political-news-img

వివేకా హత్యకు ఏడున్నరేళ్లు.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను.. : సునీత

తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 75 వ పుట్టిన రోజును పులివెందుల లోనీ వైయస్ వివేక పార్కులో ఆయన విగ్రహానికి కూతురు సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిలు శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్ సునీత మాట్లాడుతూ ఇప్పటికి వైయస్ వివేకాను హత్య చేసి చేసి ఏడున్నర సంవత్సరాలు గడిచిందని ఇప్పటికి తాను న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపారు. గత ఆరునెలల కాలంలో కొన్ని జడ్జిమెంట్లు వచ్చాయని ఆ జడ్జిమెంట్లు మంచివి కాదని నా అభిప్రాయం అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరికీ తెలియక ముందే ఉదయం ఐదున్నరకే వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిందన్నారు. ఇన్వెస్టిగేషన్లో కొన్ని అవకతవకులు ఉన్నాయని మాట్లాడారు. ఏదో ఒక రోజు తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, తాను న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానన్నారు. YS Vivekananda Reddy Murder Case, YS Sunitha Reddy, Viveka Murder Case,Vivekananda Reddy Birth Anniversary, Pulivendula, YS Jagan Mohan Reddy,Viveka Murder Investigation

Publish Date: Aug 8, 2026 7:08PM

political-news-img

లాల్ దర్వాజా బోనాలవేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లాల్ దర్వాజా, దర్బార్ మైసమ్మ–కార్వాన్, అంబర్‌పేట్ మహంకాళి ఆలయం, చిలకలగూడ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 9, 10 తేదీల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుంచి, ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపులు ముగిసే వరకు పాత బస్తీలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఇంజిన్ బౌలి, ఆలియాబాద్, లాల్ దర్వాజా, గౌలీపురా, ఛత్రినాక, చార్మినార్, మొఘల్‌పురా, హరిబౌలి తదితర ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యా మ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు. మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు ప్రధాన రహదారిని బోనాల ఊరేగింపు పూర్తయ్యే వరకు పూర్తిగా మూసివేయనున్నారు. చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు TG, APSRTC బస్సులను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. భక్తుల వాహనాల కోసం శాలిబండ, అల్కా థియేటర్, ఆర్యవైశ్య మందిరం, VDP స్కూల్ మైదానం, మిత్రా స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్ టెర్మినల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. దర్బార్ మైసమ్మ బోనాలు, ఏనుగు ఊరేగింపు నేపథ్యంలో ఆగస్టు 8 రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం వరకు కార్వాన్, పురానాపూల్, టప్పాచబుత్రా, జియాగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. పురానాపూల్, టప్పాచబుత్రా, యాదవ్ భవన్, మొఘల్ కా నాలా వైపు నుంచి ఆలయం దిశగా వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు. కార్వాన్‌లో ప్రభుత్వ పాఠశాల మైదానం, తోలి మసీదు సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం, జగత్ సింగ్ ప్రైవేట్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో బోనాల నేపథ్యంలో ఆగస్టు 9 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. ఉప్పల్–చాదర్‌ఘాట్, MGBS మార్గాల్లో భారీ వాహనాలు, బస్సులను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా నడిపించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు అంబర్‌పేట్ GHMC మైదానంలో వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు. చిలకల గూడ శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయం వద్ద ఆగస్టు 9, 10 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సీతాఫల్‌మండి, చిలకలగూడ, అల్లుగడ్డ బావి, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులు, వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసర ట్రాఫిక్ సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచించారు. Lal Darwaza Bonalu, old city, Medina X Roads, Sitaphalmandi, Chilakalguda, Allugadda well, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy

Publish Date: Aug 8, 2026 6:48PM

political-news-img

పాక్ లో నీటి సంక్షోభం ఆ దేశ స్వయంకృతాపరాధమే.!

పాకిస్థాన్ లో నీటి సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాగు, సాగు నీటి కొరతతో జనంనానా అవస్థలుపడుతున్నాయి. అయితే ఈ నీటి ఎద్దడికి కారణమైన తన పాలనా వైఫల్యాలను అంగీకరించకుండా పాకిస్థాన పాలకులు నెపం ఇండియాపై నెట్టేస్తోంది. అయితే పాకిస్థాన్ లో తీవ్ర నీటి కొరతకు కారణాలేమిటన్నది.. కెనడాకు చెందిన జియోపొలిటికల్ మానిటర్ నివేదిక కుండబద్దలు కొట్టేసింది. పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభానికి భారత్ కారణం పూర్తిగా ఆ దేశ స్వయంకృత అపరాధమేననీ విస్పష్టంగా పేర్కొంది. మితిమీరిన అవినీతి, ప్రణాళికా రాహిత్యం, అంతర్గత రాజకీయ కుమ్ములాటల కారణంగానే పాకిస్థాన్ లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడిందని ఆ నివేదిక తేల్చేసింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాక్ పాలకులు నెపంఇండియాపై నెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని విస్పష్టంగా పేర్కొంది. దాచుకోవడానికి పాక్ పాలకులు భారత్‌పై విషప్రచారం సాగిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో జరిపిన దాడిలో 26 మంది ఇండియన్ సిటిజన్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు పూర్తిగా నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టంగా ప్రకటించింది. ఇప్పుడు పాకిస్థాన్ ఆ విషయాన్నే ఎత్తి చూపుతూ ఇండియాకు వ్యతిరేకంగా తమ దేశ పౌరులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ప్రపంచ దేశాల ముందు భారత్ దుందుడుకు చర్య కారణంగా దేశంలో నీటి సంక్షోభం ఏర్పడిందని బాధితురాలిగా సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుననది. నిజానికి పాకిస్థాన్ నీటి కొరతకు సింధు జలాల ఒప్పందం తాత్కాలిక నిలిపివేత కారణం కాదనీ, ఆ దేశ అంతర్గత అవినీతే కారణం. ఈ విషయానని ఈ ఓప్పందం తాత్కాలిక నిలిపివేతకు సంవత్సరాల ముందే పాకిస్థాన్ ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. 2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం. పాకిస్థాన్ లోని అంతర్గత ప్రాంతీయ అసమానతలు కూడా ఈ నీటి సంక్షోభాన్ని మరింత పెంచాయి. సింధు జలాల ఒప్పందం కుదిరినప్పటి నుంచి పాకిస్థాన్ కొత్త డ్యామ్‌ల నిర్మాణంపై విపరీతమైన ఆసక్తి చూపింది. అయితే ఈ డ్యామ్‌లు, ప్రాజెక్టులు ప్రధానంగా సైన్యానికి పట్టున్న పంజాబ్ ప్రావిన్స్‌కే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. దీనివల్ల పంజాబ్ వంటి ఎగువ ప్రావిన్సులు నీటిని అడ్డుకుంటూ, దిగువన ఉన్న సింధ్ ప్రావిన్స్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. వైఫల్యం, డ్యామ్ ల నిర్వహణా లోపాలు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందన్నది వాస్తవం కాగా, దానిని కప్పిపుచ్చి ఇండియాపై నిందలు వేస్తున్న పాకిస్థాన్ కపటయత్నాలను జియోపొలిటికల్ మానిటర్ నివేదిక బహిర్గతం చేసింది. Pakistan water crisis report, Indus Waters Treaty suspension, Geopolitical Monitor Pakistan report, Pahalgam attack India Pakistan

Publish Date: Aug 8, 2026 5:54PM

political-news-img

అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త..!

రెంట్ బాయ్‌ఫ్రెండ్ వలలో పడొద్దు.. సైబరాబాద్ పోలీసులు కీలక సూచన..! ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!”.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఇలాంటి ప్రకటనలు యువతులను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటి వెనుక అసలు కథ వేరే ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో జరుగుతున్న ఈ ఆన్‌లైన్ మోసం బారిన పడితే డబ్బులు పోవడంతో పాటు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ‘50% OFF’, ‘పర్సనల్ కంపానియన్’, ‘కాఫీ డేట్’ అంటూ ఆకర్షణీయమైన పోస్టర్లు పెడుతున్నారు. గంటల వారీగా, డే ప్యాకేజీల పేరుతో రకరకాల ధరలను ప్రకటిస్తూ యువతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుకింగ్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు. అందమైన యువకుల ఫొటోలతో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి చాటింగ్ మొదలుపెడుతున్నారు. తొలుత తియ్యటి మాటలతో నమ్మకం కలిగించి.. ఆ తర్వాత బుకింగ్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేరుతో డబ్బులు అడుగుతున్నారు. క్యూఆర్ కోడ్లు, డిజిటల్ పేమెంట్ల ద్వారా డబ్బులు చెల్లించిన వెంటనే అకౌంట్లను బ్లాక్ చేసి మాయమయ్యే అవకాశముంది. ఇక్కడితో మోసం ఆగదు. చాటింగ్ సమయంలో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, ఫొటోలను ఉపయోగించి తర్వాత బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. కొందరు కేటుగాళ్లు మార్ఫింగ్ చేసిన ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం కూడా ఉండటంతో యువతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని నేరుగా కలిసేందుకు వెళ్లడం కూడా ప్రమాదకరమే. డిస్కౌంట్ ఆఫర్లను చూసి తొందరపడి స్పందించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదని, ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. యువతుల భద్రత విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు చూస్తున్నారు? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? అనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి అనుమానాస్పద ప్రకటనలు కనిపించినా, సైబర్ మోసానికి గురైనా వెంటనే 1930కు ఫోన్ చేయాలి. అలాగే cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలి. Rent Boyfriend Offers, Cybercrime, Instagram, Telegram, Facebook, Personal Companion, Coffee date, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy

Publish Date: Aug 8, 2026 5:37PM

political-news-img

వెలిగొండ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.!

ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాలుగా సాగునీరు, తాగునీటి కోసం నిరీక్షిస్తున్న ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజల కల సాకారం చేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూరం దగ్గరపడింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలా ఖరులోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీని ద్వారా కృష్ణా నది నుంచి వరద జలాలను టన్నెళ్ల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు తరలించి విడుదల చేసేందుకు ఏపీ జలవనరుల శాఖ అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్త చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి అవసరమైన ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలో మిగిలి ఉన్న అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఆగస్టు నెలాఖరు నాటికే ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు విస్పష్ట ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది. 3 వేల కోట్ల భారీ వ్యయంతో నిలిచిపోయిన ప్రధాన ఇంజినీరింగ్, టన్నెల్, కాలువల పనులను పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోని వివిధ కీలక విభాగాల పనులు 90 శాతం నుంచి 99 శాతం పూర్తయ్యాయి. రాబోయే రెండు వారాల్లో మిగిలిన చిన్నపాటి పనులన్నీ పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత సంక్లిష్టమైన సొరంగం లోపల ఉన్న భారీ టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) తొలగింపు పనులను వేగంగా సాగుతున్నాయి. 1,900 మెట్రిక్ టన్నుల బరువు, 175 మీటర్ల పొడవు ఉన్న ఈ భారీ యంత్రాన్ని బయటకు తీసే పనుల్లో 70 శాతానికి పైగా పూర్తికాగా రానున్న వారం రోజుల్లో మిగిలిన 30 శాతం పని పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఇక కొల్లంవాగు నుంచి కృష్ణా జలాలను టన్నెల్‌కు చేర్చే అప్రోచ్ ఛానల్ పనులతో పాటు హెడ్ రెగ్యులేటర్ గేట్ల నిర్మాణం కూడా పూర్తి అయ్యింది. మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల సహాయంతో పనులు శరవేగంతో సాగుతున్నాయి. వైసీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు పడకేశాయి. జగన్ సర్కార్ ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నాయి. 2024లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి.. ఫేజ్-1 పరిధిలోని అన్ని కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు, రాయలసీమ సరిహద్దు మండలాలకు కృష్ణా జలాలు అందించడమే లక్ష్యంగా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులతో కూడా ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల సంక్షేమానికి కూడా చంద్రబాబు సమ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలోని 4 వేల761 నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి 600 కోట్ల రూపాయల పునరావాస పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించి ఇప్పటికే తొలి విడతగా ఇప్పటికే 318 కోట్ల రూపాయలు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన నిధులను రెండు విడతల్లో నెలాఖరుకల్లా అంటే ప్రాజెక్టు ప్రారంభోత్సవం నాటికల్లా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్ నిండితే, దశాబ్దాలుగా నీటి కర వుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు శాశ్వత సాగు, తాగునీటి పరిష్కారం లభించనుంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, తాగునీటి ఎద్దడి తీరి ఆయా ప్రాంతాలలో వ్యవసాయం, ఆర్థిక పురోగతి ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి, ఫ్లోరైడ్ రహిత తాగునీరు గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి వస్తుంది.

Publish Date: Aug 8, 2026 5:31PM

political-news-img

 పాలు లేకుండానే కాల్షియం, ఐరన్! ఈ ఆకుకూర గురించి తెలుసా.. 

కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు. ఇంతకీ ఆ ఆకుకూర ఏంటి? దానిలో ఉండే పోషకాలు ఏమిటి? ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ ఈ ఆకుకూర గురించి ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కాల్షియం మన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. అలాగే ఐరన్ శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ఇతర సహజ ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఆహార విధానంలో భాగం. అయితే ఒక ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మాత్రమే కాల్షియం లేదా ఐరన్ లోపం పూర్తిగా సరిచేయబడుతుందని భావించకూడదు. ఇప్పటికే లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే, వైద్యుల సూచన మేరకు సరైన ఆహారం లేదా అవసరమైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: • కాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎందుకు అవసరం? • ఇంట్లో సులభంగా లభించే ఈ ఆకుకూరలో ఉన్న పోషకాలు ఏమిటి? • ఈ ఆకుకూరను ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు? • ఆకుకూరలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? • సహజ ఆహారాల ద్వారా పోషకాలను పొందడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పోషక లోపం, అనారోగ్య సమస్య ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించవద్దు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Aug 8, 2026 5:27PM

MOVIE NEWS