Publish Date:May 28, 2022
తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వరంగల్‌లో భూ సమీకరణకు వ్యతిరేకంగాద ఆందోళనకు దిగిన రైతులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న మల్లన్నను వరంగల్ జిల్లా ఆరేపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వరంగల్‌లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మల్లన్న మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం వారికి మద్దతు తెలియజేయడానికి అక్కడకు వెళుతున్న తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా వరంగల్ వెళుతున్న మల్లన్నను పోలీసులు అరెస్టు చేసి లింగాల ఘనపురం పోలీసు స్టేషన్ కు తరలించిన సంగతి విదితమే. లాండ్ పూలింగ్ ‘రియల్’ మాఫియాను అడ్డుకుంటున్న రైతులకు మద్దతుగా నిలుస్తున్నందుకే తనను అరెస్టు చేశారని అప్పట్లో మల్లన్న పేర్కొన్న సంగతి విదితమే.
గతంలో కేసీఆర్ విధానాలపై విమర్శలు గుప్పించిన తీన్మార్ మల్లన్న ఇటీవల తాను ఇకపై కేసీఆర్ పై విమర్శలు చేయబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తాను త్వరలో బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ పార్టీ కంటే తాను, తన బృందమే తెలంగాణ కోసం మెరుగ్గా పని చేయగలమని మల్లన్న పేర్కొన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయబోనని ప్రకటించడంతో తీన్మార్ మల్లన్నకు ఇక కేసుల బెడద తప్పుతుందని అప్పట్లో అంతా భావించారు. అయితే వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా మల్లన్న నిలబడటంతో రెండు వారాల వ్యవధిలో రెండో సారి అరెస్టు అయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/teenmar-mallanna-arrest-25-136595.html
తమిళనాడు రాజకీయాల్లో ఏ క్షణానైనా ఏదన్నా జరగవచ్చునని, ఇక్కడ కూడా ఒక షిండే తలెత్తవచ్చని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కే. అన్నామలై అనడం ఇపుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహా రాష్ట్ర లో మాదిరిగా ఇక్కడా రాజకీయ పరిస్థితులు మారే అవకాశాలున్నాయని బిజెపి చూచాయిగా ఈ ప్రస్థావన చేసింది. అయితే డిఎంకే సీనియర్ నేత, పార్టీ నిర్వాహక కార్యదర్శి ఆర్.ఎస్. భారతి మాత్రం అన్నామలై మాటలను పెద్దగా సీరియస్‌గా పట్టించుకోనవసరం లేదన్నారు.
మహారాష్ట్ర, తమిళనాడులలో రాజకీయ పరిస్థితులను గురించి ప్రస్థావిస్తూ, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్‌థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ సినీరంగ ప్రవేశం అచ్చం తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి ఎం.కరుణానిధి కుమారుడు ముత్తు సినీరంగ ప్రవేశం ఒకేలా వుందని అంటూ, వారిద్దరి తొలి సిని మాలూ పెద్దగా ఆడలేదని అన్నామలై అన్నారు.
కాస్త వినసొంపుగా పాడుతూంటే ఓ క్షణం వినాలనిపిస్తుంది.. ఎవరన్నా ఫ్లూటో, వీణో వాయిస్తుంటే వీనుల విందుగా వుంటే .. మరో పాటనో, కీర్తననో వాయించమని కోరుతూంటారు. పాడటం, వాద్య నైపుణ్యాలు సరస్వతీ కటాక్షం అంటారు పెద్దలు. అది అందరికి అబ్బే విద్య కాదు. వంద మంది పాడేవారుండవచ్చు.. ఏ ఇద్దరు ముగ్గురి గొంతో అమృతం పోసినట్టు వుంటుంది.
అన్నీ అనుకున్నట్టే జరగవు. కాలం కటువుగానే సాగుతూంటుంది. ఏది ఎప్పుడైనా జరగవచ్చు. నిన్నటి ప్రేమికులు ఏదో కారణంతో విడిపోవచ్చు. పిల్లలు తల్లిదండ్రులను విడిచీ పోవచ్చు. కాలం విలువల్ని మార్చేస్తుంటుంది. ఊహలోకంలో విహరించడం కృష్ణశాస్త్రిగారి కవితల్లోనే సాగుతుంది. వాస్తవం శ్రీశ్రీ చెప్పి నట్టుగానే వుంటుంది. కానీ ఎక్కడో ఎప్పుడో ఒక్కరు మాత్రం ఆదుకోవడానికి అమాంతం అమృతహస్తం అందించవచ్చు
దేశరక్షణ అంశాన్ని పరిశీలిస్తే ఒకింత భయమేస్తుంది. మనం నిజంగానే సురక్షితంగా వున్నామా అన్న ప్రశ్న పెద్దదయి వొణికిస్తోంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉగ్రదాడులకు ఆస్కారం వుంటోం ది. ఒకదాని తర్వాత మరొకటి పెనుముప్పులు పొంచి వుంటున్నాయి. ప్రభుత్వాలు మారినా, సైన్యం మూడు విభాగాలూ ఎంతో అప్రమత్తంగా వున్నన్నా.. ఉగ్రదాడుల ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది.
ఒక్కప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కమ్యూనిస్ట్ పార్టీలు కీలక భూమికను పోషించాయి. అయితే, అంతతా గతించిన చరిత్ర. ఈరోజు, ఏపీలోనే కాదు,దేశంలో (ఒక్క కేరళలో మినహా) కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వ వైభాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచు కోటలుగా నిలిచిన, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోనూ లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టులు ఇంకా అధికారంలో ఉన్నారు.
ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, లెఫ్ట్ పార్టీలు పూర్వ వైభవాన్ని ఎప్పుడో కోల్పోయాయి. అయినా, ఇటు ఏపీలో అటు తెలంగాణాలో లెఫ్ట్ పార్టీ నేతలు, చింత చచ్చినా పులుపు చావలేదు
అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో ఫోర్బ్స్ కంపెనీకి చోటు లభించింది. అమరరాజా బ్యాటరీస్ గుంటూరు ఎంపీ, తెలుగుదేశం నాయకుడు గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన కంపెనీ అన్న సంగతి విదితమే.
కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నారా? ఓ వంక శాఖపరమైన సమస్యలు, మరోవంక రాజకీయ సవాళ్ళు ఒకేసారి దండయాత్ర చేయడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, అంటే, అవును, ఆమె ఒక్కసారిగా ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు. ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్నారని, అంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించే క్రమమలో విద్యార్ధుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెనే సిల్లీ మంత్రిని చేశాయి.
మహా వికాస్ అఘాడీ (ఎంవీఎ) ప్రభుత్వ వ్యతిరేకత కొత్త స్పీకర్ ఎన్నిక విషయంలో స్పష్టమయింది. షిండే, ఫడ్నవీస్‌ల ప్రయాణం మున్ముందు అంత సులభసాధ్యంగా సాగకాపోవచ్చు.
కొంచం విరామం అంతే మళ్లీ చమురు సంస్థలు తమ బాదుడు మొదలెట్టేశాయి. తాజాగా గృహావసరాలను వినియోగించే గ్యాస్ సిలెండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు వడ్డించాయి. ఈ వడ్డింపు బుధవారం నుంచే అమలులోకి వస్తుంది. ఇటీవలే అంటే ఈ నెల 1వ తేదీన వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే బండపై 7వ తేదీ నుంచి 50 రూపాయలు వడ్డించడం విశేషం.
ప్రజలలో వ్యతిరేకత వైసీపీపై కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలపై కాదు వ్యతిరేకత అంతా వాలంటీర్లపైనే.. ఇదీ వైసీపీ నేతలు ఇప్పుడు ముక్తకంఠంతో చెబుతున్న మాట. మనం నియమించిన వాళ్లు వాలంటీర్లు ఇప్పుడు వారి వల్లే మనకు ఇబ్బంది ఎదురౌతోందనుకుంటే వాళ్లని తొలగించేద్దాం అదెంత సేపు అన్నదే ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్న మాట. పార్టీ ప్లీనరీలకు ముందు నిర్వహించిన జిల్లాల ప్లీనరీలలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇదే విషయం చెప్పారు. పార్టీ బలోపేతం, పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా వేటి గురించీ జిల్లా ప్లీనరీలలో చర్చించలేదు.
నీకిది.. నాకిది అన్న ఒప్పందం.. సంబంధం కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో తమకు ఉందని వైసీపీ ఎంపీ ఒకరు కుండ బద్దలు కొట్టేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గత మూడేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీసీ మద్దతు ఇస్తున్నదని అంగీకరించారు. అందుకు ప్రతిగా కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పేశారు. దీంతో ఇప్పటి దాకా గుట్టుగా ఉన్న బీజేపీ- వైసీపీ క్విడ్ ప్రోకో సంబంధం లేదా అనుబంధం ఇప్పుడు బట్టబయలైపోయింది.
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, దటీజ్ కేసీఆర్, మహా మేథావి. చాలా తెలివైన రాజకీయ నాయకుడు. అంతకంటే గొప్ప రాజకీయ వ్యూహకర్త. ఎంతటి రాజకీయ ఉద్దండులనైనా ఆయన ఇట్టే బుట్టలో వేసుకోగలరు. అంతేకాదు, ఎంతటివారినైనా అంతే తేలిగ్గా తీసి కరివేపాకులో కలిపేయనూ గలరు. ఇన్నెందుకు ఆయన ఘటనా ఘటన సమర్ధుడు. ఆయన రాజకీయ, విజ్ఞత, వివేచన మీద ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర లేదు.
ఆయన ఎప్పుడు, ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనతో సహా ఎవరికీ తెలియదు, కానీ, ఆయన నోటి నంచి వచ్చిన మాట రాజకీయ తుపాను సృష్టిస్తుంది. అలాగే, రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు మరొకరు లేరు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కంటే సీనియర్ నాయకులు ఉన్నా, ఉద్యమ నేతగా జనం ఆయన్ని ఎత్తు కుర్చీ ఎక్కించారు. సో.. ఆయనే టాలెస్ట్ లీడర్’గా చలామణి అవుతున్నారు.