political-news-img

ముద్రగడ పాడె మోసిన జగన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, మరీ ముఖ్యంగా కాపు సామాజికవర్గ ఉద్యమాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్రలో వైసీపీ అధినేత జగన్ పాల్గొనడమే కాకుండా.. స్వయంగా ఆయన పాడె మోశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆరోగ్యం విషమించి ముద్రగడ మంగళవారం (జులై 14)న తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. ఆయన వయస్సు 73 ఏళ్లు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు.. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడిలో బుధవారం (జులై 15) జరిగాయి. భీమవరంలో పర్యటించి అక్కడి ఆక్వారైతులతో భేటీ అయిన తరువాత జగన్ బుధవారం మధ్యాహ్నానికి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ పరంగా తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ మరణం కేవలం వారి కుటుంబానికే కాకుండా వైసీపీకి, ఆయనను ఆరాధించే లక్షలాది మంది అభిమానులకు తీరని లోటన్నజగన్.. నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్లే అరుదైన నైజం ముద్రగడ సొంతమని, ఆత్మగౌరవానికి, నిజాయితీకి నిలువెత్తు రూపమని అన్నారు. అనంతరం ముద్రగడ అంతిమ యాత్రలో స్వయంగా ముద్రగడ పద్మనాభం పాడె మోశారు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్న వారి సొంత స్థలంలో అంత్యక్రియల ప్రక్రియను నిర్వహించారు. Mudragada Padmanabham, YS Jagan, Kirlampudi, Mudragada Funeral, Botsa Satyanarayana, YSRCP News

Publish Date: Jul 15, 2026 5:05PM

political-news-img

గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? కడుపు ఆరోగ్యం మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసా?

గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? కడుపు ఆరోగ్యం మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసా? మన శరీర ఆరోగ్యానికి గట్ (Gut) ఎంత ముఖ్యమో చాలా మందికి పూర్తిగా తెలియదు. మన పేగుల్లో కోట్లాది సూక్ష్మజీవులు (Microbiome) నివసిస్తుంటాయి. వీటిలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా మధ్య సరైన సమతుల్యత ఉండటం ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ సమతుల్యత దెబ్బతింటే దానిని డిస్బయాసిస్ (Dysbiosis) అంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ Dr. Rakesh Kalapala గారు గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? అది మన శరీరంలో ఎలా పనిచేస్తుంది? మంచి బ్యాక్టీరియా పాత్ర ఏమిటి? చెడు బ్యాక్టీరియా పెరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి విషయాలను సులభమైన భాషలో వివరించారు. అలాగే గట్ హెల్త్‌కు మెదడు (Gut-Brain Connection)తో ఉన్న సంబంధం, లివర్, ప్యాంక్రియాస్ వంటి ముఖ్యమైన అవయవాల పనితీరుపై గట్ ఆరోగ్యం ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు. తరచూ గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా గుర్తించాలి? ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు? అనే అంశాలపై కూడా అవగాహన కల్పించారు. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు, పులియబెట్టిన ఆహారాలు (Fermented Foods), ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, తగినంత నీరు తాగడం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడిని తగ్గించడం వంటి జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా యాంటీబయోటిక్స్‌ను అవసరం లేకుండా తరచూ వాడటం వల్ల గట్ మైక్రోబయోమ్ ఎలా దెబ్బతింటుందో, ఏ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలో కూడా స్పష్టంగా తెలియజేశారు. గట్ ఆరోగ్యంపై శాస్త్రీయమైన, ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? మంచి బ్యాక్టీరియా – చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత డిస్బయాసిస్ అంటే ఏమిటి? దాని ప్రభావాలు గట్-బ్రెయిన్ కనెక్షన్ ఎలా పనిచేస్తుంది? గట్ ఆరోగ్యం లివర్, ప్యాంక్రియాస్‌పై చూపే ప్రభావం గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు గట్ హెల్త్‌ను మెరుగుపరిచే ఆహారం మరియు జీవనశైలి ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?

Publish Date: Jul 15, 2026 4:54PM

political-news-img

ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో తాహిర్ హుస్సేన్ దోషి.!

దేశ రాజధాని ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం చోటుచేసుకున్న అత్యంత దారుణమైన కమ్యూనల్ అల్లర్ల ఉదంతం.. ఇప్పుడు న్యాయపరంగా నిర్ణయాత్మక దశకు చేరుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చుట్టూ ముదిరిన వివాదాలు, ఆందోళనల నేపథ్యంలో 2020లో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండ తీవ్ర రక్తపాతానికి దారితీసిన సంగతి తెలిసిందే. దాదాపు 53 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ అల్లర్ల పర్వంలో, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) యువ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ క్రూర హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరికొందరిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. జూలై 23న వీరికి విధించే శిక్షల పరిమాణంపై కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. అయితే, అదే సమయంలో ఈ తీర్పు చుట్టూ దేశ రాజకీయాల్లో ఒక కొత్త వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ఈ న్యాయ ప్రక్రియకు మతపరమైన రంగును పులిమేలా ఉందనే విమర్శలకు దారితీశాయి. ఈ మొత్తం వివాదానికి మూలాలు 2019 చివరి నాటి రాజకీయ పరిణామాలలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత, దేశవ్యాప్తంగా అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్రమైన చర్చోపచర్చలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వంటి ప్రాంతాలలో నెలల తరబడి సాగిన రహదారి దిగ్బంధనాలు, ధర్నాలు రాజధాని నగరంలో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణాన్ని రగిల్చాయి. ఇది చివరకు 2020 ఫిబ్రవరి 23 నుండి 26 మధ్య కాలంలో ఈశాన్య ఢిల్లీ పరిధిలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, చాంద్ బాగ్, ఖజూరి ఖాస్, ముస్తఫాబాద్ వంటి సమస్యాత్మక ప్రాంతాలలో తీవ్రస్థాయి మత ఘర్షణలుగా రూపాంతరం చెందింది. పరస్పరం రాళ్ల దాడులు చేసుకోవడం, ఆస్తులను తగులబెట్టడం, పెట్రోల్ బాంబుల వినియోగం, ప్రార్థనా మందిరాలపై దాడులతో ఆ ప్రాంతాలన్నీ రణరంగంగా మారాయి. ఈ ఘోర హింసలో వందలాది మంది తీవ్రంగా గాయపడగా, 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్ల వెనుక ఉన్న లోతైన కుట్రలను, నేరాలను ఛేదించడానికి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగాలు, క్రైమ్ బ్రాంచ్ సంస్థలతో పాటు జాతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే స్థానిక రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఉన్న తాహిర్ హుస్సేన్ పాత్ర ఈ అల్లర్లలోను, ఐబీ అధికారి హత్యలోనూ ప్రధానంగా తెరపైకి వచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే, 2020 ఫిబ్రవరి 25న కేవలం 26 ఏళ్ల వయసున్న ఐబీ అధికారి అంకిత్ శర్మ విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి తిరిగొచ్చారు. ఆ తర్వాత బయటకు వెళ్లిన ఆయన ఎంతకీ తిరిగి రాకపోవడంతో, ఆందోళన చెందిన ఆయన తండ్రి రవీందర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా లభించిన సమాచారం ప్రకారం, చాంద్ బాగ్ వంతెన సమీపంలో ఉన్న ఒక భవనం వద్ద అంకిత్‌ను ఒక ఉన్మాద గుంపు అపహరించి, హతమార్చి, అనంతరం అక్కడే ఉన్న ఖజూరి ఖాస్ మురికి కాలువలో పడవేసినట్లు తెలిసింది. ఆ తర్వాత పోలీసులు కాలువ నుండి ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైన నిజాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అంకిత్ శర్మ శరీరంపై ఏకంగా 51 కి పైగా తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పదునైన ఆయుధాలతో, అత్యంత పాశవికంగా దాడి చేసి ఆయనను హత్య చేసినట్లు తేలింది. తాహిర్ హుస్సేన్‌కు చెందిన భవనం నుంచే ఈ నేరానికి పాల్పడిన గుంపు పనిచేసిందని, ఆ గుంపే తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని అంతమొందించిందని రవీందర్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీని ఆధారంగా సుదీర్ఘంగా సాగిన న్యాయ విచారణ ప్రక్రియ ఇప్పుడు ఒక ముగింపునకు వచ్చింది. కార్కర్డూమా కోర్టుకు చెందిన అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్ దాదాపు 320 పేజీలతో కూడిన సుదీర్ఘమైన, సమగ్రమైన తీర్పును వెలువరించారు. ఈ తీర్పులో న్యాయమూర్తి పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. నిందితుడు తాహిర్ హుస్సేన్ ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఏర్పడిన చట్టవ్యతిరేక జనసమూహంలో కీలక సభ్యుడని కోర్టు నిర్ధారించింది. అల్లర్లు జరిగిన రోజున చాంద్ బాగ్ ప్రాంతంలో సదరు గుంపు ఆయుధాలతో సిద్ధమై, ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే వ్యవహరించిందని, ఆ గుంపులోని వ్యక్తులే అంకిత్ శర్మను బలవంతంగా లాక్కెళ్లి అత్యంత క్రూరంగా దాడి చేసి హతమార్చారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక చట్టవ్యతిరేక సమూహంలో భాగస్వామిగా ఉన్నందుకు, ఐపీసీ సెక్షన్ 149 ప్రకారం ఆ గుంపు చేసిన హత్యకు తాహిర్ హుస్సేన్ కూడా సమాన బాధ్యుడవుతాడని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 365 (అపహరణ), 153A (మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం) వంటి అ సెక్షన్ల కింద నేరం రుజువైంది. అయితే, నేరపూరిత కుట్ర వంటి కొన్ని సెక్షన్లలో ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలు చూపలేకపోవడంతో వాటి నుండి మినహాయింపు లభించింది. తాహిర్‌తో పాటు నజీమ్, కాసిమ్, జావేద్, అనస్ అనే నలుగురిని కూడా కోర్టు దోషులుగా ప్రకటించగా, తగిన ఆధారాలు లేని కారణంగా మరో ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. తాహిర్ హుస్సేన్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచిన బలమైన స్థానిక నేత కావడంతో.. ఈ అంశంపై ఆప్ నాయకత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అల్లర్ల సమయంలో ఆయన నివాసం వేదికగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ సీసాలు సరఫరా అయ్యాయనే ఆరోపణలు రాగానే పార్టీ ఆయనను సస్పెండ్ చేసినప్పటికీ.. అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో సరైన రాజకీయ లేదా నైతిక వైఖరి తీసుకోకుండా మౌనం వహించారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఏకంగా కేజ్రీవాల్ అండదండలతోనే ఇదంతా జరిగిందనీ, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విచారణ సంస్థలు గానీ, న్యాయస్థానాలు గానీ కేజ్రీవాల్‌కు ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఎక్కడా నిర్ధారించలేదు. మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఈ తీర్పుపై స్పందిస్తూ, తాహిర్ హుస్సేన్ ముస్లిం కావడం వల్లే ఆయన్ను టార్గెట్ చేశారని, ఒకవేళ ఆయన పేరు 'తాహిర్' కాకుండా 'కపిల్' అని ఉండి ఉంటే ఈ పాటికి నిర్దోషిగా బయటకు వచ్చేవారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశంలో సరికొత్త చర్చకు దారితీశాయి. న్యాయస్థానం సాక్ష్యాధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తీర్పు ఇస్తే.. దానికి మతపరమైన రంగు పులిమి న్యాయవ్యవస్థపైనే పక్షపాత ముద్ర వేయడానికి ప్రయత్నించడం బాధ్యతారాహిత్యమైన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2020 నాటి ఢిల్లీ ఘర్షణలు కేవలం ప్రాణ నష్టాన్ని మాత్రమే మిగల్చలేదు, దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్న రెండు ర్గాల మధ్య ఉన్న నమ్మకాన్ని, సామాజిక సామరస్యాన్ని దారుణంగా దెబ్బతీశాయి. అంకిత్ శర్మ వంటి యువకులు అటు ప్రభుత్వ భద్రతా వ్యవస్థలో ఉంటూనే, ఇటు స్థానికంగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. అలాంటి వ్యక్తిని ఇంత ఘోరంగా పొట్టనబెట్టుకున్న కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం బాధిత కుటుంబానికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లభించిన న్యాయపరమైన ఉపశమనంగా భావించవచ్చు. ఈ తీర్పును ప్రధాన స్రవంతి మీడియా ఢిల్లీ అల్లర్ల కేసుల్లో నమోదైన మొట్టమొదటి కీలక హత్య నిరూపణగా పేర్కొంటూ విస్తృతంగా కవరేజ్ ఇచ్చింది. తాహిర్ హుస్సేన్ రాజకీయ నేపథ్యం, ఆయన ఆస్తులు, అల్లర్లలో ఆ భవనం పోషించిన పాత్ర వంటి అంశాలపై పెద్ద ఎత్తున విశ్లేషణలు వచ్చాయి. అయితే, మీడియా, రాజకీయ వర్గాల మధ్య నడుస్తున్న ఈ నేరేటివ్ వార్ లో బాధితుల కుటుంబాల అసలు వేదన, భవిష్యత్తులో ఇలాంటి మతపరమైన అల్లర్లు జరగకుండా పోలీసు వ్యవస్థలో తీసుకురావాల్సిన పటిష్టమైన సంస్కరణల గురించిన లోతైన చర్చలు చాలా వరకు మరుగునపడిపోతున్నాయనే ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. ఈ చారిత్రాత్మక తీర్పు కేవలం ఒక కేసు ముగింపు మాత్రమే కాదు.. దేశంలోని మిగిలిన అల్లర్ల బాధితులకు కూడా న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది. అయితే.. ఈ ఉదంతం మన ప్రజాస్వామ్య వ్యవస్థ ముందు కొన్ని కీలకమైన ప్రశ్నలను ఉంచుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు లేదా రాజకీయ నాయకులే స్వయంగా కమ్యూనల్ హింసకు కేంద్ర బిందువులుగా మారినప్పుడు, భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా స్పందించాలనే దానిపై స్పష్టత రావాలి. న్యాయస్థానాలు పూర్తి ఆధారాలతో తీర్పులు ఇచ్చినప్పుడు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపైనే మతపరమైన పక్షపాతం ఉందంటూ ఇమ్రాన్ మసూద్ వంటి నేతలు చేసే వ్యాఖ్యలను పౌర సమాజం ఎంతవరకు అంగీకరించాలనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో వ్యవస్థలపై ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఇకపోతే.. రాజకీయ పార్టీలు కేవలం నిందితులపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో మళ్లీ శాంతిభద్రతలు నెలకొనేలా, భిన్న వర్గాల మధ్య మైత్రీ బంధం బలపడేలా బాధ్యతాయుతమైన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చివరిగా.. 2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్లు దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అంకిత్ శర్మ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా దోషులకు శిక్ష పడటం అనేది చట్టం శక్తిని నిరూపిస్తుంది. రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లేదా నిర్దిష్ట వర్గాలలో బాధిత భావనను నింపడం కోసం చట్టపరమైన తీర్పులను వక్రీకరించడం మానుకోవాలి. ఘోరమైన గాయాలు, బలమైన ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్న ఈ కేసులో మతం కార్డ్ ఉపయోగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 23న కోర్టు ప్రకటించబోయే శిక్షల పరిమాణంపైనే ఉంది. ఈ పరీక్షా సమయంలో న్యాయవ్యవస్థ, రాజకీయ పక్షాలు, మీడియా సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సమాజంలో నిజమైన న్యాయం, శాంతిని పెంపొందించే దిశగా బాధ్యతాయుతంగా అడుగులు వేయడమే దేశానికి అత్యంత శ్రేయస్కరం. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. 2020 Delhi riots, Ankit Sharma murder case, Tahir Hussain convicted, Imran Masood

Publish Date: Jul 15, 2026 4:49PM

political-news-img

పార్టీ పెట్టే ధైర్యం జూనియర్ కు ఉందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నందమూరి వారసుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 18న ఎన్టీఆర్ తన అభిమానులతో ఒక భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆయన జూలై 18న నూతన రాజకీయ పార్టీని ప్రకటిస్తారా, లేక కేవలం సామాజిక సేవా సంస్థకే పరిమితం అవుతారా అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సంచలన పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. కొందరు రాజకీయ నేతలు, న్యాయ నిపుణులు ఎన్టీఆర్ ఖచ్చితంగా పార్టీ పెడతారని, ఇందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా అందాయని బలంగా చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి సమీకరణాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని భరధ్వాజ వెల్లడించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముందు.. తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని, కేవలం సమాజ సేవ కోసమే ఒక సంస్థ పెడుతున్నానని ప్రకటించారు. తర్వాతే ఆయన దానిని తెలుగుదేశం' రాజకీయ పార్టీగా మార్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి వ్యూహమే నడుస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ నటుడు విజయ్, గతంలో రజనీకాంత్ వంటి వారు కూడా అభిమాన సంఘాల బలాన్ని సమీకరించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రాజకీయ పార్టీని స్థాపించే సాహసం చేయకపోవచ్చనన్న భరద్వాజ ఇందుకు ఆయనకున్న భారీ సినీ కమిట్ మెంట్లు కారణమన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో డ్రాగన్ , త్రివిక్రమ్ ప్రాజెక్ట్, దేవర 2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది. ఈ దశలో సినిమాలను వదిలి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించడం జూనియర్ ఎన్టీఆర్ కు సాధ్యమయ్యే పని కాకపోవచ్చని భరద్వాజ అన్నారు. మరోవైపు, పాన్ ఇండియా మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి, సోషల్ మీడియా వేదికగా తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి అభిమానుల నెట్వర్క్ ను ఒక నిర్మాణాత్మకమైన కమిటీగా మార్చేందుకే ఈ సమావేశం ఉపయోగపడవచ్చనీ, హీరో అల్లు అర్జున్ సైతం జాతీయ స్థాయిలో తన ఆర్మీ కమిటీలను వేసిన విషయాన్ని భరద్వాజ గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ, ఏపీలో ప్రాంతీయ పార్టీల మనుగడపై జాతీయ పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉన్న తరుణంలో.. ఎన్టీఆర్ అడుగులు ఎటు పడతాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన సేవా సంస్థను స్థాపించినా, భవిష్యత్తులో అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ సర్వత్రా వ్యక్తమవుతున్న సస్పెన్స్కు తెరపడాలంటే జూలై 18న జరగబోయే అభిమానుల సమావేశం వరకు వేచి చూడాల్సిందే. Jr NTR July 18 Meeting, NTR Legacy, Telugu Politics News, Jr NTR New Party Launch

Publish Date: Jul 15, 2026 4:02PM

political-news-img

ముద్రగడ అంత్యక్రియలకు జగన్.!

వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇందు కోసం ఆయన బుధవారం (జులై 15) కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన జగన్.. ముందుగా ఆయన భీమవరంలో ఆక్వా రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న మేత ధరల పెంపు, మార్కెట్‌లో గిట్టుబాటు ధరల కొరత వంటి అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్లో జగ్గంపేట చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కిర్లంపూడి చేరుకున్వంనారు. దివంతగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో పాటు కాపు సామాజిక వర్గ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభం మృతి పట్ల జగన్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన ఆయన బుధవారం(జులై 15) అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. YS Jagan attend Mudragada Padmanabham Funeral, YS Jagan Kirlampudi Visit, YSRCP Leaders Mourn, YS Jagan Bhimavaram tour, YSRCP senior leader Mudragada, Andhra Pradesh political news

Publish Date: Jul 15, 2026 2:57PM

political-news-img

దాల్మియా సిమ్మెంట్స్ సెకండ్ ప్లాంట్ విస్తరణ పనులకు లోకేష్ శంకుస్థాపన.!

కడప జిల్లా చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ ఫ్యాక్టరీ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ బుధవారం (జులై 14) శంకుస్థాపన చేశారు. ముందుగా ప్లాంట్ ఆవరణకు చేరుకున్న మంత్రి లోకేష్ కు దాల్మియా భారత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియా, కంపెనీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు. కార్మికులను పలకరించి వారితో సెల్ఫీ దిగిన లోకేష్ ఆ తరువాత పునీత్ దాల్మియాతో కలిసి దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్-2 విస్తరణ పనులకు మంత్రి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్ 2 విస్తరణను 3 వేల100 కోట్ల వ్యయంతో చేపట్టనుంది. ప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్లాంట్ విస్తరణతో కొత్తగా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. Lokesh, Lay Foundation, Stone, Rs301 crores

Publish Date: Jul 15, 2026 2:33PM

MOVIE NEWS