Top Stories

political-news-img

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ నివాసంలో ఏసీబీ సోదాలు.!

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం(జులై 14) విస్తృత సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. బచ్చు రవీందర్ ప్రస్తుతం హెచ్ఎం డిఏలో చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారం గా ఏసీబీ అధికారులు డిస్‌ప్రోపోర్షనేట్ అసెట్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోదాల సందర్భంగా నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. స్వాధీనం చేసు కున్న నగదు, బంగారం, ఇతర ఆస్తులకుకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. Dispraportionate, Assets, Case, Telangana News, Telugu One

Publish Date: Jul 14, 2026 2:16PM

political-news-img

పేర్ని నానికి పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ తండ్రి శాపనార్ధాలు.. ఎందుకంటే?

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రాణాంతకమైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్ననిరంజన్ ను మరణానికి ముందు పవన్ కల్యాణ్ వారింటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. దీనిపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. నిరంజన్ మరణం అనంతరం.. నిరంజన్ తల్లిదండ్రులు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్నినానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ కుమారుడు నిరంజనం ఆకస్మిక మృతికి పేర్నినాని.. పవన్ పై చేసిన వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు. తనకుమారుడిపై ప్రేమతో పరామర్శించడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరంజన్ ను ఎంతో కృంగదీశాయనీ, ఆ మనస్థాపంతోనే తన కుమారుడు ఎంతో ప్రేమగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పేర్ని నాని మాట్లాడిన అనుచిత మాటలు నిరంజన్‌ను మానసికంగా ఎంతో కుంగదీశాయని, ఆ తీవ్ర మనస్థాపం వల్లే తమ కుమారుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడనీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా కండరాల క్షీణతకు సంబంధించిన ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ నిరంజన్ మంచానికే పరిమితమైన నిరంజన్.. పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా చూడాలని ఆకాంక్షించాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో, ఆయన స్పందించి హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లారు. అక్కడ అతడిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, ధైర్యం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పవన్‌ను కలవాలనే తన జీవితకాల కోరిక నెరవేరడంతో నిరంజన్ ఎంతో సంతోషపడ్డాడు. అయితే.. పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తాను ఎంతో గౌరవించే నాయకుడిని అలా అవమానించడం తట్టుకోలేకపోయాడు. ఆ బాధాకరమైన వీడియోను నిరంజన్ పదే పదే చూస్తూ, తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాడని అతని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఒక పక్క శారీరక అనారోగ్యం, మరోపక్క మనసుకు తగిలిన ఈ మానసిక గాయం కారణంగానే నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించి, హఠాన్మరణానికి దారితీసిందని తండ్రి ఆరోపించారు. "ఆ చిన్నపిల్లాడి ఆరోగ్యం మీద, చివరి రోజుల్లో ఉన్న ఒక ప్రాణం మీద వెటకారం చేసి, వాడి మనసును తీవ్రంగా గాయపరిచిన పేర్ని నానికి ఈ పాపం ఖచ్చితంగా చుట్టుకుంటుందని ఆ తండ్రి ఆవేదనతో అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక నిరుపేద, అనారోగ్యంతో ఉన్న బాలుడి పరిస్థితిని కూడా వదలకుండా విమర్శలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమని నిరంజన్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని, చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని అనుభవించాల్సిందేనని వ్యాఖ్యానించారు. కొడుకును కోల్పోయిన కడుపుకోతలో ఉన్న ఆ తండ్రి వ్యక్తపరిచిన భావోద్వేగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజనులు పేర్ని నానిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు.

Publish Date: Jul 14, 2026 1:15PM

political-news-img

లులు మాల్ లో తుపాకి కలకలం.!

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లులు మాల్‌లో ఓ వ్యక్తి తుపాకీతో ప్రత్యక్ష మవడం తీవ్ర కలకలం రేపింది. రెండు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ సమయంలో గన్ బయటపడటంతో మాల్‌కు వచ్చిన సందర్శకులు, ఇతర వాహనదారులు భయాందో ళనకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన రెండు కుటుంబాలు లులు మాల్ సెల్లార్ పార్కిం గ్‌లో ఒక్కసారిగా వాగ్వాదా నికి దిగారు. గొడవ తీవ్రరూ పం దాల్చుతున్నట్లు గుర్తిం చిన మాల్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఓ వైపుపరిస్థితిని అదుపు చేస్తూనే మరోవైపు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సిద్ధిఖీని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న తుపాకీ స్వాధీనం చేసుకు న్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ లో ఆ తుపాకీకి చట్టబద్ధ మైన లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే, తుపాకీతో ఉన్న వ్యక్తి ఎలాంటి తనిఖీలు లేకుండానే మాల్ సెల్లార్ పార్కింగ్‌లోకి ప్రవేశించడం భద్రతా వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది. వాహనాలను సెల్లార్‌లోకి అనుమతించే సమయంలో భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించలేదని గుర్తించారు. అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఘర్షణను అదుపులోకి తీసుకురావడంతో సిద్ధిఖీ తుపాకీని ఉపయోగించే పరిస్థితి రాలేదని పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటన ను తీవ్రంగా పరిగణించిన పోలీసులు లులు మాల్ యాజమాన్యం భద్రతా నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించిందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనకు సంబంధించి మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. KPHB Lulu Mall Hyderabad, Hyderabad Crime News, Parking Dispute Gun Threat, Lulu Mall Security Lapse

Publish Date: Jul 14, 2026 12:56PM

political-news-img

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీని విచారించిన సీట్.!

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారిని విచారించింది. ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి. సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ప్రాథమిక వివరాల ప్రకారం... 2023లో దాదాపు ఏడాది పాటు ఏబీ వెంకటేశ్వరరావు కాల్ డేటా రికార్డులను నిందితులు అక్రమంగా సేకరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను ఈ కేసులో బాధితుడిగా, కీలక సాక్షిగా పరిగణించిన సిట్ వెంకటేశ్వరరావును విచారణకు పిలిచి ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. విచారణ సందర్భం గా ఏబీవీ కాల్ డేటా సేకరణ కు సంబంధించిన అంశాలు, ఆ సమయంలో ఆయన నిర్వహించిన అధికారిక బాధ్యతలు, తదితర అంశాలపై సిట్ అధికారులు ఏబీ వెంకటే శ్వరరావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏబీవీ కాల్ డేటా సేకరణ వెనుక ఉన్న ఉద్దేశం, దాన్ని ఎవరెవరు ఉపయోగిం చారు, ఏ విధంగా దుర్విని యోగం చేశారనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. SIT, Former AP Intelligence Chief ABV in the phone-tapping case, telangana Phone Tapping Case

Publish Date: Jul 14, 2026 12:42PM

political-news-img

రూ.318 కోట్లతో టాటా క్యాపిటల్ భారీ డీల్.. ఇక గోల్డ్ లోన్ మార్కెట్ షేక్!

భారతీయ ఆర్థిక రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న టాటా గ్రూప్‌నకు చెందిన టాటా క్యాపిటల్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటివరకు వివిధ రకాల పర్సనల్, బిజినెస్ లోన్లతో ఆకట్టుకున్న ఈ సంస్థ, ఇప్పుడు దేశంలో అత్యంత ఆదరణ ఉన్న గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఇందుకోసం కేరళలోని త్రిస్సూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) 'యోగ్‌లోన్స్' (Yog-Loans) లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. టాటా క్యాపిటల్ బోర్డు సోమవారం జరిగిన కీలక సమావేశంలో యోగ్‌లోన్స్‌ సంస్థలో ఏకంగా 88.6 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ డీల్ విలువ అక్షరాలా 318 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ కీలక కొనుగోలుతో దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న యోగ్‌లోన్స్ నెట్‌వర్క్ ఇకపై టాటా చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం యోగ్‌లోన్స్ సంస్థకు కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతమైన నెట్‌వర్క్ ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సంస్థకు మొత్తం 162 బ్రాంచీలు ఉన్నాయి. అలాగే 2026 మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం, ఈ కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల (AUM) విలువ 708 కోట్ల రూపాయలుగా ఉంది. దాదాపు 32,000 మంది నమ్మకమైన వినియోగదారులతో ఈ సంస్థ ఆర్థిక సేవలందిస్తోంది. మణప్పురం ఫైనాన్స్‌లో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేసిన అపార అనుభవం ఉన్న ఉన్నికృష్ణన్ ఇడిచరం వీటిల్ ప్రస్తుతం యోగ్‌లోన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. టాటా క్యాపిటల్ ఈ సంస్థను స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఆయనే మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని స్పష్టమైంది. దీనివల్ల సంస్థ నిర్వహణ మరింత స్థిరంగా సాగుతుందని భావిస్తున్నారు. అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్, 2026 మార్చి నాటికి ఏకంగా 2.77 ట్రిలియన్ల భారీ నికర ఆస్తుల నిర్వహణ (AUM) సామర్థ్యాన్ని కలిగి ఉంది. సంస్థ మొత్తం లోన్ బుక్‌ను పరిశీలిస్తే, అందులో 58.3 శాతం రిటైల్ రుణాలు, 27.4 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమల (SME) రుణాలు, మిగిలిన 14.3 శాతం కార్పొరేట్ రుణాలుగా ఉన్నాయి. ఇప్పుడు యోగ్‌లోన్స్ కొనుగోలుతో వారి పసిడి రుణాల విభాగం మరింత బలోపేతం కానుంది. యోగ్‌లోన్స్ నికర విలువ ప్రస్తుతం 115 కోట్ల రూపాయలుగా ఉండగా, 2021-22 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో దీని గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 25 శాతం సమ్మేళన వార్షిక వృద్ధి రేటును (CAGR) నమోదు చేయడం విశేషం. ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, పసిడి రుణాలు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 69 శాతం వృద్ధి సాధించి 3.3 ట్రిలియన్ రూపాయలకు చేరింది. బంగారం మార్కెట్ విలువలో దాదాపు 50 శాతం వరకు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు తక్షణ రుణాలు అందిస్తున్నాయి. అంతేకాకుండా, బంగారంపై రుణాలు తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లిస్తుండటంతో ఈ విభాగంలో మొండి బకాయిల భయం లేకుండా పోయింది. అందుకే ఈ లాభదాయకమైన రంగంలోకి ప్రవేశించడం ద్వారా మరింత వృద్ధి సాధించవచ్చని టాటా క్యాపిటల్ ఎండీ, సీఈఓ రాజీవ్ సభర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాత యోగ్‌లోన్స్ పూర్తిగా టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థగా రూపాంతరం చెందనుంది. tata capital acquires yog loans deal,tata gold loan business entry.

Publish Date: Jul 14, 2026 12:29PM

political-news-img

విషాదం: 38 ఏళ్లకే ఫిఫా వరల్డ్ కప్ రెఫరీ రాబ్ డీపెరింక్ కన్నుమూత!

అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డచ్‌కు చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్ రెఫరీ రాబ్ డీపెరింక్ కేవలం 38 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియల్స్ జాబితా నుండి ఆయనను తొలగించిన కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ విషాదం జరగడం క్రీడా రంగాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. రాబ్ డీపెరింక్ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకు అధికారికంగా బయటకు వెల్లడి కాలేదు. క్రీడా జీవితంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న రాబ్ డీపెరింక్, రాబోయే ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ప్రతిష్టాత్మకమైన వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR)గా విధులు నిర్వర్తించడానికి ఎంపికయ్యారు. అయితే, బ్రిటన్‌లో జరిగిన ఒక పోలీసు విచారణ కారణంగా ఈ ఏడాది మే నెలలో ఆయనను వరల్డ్ కప్ అధికారుల జాబితా నుండి అకస్మాత్తుగా తొలగించారు. ఒక టీనేజ్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏప్రిల్ నెలలో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసు ఆధారాల కొరత కారణంగా తదుపరి కాలంలో మూసివేయబడినప్పటికీ, అప్పటికే ఆయన కెరీర్ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఈ ఆరోపణలపై డీపెరింక్ డచ్ వార్తాపత్రిక 'డి టెలిగ్రాఫ్'తో మాట్లాడుతూ, తనపై అన్యాయంగా, తప్పుడు ఆరోపణలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబ్ డీపెరింక్ క్రీడా ప్రస్థానం ఎంతో అద్భుతమైనది. 2011-12 సీజన్‌లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ రెఫరీగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, 2017 చివరి నాటికి తన మొదటి 'ఎరెడివిసీ' (Eredivisie) మ్యాచ్‌కు నేతృత్వం వహించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఏకంగా 284 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను విజయవంతంగా నడిపించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ వీఏఆర్ (VAR) ఆఫీసర్‌గా బలమైన ముద్ర వేశారు. యూఈఎఫ్ఏ యూరో 2024, పారిస్ ఒలింపిక్ గేమ్స్ వంటి ప్రపంచ స్థాయి క్రీడలలో రెఫరింగ్ బృందంలో భాగస్వామిగా వ్యవహరించారు. అలాగే, 2024 యూరోపా లీగ్ ఫైనల్ (అటలాంటా వర్సెస్ బేయర్ లెవర్‌కూసేన్), డిసెంబర్ 2024లో ఖతార్‌లో జరిగిన ఫిఫా ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లకు కూడా ఆయన వీడియో అసిస్టెంట్ రెఫరీగా సేవలందించారు. fifa world cup referee rob dieperink dies 38,dutch referee rob dieperink passes away.

Publish Date: Jul 14, 2026 12:25PM

MOVIE NEWS