Publish Date:May 20, 2022
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల చిచ్చు ఇంకా చల్లారలేదు. తాజాగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ ఆంబేడ్కర్ కోససీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ చిచ్చుకు అజ్యం పోసింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచిన సంగతి తెలిసిందే.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. అయితే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి వినతులు అందాయి.. దీంతో సానుకూలంగా స్పందించి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Publish Date:May 20, 2022
పూర్వ వైభవమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు ‘చింతన్ శిబిర్ర్’ నిర్వహించింది. సుమారు 400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ శిబిరంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ భవిష్యత్ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. తీర్మానాలు చేశారు.ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం తర్వాత ఒక కదలిక వచ్చిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే, చివరాఖరుకు, అలాంటి పాజిటివ్ వైబ్స్ ఏమీ కనిపించలేదనే విశ్లేషణలు వినిపించాయి.
Publish Date:May 20, 2022
రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్ హత్య కేసు విచారణలో సీబీఐ చేతులెత్తేసిందా? కోర్టుకు ఆ దర్యాప్తు సంస్థ చెప్పిన విషయం వింటే ఔననే అని పించక మానదు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని సీబీఐ కోర్టుకు విస్పష్టంగా చెప్పేసింది.
Publish Date:May 20, 2022
ఆంధ్ర ప్రదేదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు బయలు దేరారు.. అయన కంటే ముందే తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వయా యూకే, దావోస్’ కు పయనమయ్యారు. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరు ముఖ్యనేతలు విదేశీ గడ్డమీద కలవడం యాదృచ్చికమా,లేక వ్యుహత్మకమా? జగన్ రెడ్డి, కేటీఆర్ ముందుగా అనుకునే దావోస్ ఎకనమిక్ ఫోరం వేదికను రాజకీయ చర్చలు, సంప్రదింపులకు వేదిక చేసుకున్నారా? అంటే, అదే నిజమని అంటున్నారు, రెండు పార్టీల లోగుట్టు తెలిసిన రాజకీయ విశ్లేషకులు.
Publish Date:May 20, 2022
అవి రైతు భరోసా కేంద్రాలు కావు రైతు దగా కేంద్రాలు అన్న విమర్శలు తొలి నుంచీ ఉన్నా వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ చేయించాలన్న సంచలన వ్యాఖ్యలతో తేనెతుట్టె మరోసారి కాదిలింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కోససీమలో రైతులు దోపిడీకి గురౌతున్నారనే అన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థతి నెలకొందంటూ మరో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల దోపిడీ అన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మాటలు అక్షర సత్యాలని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Publish Date:May 20, 2022
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదరింపు కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆయన నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ ఓ అజ్ణాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ తో పోలీసులకు చెమట్లు పట్టాయి. బాంబు స్క్వాడ్ తో ముఖ్యమంత్రి నివాసం, ఆయన కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు చివరికి అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు.
Publish Date:May 20, 2022
కరోనా ముప్పు ఇంకా పొంచే ఉంది. మూడు వేవ్ లలో లక్షల మంది ప్రాణాలను హరించేసిన ఈ మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లతో మానవాళిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలి సారిగా ఒమిక్రాన్ వేరియంట్ బీఏ 4 కేసు తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో నమోదు అయ్యింది. దీంతో కరోనా ప్రొటోకాల్ పాటించాల్సిన అనివార్యత మరోసారి తెరమీదకు వచ్చింది.
Publish Date:May 20, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రాజకీయం’ ఎవరికి ఒక పట్టాన అర్థం కాదు. ఆయన ఎప్పుడు ఏ అడుగు ఎందుకు వేస్తున్నారో, అయన సన్నిహితులకే కాదు, కొన్ని కొన్ని సందర్భాలలో ఆయనకు కూడా అర్థం కాదు. అందుకే అనేక సందర్భాలలో అయన నాలుక కరుచుకోవడం జరుగుతుందని అంటారు. అయితే, ఒకటి మాత్రం నిజం, ఆయన ఇంచుమించుగా ఓ పక్షం రోజులకు పైగా, ఫార్మ్ హౌస్’కే పరిమితం అయినా, ఇప్పుడు మరో పక్షం రోజులు ‘జాతీయ’ పర్యటనకు బయలుదేరి వెళుతున్నా అందుకు జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగానే భావించవలసి ఉంటుందని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Publish Date:May 20, 2022
ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం విదేశీ పర్యటనకు బయలు దేరి వెళుతుతున్నారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో హాజరయ్యేందుకే విదేశీ పర్యటనకు వెళుతున్నారు. మొత్తం పది రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు.
Publish Date:May 20, 2022
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు.ప మంత్రి పదవి చేపట్టగానే.. విశాఖ శారదాపీఠాధిపతి స్వామి సర్వూపనందేంద్ర స్వామి ని దర్శించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో కలిసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే పార్టీ వర్గాల కథనం మాత్రం రోజాకు కేబినెట్ బెర్త్ అంత సులువుగా దక్కలేదు.
Publish Date:May 20, 2022
వైసీపీ ఎమ్మెల్సీ వద్ద గతంలో కారు డ్రైవర్ గా పని చేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వద్ద కారు డ్రైవర్ గా పని చేసిన సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ అతడి మృతదేహాన్ని తన కారులో బంధువల వద్దకు తీసుకువచ్చారు.
Publish Date:May 19, 2022
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశం దిశగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం నుంజీ దేశ వ్యాప్త పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం అవుతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర సైనిక కుటుంబాలకు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు.
Publish Date:May 19, 2022
ఎలాగైనా సరే ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల ‘సత్ఫలితా’లను వారికి వివరించాలని జగన్ డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం వైసీపీ అధినేత గడప గడపకూ అంటూ ప్రజాప్రతినిథులను జనంలోకి వెళ్లమని విస్పష్ట ఆదేశాలు జారీ చేసినా వారు ఖాతరు చేయకపోవడం.. వెళ్లిన కొద్ది మందీ కూడా ప్రజాగ్రహ జ్వాలలకు జడిసి కార్యక్రమాన్ని ‘మమ’ అనిపిస్తూ చాప చుట్టేయడంతో ఆ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఇలా లాభం లేదనుకున్నారో ఏమో.. ఇప్పుడు సామాజిక న్యాయ యాత్ర అంటూ మంత్రుల బస్సు యాత్రకు నిర్ణయం తీసుకున్నారు.