'కొండా' రియ‌ల్ స్టోరీ ఇదే.. ప‌రిటాల‌, వంగ‌వీటి రేంజ్‌లో..!!

Publish Date:Jan 26, 2022

Advertisement

కొండా ముర‌ళి. కొండా సురేఖ‌. వెర‌సి కొండా దంప‌తులు. కొండా.. గుండా అనేది కొంద‌రి మాట‌. కొండా.. కొండంత బ‌ల‌మైన నాయ‌కుడనేది అనుచ‌రుల వాద‌న‌. పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. పాలిటిక్స్‌లో పీక్స్ రేంజ్‌కి ఎదిగిన నాయ‌కులు. కొండా సురేఖ‌.. మాజీ మంత్రి, ప‌లుమార్లు ఎమ్మెల్యే. కొండా ముర‌ళి ఎమ్మెల్సీగా తెర‌వెనుక రాజ‌కీయాల‌కే ప‌రిమితం. ఒక‌ప్పుడు వైఎస్సార్ అనుంగ అనుచ‌రులు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఫాలోయ‌ర్స్‌. కాంగ్రెస్‌లోనే సుదీర్ఘ రాజ‌కీయం నెరిపారు. టీఆర్ఎస్‌పై రాళ్ల‌దాడి చేసి.. ఆ కారు గుర్తు మీద‌నే గెలిచిన ఘ‌నులు. కేసీఆర్‌తో చెడి.. మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరి.. ప్ర‌స్తుతం రాజ‌కీయ పున‌ర్‌వైభ‌వం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాంటి పొలిటిక‌ల్‌గా లేచి ప‌డిన కొండా హిస్ట‌రీ.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ను ఆక‌ర్షించింది. అయితే, ఆయ‌న్ను అంత అట్రాక్ట్ చేసింది వాళ్ల పొలిటిక‌ల్ కెరీర్ మాత్రం కాదు. అంత‌కుమించి న‌డిచిన వాళ్ల ల‌వ్ స్టోరీ. న‌క్స‌ల్స్ తూటాల‌ను త‌న శ‌రీరంలో దింపుకొని.. ఆ న‌క్స‌ల్ అగ్ర‌నేత ఆర్కేతో ముర‌ళి న‌డిపిన డీల్. స‌ర్పంచ్ నుంచి వ‌రంగ‌ల్ జిల్లాను ఏలేంతగా ఎదిగిన కొండా ప్ర‌స్థానం. ఆ హీరో టైప్ రౌడీ పాలిటిక్సే ఆర్జీవీని ఆక‌ర్షించాయి. కొండా టైటిల్‌తో కాక పుట్టించి కేక పెట్టించే సినిమా తీసేశారు. ట్రైల‌ర్‌తో ర‌చ్చ రాజేశారు. ఇంత‌కీ కొండా.. చరిత్ర‌లో ఏముంది?  కొండా ముర‌ళి హీరోనా? విల‌నా? వ‌రంగ‌ల్ ఏమంటోంది..?

కొండా మురళీ.. కొండా సురేఖ.. వ‌రంగ‌ల్ ఎల్బీ కళాశాల‌లో బీఏ చ‌దువుతుండ‌గా వారి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డిచింది. ముర‌ళీ కాపు.. సురేఖ ప‌ద్మ‌శాలి.. కులాలు వేరైనా.. ప్రేమ-పెళ్లి జ‌రిగిపోయింది. 1987లో డిగ్రీ కంప్లీట్ కాగానే.. తన స్వగ్రామం వంచనగిరిలో సర్పంచ్‌ పదవికి నామినేషన్ వేశారు కొండా ముర‌ళి. ఆ స‌మ‌యంలో ఊరి కూడలిలో కుక్కను కాల్చి చంపి.. త‌న‌పై ఎవ‌రైనా పోటీ చేస్తే.. ఈ కుక్క‌ను కాల్చిన‌ట్టు కాల్చి చంపేస్తాన‌ని బెదిరించారనే ప్ర‌చారం ఉంది. అలా 24 ఏళ్ల వయస్సులో సర్పంచ్ అయ్యారు కొండా ముర‌ళి. మొద‌ట్లో వ‌రంగ‌ల్‌ జిల్లాకు చెందిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అనుచ‌రుడిగా ఉండేవారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌తో విభేదాలు వ‌చ్చి.. కాంగ్రెస్‌లో చేరారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎర్ర‌బెల్లి, కొండాల మ‌ధ్య తీవ్ర‌మైన రాజ‌కీయ‌ వార్ న‌డుస్తోంది. 

కొండా ముర‌ళిపై కాస్త రౌడీ ఇమేజ్ ఉండ‌టంతో.. సాఫ్ట్ ఫేస్‌గా త‌న భార్య కొండా సురేఖ‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చి.. ఎమ్మెల్యే, మంత్రిగా ఎదిగారు. అప్ప‌ట్లో వ‌రంగ‌ల్ జిల్లాలో కొండా ముర‌ళిదే రాజ్యం. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో న‌డిచేది ప్ర‌భుత్వ యంత్రాంగం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడ‌ల్లా కొండా దంప‌తుల‌దే హ‌వా. వ‌రంగ‌ల్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్ల‌లో త‌రుచూ కొండా పేరు వినబ‌డేది. న‌యీం ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత కూడా ఆయ‌న‌తో సంబంధాలు ఉన్నాయంటూ కొండా పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు.. త‌న బ‌ద్ద‌శ‌త్రువైన టీడీపీకి చెందిన‌ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నాలు చేసేవారు. అదే, టీడీపీ ప‌వ‌ర్‌లోకి వ‌స్తే.. కొండాను అణిచేసేలా ఎర్ర‌బెల్లి అడుగులు వేసేవారు. ఇలా వీరి మ‌ధ్య ద‌శాబ్దాల వైరం. కొండా మూవీలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు రోల్‌ను న‌ల్ల‌బల్లి సుధాక‌ర్‌గా నెగ‌టివ్ షేడ్‌లో చూపించినట్టు తెలుస్తోంది. ఒక అమ్మ‌కు, నాన్న‌కు పుట్టిన‌వాడినంటూ.. అనే డైలాగ్ ఎర్ర‌బెల్లి క్యారెక్ట‌ర్ చేత చెప్పించ‌డంతో కాంట్ర‌వ‌ర్సీ పీక్స్‌కు చేరింది. ఇప్ప‌టికే.. ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లితో పాటు ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డికి ద‌మ్కీ ఇచ్చారు కొండా సురేఖ‌. 

కొండా ముర‌ళి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య పొలిటిక‌ల్ వార్ ఓ రేంజ్‌లో సాగింది. ఇద్దరివీ వేరు వేరు నియోజకవర్గాలు. రాజకీయాల్లో ఎర్రబెల్లిది క్లీన్ ఇమేజ్. కొండా మురళిది మాత్రం డిఫ‌రెంట్ యాంగిల్‌. క‌ట్ చేస్తే.. తన భర్తను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హత్య చేయించ‌డానికి కుట్ర చేస్తున్నాడంటూ, తన మాంగళ్యం కాపాడాలంటూ.. నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే సురేఖ అప్పటి సీఎం చంద్రబాబును వేడుకోవడం సినిమాటిక్‌గానే ఉంటుంది.  

కొండా చ‌రిత్ర ఖ‌త‌ర్నాక్‌గా ఉంటుంది, హత్యలు, బెదిరింపులు, అక్రమ ఆయుధాలు లాంటి 19 కేసుల్లో నిందితుడిగా ఉండి, కోర్టు విచారణలో అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటికొచ్చారు కొండా ముర‌ళి. 2002 ఏప్రిల్‌లో అప్ప‌టి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, డైన‌మిక్ లీడ‌ర్‌, కొండాకు కొరుకుడుప‌డ‌ని నాయ‌కుడైన‌.. కొల్లి ప్రతాప్‌రెడ్డి వెళుతున్న కారుపై స‌డెన్‌గా అటాక్ జ‌రిగింది. రాయ‌ల‌సీమకు చెందిన కిరాయి రౌడీలు బాంబుల‌తో దాడి చేసి న‌డిరోడ్డుపై కొల్లి ప్ర‌తాప్‌రెడ్డిని చంపేయ‌డం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ మ‌ర్డ‌ర్ కొండా ముర‌ళి చేయించిందే.. అని ఆ కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. అప్పటి వరంగల్‌ ఎస్పీ నళిన్‌ ప్రభాత్‌.. కొండా మురళికి బేడీలు వేసి.. చొక్కా విప్పించి.. హనుమకొండ చౌరస్తాలో, ఆయ‌న స్వ‌గ్రామ‌మైన‌ వంచనగిరిలో.. పరేడ్‌ చేయించిన సీన్ వ‌రంగ‌ల్‌వాసుల‌కు ఇప్ప‌టికీ గుర్తే. సినిమాటిక్‌గా సాగిన ఆ సీన్ ఆర్జీవీ తీయ‌బోయే మూవీలో ఉంటుందా? ఉండ‌దా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 

2003లో పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి ఆర్కేతో సంబంధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై కొండా మురళి–సురేఖలపై ‘పోటా’ కేసు నమోదుకావడం సంచ‌ల‌నం. ఆర్కేకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను కొండా మురళి సమకూర్చాడని.. అందుకు ప్ర‌తిఫ‌లంగా ఎర్ర‌బెల్లిని న‌క్స‌ల్స్ చంపాల‌ని.. ఆర్కే-కొండా మ‌ధ్య డీల్ కుదిరింద‌ని పోలీసులు ప్రకటించ‌డం అప్ప‌ట్లో షాకింగ్ న్యూస్‌. ఆ కేసుకు పోలీసుల‌పై ఎర్ర‌బెల్లి ఒత్తిడే కార‌ణ‌మ‌నేది కొండా ఆరోప‌ణ‌. PWGపై తీవ్ర నిర్బంధం ఉన్న రోజుల్లో.. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన నక్సలైట్ జిలానీబేగంను తన వాహనంలో ఇంటికి తీసుకువెళ్ళి, భోజనం పెట్డించి పంపించడం.. కొండా ముర‌ళికి న‌క్స‌ల్స్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌కు ఎగ్జాంపుల్‌గా చూపిస్తారు. 

కొండా ముర‌ళి-సురేఖ‌ల‌కు వైఎస్‌తో ఉన్న అనుబంధం, ఆయ‌న అండ‌, ఆద‌ర‌ణ ఒక ఎత్త‌యితే,  గ‌డ్డం తీసేసి ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో క‌నిపించు అని వైఎస్ చేసిన సూచ‌న‌.. దానిని ముర‌ళి ఆచ‌రించిన తీరు.. సినిమాటిక్‌గానే ఉంటుంది. 2009లో వైఎస్‌ రెండోసారి సీఎం అయినప్పుడు.. సురేఖ మంత్రి కావడం, వైఎస్‌ మరణానంతరం జగన్‌కు మ‌ద్ద‌తుగా మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేర‌డం ఆస‌క్తిక‌రం. జ‌గ‌న్ ద‌గ్గ‌ర వివిధ పెట్టుబ‌డుల రూపంలో వంద‌ల కోట్ల సొమ్ము ఇరుక్కుపోయింద‌ని.. ఆ డ‌బ్బు కోస‌మే జ‌గ‌న్ వెంట ఉన్నార‌ని.. జ‌గ‌న్‌ను అడిగి అడిగి విసిగి వేసారి.. ఇక ఆ డ‌బ్బులు రావ‌ని తెలిసి.. జ‌గ‌న్‌ను వ‌దిలేసి టీఆర్ఎస్‌లో చేరార‌ని అంటారు. భార‌తి సిమెంట్‌లో పెట్టిన  ఆ 2 వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల‌ విష‌యం గురించి జిల్లాలో ఇప్ప‌టికీ మాట్లాడుకుంటారు. 

2010లో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్ రాళ్ల దాడి ఘ‌ట‌న కొండా రాజ‌కీయ చ‌రిత్ర‌లో కీల‌క ఘట్టం. జ‌గ‌న్ ప్ర‌యాణిస్తున్న రైల్‌ను ఉద్య‌మ‌కారులు అడ్డుకోవ‌డం.. హ‌రీష్‌రావును కొండా సురేఖ ప‌చ్చిబూతులు తిట్ట‌డం.. మ‌హ‌బూబాబాద్ రైల్వే స్టేష‌న్లో ట్రాక్‌పై ఉన్న రాళ్ల‌తో కొండా అనుచ‌రులు.. ఉద్యమకారులపై రాళ్ల‌తో దాడి చేయ‌డం.. ప్ర‌తిదాడి నుంచి ర‌క్ష‌ణ‌గా కొండా ముర‌ళి తుపాకీతో కాల్పులు జ‌ర‌ప‌డం.. అబ్బో.. అప్ప‌ట్లో ర‌చ్చ రంభోలా జ‌రిగింది. క‌ట్ చేస్తే.. 2014లో కొండా ఫ్యామిలీ హ‌రీష్‌రావు స‌మ‌క్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడం, ప‌ర‌కాల నుంచి షిఫ్ట్ అయి.. వరంగల్‌ తూర్పులో కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంద‌టం రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అని నిరూపించారు. అయితే, 2018 ఎన్నికల నాటికి సీన్ మారిపోయింది. కొండా దంప‌తుల ఆగ‌డాలు, అరాచ‌కాల‌పై వ‌రంగ‌ల్ ప్ర‌జ‌లు, పార్టీ నాయ‌కులు కేసీఆర్ ద‌గ్గ‌ర మొర‌పెట్టుకోవ‌డంతో.. కొండా సురేఖ‌కు టికెట్ ఇవ్వ‌లేదు టీఆర్ఎస్‌. దీంతో.. మ‌ళ్లా కాంగ్రెస్‌లో చేరి.. వ‌రంగ‌ల్‌ను వీడి ప‌ర‌కాలలో పోటి చేసి ఘోర ప‌రాజ‌యం పాలయ్యారు. అప్ప‌టి నుంచి సైలెంట్‌గా అదును కోసం ఎదురుచూస్తున్న కొండా ఫ్యామిలీకి.. ఇటు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డం.. అటు ఆర్జీవీ సినిమా తీస్తుండ‌టం.. కొండా దంప‌తుల‌కు బాగా క‌లిసిరానుందంటున్నారు. 

కొండా ముర‌ళిలో అనేక షేడ్స్ ఉన్నాయంటారు. సాయిబాబాకి మురళి పరమభక్తుడు. తన ఇలాఖాలోని కోటగండి ద‌గ్గ‌ర‌ సాయినాథుడికి గుడి కట్టించారు. ఏటా  వినాయక నవరాత్రి ఉత్సవాల వేళ.. 9 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ముర‌ళి ప‌క్కా మాస్ లీడ‌ర్‌. 'అబ్బర పులి... కొండా మురళి' లాంటి స్లోగ‌న్స్‌తో ఆయ‌న అభిమానులు అద‌ర‌గొడుతుంటారు. బాంచెన్ ప‌టేల్‌ అంటూ త‌న‌కు న‌మ్మ‌కంగా ఉండే వారిని బాగా చూసుకుంటార‌ని.. తోక జాడిస్తే.. పాతాళంలోకి తొక్కేస్తార‌ని చెబుతుంటారు. ఆయ‌న‌ ఆఫీసులో త‌న‌కు మాత్ర‌మే కుర్చీ ఉంటుందని.. ముర‌ళిని క‌లిసేందుకు వ‌చ్చే సామాన్యులంతా ఆయ‌న ముందు చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డే ఉండాల‌నేది అన‌ధికారికి రూల్‌. ఆయ‌న ఎటువెళ్లినా భారీ కాన్వాయ్‌తో వెళుతుంటారు. 

వ‌రంగ‌ల్ జిల్లా ర‌క్త‌చ‌రిత్ర‌లో ముర‌ళి పాత్ర ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. అప్ప‌ట్లో న‌క్స‌ల్స్.. కొండా ముర‌ళిని చంపేందుకు ఆయ‌న‌పై తుపాకుల‌తో ఫైరింగ్ చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్‌తో ఉన్న ముర‌ళిని ఆ న‌క్స‌ల్స్ తూటాలు ఏమీ చేయ‌లేక‌పోయాయి. అంత‌లోనే ముర‌ళి తేరుకొని.. ఓ న‌క్స‌ల్స్ నుంచి తుపాకీ లాక్కొని ఎదురుదాడి చేయ‌డంతో అన్న‌లు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఆ కాల్పుల్లో ఆయ‌న త‌ల‌లోకి ఓ తూటా ముక్క దూసుకెళ్ల‌గా.. అది ఇప్ప‌టికీ కొండా ముర‌ళీ త‌ల‌లో అలానే ఉంది. దానితో ఏం ప్ర‌మాదం లేద‌ని వైద్యులు అలానే ఉంచేశారు. ఆ దాడిలో ఆయ‌న ఓ క‌న్ను కోల్పోగా.. ప్ర‌స్తుతం ఉన్న‌ది గాజు క‌న్ను అని అంటారు. కొండా ముర‌ళి జీవితంలో ఇంత‌టి ఖ‌త‌ర్నాక్ సీన్స్ ఉంటే.. ఆర్జీవీ దృష్టిలో ప‌డ‌కుండా ఎలా ఉంటారు? ట్రైల‌ర్‌లోనూ కొండాపై కాల్పుల సీన్ ఉంది.

అయితే, కొండా లైఫ్‌లో ఎన్ని పాజిటివ్ షేడ్స్ ఉంటాయో అంత‌కుమించి నెగ‌టివ్ రోల్ క‌నిపిస్తుంది. మ‌రి, ఆర్జీవీ ఈ మంచి-చెడుల‌ను బ్యాలెన్స్ చేస్తారా? త‌న‌దైన స్టైల్‌లో విల‌నిజం, హీరోయిజం మిక్స్ చేసి చూపిస్తారా? టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, ప‌బ్లిసిటీతో పిచ్చెక్కించి.. ఎప్ప‌టిలానే చివ‌రాఖ‌రికి సినిమాతో తుస్సుమ‌నిపిస్తారా? లేక‌, ర‌క్త‌చ‌రిత్ర‌, వంగ‌వీటి త‌ర‌హా హిట్ కొడ‌తారా? రాజ‌కీయంగా ప‌త‌నావ‌స్థ‌కు చేరి.. పున‌ర్‌వైభ‌వం కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న కొండా దంప‌తుల‌కు.. ఆర్జీవీ మేడ్ "కొండా" మూవీ ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.... 

By
en-us Political News

  
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి, ప్రస్తుతం తిహార్ జైల్లో వున్నారు
మొన్నటి వరకు యువతరాన్ని పబ్జీ పిచ్చి పట్టి పిడించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న సీఎం. గత ఏడాది ఏప్రిల్ లో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదిక పేర్కొన్న మేరకు 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే సంపన్నుడిగా తేలారు.
చాలామంది దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నిస్తారు. దేశం నాకేమిస్తుందా అని ఆలోచిస్తారు.
పంచ్ డైలాగుల నుంచి పలాయనం దాకా వైసీపీ తిరోమన ప్రస్ధానం చేరుకుందా అంటే కడప జిల్లా రాజకీయాలలో జరుగుతున్న లేదా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తోంది. పులివెందుల పులి, సింహం సింగిల్ ఎంట్రీ వంటి డైలాగుల నుంచి తమపై ఎవరూ ఆరోపణలూ విమర్శలూ చేయకూడదంటూ కడప కోర్టు నుంచి తెచ్చుకునే వరకూ వైసీపీ వచ్చింది.
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి,
బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.