పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా వర్మ తొలగింపు నిజంగా ఒక అనూహ్య పరిణామమే. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుండి తొలగిస్తూ తెలుగుదేశం హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాలలో పెను సంచలనం రేపింది. పిఠాపురం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో.. ఇక్కడ జరిగే ప్రతి చిన్న మార్పు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ నేపథ్యంలోనే వర్మను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించడంలో వర్మదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ కోసం తన సీటును వర్మ త్యాగం చేశారు. వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి మరీ అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం స్థానిక టీడీపీ శ్రేణులలో కూడా అసంతృప్తికి కారణమైంది.
గత కొద్దిరోజులుగా పిఠాపురంలో జనసేన, టీడీపీ స్థానిక నాయకుల మధ్య ప్రోటోకాల్ విషయంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులతో వాగ్వాదాలకు దిగారు. ఇప్పుడు అవే తెలుగుదేశం అధిష్ఠానం వర్మపై వేటు వేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే విషయంలో వర్మ తనను ఇన్ చార్జిగా తొలగించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ బలోపేతానికి తన రక్తాన్ని ధారపోశాననీ.. ఏనాడు క్రమశిక్షణ తప్పలేదని చెబుతూ.. అర్ధంతరంగా మీడియా సమావేశాన్ని ముగించి కన్నీటిని ఆపుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. తెలుగుదేశం శ్రేణుల్లో వర్మ పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే వర్మను నియోజకవర్గ బాధ్యతల నుంచే తప్పించి ముందు ముందు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం హైకమాండ్ ఉందని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో.. ఆ కూటమిలోని ఇద్దరు ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో పిఠాపురం టీడీపీలో ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. వర్మ వంటి బలమైన నేతను పక్కన పెట్టడం వల్ల కేడర్‌లో అసమ్మతి రాకుండా చూసుకోవడం ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముందు ఉన్న టాస్క్ గా చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pithapuram-varma-ousted-25-219217.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.