Top Stories

dummy

political-news-img

ఏబీవీ కొత్త పార్టీ.. కులం కాదు.. వ్యక్తిత్వమే అభ్యర్థుల ఎంపికకు కొలమానం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఏపీలో కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీలో ప్రతి చిన్న విషయానికి కులం రంగు పులుముతున్నారని, మంచినీళ్ల నుంచి ఇంటి అద్దె వరకు కుల ప్రాతిపదికన లెక్కలు వేసే వాతావరణం నెలకొందని విమర్శించారు. తన కొత్త పార్టీ కేవలం వ్యక్తిత్వం ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాస్పద వ్యక్తులకు, అవినీతిపరులకు చోటు ఉండదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం చేసిన తప్పులను, దోపిడీని అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో జరిగిన వేల కోట్ల అవకతవకలు, ఇండోసోల్ ప్రాజెక్టుల పేరుతో జరిగిన సబ్సిడీల కుంభకోణాలను ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. ఇలాంటి ప్రమాదకరమైన రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటి వరకు కేవలం మీడియా ద్వారానే ప్రజా సమస్యలపై పోరాటం చేశాననీ, ప్రభుత్వాలను కదిలించాలంటే ఒక వ్యవస్థీకృత రాజకీయ వేదిక అవసరమని గుర్తించానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అందుకే ఒక పొలిటికల్ పార్టీగా అవతరించి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా, బాధ్యతాయుతమైన పాలనను అందించడమే తన కర్తవ్యమని వివరించారు. భవిష్యత్ నాయకత్వంపై అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్న వ్యక్తిగా ఇతర పార్టీల అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడం సబబు కాదని చెబుతూనే.. వ్యవస్థలో మార్పు రావలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు కొత్త రాజకీయ ప్రయాణం ఏపీ ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకువస్తుంది? సాంప్రదాయ పార్టీలకు ఆయన తన పార్టీతో చెక్ పెట్టగలరా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Publish Date: May 9, 2026 6:56PM

political-news-img

విజయ్ కు వీసీకే మద్దతు.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం

తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. టుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు మార్గం సుగమం చేస్తూ.. విడుదలై చిరుత్తైగల్ కట్జి పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించింది. టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది. దీంతో విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ లభించింది. ఈ పరిణామంతో విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే టీవీకే పార్టీకి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీసీకే కూడా తోడవడంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుపై ఉన్న సందిగ్ధత తొలగిపోయింది.

Publish Date: May 9, 2026 6:11PM

political-news-img

మల్టీలెవెల్ పార్కింగ్ సెంటర్లతో ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్!

హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరిగిపోతున్న వాహనాల రద్దీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందించింది. భాగ్యనగరాన్ని ట్రాఫిక్ రహితంగా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించింది. వాహనదారులు రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలను నిలపడం వల్ల ఏర్పడుతున్న అంతరాయాలను తొలగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆలోచన ప్రకారం.. ఈ మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాలలో కేవలం వాహనాల నిలుపుదలకే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలకు కూడా అవకాశం కల్పించడంద్వారా ఈ ప్రాజెక్టులు ఆర్థికంగా కూడా లాభసాటిగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది. స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్, సెన్సార్ల వినియోగం వంటి ఆధునిక సాంకేతికతను ఇందులో ప్రవేశపెట్టడం ద్వారా వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది. గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఈసారి మరింత పకడ్బందీగా మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలను నగరమంతటా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధానంగా ఓల్డ్ సిటీ, అబిడ్స్, కోఠి, పంజాగుట్ట వంటి రద్దీ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించడంతో పాటు.. రోడ్ల విస్తరణ పనులను కూడా ఈ ప్రణాళికలో భాగంగా సమన్వయం చేయనుంది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను సొంతం చేసుకుంటుందని నిపుణులు అంటున్నారు.

Publish Date: May 9, 2026 5:57PM

political-news-img

విశాఖకు మరో మణిహారం.. 102 కిలోమీటర్ల సెమీరింగ్ రోడ్డు

విశాఖపట్నం నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో వీఎంఆర్‌డీఏ కీలక ముందడుగు వేసింది. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు.. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించేందుకు 102 కిలోమీటర్ల పొడవైన సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదిత రహదారి రాంబిల్లి నుంచి ప్రారంభమై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సాగుతుంది. ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిపై ఒత్తిడిని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రాంబిల్లి వద్ద ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు , పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెళ్లే సరుకు రవాణాకు ఈ రహదారి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. భోగాపురం వద్ద నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ సెమీ రింగ్ రోడ్డు అనుసంధానం కావడం వల్ల ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయం లభిస్తుంది. గతంలో ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా.. మరింత శాస్త్రీయంగా ఈ 102 కిలోమీటర్ల రహదారిని రూపొందించారు. దీని కోసం భూసేకరణ ప్రక్రియ, నిధుల సమీకరణపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే జంక్షన్ల వద్ద వాణిజ్య సముదాయాలు.. లాజిస్టిక్ హబ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసే ఈ ప్రాజెక్టుపై స్థానిక ప్రజలు, పారిశ్రామిక వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. రాబోయే ఐదేళ్లలో విశాఖ నగరం మరింత విస్తరించడానికి ఈ సెమీ రింగ్ రోడ్డు ఒక చోదక శక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.

Publish Date: May 9, 2026 5:46PM

political-news-img

ఏసీ గదుల నుంచి పాలనకు చరమగీతం.. ప్రతి శుక్రవారం సమస్యల పరిష్కార దినం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏసీ గదుల లో కూర్చిని పాలన సాగించే పద్ధతికి చరమగీతం పాడారు. ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కార దినంగా ప్రకటించడం ద్వారా అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. సింగపూర్ నమూనా నుండి స్ఫూర్తి పొందిన చంద్రబాబునాయుడు, సమస్యలను స్థానికంగా మండల స్థాయిలో పరిష్కరించాలని నొక్కి చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో గడిపే సమయాన్ని గరిష్ఠంగా పెంచడానికి.. అన్ని అధికారిక వీడియో కాన్ఫరెన్సులు, అంతర్గత సమావేశాలు ఇప్పుడు వారానికి ఒక రోజుకు పరిమితం చేశారు. కలెక్టర్లు ఇప్పుడు ప్రతి నియోజకవర్గాన్ని నెలలో కనీసం నాలుగు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. అలాగే.. డిసెంబర్ 2027 నాటికి 10 లక్షల ఇళ్లను నిర్మించాలనే భారీ లక్ష్యాన్ని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. క్షేత్రస్థాయి ఉనికిని, హై-స్పీడ్ డిజిటల్ ట్రాకింగ్‌ను కలపడం ద్వారా.. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని చేయడం ఒక మేండటరీగా మార్చేశారు.

Publish Date: May 9, 2026 5:06PM

political-news-img

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో నేడు ఒక కీలక అధ్యాయం మొదలైంది. రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ కాలం పాటు వామపక్షాలు, ఆపై తృణమూల్ కాంగ్రెస్ పాలించిన ఈ రాష్ట్రంలో, ఇప్పుడు కమల దళం అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించింది. సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తల జయజయధ్వానాల మధ్య, రాష్ట్ర గవర్నర్ సువేందు అధికారితో పదవీ ప్రమాణం చేయించారు. సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ముఖ్యంగా నందిగ్రామ్ రైతాంగ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో అత్యంత కీలకం. అయితే, తృణమూల్ కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గుతోందని భావించిన సువేందు.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ ను వీడి బీజేపీలో చేరారు. అప్పట్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఢీకొని విజయం సాధించారు. దీంతో సువేందు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ విజయం ఆయనను బీజేపీలో తిరుగులేని నాయకుడిగా మార్చడమే కాకుండా.. నేడు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేలా చేసింది. ఈ విజయోత్సాహం మధ్యే సువేందు అధికారిపై ప్రతిపక్షాల విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో సువేందు తృణమూల్‌లో ఉన్నప్పుడు ఆయనపై ప్రధాని మోదీ స్వయంగా అవినీతి ఆరోపణలు చేశారనీ.. ఇప్పుడు వాటన్నిటినీ మరిచిపోయి సువేందును ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా, ఆయన ప్రమాణస్వీకారినికి కూడా హాజరవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజనులు ప్రధాని మోడీ ద్వంద్వ ప్రమాణాలను నిలదీస్తున్నారు.

Publish Date: May 9, 2026 4:45PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img