Top Stories

political-news-img

మారుతి సుజుకి ఇన్విక్టో ఆన్‌రోడ్ ధర ఎంత? మైలేజ్ చూస్తే షాకే!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో నమ్మకానికి, మధ్యతరగతి బడ్జెట్‌ వాహనాలకు మారుపేరుగా నిలిచిన మారుతి సుజుకి, ప్రీమియం లగ్జరీ విభాగంలో తన జెండాను బలంగా పాతడానికి తెచ్చిన అద్భుతమైన వాహనం మారుతి సుజుకి ఇన్విక్టో. సాధారణంగా ఐదు లక్షల నుంచి 15 లక్షల బడ్జెట్‌ కార్లకు కేరాఫ్‌ అడ్రెస్‌గా ఉండే మారుతి సుజుకి నుంచి 30 లక్షలకుపైగా బడ్జెట్ కారు అనగానే చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ దీని టెక్నాలజీ, లగ్జరీ గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. టొయోటా ఇన్నోవా హైక్రాస్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి, నెక్సా ప్రీమియం నెట్‌వర్క్ ద్వారా విక్రయించే ఈ ఫ్లాగ్‌షిప్‌ మోడల్, లగ్జరీని కోరుకునే పెద్ద కుటుంబాలకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలిచింది. హైదరాబాద్‌లో మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఇన్విక్టో ఆన్‌రోడ్ ధర ప్రస్తుతం 31.62 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై గరిష్టంగా 36.21 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. ఈ భారీ ఎంపీవీ వాహనం ప్రధానంగా మూడు అద్భుతమైన వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన జెటా ప్లస్ 7 సీటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 24,97,400 కాగా, ఆర్టీఓ ఛార్జీలు మరియు ఇతర పన్నుల రూపంలో రూ. 5,49,406, ఇన్సూరెన్స్ కోసం రూ. 1,25,529 కలిపి హైదరాబాద్‌లో మొత్తం ఆన్-రోడ్ ధర రూ. 31,72,335 గా ఉంది. అలాగే జెటా ప్లస్ 8 సీటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 25,27,300 కాగా, ఆన్-రోడ్ ధర రూ. 32,12,969 గా నిర్ణయించారు. ఇక అన్నింటికంటే టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఆల్ఫా ప్లస్ 7 సీటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 28,60,500 కాగా, హైదరాబాద్‌లో దీని ఫైనల్ ఆన్-రోడ్ ధర ఏకంగా రూ. 36,20,826 కు చేరుకుంటుంది. ఈ కారులో ఉపయోగించిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ దీనికి ఇంతటి విలువను తెచ్చిపెట్టింది. ఇందులో శక్తివంతమైన 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌ ఇంజిన్‌తో పాటు ఇ-సివిటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను అమర్చారు. దీనికి అదనంగా ఎలక్ట్రిక్ మోటార్, నికెల్ మెటల్‌ హైడ్రైడ్‌ బ్యాటరీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సిటీ ట్రాఫిక్‌లో లేదా నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కారు కేవలం విద్యుత్‌పై మాత్రమే నడుస్తుంది, దీనివల్ల పెట్రోల్ అస్సలు ఖర్చు అవ్వదు. వేగం పెంచినప్పుడు మాత్రమే ఆటోమేటిక్‌గా పెట్రోల్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద 7 సీటర్ వాహనాలు సాధారణంగా లీటరుకు 10 నుండి 12 కిలోమీటర్ల మైలేజీ ఇస్తేనే ఎక్కువ అనుకుంటారు, కానీ ఈ ఇన్విక్టో ఏకంగా లీటర్‌కు 23.24 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే, జెటా ప్లస్ వేరియంట్‌లో 8 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పుష్‌బటన్ స్టార్ట్ మరియు ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇక టాప్ వేరియంట్ ఆల్ఫా ప్లస్‌లో రాయల్ లుక్ ఇచ్చే పనోరమిక్‌ సన్‌రూఫ్, పెద్ద 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, వేసవిలో చల్లదనాన్నిచ్చే వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, 360 డిగ్రీల కెమెరా వ్యూ మరియు మెమొరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి లగ్జరీ ఫీచర్లు లభిస్తాయి. భద్రతలోనూ ఈ కారు తగ్గేదేలే అంటోంది. భారత్ ఎన్‌క్యాప్‌ క్రాష్ టెస్టింగ్‌లో ఈ మోడల్ ప్రతిష్టాత్మక 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-ఫోర్ డిస్క్ బ్రేక్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన రక్షణ వలయం ఉంది. maruti invicto on road price emi,maruti invicto hybrid mileage features

Publish Date: Jul 13, 2026 6:25PM

political-news-img

తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌ఛార్జ్ రేసు.. తిరుపతి సమావేశంలో రచ్చ

తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి వర్గీయులను తొలుత సమావేశ మందిరంలోకి అనుమతించక పోవడంతో వారు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం జయచంద్రారెడ్డి వర్గీయులను సమావేశంలోకి అనుమతించారు. ఇదిలా ఉండగా, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా శంకర్ యాదవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనను అనవసరంగా వివాదాల్లోకి లాగారని, నియోజకవర్గంలో తనకు బలమైన వర్గం ఉందని పేర్కొంటూ మరోసారి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు తనకే అప్పగించాలని జయచంద్రారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు

Publish Date: Jul 13, 2026 6:25PM

political-news-img

లగ్జరీ హోటల్ రూమ్ ధరల బాదుడు: ఇంకా పెరుగుతాయా? టాప్ హోటల్స్ షాకింగ్ ప్లాన్స్!

భారతదేశంలో పర్యాటక రంగం మరియు వ్యాపార రంగాలు ఊపందుకోవడంతో, దేశంలోని ప్రముఖ ఫైవ్ స్టార్ మరియు లగ్జరీ హోటళ్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా రికార్డు స్థాయిలో గది అద్దెలు (రూమ్ రేట్లు) పెరుగుతూ వస్తున్నాయి. అయితే, ఈ ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇకపై పెరగకపోవచ్చని మార్కెట్ నిపుణులు కొందరు భావిస్తున్నారు. కానీ, దేశంలోని అగ్రశ్రేణి హోటల్ చైన్ల యాజమాన్యాలు మాత్రం ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో లగ్జరీ హోటల్ ధరలు ఇంకా చాలా తక్కువగానే ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి మరింత పెరిగేందుకు ఎంతో అవకాశం ఉందని వారు గట్టిగా చెప్తున్నారు. ప్రస్తుతం భారతీయ ప్రీమియం హాస్పిటాలిటీ మార్కెట్ ఒక కొత్త వ్యూహాత్మక మార్పును సంతరించుకుంది. హోటళ్లు కేవలం రూమ్ ఆక్యుపెన్సీ (గదులు నిండటం) పైనే దృష్టి పెట్టకుండా, తమ రూమ్ రేట్లను స్థిరంగా ఉంచుకుంటూ లాభాలను పెంచుకోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రముఖ హోటల్ గ్రూప్ ఒబెరాయ్ మరియు ట్రైడెంట్ బ్రాండ్ల మాతృసంస్థ అయిన ఇఐహెచ్ లిమిటెడ్ (EIH Ltd) మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్‌జిత్ సింగ్ ఒబెరాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరోపా, ఉత్తర అమెరికా మరియు ఇతర ఆసియా లగ్జరీ మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో లగ్జరీ సేవల ధరలు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా లగ్జరీ హోటళ్లు ఒక రాత్రి బసకు 1,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 96,000 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న తరుణంలో, భారత్ ఇంకా ఆ స్థాయికి చాలా దూరంలో ఉందని ఆయన గుర్తుచేశారు. ఉదాహరణకు, దేశ రాజధానిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ది ఒబెరాయ్ న్యూఢిల్లీ' హోటల్‌లో ఒక రాత్రికి రూమ్ రేట్లు సీజన్‌ను బట్టి 20,000 రూపాయల నుండి 30,000 రూపాయల మధ్య మారుతుంటాయి. గ్లోబల్ మార్కెట్ ధరలతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ. ఐటీసీ హోటల్స్, ది లీలా వంటి ఇతర టాప్ బ్రాండ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే, మెట్రో నగరాల్లోని బిజినెస్ హోటళ్ల ధరలు ఒక పరిమితికి (సీలింగ్) చేరువవుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, లగ్జరీ రిసార్టుల ధరలు మాత్రం భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంది. top five star hotels price rise,oberoi itc luxury hotels pricing trends.

Publish Date: Jul 13, 2026 6:21PM

political-news-img

వేదాంత షేర్ల ఊచకోత: 5% పెరిగిన స్టాక్స్.. ఇన్వెస్టర్లు ఇప్పుడు కొనవచ్చా?

భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ మైనింగ్, మెటల్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ షేర్లు మళ్లీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన మెగా డీమెర్జర్ ప్రక్రియ తర్వాత, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో విడివిడిగా లిస్టయిన వేదాంత గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో ఏకంగా 5 శాతం వరకు పెరిగి సరికొత్త జోష్‌ను ప్రదర్శించాయి. గత కొన్ని రోజులుగా లాభాల స్వీకరణతో (ప్రాఫిట్ బుకింగ్) కొంత కరెక్షన్‌కు గురైన ఈ స్టాక్స్, ఇప్పుడు మళ్లీ రికవరీ బాట పట్టడం మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వేదాంత ఐరన్ అండ్ స్టీల్, వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ వంటి అనుబంధ సంస్థల షేర్లలో కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపించింది. ఈ అకస్మాత్తు ర్యాలీతో రిటైల్ ఇన్వెస్టర్లు, అసలు ఈ షేర్లను ఇప్పుడు కొనవచ్చా లేదా అనే సస్పెన్స్‌లో పడ్డారు. ఈ మొత్తం ర్యాలీలో వేదాంత ఐరన్ అండ్ స్టీల్ (Vedanta Iron & Steel) షేర్లు అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన చేశాయి. మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ షేరు దాదాపు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. జూన్ 15న కేవలం రూ. 20 వద్ద లిస్టయిన ఈ స్మాల్‌క్యాప్ కౌంటర్, ప్రఖ్యాత ఇన్వెస్టర్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ (Premji Invest) సుమారు రూ. 102 కోట్ల విలువైన 4.84 కోట్ల షేర్లను కొనుగోలు చేసిన తర్వాత ఏకంగా 113 శాతం లాభపడి మల్టీబ్యాగర్‌గా మారింది. మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీ విక్రయించదగిన ఇనుప ఖనిజం (Iron Ore) ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 4 శాతం వృద్ధితో 2.6 మిలియన్ డీఎంటీ (DMT) కి చేరింది. అయితే గోవా, ఒడిశా ప్లాంట్లు వరుసగా 166 శాతం, 59 శాతం భారీ వృద్ధిని నమోదు చేయగా, కర్ణాటక ప్లాంట్ ఉత్పత్తి మాత్రం 46 శాతం పడిపోయింది. మొత్తం మీద స్టీల్ ఉత్పత్తి కూడా 4 శాతం పెరిగి 5,82,000 టన్నులకు చేరడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. మరోవైపు వేదాంత అల్యూమినియం (Vedanta Aluminium) షేర్లు కూడా మంచి పుంజుకున్నాయి. దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై పాజిటివ్ రేటింగ్ ఇస్తూ, రూ. 540 టార్గెట్ ప్రైస్‌ను నిర్ణయించింది. మార్కెట్లో అత్యధిక క్యాపిటలైజేషన్ కలిగిన లార్జ్‌క్యాప్ స్టాక్‌గా రూ. 522 వద్ద లిస్టయిన ఈ షేరు, ఆ తర్వాత 12 శాతం వరకు పతనమై సుమారు రూ. 25,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టేసింది. అయితే, ప్రస్తుత క్యూ1 (Q1) ఫలితాల్లో రికార్డు స్థాయిలో 6.32 లక్షల టన్నుల అల్యూమినియం ఉత్పత్తిని నమోదు చేయడం విశేషం. ఇది గతేడాదితో పోలిస్తే 5 శాతం ఎక్కువ. అలాగే బాల్కో (BALCO) ద్వారా విద్యుత్ అమ్మకాలు కూడా 21 శాతం పెరిగి 520 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మరియు ఎమ్కే గ్లోబల్ వంటి బ్రోకరేజీలు ఈ షేరుపై బుల్లిష్‌గా ఉండటానికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్లో చైనా ఉత్పత్తి పరిమితులు మరియు అల్యూమినియంకు ఉన్న దీర్ఘకాలిక డిమాండ్. vedanta iron steel aluminium shares rally,anil agarwal vedanta demerger stock performance.

Publish Date: Jul 13, 2026 6:20PM

political-news-img

ఫిఫా వరల్డ్‌కప్‌లో భారీ మార్పులు: భారత్‌కు తలుపులు తెరిచిన లక్!

ప్రపంచ ఫుట్‌బాల్ రంగంలో అత్యున్నత సంస్థ అయిన ఫిఫా (FIFA) ఒక భారీ చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఈ అద్భుతమైన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానుల్లో, ముఖ్యంగా భారతీయ సాకర్ ప్రేమికుల్లో సరికొత్త ఆశలను చిగురింపజేస్తోంది. రాబోయే మెగా టోర్నమెంట్లలో జట్ల సంఖ్యను భారీగా పెంచడం ద్వారా మరింత మందికి ఈ విశ్వవేదికపై ఆడే అవకాశాన్ని కల్పించాలని ఫిఫా యోచిస్తోంది. 2026 నాటి ఫిఫా ప్రపంచకప్ టోర్నీలోనే మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 48 జట్లు పాల్గొనేలా విస్తరించారు. అంతకుముందు కేవలం 32 జట్లు మాత్రమే ఆడే ఈ మెగా ఈవెంట్‌లో, అదనంగా మరో 16 జట్లకు చోటు కల్పించడం అనేది ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ భారీ విస్తరణ వల్ల ఆసియా ఖండానికి కేటాయించే కోటా కూడా దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గతంలో ఆసియా నుంచి కేవలం 4 నుంచి 5 జట్లకు మాత్రమే అర్హత లభించేది, కానీ ఈ కొత్త నిబంధనల ప్రకారం ఆ సంఖ్య 8 కంటే ఎక్కువకు పెరగనుంది. ఈ పరిణామం 140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశానికి ఒక సువర్ణావకాశంగా మారబోతోంది. ప్రస్తుతం ఫిఫా అధికారిక ర్యాంకింగ్స్‌లో ఉన్న 211 సభ్య దేశాలలో భారత్ 138వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మెగా మార్పుల వల్ల రాబోయే కాలంలో టీమిండియా ప్రపంచకప్‌ కల సాకారం చేసుకునే అవకాశాలు ఎంతగానో మెరుగయ్యాయి. indian football team fifa world cup chance,fifa expansion 48 teams benefits india.

Publish Date: Jul 13, 2026 6:15PM

political-news-img

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత : సీఎం చంద్రబాబు

గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమరుస్తున్నట్టు చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్తగేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు గేట్లను అమర్చే పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళ్తోందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోందని అధికారులు వివరించారు. అలాగే కాల్వలకు ఎన్ని క్యూసెక్కులు విడుదల చేశారని ముఖ్యమంత్రి అడిగారు. 14,700 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదిలామని అధికారులు చెప్పారు. కాల్వ చివరి భూములకూ నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పిచ్చుకలంకలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోదావరి డెల్టాకు దేశానికే అన్నపూర్ణ అనే ఖ్యాతి రావడానికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టే కారణమని, అనంతరం ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కొత్త బ్యారేజీతో మరో పంటకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. 2.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యంతో పాటు ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ డెల్టాల్లో కలిపి 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా బ్యారేజీ ఉపయోగపడుతోందన్నారు. అయితే 50 ఏళ్లకు పైగా గేట్లు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థలు పాతబడటంతో వాటి ఆధునీకరణ అత్యవసరమైందని ముఖ్యమంత్రి చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.32 కోట్లతో కొత్త గేట్లను అమర్చిందని, ఇప్పుడు మిగిలిన పాత గేట్ల స్థానంలో 117 కొత్త గేట్లను తొమ్మిది నెలల్లో అమర్చేలా చర్యలు ప్రారంభించామని సీఎం తెలిపారు. గత పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీస నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని... కనీసం గ్రీజ్ పెట్టేందుకు అవసరమైన నిధులను కూడా గత పాలకులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తంగా కొత్త గేట్లను బిగించామని వివరించారు. తాము గత రెండేళ్లలోనే సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం నిర్వాసితులను ఆనందంగా ఉంచుతాం ఒకప్పుడు కోనసీమలో వరికి మద్దతు ధర లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొంటే, ఇప్పుడు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు విక్రయించిన 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని సీఎం విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Publish Date: Jul 13, 2026 5:40PM

MOVIE NEWS