political-news-img

నా తండ్రి నుంచే నాకు ప్రాణహాని ఉంది.. ఎమ్మెల్యే కొడుకు సంచలన వ్యాఖ్యలు ..!

రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తన సొంత తండ్రి అయిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నుంచే తనకు, తాను ప్రేమించిన యువతికి తీవ్ర ప్రాణహాని ఉందంటూ సంతోష్ గౌడ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక పక్క ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను తీర్చాల్సిన రాజకీయ నాయకుడి ఇంట్లోనే ఇలాంటి తీవ్రస్థాయి కుటుంబ కలహాలు, ప్రాణ బెదిరింపులు వెలుగుచూడటం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకోవడమే తాను చేసిన నేరమా అని సంతోష్ ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏ క్షణంలోనైనా తనను, తనకు కాబోయే భార్య కుటుంబాన్ని చంపే ప్రమాదం ఉందంటూ పోలీసులను, ప్రభుత్వాన్ని రక్షణ కల్పించాలని బహిరంగంగా ఆర్థించాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, సంతోష్ గౌడ్ శ్రీయాషి అనే యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో తొలత కొన్ని చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే 2026 జులై 8వ తేదీన ఇరు కుటుంబాల పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో సంతోష్, శ్రీయాషిల నిశ్చితార్థం కూడా ఎంతో వైభవంగా జరిగింది. కన్న తల్లిదండ్రులు స్వయంగా ముందుండి ప్రేమ వివాహం జరిపించడానికి నిరాకరించినప్పటికీ, కుమారుడి ఇష్టాన్ని గౌరవిస్తూ వివాహానికి స్పష్టమైన అనుమతి ఇచ్చారని సంతోష్ తెలిపాడు. ఈ నిశ్చితార్థం ముగిసిన తర్వాత గత 1 నెల రోజులుగా తాను కాబోయే భార్య ఇంట్లోనే నివాసముంటున్నానని, ఈ విషయం తన తండ్రి ప్రకాశ్ గౌడ్‌తో సహా కుటుంబ సభ్యులందరికీ పూర్తిగా తెలుసని అతడు మీడియాకు వెల్లడించాడు.అయితే ఊహించని రీతిలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. తమ వివాహాన్ని ససేమిరా ఒప్పుకోని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, తన అనుచరులతో దాడులకు పూనుకున్నట్లు సంతోష్ తీవ్రమైన విమర్శలు చేశాడు. సుమారు 40 మంది గుండాలు, అనుచరులు అకస్మాత్తుగా వచ్చి తాను ఉంటున్న కాబోయే అత్తగారి ఇంటిపై విచక్షణారహితంగా దాడి చేశారని సంతోష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇంట్లోని మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటమే కాకుండా, అసత్య ప్రచారాలు చేస్తూ ఎవరో అప్పులివ్వాలంటూ తప్పుడు పిటిషన్లు ఇప్పించి మానసికంగా, శారీరకంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. ఈ అకృత్యాలకు, దాడులకు సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలు, వీడియో రికార్డింగ్‌లు కూడా తమ వద్ద భద్రంగా ఉన్నాయని అతడు స్పష్టం చేశాడు. ప్రజాప్రతినిధిగా ఉంటూ సొంత కొడుకుపైనే గుండాలతో దాడి చేయించడం ఎంతవరకు న్యాయమని సంతోష్ గౌడ్ తీవ్రంగా ప్రశ్నించాడు. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేకపోవడం వల్లే తమను అంతమొందించేందుకు ఈ కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఏ నిమిషంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నామని, తనకు మరియు తన కాబోయే భార్య శ్రీయాషి కుటుంబానికి తక్షణమే తగిన పోలీస్ రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్నాడు. ఈ సంచలన ఘటన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనంగా మారి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. MLA Prakash Goud, Prakash Goud son Santhosh Goud, Congress MLA Prakash Goud news, Telangana politics news, Prakash Goud son love marriage, Hyderabad crime and politics

Publish Date: Aug 6, 2026 5:08PM

political-news-img

ప్రయాగ్ రాజ్ లో రాహుల్ ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమానికి అనుమతి ఉపసంహరణ.!

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులతో జరప తలపెట్టిన ముఖాముఖి ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా జరగాల్సిన ఈ బహిరంగ సభ అనుమతిని చివరి నిమిషంలో ప్రభుత్వం నిరాకరించడంపై యూపీ సర్కార్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ గ్రౌండ్‌లో శనివారం (ఆగస్టు 8) రాహుల్ గాంధీ విద్యార్థులు, నిరుద్యోగ యువతతో నేరుగా మాట్లాడేలా ఛాత్రోన్ కీ గూంజ్ పేరిట సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తొలుత అనుమతులు లభించినప్పటికీ.. మైదాన నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే కాయస్థ పాఠశాల ట్రస్ట్ హఠాత్తుగా వెనక్కు తగ్గింది. దీనితో కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. రాజస్థాన్‌లోని కోటా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నగరాల్లో కూడా రాహుల్ కార్యక్రమాలకు ఇలాగే ఆటంకాలు సృష్టించారని, ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీ వస్తుంటే ప్రభుత్వం ఎందుకు అంతగా భయపడుతోందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ కూడా కాంగ్రెస్ నేతకు మద్దతుగా నిలిచారు. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుందని, ఇలాంటి సభలను అడ్డుకోవడం ప్రభుత్వ బలహీనతను, భయాన్ని బయటపెడుతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పోటీ పరీక్షల ప్రక్రియల్లో జరుగుతున్న వరుస అక్రమాలు, పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీలో జాప్యం వంటి అనేక అంశాలపై విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులతో భేటీ అయి వారి ఆవేదనలను తెలుసుకోవాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థుల మద్దతు ప్రతిపక్షాలకు లభిస్తే తమ అధికారానికి ముప్పు తప్పదన్న భయంతోనే యూపీ ప్రభుత్వం ఈ సభను అడ్డుకుంటోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులతో రాహుల్ గాంధీ భేటీ అవుతారని చెబుతున్న కాంగ్రెస్ ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. Rahul Gandhi Prayagraj Meeting, Chhatron Ki Goonj UP, Congress Vs BJP Uttar Pradesh, Priyanka Gandhi Comments

Publish Date: Aug 6, 2026 4:52PM

political-news-img

మద్యం మత్తులో మెడికోపై కారు ఎక్కించిన తాగుబోతులు..!

ఏపీ రాజమహేంద్రవరంలో అత్యంత ఘోరమైన సంఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఊగిపోతూ, బరితెగించిన ఇద్దరు యువకులు ఓ యువ వైద్య విద్యార్థినిపైకి అతివేగంగా కారును దూకించారు. ఈ త్రైమాసిక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే, రాజానగరంలోని ప్రముఖ జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ ప్రియాంక స్థానిక ప్రసాద్ ఆదిత్య మాల్ వద్దకు వచ్చారు. అదే సమయంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు విపరీతంగా మద్యం సేవించి మాల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని వెనక్కి పంపేశారు. సిబ్బందిపై కక్ష పెంచుకున్న ఆ యువకులు ఆగ్రహంతో తమ కారు వద్దకు వెళ్లి వాహనాన్ని అడ్డగోలుగా, అతివేగంగా నడపడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయానికి మాల్ బయట స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థిని ప్రియాంకను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఢీకొట్టిన తీవ్రతకు ప్రియాంక కిందపడిపోగా, కనీస మానవత్వం లేకుండా నిందితులు ఆ కారును ఆమె తలపై నుంచే పోనిచ్చారు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే కేకలు వేస్తూ బాధితురాలిని కాపాడేందుకు పరుగులు తీశారు. రక్తమడుగులో పడివున్న ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియాంక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ఆమె ఐసీయూలో బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉండి చావుబతుకుల మధ్య పోరాడుతోందని వైద్య వర్గాలు ధృవీకరించాయి. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న తమ కుమార్తె పరిస్థితి చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. సంఘటన సమాచారం అందుకున్న ప్రకాశ్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిర్లక్ష్యంగా, మద్యం మత్తులో కారు నడిపి ప్రాణాల మీదకు తెచ్చిన నామవరం యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పట్ల స్థానిక ప్రజలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి పోకిరీలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును వేగవంతంగా విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. తాగుబోతుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద రాత్రివేళల్లో పోలీసు పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. Rajahmundry car accident, GSL Medical College, Drunk and Drive, Prakash Nagar Police Station, Andhra Pradesh Crime News

Publish Date: Aug 6, 2026 4:48PM

political-news-img

పంద్రాగస్టున కొత్త రేషన్ కార్డుల పంపిణీ.!

తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది అర్హులైన లబ్ధిదారులకు పంద్రాగస్టున నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనుంది. పౌర సరఫరాల శాఖ ద్వారా సామాన్య ప్రజలకు సంపూర్ణ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. షన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిం చనున్నారు. ఆగస్టు 15న తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు. పాత కార్డులపై కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలు, చిరునామా, సభ్యుల ఫొటోలు కనిపించేవి. అయితే ఇప్పుడు పంపిణీ చేయనున్న ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫొటోలు , పేర్లు ఉండవు. దానికి బదులుగా ప్రతి కార్డుపై ఒక ప్రత్యేకమైన విశిష్ట సంఖ్య, క్విక్ స్కానింగ్ కోసం ఒక బార్‌కోడ్‌ను మాత్రమే ఉంటుంది. ఈ అధునాతన బార్‌కోడ్ ద్వారా రేషన్ దుకాణాల్లో లేదా అధికారుల వద్ద డిజిటల్ స్కేనర్ సహాయంతో బార్‌కోడ్‌ను స్కాన్ చేయగానే, లబ్ధిదారుల కుటుంబానికి చెందిన సంపూర్ణ వివరాలు, సభ్యుల పేర్లు, ఆధార్ సీడింగ్ సమాచారం ఆన్‌లైన్ డేటాబేస్ ద్వారా డిస్ప్లే అవుతాయి. ఈ వినూత్న బార్‌కోడ్ విధానం ద్వారా సమాచార దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు రేషన్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. నకిలీ కార్డుల నిరోధానికి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా రేషన్ సరుకులు అందేలా చూడటానికి ఈ డిజిటల్ డిజైన్ దోహదపడు తుందంటున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాలను పారదర్శకంగా సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసి తుది జాబితాను ఆమోదించి, ఆగస్టు 15 నాటికి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. new ration cards in Telangana, Revanth Reddy ration card distribution, August 15 ration cards, Barcode ration card, Debit Card Size

Publish Date: Aug 6, 2026 4:30PM

political-news-img

మంత్రి లోకేష్‌ను కలిసిన కామన్వెల్త్ పతక విజేత అజయ్

ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు.. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లి నివాసంలో కలిశారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరచిన వల్లూరి అజయ్ బాబును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తండ్రి కాంస్య పతకం సాధించగా.. కుమారుడు 16 ఏళ్ల తర్వాత రజత పతకం సాధించి రికార్డ్ సృష్టించారని ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా అజయ్ బాబు ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అజయ్ బాబును మంత్రి శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ ఎస్.భరణి పాల్గొన్నారు. Commonwealth medalist Ajay, Minister Lokesh, Glasgow, Weightlifting, Vizianagaram District, CM Chandrababu

Publish Date: Aug 6, 2026 4:26PM

political-news-img

అంబటి పాదయాత్ర హాల్ట్.. కారణం ఏంటో తెలుసా?

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జగన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని ఆ పార్టీ శ్రేణుల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకూ రెండు రోజులు వినతి యాత్ర పేరిట అంబటి రాంబాబు తలపెట్టిన పాదయాత్ర చివరి నిముషంలో రద్దైంది. పైకి రద్దు కాదు తాత్కాలిక వాయిదా అని చెబుతుంటే.. తన అనుమతి లేకుండా పాదయాత్రా అంటూ జగన్ కన్నెర్ర చేయడం వల్లే అంబటి తన పాదయాత్రను రద్దు చేసుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తూ అంబటి ఈ పాదయాత్ర తలపెట్టారు. కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. అంబటి రాంబాబు తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికే పాదయాత్ర ప్రకటన చేశారని జగన్ భావించారని అంటున్నారు. ఇలా సొంత ప్రయోజనాలు, గుర్తింపు కోసం పాదయాత్రలూ, ఆందోళనలూ చేపట్టడం ఏమిటని అంబటిని నిలదీసినట్లు చెబుతున్నారు. అధిష్ఠానం రూపొందించిన కార్యక్రమాలకే పరిమితం కావాల తప్ప.. ఇలా వ్యక్తిగత ఇమేజ్ కోసం పాదయాత్రలు, ఆందోళనలు కూడదని నిష్కర్షగా చెప్పడంతో అంబటి తన పాదయాత్రను విరమించుకున్నట్లు సమాచారం. అయితే జగన్ ఆగ్రహం గురించి బయటకు చెప్పుకోలేక.. డీఎస్సీ నిరసనలకు పార్టీ హైకమాండ్ పిలుపు నివ్వడంతో వాటికి తన పాదయాత్ర అడ్డం కాకూడదన్న ఉద్దేశంతోనే తాత్కాలికంగా విరమించినట్లు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. Ambati Rambabu Padayatra canciled, Ambati Vinathi Yatra, Ambati Rambabu Protest Postponed, AP Politics, DGP Office March, Telugu One

Publish Date: Aug 6, 2026 4:01PM

MOVIE NEWS