దోచుకోవడం.. దాచుకోవడంలో వైసీపీ ఫస్ట్ ఆదుకోవడం.. అందుకు ఖర్చు చేయడంలో ‘దేశం’ బెస్ట్

Publish Date:May 28, 2022

Advertisement

దోచుకోవడం, దాచుకోవడం వైసీపీ నైజం. ఈ విషయం గణాంకాలతో  సహా మరోసారి రుజువు అయింది. వైసీపీకి  2020-2021 ఆర్థిక సంవత్సరంలో   107.99 కోట్ల రూపాయలు విరాళంగా, అందగా వాటిలో కేవలం ఎనిమిది కోట్ల ఏడు లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. అంటే విరాళంగా వచ్చిన మొత్తం నుంచి 99.25 శాతం నిధులు ఖర్చు చేయకుండా మిగుల్చు కుంది.    అదే ఆర్థిక సంవత్సరంలో  తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాలు 3 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే. కానీ.. తెలుగుదేశం ఖర్చు చేసింది మాత్రం  54 కోట్ల 76 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అంటే.. వచ్చిన విరాళాల ద్వారా అందిన ఆదాయం కన్నా తెలుగుదేశం 1,584 కోట్ల రూపాయలు అదనంగా వ్యయం చేసింది.    విరాళాల సొమ్మును మిగుల్చుకోవడంలో వైసీపీ ఏపీలోనే కాకుండా దేశంల మొత్తంలోనే ప్రథమ స్థానంలో నిలిస్తే, వచ్చిన సొమ్ము కన్నా అధికంగా ఖర్చుపెట్టడంలో తెలుగుదేశం పార్టీ దేశంలోనే  మొదటి ప్లేస్ లో ఉంది. ఈ గణాంకాలు  ఏడీఆర్  నివేదిక అధికారికంగా వెల్లడించిన వాస్తవాలు.  2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ వ్యయ లెక్కల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది.

ఈ గణాంకాలు చూస్తుంటే.. పార్టీ నిర్వహణ కోసం, కార్యకర్తల శ్రేయస్సు కోసం తెలుగుదేశం ఎంతగా పరితపిస్తుందో  అవగతమౌతుందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ శ్రేణులకు బీమా కల్పించడంలో, ఆరోగ్య పరంగా వారు ఇబ్బందులు పడుతుంటే  ఆదుకోవడంలో దేశంలోని పార్టీలన్నిటి కంటే తెలుగుదేశం పార్టీ ముందుంటుందనడంలో సందేహం లేదనడానికి ఈ గణాంకాలే తిరుగులేని రుజువు.   దేశం మొత్తంలో పార్టీ కార్యకర్తలకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం. పార్టీ కార్యకర్తలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, రక్తదానం చేయడంలో  తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి ఆ పార్టీ కార్యకలాపాలను గమనిస్తే ఇట్టే అవగతమౌతుంది.  ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ఉదారంగా ముందుకు వస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తెలుగుదేశం సేవా కార్యక్రమాలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి అని పరిశీలకులు గణాంకాలతో, ఉదాహరణలతో వివరిస్తున్నారు.

అయితే.. అందుకు భిన్నంగా అధికారంలో ఉన్న  వైసీపీ పార్టీ నిర్మాణం, కార్యకర్తల శ్రేయస్సు విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న విమర్శలకు ఏడీఆర్ నివేదిక వెల్లడించిన వాస్తవాలు బలం చేకూరుస్తున్నాయి.  రాష్ట్రంలో విపత్తులు  సంభవించిన సందర్బాలలో, భారీ ఎత్తున అందిన విరాళాల సొమ్ము అందినప్పటికీ బాధితులను మానవతా దృక్పథంతో  ఆదుకోవడానికైనా వాటిని ఉపయోగించకపోవడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో విపక్ష తెలుగుదేశం పార్టీకి పార్టీ పరంగా అందిన విరాళాలు స్వల్పమే అయినా, ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే విరాళాల ద్వారా వచ్చిన సొమ్ము కంటే అధిక మొత్తం వ్యయం చేసి వారిని ఆదుకోవడానికి ముందుకు సాగడం ఇరు పార్టీల మధ్యా ఉన్న స్పష్టమైన తేడా ఏమిటన్నది తేటతెల్లం చేస్తొందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతసేపూ ముఖ్యనేతలు, ముఖ్యులు, పార్టీలో పైనున్న వారే నిధులను, పదవులను అనుభవిస్తారు కానీ.. దిగువ స్థాని శ్రేణుల సంక్షేమం, శ్రేయస్సును వైసీపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వైసీపీ క్యాడర్ నుంచే వెల్లువెత్తుతున్నాయి. 

2020-21లో దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలకు 529 కోట్ల 41 లక్షలు విరాళంగా  ఆదాయం సమకూరింది. ఈ మొత్తం ఆదాయం 2019-20  సంవత్సరంలో వచ్చిన 800 కోట్ల 26 లక్షలతో  పోల్చితే  34.96 శాతం తక్కువే. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి 37 కోట్ల 65 లక్షలు ఆదాయం విరాళంగా వస్తే.. 22 కోట్ల 34 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనించాలి. అంటే.. 40.66 శాతం ఆదాయాన్ని టీఆర్ఎస్ కూడా ఖర్చు చేయకుండా మిగుల్చుకుందన్నమాట. మరో పార్టీ ఎంఐఎంకు అదే ఏడాది కోటీ 62 లక్షల రూపాయల ఆదాయం వస్తే.. కేవలం 19 లక్షల 4 వేల రూపాయలే వినియోగించింది. దేశం మొత్తంలో అందిన విరాళాల్లో అధిక మొత్తాన్ని మిగుల్చుకున్న పార్టీల్లో వైసీపీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. బీజేడీ అయితే.. 90.44 శాతంతో రెండో ప్లేస్ లో, ఎంఐఎం 88.02 శాతం విరాళాల ఆదాయాన్ని మిగుల్చుకుని మూడో స్థానంలో ఉంది.

దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలకు 376 కోట్ల, 86 లక్షలు స్వచ్ఛంద విరాళాల రూపంలో అందాయి. వాటిలో 250 కోట్ల 60 లక్షలు పార్టీలు ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కూడగట్టుకున్నవే కావడం గమనార్హం. ఈ బాండ్ల మొత్తం కేవలం ఐదు పార్టీలకే వెళ్లిందని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఎలక్టొరల్ బాండ్ల ఆదాయంలో కూడా వైసీపీయే ముందుంది. వైసీపీకి మొత్తం 96 కోట్ల 25 లక్షల రూపాయలు బాండ్ల రూపంలో అందింది. ఎలక్టొరల్ బాండ్ల ఆదాయం 80 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో డీఎంకే నిలిచింది. బీజేడీ అయితే.. 67 కోట్ల రూపాయల బాండ్ల ఆదాయంతో మూడోస్థానంలో ఉంది.

అటు విరాళంగా.. ఇటు ఎలక్టొరల్ బాండ్ల రూపంలో భారీ ఎత్తున వచ్చిన ఆదాయం నుంచి అంతే భారీ మొత్తంలో మిగుల్చుకున్న వైసీపీ ఆ సొమ్మంతా ఏం చేసింది? ఎందుకోసం ఆ నిధుల్ని దాచుకుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. దాచుకున్న విరాళాల సొమ్మంతా వచ్చే ఎన్నికల్లో విస్తారంగా వెదజల్లి   ఓట్లు కొల్లగొట్టేందుకు పథకం వేసిందా? అన్న ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు ఔననే సమాధానం చెబుతున్నారు. తనకు వచ్చిన ఆదాయం కన్నా అధికంగా ఖర్చు పెట్టిన టీడీపీ ఎక్కడ? వచ్చిన నిధుల్ని వచ్చినట్లే దాచేసుకున్న వైసీపీ తీరు ఎక్కడ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
బీజేపీ దక్షిణాదిలో వేళ్లూనుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విదంగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా నలుగురు దక్షిణాది వారికి నామినేట్ చేసింది. ప్రముఖ తెలుగు సినీ రచయత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, అలాగే పరుగుల రాణి, ఒలింపిక్ పతక విజేత పీటీ ఉష, ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేలను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఏ క్ష‌ణానైనా ఏద‌న్నా జ‌ర‌గ‌వ‌చ్చున‌ని, ఇక్క‌డ కూడా ఒక షిండే త‌లెత్త‌వ‌చ్చ‌ని త‌మిళ‌నాడు బిజెపి అధ్య‌క్షుడు కే. అన్నామ‌లై అన‌డం ఇపుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మ‌హా రాష్ట్ర లో మాదిరిగా ఇక్క‌డా రాజ‌కీయ ప‌రిస్థితులు మారే అవ‌కాశాలున్నాయ‌ని బిజెపి చూచాయిగా ఈ ప్ర‌స్థావ‌న చేసింది. అయితే డిఎంకే సీనియ‌ర్ నేత‌, పార్టీ నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి ఆర్.ఎస్‌. భార‌తి మాత్రం అన్నామ‌లై మాట‌ల‌ను పెద్ద‌గా సీరియ‌స్‌గా ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌న్నారు. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడుల‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను గురించి ప్ర‌స్థావిస్తూ, శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు దివంగత బాల్‌థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధ‌వ్ సినీరంగ ప్ర‌వేశం అచ్చం త‌మిళ‌నాడు మాజీ ముఖ్య మంత్రి ఎం.క‌రుణానిధి కుమారుడు ముత్తు సినీరంగ ప్ర‌వేశం ఒకేలా వుంద‌ని అంటూ, వారిద్దరి తొలి సిని మాలూ పెద్ద‌గా ఆడ‌లేద‌ని అన్నామ‌లై అన్నారు.
కాస్త విన‌సొంపుగా పాడుతూంటే ఓ క్ష‌ణం వినాల‌నిపిస్తుంది.. ఎవ‌ర‌న్నా ఫ్లూటో, వీణో వాయిస్తుంటే వీనుల విందుగా వుంటే .. మ‌రో పాట‌నో, కీర్త‌న‌నో వాయించ‌మ‌ని కోరుతూంటారు. పాడ‌టం, వాద్య నైపుణ్యాలు స‌ర‌స్వ‌తీ క‌టాక్షం అంటారు పెద్ద‌లు. అది అంద‌రికి అబ్బే విద్య‌ కాదు. వంద‌ మంది పాడేవారుండ‌వ‌చ్చు.. ఏ ఇద్ద‌రు ముగ్గురి గొంతో అమృతం పోసిన‌ట్టు వుంటుంది.
అన్నీ అనుకున్న‌ట్టే జ‌ర‌గ‌వు. కాలం క‌టువుగానే సాగుతూంటుంది. ఏది ఎప్పుడైనా జ‌ర‌గ‌వ‌చ్చు. నిన్న‌టి ప్రేమికులు ఏదో కార‌ణంతో విడిపోవ‌చ్చు. పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌ను విడిచీ పోవ‌చ్చు. కాలం విలువ‌ల్ని మార్చేస్తుంటుంది. ఊహ‌లోకంలో విహ‌రించ‌డం కృష్ణ‌శాస్త్రిగారి క‌విత‌ల్లోనే సాగుతుంది. వాస్త‌వం శ్రీ‌శ్రీ చెప్పి న‌ట్టుగానే వుంటుంది. కానీ ఎక్క‌డో ఎప్పుడో ఒక్క‌రు మాత్రం ఆదుకోవ‌డానికి అమాంతం అమృత‌హ‌స్తం అందించ‌వ‌చ్చు
దేశ‌ర‌క్ష‌ణ అంశాన్ని ప‌రిశీలిస్తే ఒకింత భ‌య‌మేస్తుంది. మ‌నం నిజంగానే  సుర‌క్షితంగా వున్నామా అన్న ప్ర‌శ్న పెద్ద‌ద‌యి వొణికిస్తోంది.  దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉగ్ర‌దాడుల‌కు ఆస్కారం వుంటోం ది. ఒక‌దాని  త‌ర్వాత మ‌రొక‌టి పెనుముప్పులు పొంచి వుంటున్నాయి. ప్ర‌భుత్వాలు మారినా, సైన్యం మూడు విభాగాలూ ఎంతో అప్ర‌మ‌త్తంగా వున్నన్నా..  ఉగ్ర‌దాడుల ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది.
ఒక్కప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కమ్యూనిస్ట్ పార్టీలు కీలక భూమికను పోషించాయి. అయితే, అంతతా గతించిన చరిత్ర. ఈరోజు, ఏపీలోనే కాదు,దేశంలో (ఒక్క కేరళలో మినహా) కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వ వైభాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచు కోటలుగా నిలిచిన, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోనూ లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టులు ఇంకా అధికారంలో ఉన్నారు. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, లెఫ్ట్ పార్టీలు పూర్వ వైభవాన్ని ఎప్పుడో కోల్పోయాయి. అయినా, ఇటు ఏపీలో అటు తెలంగాణాలో లెఫ్ట్ పార్టీ నేతలు, చింత చచ్చినా పులుపు చావలేదు
అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో ఫోర్బ్స్ కంపెనీకి చోటు లభించింది. అమరరాజా బ్యాటరీస్ గుంటూరు ఎంపీ, తెలుగుదేశం నాయకుడు గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన కంపెనీ అన్న సంగతి విదితమే.
కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నారా? ఓ వంక శాఖపరమైన సమస్యలు, మరోవంక రాజకీయ సవాళ్ళు ఒకేసారి దండయాత్ర చేయడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, అంటే, అవును, ఆమె ఒక్కసారిగా ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు. ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్నారని, అంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించే క్రమమలో విద్యార్ధుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెనే సిల్లీ మంత్రిని చేశాయి.
మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఎ) ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొత్త స్పీక‌ర్ ఎన్నిక విష‌యంలో స్ప‌ష్ట‌మ‌యింది. షిండే,  ఫ‌డ్న‌వీస్‌ల ప్ర‌యాణం మున్ముందు అంత సుల‌భ‌సాధ్యంగా సాగ‌కాపోవ‌చ్చు. 
కొంచం విరామం అంతే మళ్లీ చమురు సంస్థలు తమ బాదుడు మొదలెట్టేశాయి. తాజాగా గృహావసరాలను వినియోగించే గ్యాస్ సిలెండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు వడ్డించాయి. ఈ వడ్డింపు బుధవారం నుంచే అమలులోకి వస్తుంది. ఇటీవలే అంటే ఈ నెల 1వ తేదీన వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే బండపై 7వ తేదీ నుంచి 50 రూపాయలు వడ్డించడం విశేషం.
ప్రజలలో వ్యతిరేకత వైసీపీపై కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలపై కాదు వ్యతిరేకత అంతా వాలంటీర్లపైనే.. ఇదీ వైసీపీ నేతలు ఇప్పుడు ముక్తకంఠంతో చెబుతున్న మాట. మనం నియమించిన వాళ్లు వాలంటీర్లు ఇప్పుడు వారి వల్లే మనకు ఇబ్బంది ఎదురౌతోందనుకుంటే వాళ్లని తొలగించేద్దాం అదెంత సేపు అన్నదే ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్న మాట. పార్టీ ప్లీనరీలకు ముందు నిర్వహించిన జిల్లాల ప్లీనరీలలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇదే విషయం చెప్పారు. పార్టీ బలోపేతం, పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా వేటి గురించీ జిల్లా ప్లీనరీలలో చర్చించలేదు.
నీకిది.. నాకిది అన్న ఒప్పందం.. సంబంధం కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో తమకు ఉందని వైసీపీ ఎంపీ ఒకరు కుండ బద్దలు కొట్టేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గత మూడేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీసీ మద్దతు ఇస్తున్నదని అంగీకరించారు. అందుకు ప్రతిగా కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పేశారు. దీంతో ఇప్పటి దాకా గుట్టుగా ఉన్న బీజేపీ- వైసీపీ క్విడ్ ప్రోకో సంబంధం లేదా అనుబంధం ఇప్పుడు బట్టబయలైపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.