political-news-img

కాలినడకన తిరుమలకు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శనివారం (జులై 18) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు శుక్రవారం (జులై 17) ఆమె అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకుని, క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందు గా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండి తుల ఆశీర్వాదం పొందారు.టీటీడీ అధికా రులు ఆమెకు తీర్థప్రసా దాలు అందజేశారు. తదనంతరం ఆలయం ఎదురుగా ఉన్న అఖి లాండం వద్ద కొబ్బరికా యలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న అన్నా లెజినోవా, అనంతరం బేడి ఆంజనేయస్వామి ఆల యాన్ని కూడా దర్శించుకు న్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం గా పూర్తికావడంతో, ఆ మొక్కును తీర్చుకునేం దుకు అన్నా లెజినోవా శ్రీవారిని దర్శించుకున్నారు గతంలో కూడా తమ కుమారుడు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సందర్భంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి తోటి భక్తులతో కలిసి నేలపై కూర్చుని ఎంతో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. Anna Lezhneva Tirumala Visit, Pawan Kalyan Wife Donation, Mark Shankar Pawan Kalyan, Tirumala Suprabhata Seva

Publish Date: Jul 18, 2026 11:56AM

political-news-img

కాదంబరి జెత్వానీ కేసు.. సీఐడీ చార్జిషీట్ రిటర్న్!

ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు రిటర్న్ అయ్యింది. సీఐడీ గుంటూరు అధకారులు దర్యాప్తు చేసి.. ఈ కేసులో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారనే పూర్తి వివరాలతో చార్జిషీటును సిద్ధం చేసి కోర్టుకు సమర్పించారు. అయితే.. సాంకేతిక కారణాలలో కోర్టు చార్జిషీట్ ను రిటర్న్ చేసింది. దీంతో సీఐడీ అధికారులు త్వరలోనే లోపాలను సవరించి మరో చార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేసు వివరాల్లోకి వెడితే.. వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో దాదాపు రెండు వారాల పాటు ఆమెను జైల్లో ఉంచి, తీవ్ర మానసిక, శారీరక క్షోభకు గురిచేశారనీ, తమ ఆస్తులను సీజ్ చేశారని బాధితురాలు కాదంబరి జత్వానీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై కాదంబరి జెత్వానీ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దర్యాప్తును సీఐడీకి బదిలీ చేసింది. సీఐడీ దర్యాప్తులో ఈ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు (పీఎస్ఆర్), కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఏసీపీ హనుమంతరావు, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తేల్చింది. ఇప్పటికే ప్రభుత్వం వీరిసై సస్పెన్షన్ వేటు వేసింది. దర్యాప్తులో భాగంగా సీఐడీ పోలీసులు 50 మంది సాక్షులను విచారించి, కీలక ఆధారాలను సేకరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పి.ఎస్.ఆర్. ఆంజనేయులను ఈ ఏడాది ఏప్రిల్ 22న సీఐడీ అరెస్ట్ చేయగా, ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ అనుభవించి, ఇటీవల హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందారు. ఇప్పుడు కోర్టు చార్జిషీటును తిరస్కరించడంతో సీఐడీ సాంకేతిక లోపాలను సవరించి మరో చార్జిషీట్ దాఖలు చేయడానికి సమాయత్తమౌతోంది. CID charge sheet returned in Kadambar Jatwani case, PSR, Krantiranatata, Vishalgunni, Kukkala Vidyasagar

Publish Date: Jul 18, 2026 11:37AM

political-news-img

సబిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు.!

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. భారత్ రాష్ట్ర సమితి తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు సభకు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఈ భారీ యువజన సభ కంటే ముందే బీఆర్‌ఎస్ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ పి. సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ పరిణామంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం (జులై 18) మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఈ సభను ముగించాలని భావించారు. అయితే.. తొలుత ఈ సభకు అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించినప్పటికీ, బీఆర్‌ఎస్ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం, తెలంగాణ హైకోర్టు కొన్ని నిబంధనలతో ఈ బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభకు అనుమతి ఇస్తూ.. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని, అలాగే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని ఎక్కడా దిగ్బంధించకూడదని నిర్వాహకులకు షరతులు విధించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం సభను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఉదయాన్నే నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ మండిపడుతోంది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఈ హౌస్ అరెస్టులు రాజ్యాంగ విరుద్ధమంటూ విమర్శలు గుప్పించింది. BRS leaders house arrest, Yuva Sangrama Sabha, Telangana politics latest updates, Saroornagar stadium BRS meeting

Publish Date: Jul 18, 2026 11:22AM

political-news-img

పులివెందుల.. ఒక పేరు కాదు.. మూడు లక్షల మంది గుండె చప్పుడు.!

దేశంలోని ప్రతి పట్టణానికీ ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి నేలకీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి ఊరికీ తనదైన ప్రత్యేక గౌరవం ఉంటుంది. కానీ.. దురదృష్టవశాత్తూ పులివెందులకు మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాలుగా సినిమాలు, రాజకీయ వేదికలు, టెలివిజన్ చర్చలు, వార్తాపత్రికల శీర్షికలు, ఇప్పుడు సోషల్ మీడియా..ఇలా అన్నీ కలిసి పులివెందులను ఇవన్నీ కలిసి పులివెందులను ఒక మనిషిగా చూపించాయి. ఒక కుటుంబంగా చూపించాయి. ఒక రాజకీయ గుర్తింపుగా మార్చేశాయి. కానీ పులివెందుల ఎవరో ఒకరి ఇంటి పేరు కాదు.. పులివెందుల మూడు లక్షల మంది మనుషుల నివసించే ఊరిపేరు. ఈ నేల మీద ప్రతి ఉదయం రైతు నాగలి దున్నుతాడు. కూలీ తన స్వేదం చిందించి.. తన పిల్లల ఆకలి తీరుస్తాడు. తల్లి తన బిడ్డను పాఠశాలకు పంపుతుంది. విద్యార్థి తన కలల కోసం రాత్రిళ్లు మేల్కొని చదువుతాడు. వ్యాపారి రేపటి ఆశతో షట్టర్ ఎత్తుతాడు. వృద్ధుడు దేవాలయానికి వెళ్లి తన ఊరి మంచిని కోరుకుంటాడు. అయితే వారెవరూ వార్తల్లో కనిపించరు. వాళ్ల పేర్లు చర్చల్లో వినిపించవు. అసలు వారి ఉనికినే ఎవరూ గుర్తించరు. అయితే వాస్తవానికి వాళ్లే పులివెందుల. పులివెందుల అంటే అధికారపు అహంకారం కాదు. పులివెందుల అంటే సామాన్యుడి ఆత్మగౌరవం. పులివెందుల అంటే భయం కాదు. పులివెందుల అంటే బతుకు. పులివెందుల అంటే రాజకీయాలు కాదు. పులివెందుల అంటే ప్రజలు. ఈ దేశ రాజ్యాంగం చెబుతోంది.. ఈ దేశం ప్రజలది అని. ఏ నాయకుడూ ప్రజలకు యజమాని కాదని.. ప్రజలే యజమానులని. అయితే... పులివెందుల ప్రజలను ఎందుకు ఎవరో ఒకరి సొత్తులా మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ నేలను ఒక కుటుంబం పేరుతో మాత్రమే గుర్తిస్తున్నారు? మూడు లక్షల మంది మనుషుల గౌరవం అంత చౌకైపోయిందా? ఒక పట్టణం చరిత్రను ఒకే రాజకీయ కథలో బంధించడం... ఆ పట్టణానికి చేసే అతిపెద్ద అన్యాయం. ఎందుకంటే.. రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి. పులివెందులను మూడు లక్షల మంది మనుషుల హృదయంతో చూడండి. ఎందుకంటే.. ఈ నేలపై పుట్టిన ప్రతి బిడ్డకు తన స్వంత ఆలోచన ఉంది. తన సొంత గౌరవం ఉంది. తన సొంత ఓటు ఉంది. తన సొంత భవిష్యత్తు ఉంది. స్వంత వ్యక్తిత్వం ఉంది. వాళ్లు ఎవరికీ చెందిన వారు కాదు. ఈ నేలకే చెందిన వారు. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. కానీ మా నేల గౌరవాన్ని ఎవరి పేరులోనూ.. ఏ ఒక్క కుటుంబంతోనో బంధించడానికి మాత్రం ఒప్పుకోం. చివరిగా ఒక మాట... పులివెందులలో ఒక నాయకుడు ఉండొచ్చు... ఒక కుటుంబం ఉండొచ్చు... కానీ పులివెందుల అనేది వాళ్లు కాదు. పులివెందుల అంటే మూడు లక్షల మంది ప్రజల ఆత్మగౌరవం. మూడు లక్షల మంది ప్రజల గుండె చప్పుడు.. ఆ ఆత్మగౌరవానికి యజమానులు ప్రజలే.. ప్రజలే.. ప్రజలే. భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి, పులివెందుల Pulivendula heartbeat of three lakh people, Politics, Oneman, Onefamily

Publish Date: Jul 18, 2026 11:07AM

political-news-img

ఆధ్యాత్మికత ముసుగులో గంజాయి సాగు.!

భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు జరగాల్సిన ఆశ్రమంలో గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. యాలాల మండలం గోవిందరావుపేట శివారు లోని ఓ స్వామీజీ ఆశ్రమం లో అక్రమంగా గంజాయి సాగు జరుగుతోందన్న సమాచారంతో టాస్క్‌ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహిం చారు. ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. ఆశ్రమం పేరుతో గంజాయి సాగు చేస్తు న్నారా? దీనికి మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై కేసు నమోదు చేసి విచా రణ కొనసాగిస్తు న్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరున్న ఆశ్రమంలో గంజాయి సాగు బయ టపడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. cultivation, Ganja, guise, spirituality, Vikarabad, Govindaraopet

Publish Date: Jul 18, 2026 10:58AM

political-news-img

సలాల్ డ్యామ్, బాగ్లిహార్ ప్రాజెక్టుల పూడిక తీత.. పాక్ కు చుక్కలే.!

భారత్, పాకిస్తాన్ మధ్య జల వనరుల పంపిణీకి సంబంధించిన వివాదాలు మరోసారి ముదిరిపాకాన పడ్డాయి. జమ్మూ కశ్మీర్ పరిధిలోని కీలకమైన రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులలో భారీ ఎత్తున పూడికతీత ( పనులను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. చినాబ్ నదిపై నిర్మించిన సలాల్, బాగ్లిహార్ డ్యామ్‌లలో పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఉగ్రవాద చర్యలను అణచివేయని పక్షంలో చర్చలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్.. ఇప్పుడు ఏకపక్షంగా తన సొంత భూభాగంలోని డ్యామ్‌ల పునరుద్ధరణపై దృష్టి సారించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 16న మొదలైన పూడిక తీత పనులు ఈ నెల 26 వరకు సాగనున్నాయి. రియాసి జిల్లా పరిధిలోకి వచ్చే సలాల్ డ్యామ్, అలాగే రాంబన్ జిల్లాలో ఉన్న బాగ్లిహార్ ప్రాజెక్టులు విద్యుదుత్పత్తిపరంగా కీలకమైనవి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ జలాశయాలలో టన్నుల కొద్దీ పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గింది. . ఇది విద్యుత్ ఉత్పాదనపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి పూడికతీత పనులు చేపట్టింది. 1970 నుండి ఈ డ్యామ్‌లలో ఎప్పుడూ సరైన రీతిలో పూడికతీత పనులు జరగలేదు. గతంలో భారత్ ఇటువంటి ప్రయత్నాలు చేయాలని భావించిన ప్రతిసారీ పాకిస్తాన్ అంతర్జాతీయ నియమాలను అడ్డం పెట్టుకుని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో దౌత్యపరమైన ఒడంబడికల కారణంగా స్లూయిస్ గేట్లను మూసివేయాల్సి వచ్చింది. అప్పట్లో విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ.. పాక్ ఒత్తిడికి తలొగ్గి డ్యామ్ ఎత్తును 10 మీటర్ల మేర తగ్గించారు. దీనివల్ల భారత్ నష్టపోగా, పాకిస్తాన్ లబ్ధి పొందుతూ వచ్చింది. ప్రస్తుతం 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది. చినాబ్ నీటిపై పాకిస్తాన్‌కు హక్కులు ఉన్నప్పటికీ, తన అంతర్గత పరిధిలో మౌలిక వసతుల నిర్వహణ చేసుకునే హక్కు భారత్‌కు ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. దీంతో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. డ్యామ్‌ల నుండి తొలగించే బురద, వ్యర్థాలు నదీ ప్రవాహం ద్వారా దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి పాక్ భూభాగంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అక్కడ ఉన్న ప్రధాన కాలువలు, హెడ్‌వర్క్స్ వ్యవస్థలు పూడికతో నిండిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే సమయంలో ఎగువన భారీ వర్షాలు కురిస్తే పాక్‌లో వరద ముప్పుతో పాటు మౌలిక వసతులు ధ్వంసమవుతాయి. మరోవైపు, పూడికతీత ప్రక్రియ పూర్తయిన తర్వాత సలాల్, బాగ్లిహార్ ప్రాజెక్టులలో నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం భారీగా పెరుగుతుంది. దీనివల్ల దిగువన ఉన్న పాకిస్తాన్‌కు సహజంగానే విడుదలయ్యే నీటి పరిమాణం తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో, నీటి సమస్యతో సతమతమౌతున్న పాకిస్థాన్కు ఇది కోలుకోలేని దెబ్బగా మారుతుంది. Indus Waters Treaty, Salal Dam Desilting, Baglihar Project Chenab River, India Pakistan Water Dispute,

Publish Date: Jul 18, 2026 10:34AM

MOVIE NEWS