చట్టం ముందు అందరూ సమానమే కదా ... దేవుడైనా, దేవుని విగ్రహమే అయినా అంతే కదా అనుకున్నారో ఏమో కానీ, ఆ జడ్జిగారు ఆలయ మూలవిరాట్టు విగ్రహాన్ని కోర్టులో హాజరు పరచాలని సమన్లు జారీ చేశారు. వినడానికి కొంచెం వింతగా ఉన్న ఈ విచిత్ర ఉదంతం మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో జరిగింది. అదే మన ఏపీలో జరిగుంటే ఏమి జరిగేదో వేరే చెప్పనక్కరలేదు. విగ్రహాన్ని ముక్కలు చేసి మరీ కోర్టు ఎదుట పడేసేవారు కావచ్చు,మన ప్రభువులు. కానీ,తమిళనాడులో ఇంకా ధర్మం అంతో ఇంతో బతికుంది కావచ్చు, అందుకే తిరుప్పూరు జిల్లాలోని ఓ ఆలయ మూలవిరాట్టును హాజరుపరచాలంటూ దిగువ కోర్టు సమన్లు జారీచేసిన ఉదంతం పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడికే సమన్లు జారీ చేయడం ఏంటని క్రింది కోర్టు న్యాయాధికారిని ప్రశ్నించింది.
ఇక విషయంలోకి వెళితే, తిరుప్పూరు జిల్లా శివిరిపాళయం పరమశివన్ ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహాన్ని గతంలో దొంగలు ఎత్తుకెళ్ళారు. అయితే, పోలీసులు ఆ విగ్రహం ఆచూకీని కనుగొని దానిని ఆలయ నిర్వాహకులకు అప్పగించారు. ఆలయ నిర్వాహకులు శాస్త్రోక్తంగా ఆ విగ్రహాన్ని గర్భాలయంలో పునః ప్రతిష్ఠిచేశారు.కుంభాభిషేకం నిర్వహించారు. నిత్య పూజలు ఇతర ఆచార క్రతువులు జరుగుతున్నాయి. అయితే, విగ్రహాల చోరీకేసులపై విచారణ జరుపుతున్న కుంభకోణం ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఆ ‘మూల విరాట్టు’ను జనవరి 6వ తేదీన తమ ఎదుట హాజరుపరచాలంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సమన్లను సవాల్ చేస్తూ ఆలయ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. చోరీకి గురైన ఆ విగ్రహాన్ని ఆగమ నియమాల ప్రకారం ఆలయంలో ప్రతిష్ఠించి సంప్రోక్షణలు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కుంభకోణం కోర్టు సమన్లు జారీ చేయడంపై హైకోర్టు న్యాయమూర్తి ఆర్.సురే్‌షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఓ అడ్వకేట్ కమిషనర్ ద్వారా మూలవిరాట్టును పరిశీలించవచ్చని,అంతే కానీ, మూలవిరాట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భాలయం నుంచి బయటికి తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. అది తమిళనాడు కాబట్టి దేవుడు బతికి పోయాడు.. అదే మన ఏపీలో అయితే..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/madras-hc-order-god-cannot-be-summoned-by-the-court-39-129867.html
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.