చిత్తూరులో ప్రేమ ఉన్మాదం..

Publish Date:Jun 5, 2021

Advertisement

ప్రాంతం ఏదైనా, ప్రభుత్వాలు ఎన్ని మారిన, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, పేరు ఏదైనా గాని నిత్యం ఆడవారిపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్తకొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చిత్తూరు నగరంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది కసాయిగా మారి ఆ  యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చివరకు తను కూడా గొంతు కోసుకుని పడిపోయాడు.
 
ఆమె పేరు సుష్మితకు చిన్నప్పటి నుంచి చదువంటే చచ్చేంత ఇష్టం. అందుకే సుష్మిత అప్పులు చేసి మరీ కూతురిని చదివిచారు. పేద వారమైనా.. ఇరుకు ఇంట్లో ఉంటున్నా ఏనాడూ ఇబ్బంది పడలేదు తాను. చదువే తన సర్వాంగ, చదువే తన కష్టాలు తీరుస్తుందని కష్టపడి చదివింది. కానీ శుక్రవారం ఉదయం సుష్మితను చిన్నా అనే యువడుకు గొంతు కోసి చంపేయగా.. ఆమె కుటుంబసభ్యుల చేతిలో చిన్నా హతమయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరంతో పాటు రాష్ట్రంలోనే తీవ్ర అలజడి సృష్టించింది. ఈ దారుణ ఘటనతో గతంలో జరిగిన ప్రేమోన్మాద దాడులు ప్రజల కళ్లముందు కదలాడాయి. అసలు వివరాలు.. 

చీలాపల్లి సీఎంసీలో  సుష్మిత నర్సుగా పనిచేస్తుంది. డ్యూటీ నిమిత్తం ఆమె సోదరుడు సునీల్‌ రోజూ మధ్యాహ్నం బైక్‌పై తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం ఇంటికి తీసుకొచ్చేవాడు. కట్ చేస్తే.. అదే ప్రాంతానికి చెందిన  పని లేని ఒక పోరంబోకు, వాడి పేరు చిన్న సుస్మితను కొంతకాలంగా ప్రేమిస్తున్నాను అంటూ, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది జనవరిలో సుస్మిత కుటుంబ సభ్యులు చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆయినా వాడి ఆగడాలు ఆగలేదు మళ్ళీ చిన్నా వేధింపులపై తిరిగి రెండు నెలల కిందట వరదయ్య మళ్లీ పోలీసులకు చెప్పగా.. పోలీసులు చిన్నాకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సుస్మితపై పగ పెంచుకుని ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో విధులు ముగించుకుని రోజులాగే శుక్రవారం ఉదయం 7.30గంటలకు తన అన్నతో కలిసి సుష్మిత ఇంటికి వచ్చింది. డ్యూటీ చేసి వచ్చిన కూతురికి టీ ఇద్దామని తల్లి తల పాల కోసం కొట్టుకి  వెళ్ళింది. పనిలో పని అని టిఫిక్ కోసం సునీల్ హోటల్‌కు వెళ్లాడు. ఊరు వాతావరణం కదా అప్పటికే  అప్పటికే సుష్మిత ఒంటరిగా ఉందని పసిగట్టిన చిన్న. పధకం ప్రకారం మిద్దెలు దూకుతూ వెళ్లి సుష్మిత ఇంటి మేడపైకి వెళ్ళాడు. వెనుక ఉన్న మెట్లు దిగి వెంట తెచ్చుకున్న కత్తితో ఇంటి గడియను విరగ్గొట్టాడు.

సౌండ్ లేకుండా లోపలి ఎంటర్ అయ్యాడు. సుస్మిత గాఢనిద్రలో ఉంది. ఒక్కసారిగా తనకు జరిగిన విషయాలు అన్ని గుర్తుకు చేసుకున్నాడు చిన్న.. ఒక్కసారిగా  మెరుపు దాడి చేసినట్లు గదిలో నిద్రిస్తున్న సుష్మితపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. ఆ రక్తపు మడుగులో పడిఉన్న సుస్మిత చూసి మరి ఆ కసాయి వాడు ఏమనుకున్నాడో  అనంతరం అదే గదిలో తానూ కూడా  గొంతు కోసున్నాడు. పాలకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి సుష్మిత, చిన్నా ఇద్దరూ రక్తపుమడుగులో ఉండటంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సునీల్‌ కొనఊపిరితో ఉన్న చిన్నాను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి రాయితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటనపై స్థానికంగా ఉండే మహిళా సంరక్షణ కార్యదర్శి చిత్తూరు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్‌ టీం హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించింది. చిన్నాను హతమార్చిన సునీల్‌పై పోలీసులు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By
en-us Political News

  
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.