Publish Date:Nov 27, 2021
తెలంగాణ కాంగ్రెస్ లో అంతా సెట్ రైట్ అయిందా? సీనియర్లంతా ఒక్కటైపోయారా? కలిసికట్టుగా పోరాడుతూ కేసీఆర్ కు చుక్కలు చూపించబోతున్నారా? అంటే కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలకో గాంధీభవన్ లో ఖుషీ వాతావరణం కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎడమొఖం పెడ మొఖంగా ఉన్న నేతలంతా కలిసిపోయారు. ఇందుకు పీసీసీ చేపట్టిన వరి దీక్ష వేదికైంది. కొంత కాలంగా భిన్న దృవాలుగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలుసుకోవడం చర్చగా మ మారింది. కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపింది.
వరి దీక్ష వేదికగా కలిసిపోయిన ఆ ఇద్దరు నేతలో ఎవరో కాదు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న వీరు ఇప్పుడు కలిసిపోయారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నాచౌక్‌లో రెండు రోజుల‘వరి దీక్ష’ చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. అయితే. ఈ దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ ఒకరంటే ఒకరికి పడని.. ఒక్కసారీ మాట్లాడుకోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు... కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది.ఈ సన్నివేశం చూసిన జనాలు, కాంగ్రెస్ అధిష్టానం సైతం ఒకింత ఆశ్చర్యపోయింది.
టీపీసీసీ చీఫ్ కోసం విశ్వప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి.. ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాదు రేవంత్ రెడ్డి టార్గెట్ గా వరుస ప్రకటనలు చేసి కాక రాజేశారు. పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ పార్టీ ఇంచార్జీనే టార్గెట్ చేశారు. తర్వాత కూడా సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ లక్ష్యంగా కామెంట్లు చేశారు కోమటిరెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీకి డిపాజిట్ రాకపోవడంతో.. అందుకు పీసీసీ చీఫ్ కారణమనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. అయితే వాళ్లిద్దరి మధ్య సయోధ్య కోసం సీనియర్ నేత వీ హనుమంతరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయని అంటున్నారు.
కొన్ని రోజుల క్రితం సీఎల్పీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమయ్యారు వీహెచ్. తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ చర్చించారు. ఈ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఒకే తాటిపైకి తీసుకురావడానికి సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకట్రెండు సందర్భాల్లో వీహెచ్ ఫెయిల్ అయినప్పటికీ.. వరి దీక్షతో కోమటిరెడ్డి-రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. దీంతో వీహెచ్ మంత్రాంగం ఫలించినట్లయ్యింది. అయితే ఇద్దరూ కలిసిపోయినట్టేనా..? లేకుంటే దీక్ష ముగిసే వరకు మాత్రమే ఇలా కలిసుంటారా..? అన్నదానిపై పార్టీ నేతలెవరు క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి దీక్షలో కూర్చున్న విజువల్స్ మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తెగ వైరల్ చేస్తోంది. ఆ ఇద్దరూ కలిసిపోయారు.. ఇక కాస్కో కేసీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి పనిచేస్తే గులాబీ పార్టీకి చెమటలు పట్టడం ఖాయమనే చర్చ గాంధీభవన్ తో పాటు కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-komati-reddy-venkat-reddy-dharna-at-indira-park-for-paddy-crop-39-127243.html
లోకం చీదరించుకునే పని చేసినవాడిని పంచనబెట్టుకుని అబ్బే మావాడు కాదు అదంతా మార్షింగ్ వ్యవ హారమని అడ్డంగా వాదించడం ఎంతవరకూ సమంజసం. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహా దారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట కూడా అలానే వుంది. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ లీలలు వీడియోలో అందరూ చూసి ప్రశ్నిస్తుంటే ఇదేమీ సీరియస్ సంగతి కాదని ఆయన అనడం విడ్డూరం.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా చేశారు. క్షణాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజగోపాల రెడ్డి పేరు పక్కన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే.. కూడా వచ్చిచేరింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరడం కూడా ఖరారైపోయింది. ఆగష్టు 21 న రాజగోపాల రెడ్డి ఖద్దరు విడిచి కాషాయం కట్టేందుకు సిద్దమయ్యారు. అందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపధ్యంలో ఆయన రాజకీయ జీవితం కొత్త మలుపు తీసుకుంటోందని అనుకోవచ్చును. గతాన్ని గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం)కు అప్పగించి, ఆ ఎదురుగా అడుగుల దూరంలో ఉన్న డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ రాష్ట్ర కార్యాలయం) నుంచి కొత్త నడక ప్రారంభమవుతుంది.
ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన గోరంట్ల మాధవ్ కు వైసీపీ మహిళా నేతలు మద్దతుగా మాట్లాడటం పై జనం ఆశ్చర్య పోతున్నారు. మహిళా నేతలు అయి ఉండీ.. ఇక అసభ్య వీడియోలో అడ్డంగా దొరికి పోయిన ఎంపీకి మద్దతుగా నిలవడంపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు రంగం సిద్ధమౌతోందా? అన్న ప్రశ్నకు ఆయన సుప్రీం కోర్టు పై చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందించిన తీరు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తుంది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం (ఆగస్టు 8)న జరిగిన సదస్సులో ఆయన సుప్రీం కోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి బీహార్ లో నితీష్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కు జెల్ల కొట్టి విపక్ష ఆర్జేడీ మద్దతుతో, వామపక్షాల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.
రొట్టెల పండుగ
మత సామరస్యానికి ప్రతీక. ఈ పండగ నెల్లూరులో అత్యంత వైభవంగా జరుగుతోంది. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయి. అలాగే మరికొన్ని వేడుకలు కొంత మంది మాత్రమే జరుపుకొంటారు. నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండుగకు నెల్లూరుకే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చింది.
టీమ్ ఇండియాలోకి విరాట్ కోహ్లీ మళ్లీ వచ్చేశాడు. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసీయా కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. ఆసీయాకప్ ఎంపిక చేసిన భారత జట్టులో విరాట్ కోహ్లీకి స్థానం లభించింది.
చంద్రబాబుతో మోడీ ఓ ఐదు నిముషాలు ముచ్చటించడం వైసీపీలో గుబులు రేపుతోందా? బాబు, మోడీ భేటీనీ వైసీపీ జీర్ణించు కోలేకపోతోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు కుదురుతుందన్న భయం పట్టుకుందా? అంటే సజ్జల ఈ రోజు(ఆగస్టు 8) మీడియా సమావేశం లోమాట్లాడిన మాటలు వింటే ఔనని అనిపించక మానదు.
ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఎందుకు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన మాధవ్ పై చర్యలు తీసకోవాలంటూ తెలుగుదేశం, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఢిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం ఆ వీడియోపై విచారణ జరిపి గోరంట్ల మధవ్ పై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకు ముందు ఈ వీడియో వ్యవహారం వెలుగులోనికి వచ్చిన రోజే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్ పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కామన్వెల్త గేమ్స్ చివరి రోజు సోమవారం ( ఆగస్టు 8)భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కనకవర్షం కురిపించారు. మహిళల సింగిల్స్ లో సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ లు స్వర్ణాలు సాధించగా, ఆ తరువాత కొద్ది సేపటికే పురుషుల డబుల్స్ లో రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి ఇంగ్లాండ్ జోడీ బెన్ లెన్ సీన్ వెండీలపై వరుస సట్లలో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకున్నారు.
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్గేమ్స్లో సోమవారం భారత్ మరో స్వర్ణపతకం సాధించింది. భారత్ ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పోటాపోటీగా జరిగిన ఫైనల్లో మలేషియా ప్లేయర్ జియాంగ్ పై విజయం సాధించాడు.
నేను చేనేతకు పెద్ద అంబాసిడర్‌ని అంటూ జనసేన నాయకుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నాడు. అంతే వెంటనే చాలామంది నువ్వే కాదు చాలామంది అదే బాటలో ఉన్నారని ప్రకటించారు.
దొంగ తాళాలతో వెళతాడు, ఆర్ధిక నేరస్తుల్ని వెంటాడుతుంది ఈడీ, నోయిడాలో బుల్డోజర్ మాత్రం త్యాగి వెంటబడింది.