ఈ సీఎం.. పదోతరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ!
Publish Date:Mar 25, 2021
Advertisement
రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో పదోతరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ .. గతంలో చేసిన దొంగ బుద్ది ఆయనకు ఇంకా పోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అలాంటి పనులే చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ, పాలనలో వేసిన ప్రతి అడుగూ తప్పుతూ ఫేక్ ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు... ఈ వ్యాఖ్యలు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ప్రతిపక్ష నాయకుడు చేసినవి. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారం రాజకీయ కాక రేపుతోంది. ఫేక్ కేసులు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిపోయిన బుద్ధి జగన్ రెడ్డి ఇంకా మార్చుకోలేదని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదులు ఇచ్చి ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. అమరావతి అసైన్డ్ భూముల అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులైనా నిజమైనవాళ్లా? లేక ఫేక్ సీఎం ఇచ్చిన ఫేక్ ఫిర్యాదుల్లాంటి ఫేక్ ఖాకీలా? అంటూ సెటైర్లు వేశారు అయ్యన్న పాత్రుడు. "నాడు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకరించి, అధికారం చేపట్టాక కక్ష కట్టి మరీ అమరావతి అంతానికి కుట్రలు చేస్తున్నావు. వికేంద్రీకరణ పేరుతో నువ్వు చిమ్ముతున్న విద్వేషపు విషాన్ని టీడీపీ జనం ముందు ఉంచింది. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరింపులకు పాల్పడినా జగన్ రెడ్డి, ఆయన గ్యాంగ్ చెప్పేవన్నీ అవాస్తవాలేనని ప్రజలు కుండబద్దలు కొట్టారు. అసత్యప్రచారాలే పునాదులుగా నిర్మించుకున్న అధికారం కూలిపోయే రోజు దగ్గరపడింది" అంటూ సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు.
http://www.teluguone.com/news/content/tdp-seniour-leader-ayyannapatrudu-fire-on-cm-jagan-25-112579.html





