Top Stories

political-news-img

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్.!

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత 20 రోజులుగా సాగుతున్న పర్యావరణ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను పోలీసులు శనివారం (జులై 18) భగ్నం చేశారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 59 ఏళ్ల వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన దీక్షకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతున్నది. అయితే, శనివారం (జులై 18) తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా వాంగ్‌చుక్‌ను బలవంతంగా దీక్షా శిబిరం నుండి తరలించి అరెస్ట్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ నిరశన దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ 8 కేజీల బరువు తగ్గారు. శుక్రవారం(జులై 17) ఆయనను పరీక్షించిన వైద్య బృందం వాంగ్‌చుక్ శరీరంలోని ముఖ్యమైన అవయవాలు విఫలమయ్యే ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చింది. అంతకుముందే ఢిల్లీ హైకోర్టులో ఈ విషయమై విచారణ జరిగింది. దేశంలో ఏ పౌరుడి ప్రాణమైనా అత్యంత విలువైందని పేర్కొన్న ఢిల్లీ హైకోర్టు వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన అన్ని రకాల వైద్య చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయన ఆరోగ్య స్థితిపై రోజువారీ నివేదికలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల హెచ్చరికలు, కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా.. గత రెండు రోజులుగా వాంగ్‌చుక్ ఆరోగ్యం షమిస్తున్న తరుణంలో దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు. Delhi Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, Sonam Wangchuk Hunger Strike, Dharmendra Pradhan Resignation Demand

Publish Date: Jul 18, 2026 8:54AM

political-news-img

ఏపీ విద్యార్థుల తల్లులకు అలర్ట్.. ఆ రోజే అకౌంట్లలోకి భారీ నగదు!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకం నిధుల విడుదలకు సంబంధించి విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జూలై 22వ తేదీన రూ.13,000 నగదును నేరుగా జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాల్లోని పిల్లలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో, వారి విద్యాభ్యాసానికి భరోసా కల్పించేందుకు ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ పథకం కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.10,120.78 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67,47,190 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 42,70,082 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ ప్రక్రియ జరగనుంది. జూలై 22వ తేదీ నాటికి మొదటి విడతగా 64,76,590 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో ఈ సొమ్ము జమ కానుంది. వాస్తవానికి ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటిస్తుంది. ఇందులో రూ.13,000 నేరుగా తల్లి ఖాతాకు చేరుతుండగా, మిగిలిన రూ.2,000 మొత్తాన్ని పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈసారి కూటమి ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ పథకం వర్తించేది కాదు. కానీ ఇప్పుడు సమాజంలో తక్కువ జీతాలతో సేవలు అందిస్తున్న 17,000 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, అలాగే పారిశుధ్య కార్మికుల (శానిటేషన్ వర్కర్స్) పిల్లలకు కూడా ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేవలం పట్టణ ప్రాంత అంగన్‌వాడీలకు మాత్రమే పరిమితమైన ఈ లబ్ధిని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్‌వాడీ వర్కర్లకు సైతం విస్తరిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రకటించారు. ap govt thalliki vandanam july 22 status,thalliki vandanam 13000 deposited mothers account.

Publish Date: Jul 18, 2026 8:45AM

political-news-img

ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్‌సీబీనే ముద్దు! ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం!

క్రికెట్ ప్రపంచంలో హెడ్ కోచ్ పదవులకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లండ్ లాంటి అంతర్జాతీయ జట్టుకు టెస్టు క్రికెట్ హెడ్ కోచ్‌గా పనిచేయడం అంటే ఎవరైనా అదృష్టంగా భావిస్తారు. కానీ జింబాబ్వే మాజీ దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త టెస్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇటీవల ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. మెకల్లమ్ స్థానంలో కొత్త వ్యూహకర్తను నియమించేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో ఆండీ ఫ్లవర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఆ చర్చల అనంతరం ఆండీ ఫ్లవర్ తాను రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లండన్ స్పిరిట్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆండీ ఫ్లవర్, ప్రస్తుతం తాను చేస్తున్న ఫ్రాంచైజీ కోచింగ్ బాధ్యతలతోనే ఎంతో సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్ వంటి అద్భుతమైన జట్లకు కోచ్‌గా పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, ఈ బాధ్యతలను వదిలి వెళ్లాలనే ఆలోచన తనకు లేదని బల్లగుద్ది చెప్పారు. అంతర్జాతీయ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోచ్‌గా కొనసాగడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. ఎందుకంటే ఐపీఎల్ టోర్నమెంట్ ఇంగ్లండ్ వేసవి సీజన్ ప్రారంభంలోనే జరుగుతుందని, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో టెస్టు జట్టుకు మరియు ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఒకేసారి న్యాయం చేయడం చాలా కష్టమని ఆండీ ఫ్లవర్ వివరించారు. నిజానికి ఆండీ ఫ్లవర్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఎంతో సుదీర్ఘమైన, విజయవంతమైన అనుబంధం ఉంది. గతంలో 2009 నుండి 2014 వరకు ఐదేళ్ల పాటు ఆయన ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించారు. ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టును ఐసీసీ ప్రపంచ నంబర్-1 టెస్టు ర్యాంకింగ్‌కు చేర్చడంలో ఆండీ ఫ్లవర్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఆయన కోచింగ్ హయాంలోనే ఇంగ్లండ్ జట్టు ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌ను మూడు సార్లు ముద్దాడింది. ఆనాటి అద్భుతమైన అనుభవాన్ని తాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, ఇంగ్లండ్‌కు కోచ్‌గా పనిచేయడం తన జీవితంలోనే అతిపెద్ద గౌరవమని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ఆ అవకాశం రావడం గర్వకారణమే అయినప్పటికీ, ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేశారు. andy flower stays with rcb,england test coach andy flower news

Publish Date: Jul 18, 2026 8:42AM

political-news-img

NYT Connections: జూలై 18 కనెక్షన్స్ పజిల్ సమాధానాలు ఇవే!

న్యూయార్క్ టైమ్స్ అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన వర్డ్ గేమ్స్ లో "కనెక్షన్స్" ఒకటి. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నెటిజన్లు ఈ పజిల్‌ను ఛేదించడానికి తమ మెదడుకు పదును పెడుతుంటారు. ఇవాళ, అంటే జూలై 18, 2026 నాటి కనెక్షన్స్ పజిల్ గేమ్ నెంబర్ 1133 కు సంబంధించిన హింట్స్ మరియు సమాధానాలు మీ కోసం ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆటలో మొత్తం 16 పదాలు ఇస్తారు. వాటిని నాలుగు వేర్వేరు సమూహాలుగా, అంటే ఒక్కో గ్రూపులో 4 పదాలు ఉండేలా వర్గీకరించాలి. ఈ వర్గీకరణకు గాను మీకు కేవలం 4 తప్పులు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గేమ్ ముగిసిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. ఇవాల్టి పదాలు మిమ్మల్ని కాస్త అయోమయంలో పడేసే అవకాశం ఉంది, ఎందుకంటే కొన్ని పదాలు బాస్కెట్‌బాల్ క్రీడకు సంబంధించినవి కాగా, మరికొన్ని వీడియో గేమ్స్ మరియు సంగీతానికి ముడిపడి ఉన్నాయి. ఈరోజు పజిల్‌లో ఇచ్చిన 16 పదాలు ఇవే: TRAVEL, FLY, QUIZ, SCORE, OPINION, CARRY, HEALTH, TART, CULTURE, MIND, TIME, GOALTEND, VIEW, LIVES, DOUBLE DRIBBLE, మరియు ATTITUDE. మొదటి చూపులో ఇవన్నీ చాలా సాధారణ పదాలుగా అనిపించినప్పటికీ, వీటి వెనుక దాగి ఉన్న కనెక్షన్‌ను కనిపెట్టడం అంత సులువు కాదు. ఈ పజిల్‌ను సులభంగా పూర్తి చేయడానికి మీకు సహాయపడే నాలుగు గ్రూప్ హింట్స్ ఇక్కడ ఇస్తున్నాము. పసుపు రంగు (Yellow Group) బాస్కెట్‌బాల్ ఆటలో జరిగే ఫౌల్స్ లేదా ఉల్లంఘనలను సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు (Green Group) మీ మనస్తత్వం లేదా నమ్మకాలకు సంబంధించినది. ఇక నీలం రంగు (Blue Group) వీడియో గేమ్స్‌లో మనం నిరంతరం ట్రాక్ చేసే విషయాలను తెలియజేస్తుంది. చివరగా ఊదా రంగు (Purple Group) 'పాప్' అనే పదం తర్వాత వచ్చే పదాల కలయికను సూచిస్తుంది. ఇప్పుడు అసలు సమాధానాల విషయానికి వస్తే, మొదటగా పసుపు రంగు గ్రూప్ (Commit a Basketball Violation) లోకి CARRY, DOUBLE DRIBBLE, GOALTEND, మరియు TRAVEL అనే పదాలు వస్తాయి. బాస్కెట్‌బాల్ ఆటపై అవగాహన ఉన్నవారికి ఇవి సులభంగానే దొరికిపోతాయి. రెండవదైన ఆకుపచ్చ గ్రూప్ (Belief) లో మీ నమ్మకాలు మరియు అభిప్రాయాలను ప్రతిబింబించే ATTITUDE, MIND, OPINION, మరియు VIEW అనే పదాలు ఉంటాయి. చాలామంది ఈ పదాలను చర్చలకు సంబంధించినవిగా భావించి తప్పు చేసే అవకాశం ఉంది. మూడవదైన నీలం రంగు గ్రూప్ (Things Tracked in Video Games) లో వీడియో గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్‌పై కనిపించే HEALTH, LIVES, SCORE, మరియు TIME అనే నాలుగు ముఖ్యమైన అంశాలు చేరతాయి. nyt connections game 1133 answers,july 18 nyt connections hints today.

Publish Date: Jul 18, 2026 8:40AM

political-news-img

ఐదు దశాబ్దాల కల..నెరవేరిందిలా.!

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామీణ మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఐదు దశాబ్దాలుగా రవాణా సౌకర్యాలకు నోచుకోని మారుమూల గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించే పనులను అధికారులు వేగవంతం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొడ్డుమామిడి గ్రామానికి శాశ్వత రోడ్డు మార్గం సాకారమౌతోంది. ఈ గ్రామానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న మట్టి రోడ్డు నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన బొడ్డుమామిడి గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా, సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బొడ్డుమామిడి గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తూ చేపట్టిన పనులు వేగంగా సాగుతుండటంతో తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రధాని నరేంద్ర మోదీలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతోనే ఈ మారుమూల పల్లెకు శాశ్వత విముక్తి లభించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తమ సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నాణ్యత విషయంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దష్టి సారించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకూడదని, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే అధికారులకు విస్పష్ట ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పవన్ కళ్యాణ్ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతూ, అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బొడ్డుమామిడి రోడ్డు పనులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పంచాయతీరాజ్ రోడ్ల నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మారుమూల పల్లెలను సైతం ప్రధాన రహదారులతో అనుసంధానించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒక్క బొడ్డుమామిడి అనే కాదు.. ఎన్నో గిరిజన, మారుమూల గ్రామాలకు ఈ నిధుల ద్వారానే నేడు రోడ్డు కనెక్టివిటీ లభిస్తోంది. ప్రస్తుతం బొడ్డుమామిడి గ్రామానికి నిర్మిస్తున్న మట్టి రోడ్డు పనులు పూర్తి కావస్తుండటంతో రానున్న రోజుల్లో రవాణా కష్టాలు చాలా వరకు తీరనున్నాయి. అయితే.. వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, భవిష్యత్తులో ఈ మట్టి రోడ్డును తారు, లేదా సిమెంట్ రోడ్డుగా మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసి తమకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. Boddumamidi Village Road, Chandrababu Naidu, Pawan Kalyan, AP Rural Roads Development, Alliance Government AP

Publish Date: Jul 18, 2026 8:39AM

political-news-img

ఏఐ కంపెనీల లాభాల్లో 50% వాటా ప్రజలకే? అమెరికాలో సంచలన సర్వే!

కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఎంత వేగంగా మారుస్తుందో మనందరికీ తెలుసు. అయితే, ఈ సాంకేతిక విప్లవం వెనుక కొన్ని కార్పొరేట్ శక్తులు మాత్రమే వందల కోట్ల డాలర్ల సంపదను పోగేసుకోవడంపై ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. మానవాళి మొత్తం సృష్టించిన ఉమ్మడి జ్ఞానం ఆధారంగానే ఈ ఏఐ టెక్నాలజీలు రూపుదిద్దుకున్నాయని, కాబట్టి దీని ద్వారా వచ్చే సంపదలో సగం వాటా ప్రజలకే దక్కాలనే ఒక సంచలన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రముఖ అమెరికన్ సెనేటర్ బెర్నీ సాండర్స్ తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానానికి అక్కడి ఉద్యోగులు మరియు సాధారణ ప్రజల నుండి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఏఐ కంపెనీలు తమ స్టాక్‌లో 50 శాతం వాటాను నేరుగా ఒక పబ్లిక్ వెల్త్ ఫండ్‌కు బదిలీ చేయాలనేది ఈ ప్రతిపాదన యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల వచ్చే లాభాలను దేశ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. ఈ విషయమై జూన్ 2026 లో నిష్పాక్షిక పరిశోధనా సంస్థ 'వెరాసైట్' నిర్వహించిన ఒక విస్తృతమైన సర్వేలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 18 సంవత్సరాలు పైబడిన 1,690 మంది అమెరికన్ వయోజనులపై 17 ప్రశ్నలతో కూడిన ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం, ఏఐ కంపెనీలు తమ వాటాలో 50 శాతాన్ని ప్రభుత్వ ప్రజా నిధికి ఇవ్వాలనే ప్రతిపాదనకు ఏకంగా 69 శాతం మంది అమెరికన్లు మద్దతు పలికారు. రాజకీయ నాయకుడైన బెర్నీ సాండర్స్ పేరును ప్రస్తావించినప్పుడు కూడా ఈ మద్దతు పెద్దగా తగ్గకుండా 64 శాతంగా నమోదు కావడం విశేషం. దీనిని బట్టి ఏఐ రంగంపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత లేదా ఆందోళన ఉందో స్పష్టమవుతోంది. సాంకేతికత పెరిగిపోతుండటం వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం ఒకవైపు, కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యంపై కోపం మరోవైపు ఈ భారీ మద్దతుకు కారణాలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా, ఏఐ కంపెనీల ప్రవర్తన మరియు నైతికతపై కూడా ప్రజల్లో తీవ్రమైన అపనమ్మకం ఉన్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది ప్రజలు ఏఐ కంపెనీలు ప్రతిపాదిస్తున్న నిబంధనలు కేవలం ఆయా కంపెనీల సొంత ప్రయోజనాల కోసమేనని బలంగా నమ్ముతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సుమారు 30 శాతం మంది ప్రజలు ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల కంటే అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నియంత్రణనే ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న ఏవైనా కొత్త ఏఐ సేవలను లేదా టూల్స్‌ను ముందస్తుగానే బ్లాక్ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అనే రాజకీయ పార్టీల భేదం లేకుండా అమెరికన్లందరిలోనూ ఏఐ భద్రత, పారదర్శకత మరియు బాధ్యతాయుతమైన యాజమాన్యంపై ఒకే రకమైన ఏకాభిప్రాయం వ్యక్తమవుతోందని వెరాసైట్ సీఈఓ బెన్ లెఫ్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన నిజంగా చట్టరూపం దాలిస్తే, ఏఐ కంపెనీలు నగదు రూపంలో కాకుండా తమ షేర్ల రూపంలో ఈ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రజా నిధి ద్వారా సేకరించిన లాభాల నుండి ప్రతి అమెరికన్ పౌరుడికి ఏటా 1000 డాలర్ల చొప్పున చెక్ అందించడమే కాకుండా, ఉచిత ఆరోగ్య సంరక్షణ మరియు నాణ్యమైన విద్య కోసం ఈ నిధులను ఖర్చు చేయాలని సాండర్స్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఏఐ పరిశ్రమ ఇమేజ్ పరంగా కొంత వెనుకబడి ఉన్నప్పటికీ, పొగాకు మరియు క్యాసినో రంగాల కంటే మెరుగైన స్థానంలోనే ఉంది. అయితే, సోషల్ మీడియా కంపెనీలతో పోలిస్తే ఏఐ కంపెనీలపై ప్రజల్లో సానుకూలత ఎక్కువే ఉంది. ఓపెన్ ఏఐ, గూగుల్ జెమిని, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కేవలం లాభాల కోసమే కాకుండా సమాజం పట్ల తమకున్న సామాజిక బాధ్యతను గుర్తించి నడుచుకుంటేనే భవిష్యత్తులో ప్రజల పూర్తి నమ్మకాన్ని చూరగొనగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. bernie sanders ai stock transfer policy,ai companies half stock public fund,verasight survey ai wealth distribution.

Publish Date: Jul 18, 2026 8:38AM

MOVIE NEWS