political-news-img

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హిట్ మెన్ రోహిత్ శర్మకు పొమ్మనలేక పొగ.!?

హిట్ మన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించిన వార్తలు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే మ్యాచ్ వేదికగా హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడన్న ప్రచారంజోరుగా సాగుతోంది. ఆదివారం (జులై 19) లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి. కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ సోషల్ మీడియా కథనాల ప్రకారం.. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుకుంటుంది. ఇంతటి సుదీర్ఘ కాలం పాటు అతడు వన్డే ఫార్మాట్‌లో కొనసాగడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం కష్టమనే అభిప్రాయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. అందుకే భవిష్యత్తు జట్టు నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగా భావిస్తున్నారు. వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ, ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకుంటే మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైనట్టే అవుతుంది. ఈ నేపథ్యంలోనే.. రోహిత్ శర్మ కెరీర్‌లో లార్డ్స్ లో ఆదివారం (జులై 19) జరిగే మ్యాచే చివరి మ్యాచ్ అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు సందర్భాలలో 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే బలమైన ఆకాంక్షను రోహిత్ వ్యక్తం చేశాడు. అయితే అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా బీసీసీఐ పొమ్మనలేకపోగపెడుతున్నట్లుగా కనిపిస్తోందని రోహిత్ అభిమానలు అంటున్నారు. అయితే రోహిత్ శర్మ రిటైర్ మెంట్ కు సంబంధించి అతడి నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ ఇంత వరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. Rohit Sharma retirement rumours, Lords ODI match, Gautam Gambhir planning, 2027 ODI World Cup, BCCI selection updates, Indian cricket team news

Publish Date: Jul 18, 2026 10:14AM

political-news-img

ప్రత్యేక రాష్ట్ర నినాదంతో కదం తొక్కిన ఐదు రాష్ట్రాల గిరిజనం.!

పశ్చిమ, మధ్య భారతదేశంలోని గిరిజనులు ప్రత్యేక రాష్ట్ర నినాదంతో మరోసారి ఉద్యమ బాట పట్టారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ప్రత్యేకంగా భీల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో లక్షల మంది గిరిజనులు గర్జించారు. రాజస్థాన్ బాన్స్‌వాడా జిల్లాలోని చారిత్రక మాన్‌గఢ్ ధామ్ వేదికగా గిరిజన సంఘాలు భారీ ఎ బహిరంగ సభ నిర్వహించాయి. సరిహద్దు ప్రాంతాలకు చెందిన గిరిజనులను ఒకే తాటిపైకి తెచ్చి, తమ చిరకాల స్వప్నమైన భీల్ ప్రదేశ్ ను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ సభ జరిగింది. భీల్ ప్రదేశ్ ముక్తి మోర్చా అనే సంస్థ నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమానికి దేశంలోని ఐదు కీలక రాష్ట్రాల నుండి గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఇది ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమో కాకుండా, కేవలం ఆదివాసీ సమాజ ప్రయోజనాల కోసం జరిగిందని వక్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఉన్న బాన్స్‌వాడా-డుంగర్‌పూర్ ఎంపీ రాజ్‌కుమార్ రోత్ గిరిజనుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మద్దతును ప్రకటించారు. స్విట్జర్లాండ్‌ నుండి ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించిన రాజ్ కుమార్ రోత్.. . దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే లిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సరిహద్దు గిరిజన ప్రాంతాలను పూర్తిగా విస్మరించాయని, పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కూడా కరువయ్యాయని విమర్శించారు. ఇక సభలో వక్తలు.. గిరిజన సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. దేశంలో భౌగోళికంగా గిరిజన జనాభా వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో ముక్కలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్ల గిరిజనులు అన్ని రంగాల్లో తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నారనీ, విద్య, వైద్యం, ఉపాధి వంటి కనీస అవసరాలు కూడా సరిహద్దుల్లో ఉండే నిరుపేద ఆదివాసీలకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కాదని, తమ ఉనికిని కాపాడుకునే చారిత్రక ఉద్యమమని వారు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజన సమాజానికి చట్టబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ల ఫలాలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న యువతకు చేరడం లేదని సభలో వక్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభించకపోవడం వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని ఆవేదన చెందారు. Bhil Pradesh Demand, Mangarh Dham Tribal Protest, Bharat Adivasi Party, Rajkumar Roat MPa

Publish Date: Jul 18, 2026 9:49AM

political-news-img

రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.!

చేనేత రంగ అభ్యున్నతికి, పద్మశాలీల సంక్షేమానికి అవిరళ కృషి చేసిన నాయకుడు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి, ఆ వర్గాల ఆరాధ్యుడైన ప్రగడ కోటయ్యకు సముచిత గౌరవం కల్పించే దిశగా ఈ కీలక అడుగు వేసింది. ప్రతి ఏటా జులై 26న ఆయన జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పండుగగా, అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు, సమన్వయ బాధ్యతలను పరిశ్రమలు, వాణిజ్య శాఖకు అప్పగించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి సవిత స్వాగతించారు. చేనేత పరిశ్రమ పురోగతి సాధించాలన్నా, నేత కార్మికుల జీవితాలలో వెలుగులు నిండాలన్నా ప్రగడ కోటయ్య చూపిన మార్గమే శరణ్యమని పేర్కొన్న ఆమె.. నేతన్నల గొంతుకగా అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ఆయన వినిపించిన వాణి చిరస్మరణీయమన్నారు. చేనేత సమాజానికి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి సవిత ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, పద్మశాలీ సంఘాల నాయకులు మరియు ప్రగడ కోటయ్య అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రతి ఏటా జులై 26న కేవలం చేనేత సంఘాలకే పరిమితమైన ఈ వేడుకలు, ఇకపై ప్రభుత్వ కరచాలనంతో అధికారిక వేదికలపై నిర్వహించనుండటం విశేషం. ప్రతి జిల్లా కేంద్రంలోనూ, చేనేత గ్రామాలు అధికంగా ఉన్న ప్రాంతాలలోనూ ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. Pragada Kotaiah, Pragada Kotaiah Birth Anniversary, Chandrababu Naidu, AP State Festival

Publish Date: Jul 18, 2026 9:32AM

political-news-img

ఉప ప్రధాని అమిత్ షా.. విజయసాయి ట్వీట్ తో రాజకీయ సంచలనం.!

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ జాతీయ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి హోంమంత్రి అమిత్ షా కు ఉప ప్రధానిగా ప్రమోషన్ దక్కనుందంటూ వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకు డిప్యూటీ పీఎం పదవి దక్కనుందంటూ వస్తున్న కథనాలను సమర్ధిస్తూ.. రాబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో అమిత్ షాను ఉప ప్రధానిగా మోడీ నియమించనున్నట్లు విజయసాయి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత నిర్ణయాత్మకమైన, పాత్ర పోషిస్తున్న అమిత్ షాకు ఉప ప్రధానిగా ప్రమోషన్ రావడం సముచితమని పేర్కొన్న విజయసాయి.. దేశ ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అమిత్ షా వెనుకాడరనీ, అందువల్లే ఉప ప్రధాని పదవికి ఆయన అన్ని విధాలా అర్హులని పేర్కొన్నారు. భారత రాజకీయ చరిత్రలో గతంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులు ఉప ప్రధాని బాధ్యతలను స్వీకరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పదవితో అమిత్ షాకు దక్కబోయే స్థానాన్ని పోల్చారు. గతంలో సర్దార్ పటేల్ అలంకరించిన ఈ ఉన్నతమైన డిప్యూటీ పీఎం హోదాను అమిత్ షాకు కేటాయించడం సముచితంగా ఉంటుందని పేర్కొన్న విజయసాయి.. , ముందుముందు అమిత్ షా చేపట్టనున్న ఈ కొత్త బాధ్యతకు మద్దతు తెలుపుతూ అభినందనలు తెలిపారు. అమిత్ షా ఉప ప్రధాని అంటూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాకముందే.. విజయసాయి రెడ్డి వంటి సీనియర్ పార్లమెంటేరియన్ ఈ అంశంపై బహిరంగంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలో 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు విడతల్లోనూ డిప్యూటీ పీఎం పదవిని ఎవరికీ ఇవ్వలేదు. గతంలో బీజేపీ హయాంలోనే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆ హోదాను ఎవరికీ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో అమిత్ షాకు ఉప ప్రధాని పదవి అప్పగించడం ద్వారా, భవిష్యత్తులో ప్రధాని పదవిని చేపట్టబోయేది అమిత్ షాయే అన్న సంకేతాన్ని వ్యూహాత్మకంగా విజయసాయి ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే.. ఉప ప్రధాని నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటిక.. , విజయసాయి రెడ్డి పోస్ట్ వల్ల జాతీయ స్థాయిలో ఈ విషయంపై చర్చ జోరందుకుంది. ఒకవేళ అమిత్ షా అధికారికంగా ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే, అది దేశ రాజకీయ ముఖచిత్రాన్ని, అధికారిక ప్రాధాన్యతలను మార్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. Amit Shah Deputy PM news, Vijaya Sai Reddy tweet on Amit Shah, Union Cabinet Reshuffle 2026, Narendra Modi government Deputy Prime Minister, YSRCP BJP political updates

Publish Date: Jul 18, 2026 9:12AM

political-news-img

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్.!

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత 20 రోజులుగా సాగుతున్న పర్యావరణ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను పోలీసులు శనివారం (జులై 18) భగ్నం చేశారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 59 ఏళ్ల వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన దీక్షకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతున్నది. అయితే, శనివారం (జులై 18) తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా వాంగ్‌చుక్‌ను బలవంతంగా దీక్షా శిబిరం నుండి తరలించి అరెస్ట్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ నిరశన దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ 8 కేజీల బరువు తగ్గారు. శుక్రవారం(జులై 17) ఆయనను పరీక్షించిన వైద్య బృందం వాంగ్‌చుక్ శరీరంలోని ముఖ్యమైన అవయవాలు విఫలమయ్యే ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చింది. అంతకుముందే ఢిల్లీ హైకోర్టులో ఈ విషయమై విచారణ జరిగింది. దేశంలో ఏ పౌరుడి ప్రాణమైనా అత్యంత విలువైందని పేర్కొన్న ఢిల్లీ హైకోర్టు వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన అన్ని రకాల వైద్య చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయన ఆరోగ్య స్థితిపై రోజువారీ నివేదికలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల హెచ్చరికలు, కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా.. గత రెండు రోజులుగా వాంగ్‌చుక్ ఆరోగ్యం షమిస్తున్న తరుణంలో దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు. Delhi Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, Sonam Wangchuk Hunger Strike, Dharmendra Pradhan Resignation Demand

Publish Date: Jul 18, 2026 8:54AM

political-news-img

ఏపీ విద్యార్థుల తల్లులకు అలర్ట్.. ఆ రోజే అకౌంట్లలోకి భారీ నగదు!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకం నిధుల విడుదలకు సంబంధించి విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జూలై 22వ తేదీన రూ.13,000 నగదును నేరుగా జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాల్లోని పిల్లలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, వారి విద్యాభ్యాసానికి భరోసా కల్పించేందుకు ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ పథకం కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.10,120.78 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67,47,190 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 42,70,082 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ ప్రక్రియ జరగనుంది. జూలై 22వ తేదీ నాటికి మొదటి విడతగా 64,76,590 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో ఈ సొమ్ము జమ కానుంది. వాస్తవానికి ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటిస్తుంది. ఇందులో రూ.13,000 నేరుగా తల్లి ఖాతాకు చేరుతుండగా, మిగిలిన రూ.2,000 మొత్తాన్ని పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈసారి కూటమి ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ పథకం వర్తించేది కాదు. కానీ ఇప్పుడు సమాజంలో తక్కువ జీతాలతో సేవలు అందిస్తున్న 17,000 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, అలాగే పారిశుధ్య కార్మికుల (శానిటేషన్ వర్కర్స్) పిల్లలకు కూడా ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేవలం పట్టణ ప్రాంత అంగన్‌వాడీలకు మాత్రమే పరిమితమైన ఈ లబ్ధిని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్‌వాడీ వర్కర్లకు సైతం విస్తరిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రకటించారు. ap govt thalliki vandanam july 22 status,thalliki vandanam 13000 deposited mothers account.

Publish Date: Jul 18, 2026 8:45AM

MOVIE NEWS