అమ్మో జ‌గ‌న‌న్నో!.. కొత్త జిల్లాల వెనుక ఇంత స్కెచ్ ఉందా?

Publish Date:Jan 26, 2022

Advertisement

అయ్యేది కాదు.. పొయ్యేది కాదు, అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనే తుట్టెను కదిల్చింది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయకపొతే కొంపలేవో మునిగి పోతునట్లు, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆగమేఘాల మీద  ‘ఆన్లైన్’ లో ఆమోదం తెలిపింది. అయితే, ఇది అయ్యేది కాదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా గణనకు 2020 జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్‌ (నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం జరీ చేసినప్రీజింగ్ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కూడా ‘ఫ్రీజింగ్’ మోమో జారీ చేసింది. దీంతోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రి య అధికారికంగా నిలిచిపోయింది. 

అంటే దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు  కొత్త జిల్లల ఏర్పాటు కుదిరే పని కాదు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన గారి 40 మంది సలహాదారులకు తెలియదా? ఈ మేరకు కేబినెట్‌ నోట్‌’ను ఆన్లైన్’లో  సర్క్యులేట్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు తెలియదా, ఆన్లైన్’లోనే ఆమోదం తెలిపిన మంత్రులకు తెలియదా అంటే అందరికీ తెలుసు. నిజానికి, ఇది కొత్త ట్రిక్ కాదు, గతంలోనూ ప్రయోగించి ఫెయిల్ అయిన పాత ట్రిక్కునే ప్రభుత్వం మళ్ళీ మరో మరో పైకి తీసింది. 

నిజానికి, గతంలోనూ అప్పటి చిక్కులోంచి బయటపడేందుకు, ప్రజలదృష్టిని రియల్ ఇష్యూస్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఇదే ట్రిక్ ప్లే చేసింది. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతలను వరదలు ముంచెత్తిన సమయంలో ముఖ్యమంత్రి ప్యాలెస్ గడప దాటలేదు. ప్రజలను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తీరును విపక్షాలు విమర్శించాయి. రోమ్ చక్రవర్తి ఫిడేలు రాగాలను గుర్తు చేసి దెప్పి పొడిచాయి. బాధిత ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు. ఆ సమయంలో అమరావతిలో జరిగిన ఎంపీల సమావేశంలో, ముఖ్యమంత్రి ‘కొత్తజిల్లాల అంశాన్ని ప్రస్తావించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. ఆ తర్వాత ఆ విషయం మరిచి పోయారు. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల సమయంలోనూ కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే, అప్పటి ఎన్నికల అధికారి రమేశ్‌ కుమార్‌ ‘సెన్సస్‌’ డైరెక్టర్‌ ఇచ్చిన ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు ఉండగా, ఎన్నికల సమయంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయడానికి వీల్లేదని అప్పటి సీఎ్‌సకు లేఖరాశారు. దీంతో ఆ ప్రక్రియను ఆపేశారు. ఫ్రీజింగ్‌ ఉత్తర్వులను ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు. కరోనా కారణంగా జన గణన పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇప్పట్లో అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

అయినా ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీదకు, తెచ్చింది? ఇదేమీ వెయ్యి డాలర్ల ప్రశ్న కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దిక్కు చూసినా అష్టమ దిక్కే కనిస్తోంది. ఓ వంక, ఉద్యోగులు,ఉపాధ్యాయులు రోడ్లెక్కేందుకు సిద్ధమయ్యారు. పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఆగ్రహంతో ఉన్నారు. సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా, ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, ఉద్యోగుల డిమాండ్స్ ఆమోదిస్తే, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పి, ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలను రెచ్చ గొట్టే ప్రయత్నం ప్రభుత్వం, అధికార పార్టీ చేశాయి. అయితే, తాతకు దగ్గులు నేర్పడం కుదిరే వ్యవహారం కాదని గుర్తు చేస్తూ ఉద్యోగులు, మాకసలు పీఆర్సీనే వద్దు,జీతం ఒక్క రూపాయి పెంచనూ వద్దు, పీఆర్సీ ఇస్తామంటున్న పది వేల కోట్ల రూపాయలను కూడా పేద ప్రజల సంక్షేమానికే ఖర్చు చేయండి, మాకు పాత జీతాలే ఇవ్వండి, అనే సరికి సర్కార్ పని కుడితిలో పడిన ఎలుకల మారింది. ఉద్యోగులను మోసం చేద్దామనుకుంటే అసలుకే మోసం వచ్చిందని అధికార పార్టీ అసంతృప్తులు అంటున్నారు.  

మరో వంక గుడివాడ కాసినో వివాదం ముదిరి పాకన పడుతోంది. మంత్రి కొడాలి నానీ, పూటకో అడుగు పక్కకు వేస్తున్నారు. ప్రభుత్వం మెడకు గుదిబండగా మారుతున్నారు, అనే మాట వినవస్తోంది. కాసినో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. నానీ, గత ‘చరిత్ర; చిట్టా  మొత్తం బయటకు వస్తోంది. ఇంత కాలం అంతగా వినిపించని ఆయన భూకబ్జాలు,అవినీతికి   సంబందించిన అనేక ఆరోపణలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవిగాక ఇంకా గా  నిగూడంగా ఉన్న చిక్కు ముళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని మరో మారు తెరమీదకు తెచ్చింది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ, మరొకరు కానీ, ‘చీటింగ్ ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై సక్సెస్’ అనుకుంటే అన్ని సందర్భాలో అది సాధ్యం కాదు. ఇప్పుడు, ఇది కూడా అంతే .. అంటున్నారు.

By
en-us Political News

  
లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. కాదు కుదరదూ అంటే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపిస్తున్నది. ఎప్పుడైతే జనసేనాని పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయరని తేలిపోయిందో.. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం పార్టీ గాజువాక సీటును తమ ఖాతాలో వేసేసుకుంది. కచ్చితంగా గెలిచే స్థానాలలో గాజువాక మొదటి వరుసలో ఉంటుందని తెలుగుదేశం శ్రేణులు ఢంకా బజాయించి చెబుతున్నాయి.
 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులను టార్గ్ చేస్తూ పావులు కదుపుతోంది. వారిపై ఉన్న పోలీస్ కేసులను తిరగతోడుతుంది. 
అధికారం ఒకరిని అందలం ఎక్కిస్తే మరొకరిని పాతాళంలో తోసేస్తుంది. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ అయిన మల్లారెడ్డిని  అన్ పాపులర్ చేసింది
ల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని పేర్కొంటూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం ను ఆశ్రయించారు
లోక్ సభ ఎన్నికల బరిలో ఏపీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ , గారాల పట్టి షర్మిల గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.  
సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన దాదాపు గంటకు పైగా విమానంలోనే చిక్కుపడిపోయారు. దీంతో ముంబైలో కీలక సమావేశానికి హాజరు కాలేకపోయారు.
సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు గట్టిగా వినిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంతో విభేదాల కారణంగా నిత్యం వార్తలలో నిలిచిన తమిళి సై అప్పట్లోనే రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపించాయి.
ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో మే13న జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థుల హ‌వా ఖాయ‌మ‌ని సర్వేలు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో ఒక్క కుప్పం నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజయం సాధించింది.
ఇండియా కూటమి బలహీనపడుతూ కాంగ్రెస్ బలోపేతమౌతోందా? ఎన్డీయే బలోపేతం చేస్తామనడం వెనుక బీజేపీ బలహీనపడిందన్న సంకేతాలు ఉన్నాయా? ప్రస్తుతం రాజకీయ సర్కిల్స్ లో ఇదే చర్చ విస్తృతంగా సాగుతోంది.
వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్న లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఏపీ సీఎం జగన్ ప్రకటించేశారు. ఒకే సారి 175 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేసిన జగన్, లోక్ సభ స్థానాల విషయంలో మాత్రం ఒక్క అనకాపల్లి నియోజకవర్గాన్ని మినహాయించి మిగిలిన 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పాలన అంతం కోరుకుంటున్నారా? వచ్చే ఎన్నికలలో వారు అన్ కండీషనల్ గా ఎన్డీయే కూటమికే ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే చిలకలూరి పేటలో ఆదివారం (మార్చి 17) సాయంత్రం జరిగిన ప్రజాగళం సభ తరువాత మోడీ వరుస ట్వీట్లు చేస్తే ఔననే అనిపిస్తున్నది.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (మార్చి 18) ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.