పులులు కాదు పిల్లులు.. గంట క‌ళ్లు మూసుకుంటే.. మాకూ బీపీ.. టాప్‌న్యూస్ @7pm

Publish Date:Oct 22, 2021

Advertisement

1. కొన్ని పిల్లులు తాము పుల‌ల‌మ‌నుకుంటున్నాయి.. మా పార్టీ ఆఫీసులో ప‌గిలింది అద్దాలు మాత్ర‌మే.. మా కార్య‌క‌ర్త‌ల గుండెల‌ను మీరు గాయ‌ప‌ర‌చ‌లేరు.. ఒక చెంప మీద కొడితే రెండు చెంప‌లు వాయ‌గొడ‌తాం.. అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ప‌సుపు జెండా చూస్తే వైసీపీ శ్రేణుల‌కు ఎందుకంత భ‌య‌మ‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో గంజాయి దందా బాగా న‌డుస్తోంది.. దీనిపై నిల‌దీస్తే టీడీపీ కార్యాల‌యంపై దాడి చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీ సీఎంగా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేశ్‌. 

2. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయ‌న‌ గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు. 

3. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. కేసీఆర్ పేరును బలపరుస్తూ మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో కేసీఆర్ ఎన్నిక లాంఛనమే కానుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి వచ్చిన నామినేషన్లను శనివారం పరిశీలిస్తారు. ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ జరుగనుంది. ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 వసంతాలు కావడంతో 25న పార్టీ తరపున ద్విదశాబ్ది ఉత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 

4. టీడీపీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సీఎం జ‌గ‌న్‌రెడ్డితో పాటు మంత్రుల‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని. 

5. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి రైతులు మహా పాదయాత్ర చేప‌డుతున్నారు. తుళ్లూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజుల పాటు పాద‌యాత్ర కొన‌సాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. మహా పాదయాత్రకు పలు పార్టీల మద్దతు కూడ‌గ‌డుతున్నారు. తాజాగా, మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు.

6. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశించ‌గా.. ఆ దిశగా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

7. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా..’ అంటూ బ‌రితెగింపు మాట‌లు మాట్లాడారు. ఎంపీ రెడ్డెప్ప సమక్షంలోనే ఇలా రెచ్చిపోయారు. చంద్ర‌బాబుపై వైసీపీ లీడ‌ర్ సెంథిల్‌కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెంథిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు భ‌గ్గు మంటున్నాయి.

8. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు. 

9. తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. నవంబర్, డిసెంబర్ నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్లో ఉంచింది. రోజుకి 12 వేల చొప్పున 7.8 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే, నాలుగు గంటల్లోనే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంతో టీటీడీకి 21 కోట్ల రాబడి వచ్చింది. 

10. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల మైలురాయిని అధిగ‌మించిన సంద‌ర్భంగా ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని ప్ర‌ధాని మోదీ అభివర్ణించారు. ‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. 

By
en-us Political News

  
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బులంద్‌షెహ‌ర్ లో దేవేంద్రి అనే మ‌హిళకి పాము క‌రిస్తే ఆమె భ‌ర్త ఏకంగా పేడ‌గుట్ట కింద ప‌డుకోబెట్టాడు. ఆమె పాము కాటు విషం నుంచి బ‌య‌ట‌ప‌డి బ‌తుకుతుంద‌ని!
మాథ్యూప‌ద‌కండో ఏట జ‌బ్బు చేసి చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసిన‌పుడ‌ల్లా పోనీ అక్క‌డ‌కి వెళ్లాల‌నే వెళ్లాడ‌నే అనుకుంటోంది. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభ‌స్మాన్ని చంద్రుడి మీద‌కి పంప‌డానికి సిద్ధ‌ప‌డింది కోరి. వ‌చ్చే ఏడాది ఆమె కోరిక ఫ‌లించ‌వ‌చ్చు
పాల‌న ఎప్పుడూ జ‌న‌రంజ‌కంగా వుండాలి. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ల‌క్ష్యాలూ ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించాలి గాని ప్ర‌జ‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌పుడు మంచి పాల‌న‌ను అందిస్తున్నామ‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేయించుకోవ‌డం న‌వ్వుల‌పాలే అవుతుంది. కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వ గ్రాఫ్‌ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డిపోతోంది. అయినా అగ్నిప‌థ్ వంటి దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ల‌తో యువ త‌ను దెబ్బ‌తీయ‌డం కేవ‌లం మూర్ఖ‌పు పాల‌నే అవుతుంది. అస‌లు బిజెపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే ప్ర‌జావ్య‌తిరేక‌త వెల్లువెత్తే ప‌రిస్థి తులే వున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కొత్త పార్టీ వెనుక కూడా ఎన్నికల వ్యూహమే ఉందా? ఆ వ్యూహం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఉరుము లేని పిడుగులా ప్రశాంత్ కిశోర్ తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వీటిని కేవలం ఊహాగాన సభలుగా కొట్టి పారేయడానికి వీల్లేదని పరిశీలకులు అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరపడం ఇందు కోసం ఆయన ప్రగతి భవన్ లో రెండు రోజుల బస చేయడాన్ని తార్కానంగా చూపిస్తున్నారు.
ఓ యువకుడి ఆత్మహత్యకు కారకురాలైందని ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఓ యువతిపై అత్యంత క్రూరంగా రివెంజ్ తీర్చుకున్నారు. ఆమెను కిడ్నాప్‌ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జీషీటును మంగళవారం కోర్టుకు సమర్పించారు. 21 మందిపై దాఖలైన చార్జిషీట్లో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
భక్తికి ఎల్లలు ఉండవంటారు. భగవంతునిపై తన భక్తిని ప్రదర్శించేందుకు ఏకంగా కన్నులు పెకలించుకున్నాడు కన్నప్ప. ప్రాణాలనే తృణ ప్రాయంగా అర్పించేశాడు మార్కండేయులు. భగవంతుని పై తనకున్న భక్తిప్రపత్తులను బియ్యపు పై గింజ అక్షరాలుగా మలిచి ఆ దేవుడికే తలంబ్రాలుగా అర్పించాడు ఈ భక్తుడు. నిజామాబాద్‌ ఇందూరు ఆర్టీసీ కాలనీకి చెందిన బిల్ల బాబు, పదవి విరమణ అనంతరం ఆధ్యాత్మిక చింతనతో శ్రీరాముడి పై తనకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది లక్షల యాభై ఒక్క వెల బియ్యపు గింజల పై శ్రీరామ నామాన్ని రాశారు. ఇందు కోసం ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానాంతరం భగవంతునికి పూజ చేసి జెల్‌ పెన్‌తో రామ నామాన్ని తెలుగు, హిందీ భాషలలో లిఖిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు లిఖించిన బియ్యపు గింజలను ఇందూరు ఖిల్లా రామాలయంలో శ్రీసీతారాముల వారి కళ్యాణానికి రెండు మార్లు, ఇందూరు సుభాష్‌ నగర్‌ రామాలయంలో ఒక సారి, భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణంలో తలంబ్రాలలో కలపటం జరిగింది.
దేశవ్యాప్తంగా సుమారు డజను రాష్ట్రాల్లో చీకట్లు కమ్ముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజూ 8 గంటల పైగా విద్యుత్తు కోతలు అమలవుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్తాన్ లకు పట్టిన దుస్థితే భారతదేశంలోనూ తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్’ వయసు ఉంటే ఓ 40 ఏళ్ళు ఉండవచ్చును. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు, 2012 ఆ ప్రాంతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా దేశానికి పరిచయం అయ్యారు. అంటే, ఓ దశాబ్ద కాలంగా మాత్రమే దేశ రాజకీయాలలో ఆయన పేరు వినిపిస్తోంది.నిజానికి గత సంవత్సరం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఆయన బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగి పోయింది. ఇంతలోనే పీకే, ఇంతింతై ..అన్నట్లుగా ఎదిగిపోయారు. ఎంతగా అంటే, కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ మొదలు, వైసీపీ, తృణమూల్. ఎన్సీపీ వంటి పిల్ల కాంగ్రెస్ పార్టీలు అలాగే, తెరాస, డీఎంకే వంటి ప్రాంతీయ, కుటుంబ పార్టీలు... ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న లౌకికవాద పార్టీలన్నీ క్యూకట్టి మరీ పీకేని శరణు వేడుతున్నాయి.
స‌మీర్ వాంఖ‌డే. ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి. డ్ర‌గ్స్ కేసులో షారుఖ్‌ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచీ.. దేశ‌వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఆర్య‌న్‌ఖాన్ కేసు నుంచి త‌ప్పించినా.. ఎన్సీపీతో, మంత్రి మాలిక్‌తో వివాదం మాత్రం కంటిన్యూ అవుతోంది. తాజాగా, స‌మీర్ వాంఖ‌డే హిందువు కాదు ముస్లిం అంటూ ఆధారాలు సైతం చూపించారు. 
క‌దం క‌దం క‌దిపారు. అలుపెర‌గ‌కుండా పోరాడుతున్నారు. వారి ల‌క్ష్యం ఒక‌టే. వారి గ‌మ్యం ఒక‌టే. అమ‌రావ‌తినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించ‌డం. ఆంధ్రుల క‌ల‌ల కేపిట‌ల్‌ను మూడు ముక్క‌లు చేసే ప్ర‌య‌త్నాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం విర‌మించుకోవ‌డం. ఇందుకోసం రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. అయినా.. పాల‌కుల తీరు మార‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కారు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. దీంతో.. జ‌గ‌న్‌రెడ్డి బండ‌రాయి హృద‌యాన్ని ఆ దేవుడే మార్చాలంటూ.. క‌లియుగ వెంక‌న్న స్వామికి మొక్కుకోవ‌డానికి అమ‌రావ‌తి రైతులు దండుగా క‌దిలారు. త‌మ గోడు మిగ‌తా జిల్లాల వారికీ తెలిసేలా.. మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. ఉరిమే ఉత్సాహంతో.. స‌డ‌ల‌ని సంక‌ల్పంతో.. అడుగులో అడుగు వేస్తున్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తిరుమ‌ల బాట ప‌ట్టారు అమ‌రావ‌తి రైతులు.
ఆయ‌న హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ ఏసీపీ. పేరు కేవీఎం ప్ర‌సాద్‌. డ్యూటీలో నిత్యం బిజీగా ఉంటారు. సోమ‌వారం ఉద‌యం స‌డెన్‌గా ఆయ‌న ఫోన్ రింగ్ అయింది. ఏదో డిపార్ట్‌మెంట్ కాల్ అయి ఉంటుంద‌ని చాలా క్యాజువ‌ల్‌గా కాల్ లిఫ్ట్ చేశారు. మేట‌ర్ విని ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. తాను స్వ‌యంగా ఏసీపీ అయి ఉండికూడా.. ఆ న్యూస్ విని నిలువునా కుప్ప‌కూలిపోయారు. క‌న్నీటి ప‌ర్యంత మ‌య్యారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....
ట్రింగ్‌..ట్రింగ్‌.. వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది. ఇటునుంచి కాల్ లిఫ్ట్ చేస్తే.. అటునుంచి మంత్రి గారు వాయిస్ వినిపిస్తుంది. తెలిసిన గొంతే కావ‌డంతో.. చాలా క్యాజువ‌ల్‌గా డిష్క‌స‌న్ సాగుతుంది. బాగున్నావా.. ఎక్క‌డున్నావ్ నుంచి మొద‌లై.. వెంట‌నే అస‌లు మేట‌ర్‌లోకి వ‌చ్చేస్తారు మినిస్ట‌ర్ గారు. క‌ట్ చేస్తే.. మంత్రి గారి ఆడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడానికి మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనారోగ్య కారణంగా కౌంటర్ ధాఖలు చేయలేక పోయామని తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.