమంలో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇండియా’ కూటమి మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే, జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వం డీలిమిటేషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించారు. “మహిళా రిజర్వేషన్‌కు మేము మద్దతు ఇస్తాం. కానీ డీలిమిటేషన్‌తో గిమ్మిక్కులు చేస్తున్నారన్న అనుమానం ఉంది” అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. అధికార ఎన్డీయే కూటమికి తగిన సంఖ్యలో సభ్యులు లేకపోవడంతో విపక్షాల మద్దతు కీలకంగా మారింది. సుమారు 18 గంటలపాటు కొనసాగే ఈ చర్చలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురావొచ్చని భావిస్తున్నారు.

Publish Date: Apr 16, 2026 7:38PM

political-news-img

పడిలేచిన కెరటం.. వెన్ను చూపని పోరాట శిఖరం.. లోకేష్

కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను గత ఎన్నికలకు ముందు స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకుని సాధించిన చూపిన నిబద్దత గల కార్యదక్షకుడు లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే ఆయన యువగళం పాదయాత్రతో అన్ని తొలగిపోయాయి. సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరించేశాయి. ఆ సమర్థత, ఆ గుర్తింపు ఫలితమే ఇప్పుడు ఆయనకు పార్టీలో ప్రమోషన్ దక్కింది. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు చాలా గట్టిగా జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారంటే.. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు. ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా దాడి చేశారు. అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని, సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి చంద్రబాబు మాటల స్ఫూర్తితో ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా వెరవలేదు. అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. విపక్షంలో ఉండి ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ణంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు. అలాగే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగించారు. తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుల్యంలోనూ కలిగించారు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే ఇప్పుడాయనను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసింది. నారా లోకేష్ కు ఈ నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు. ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్ర అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి అధికార వైసీపీ పన్నని కుట్రలు, చేయని కుతంత్రాలు లేవు. వాటన్నిటినీ ప్రజాదరణతో ఎదుర్కొని లోకేష్ ముందడుగు వేసిన తీరు నిజంగా నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు. కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది. ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి. లోకేషా.. పాదయాతా అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బంధాన్ని మరింత పటిష్టం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెడతారని అంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి లోకేశ్ మరింత బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Apr 16, 2026 7:21PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img