కొత్త ఏడాదిలో అయినా ఇవి అలవాటు చేసుకోండి.. జీవితం సంతోషంగా ఉంటుంది!

Publish Date:Dec 27, 2023

Advertisement

డిసెంబర్ నెల ముగింపుకు వచ్చేస్తోంది. కొత్త అనే పదంలోనే ఒకానొక ఆశాభావం ఉంటుంది.  చాలామంది పుట్టినరోజు సందర్బంగానో, పండుగల సందర్భంగానో, కొత్త ఏడాది సందర్బంగానో  ఈ సారి అయినా నా జీవితం మెరుగ్గా ఉండాలి, నేను ఇంకా బాగా ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే  కొత్త ఏడాదిలో ఈ కింద చెప్పుకునే అలవాట్లు జీవితంలో భాగం చేసుకుంటే జీవితం సంతోషమయమవుతుంది. అవేంటో తెలుసుకుంటే..

కృతజ్ఞత..

కృతజ్ఞత అనేది చాలా గొప్ప విషయం. జీవితంలో సానుకూల అంశాల అంశాలను గుర్తుచేసుకుని  ఆయా సందర్బాలకు కృతజ్ఞత చెప్పుకోవడం, సానుకూల జీవతానికి సహకరిస్తున్నవారికి కృతజ్ఞతన చెప్పడం, ప్రపంచంలో ఎంతో మందితో పోలిస్తే తమకు మెరుగైన జీవతమే లభించిందని తృప్తిగా ఉండటం, జివితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల  మనిషిలో సంతృప్తి పెరుగుతుంది.

సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి..

స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆప్తులతో అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన సంబంధాలు జీవితంలో గొప్ప సంతోషానికి కారణమవుతాయి. కష్ట సుఖాలను పంచుకోవడం, విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం మొదలైన సందర్బాలకు ఆత్మీయ సంబంధాల తోడు ఎంతో అవసరం.

మీకోసం మీరు..

ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు, బంధువులు ఇలా అందరూ  ఉండి ఉండవచ్చు. అందరితో సంతోషమూ లభించవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత సమయం ఉండాలి.  చదవడం, నడవడం, అభిరుచి కలిగిన పనులు చేయడం. ఆనందాన్ని ఇచ్చే పనులు చేయడం ద్వారా మానసికంగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ సమయం ఆత్మ విమర్శ చేసుకోవడానికి, తమను తాము తరచి చూసుకోవడానికి కూడా సహాయపడుతుంది.

చురుగ్గా ఉండాలి..

ప్రస్తుతకాలంలో వేగంగా వ్యాపిస్తున్న వ్యాధులు, అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని నిశ్చలమైన జీవనశైలి వదిలిపెట్టాలి. శారరక  శ్రమ, మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ధ్యానం, యోగా వంటిని ఫాలో కావాలి.

ఆరోగ్యకమైన ఆహారపు అలవాట్లు..

నేటికాలం ప్రజల ఆహారపు అలవాట్లు చాలా దారుణంగా తయారయ్యాయి.  పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్నని తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి.

సెలబ్రేషన్..

చిన్న విజయం అయినా సరే అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది  తదుపరి  పనులను మరింత ఉత్సాహంతో చేసేలా ప్రేరేపిస్తుంది.

పాజిటివ్ గా ఉండాలి..

పాజిటివ్ గా ఉంటే ఎలాంటి సమస్యలు అయినా అధిగమించవచ్చు. అవి వ్యక్తిగతం అయినా, వృత్తి సంబంధ విషయాలు అయినా సానుకూలతతో ముందుకు వెళితే ఫలితాలు కూడా సానుకూలంగానే ఉంటాయి.

                                                  *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.