పీకే డైరెక్షన్ లో హస్తానికి చుక్కలు చూపిస్తున్న తృణమూల్.. 

Publish Date:Dec 9, 2021

Advertisement

కాంగ్రెస్ పార్టీలో చీలికలు కొత్త కాదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు చీలిపోయిందో, ఆ అమ్మ కడుపులోంచి ఎన్ని పిల్ల కాంగ్రెస్’లు పుట్టుకొచ్చాయో,అందులో ఎన్ని బతికి బట్టకట్టాయో, ఎన్ని మళ్ళీ మాతృ సంస్థలో విలీనం అయ్యాయో.. అదంతా పాత  చరిత్ర. నిజానికి ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీగా చెలామణి అవుతున్న, సోనియా గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ కూడా, 1969లో మాతృ సంస్థ నుంచి, బహిష్కరణకు గురైన, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పెట్టిన పిల్ల కాంగ్రెస్ పార్టీనే. సరే, ఆతర్వాత న్యాయ,రాజకీయ పోరాటంలో విజయం సాధించి ఇందిరా గాంధీ, విజయేందిర నిలిచారు. భారత్ జాతీయ కాంగ్రెస్ పార్టీని సొంతం చేసుకున్నారు. అది వేరే విషయం.

అయితే, గతంలో ఎప్పుడూ కూడా, తల్లి పేగు తెంచుకుని బయటకు వెళ్లి పోయిన పిల్ల కాంగ్రెస్ వచ్చి, ‘నాదే నిజమైన కాంగ్రెస్, మీరు బయటకు దయ చేయండి’ అని, తల్లి కాంగ్రెస్ పార్టీని రాజకీయ యవనిక నుంచి బయటకు పొమ్మని అనలేదు.   కానీ, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాత్రం కాంగ్రెస్ పార్టీని 'యుద్ధంలో అలసిపోయిన కురువృద్ధ (గ్రాండ్‌ ఓల్డ్‌) పార్టీ'గా అభివర్ణించారు.అర్ధశతాబ్దికి పైగా, దేశాన్ని పాలించిన పార్టీని గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను నిర్వర్తించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, తృణమూల్ కాంగ్రెస్ ఎక్కిరిస్తోంది. అంతే కాదు, తామే 'నిజమైన కాంగ్రెస్‌' అని తృణమూల్ అధికార పత్రికలో ప్రకటించుకుంది. సొంత రాతలుర్సుకుంది. 

నిజమే రాహుల్ గాంధీ పుణ్యాన కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. అది నిజం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏనాడు లేని విధంగా వరసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా, రెండు సార్లు రెండంకెల స్థానాలకే పరిమితం అయింది. అయినా, ఈనాటికి కూడా, దేశంలో కాంగ్రెస్ పార్టీకి 20 శాతం వరకు ఓటు షేర్ ఉంది. బీజేపీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ  ఎక్కువ రాష్ట్రలలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. అయినా, తృణమూల్ కాంగ్రెస్, విపక్షాలకు నాయకత్వం వహించే అంశంపై దేశంలో జరుగుతున్న చర్చలో, కాంగ్రెస్‌ పాత్రను చిన్నగా చేసి చూపేందుకు, చులకన చేసేందుకు ప్రయత్నిస్తోంది.  బాహాటంగానే విమర్శిస్తోంది. 

వరసగా మూడవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలోనో, లేక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ వ్యూహంలో భాగంగానో, కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్లుగా బీజేపీ పోరాడే శక్తి తమకు మాత్రమే ఉందని తృణమూల్ సొంత పత్రిక సొంత విశ్లేషణ చేసింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక 'జాగో బంగ్లా'లో ప్రచురించిన వ్యాసంలో .'విపక్షాలను ముందుకు తీసుకెళ్లే అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పాత్ర అసమర్థంగా ఉంది' అని  మమత పార్టీ రచయితలు పేర్కొన్నారు. ."కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌.. బీజేపీ  జోరును ఆపగలగాలి. కానీ.. అంతర్గత కుమ్ములాటలు, కక్షలతో ఆ పార్టీ నలిగిపోతోంది. అయితే కాలం ఎవరి కోసం ఎదురుచూడదు. బీజేపీని ఎదుర్కొనేందుకు మరొకరు ముందుకు రావాలి. టీఎంసీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇదే నిజమైన కాంగ్రెస్" అంటూ జాగో బంగ్లా సంపాదకీయ కథనంలో పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్నపోరాటంలో రాహుల్ గాంధీ కంటే, మమతా బెనర్జీయే కీలకంగా మారారని కూడా 'జాగో బంగ్లా' పేర్కొంది  అంతేగాక విపక్షంగా తాము అన్ని పార్టీలను కలుపుని వెళ్లాలని టీఎంసీ కోరుకుంటోందని వెల్లడించింది. ఫలితంగా కాంగ్రెస్-టీఎంసీ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.మేఘాలయల సహా పలు రాష్త్రాలలో కాంగ్రెస్ నాయకులను తమ వీపుకు తిప్పుకుంటోంది. మేఘాలయలో  మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా నేతృత్వంలోని 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఇటీవల టీఎంసీలో చేరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు టీఎంసీ ఆసక్తి చూపించలేదు.ఆసక్తి చూపించక పోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీని, ఓ అనామక, అర్భక పార్టీ అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు చాలా వరకు దూరం కావడంతో, తృణమూల్ దూకుడుకు కళ్ళెం వేసే నాయకులు కరువయ్యారని, కాంగ్రెస్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు.
ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది. ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని, ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది.
శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే.
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది.
ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.