Top Stories

political-news-img

వంద డాలర్లకు చేరువైన బ్యారల్ ముడి చమురు ధర.. చమురు మంటలు ఆగేదెన్నడు?

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ముడి చమురు ధరలకు మంట పెట్టాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతుండటం, చమురు ట్యాంకర్లపై దాడులు కారణంగా ముడి చమురు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అమెరికా ఇరాన్‌పై వరుసగా 13 రోజు కూడా వైమానిక దాడులకు పాల్పడింది. హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది. ప్రపంచ సముద్ర రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి నియంత్రణపై అమెరికా, ఇరాన్ ముఖాముఖి సైనిక ఘర్షణలకు తోడు మరో కీలకమైన సముద్ర మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ సమీపంలో హౌతీలువిరుచుకుపడుతుండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఆర్థిక సంక్షోభం తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను వెంటనే ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హౌతీలను ఇరాన్ ప్రాక్సీ గ్రూప్‌గా అభివర్ణించిన ఆయన.. హౌతీల విధ్వంసక చర్యలకు ఇరాన్‌నే బాధ్యులను చేస్తామని కుండబద్దలు కొట్టారు. దాడుల్లో దెబ్బతిన్న నౌకలకు, నష్టపోయిన సరుకులకు పరిహారంగా అమెరికా వద్ద నిలిచిపోయిన ఇరాన్ సీజ్డ్ నిధులను ఉపయోగిస్తామని ప్రకటించారు. అదలా ఉంటే.. ఈ వివాదాన్ని తక్షణమే శాంతియుతంగా, దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అత్యవసర శాంతి చర్చల ప్రయత్నాల కోసం ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ టెహ్రాన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. Strait of Hormuz tensions, Crude oil price near 100, US Iran conflict, Bab el Mandeb attack

Publish Date: Jul 24, 2026 9:05AM

political-news-img

బేబీ బాస్ వరల్డ్ రికార్డు.!

క్రికెట్ లో బేబీ బాస్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేసి సంచలనాలు సృష్టిస్తున్నాడు. పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, అతి పిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికట్ లో అడుగుపెట్టిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌తో ఆడిన తొలి మూడు మ్యాచ్ లలోనూ సిక్సర్లు బాదినా భారీ స్కోరు చేయడంలో విఫలమై నిరాశ పరిచిన ఈ కుర్రోడు.. జింబాబ్వేపై చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తిరగరాసిన వరల్డ్ రికార్డులు ఏమిటంటే.. టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్.. ఇంతకు ముందు ఈ రికార్డు లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. అయితే పూర్తిస్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ రికార్డు ఆఫ్ఘ‌నిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) కలిపి పూర్తిస్థాయి సభ్య దేశాల తరఫున అతి పిన్న వయసులో తొలి అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్థాన్‌పై సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు. అసోసియేట్ దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 50+ స్కోరు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా సూర్యవంశీ నిలిచాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును కూడా అధిగమించి భారత క్రికెట్‌లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు. Vaibhav Suryavamshi world record, Zimbabwe, t20match, Halfcentury

Publish Date: Jul 24, 2026 8:45AM

political-news-img

2027 WTC ఫైనల్ తేదీలు వచ్చేసాయి లార్డ్స్‌కు ఐసీసీ షాక్.. కొత్త వెన్యూ ఏదంటే?

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక పోరుగా భావించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక భారీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. టెస్ట్ క్రికెట్ విభాగంలో శ్రేష్ఠమైన జట్టును తేల్చే ఈ మహా సంగ్రామం కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, 2027 WTC ఫైనల్ పోరు తేదీలు మరియు మైదానం వివరాలను ఐసీసీ అధికారికంగా ధ్రువీకరించింది. 2027 జూన్ 9 నుంచి జూన్ 13 వరకు ఈ ప్రతిష్టాత్మక తుది పోరు జరగనుండగా, వరుసగా నాలుగోసారి కూడా ఈ గ్రాండ్ ఫైనల్‌కు ఇంగ్లాండే వేదికగా నిలవడం గమనార్హం. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2027 ముగిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, అలాగే ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రసిద్ధ యాషెస్ సిరీస్ ప్రారంభానికి కేవలం 5 రోజుల ముందు ఈ బిగ్ ఫైనల్ నిర్వహించబోతున్నారు. అయితే, ఈ సారి ఐసీసీ తీసుకున్న నిర్ణయంలో ఒక ఊహించని సంచలన మలుపు చోటుచేసుకుంది. క్రికెట్ ప్రపంచంలో 'మక్కా'గా ఎంతో పేరుగాంచిన లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ (Lord's) మైదానానికి ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆతిథ్య హక్కులు దక్కలేదు. గతంలో లార్డ్స్ పిచ్‌పై వచ్చిన అనేక రకాల విమర్శలు, సాంకేతికపరమైన ఆందోళనల దృష్ట్యా ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని లార్డ్స్‌ను పక్కనబెట్టింది. లార్డ్స్ స్థానంలో లండన్‌లోని మరొక ప్రసిద్ధ స్టేడియం అయిన 'ది ఓవల్' (The Oval) మైదానాన్ని ఈ బిగ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. ఈ నిర్ణయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను రెండుసార్లు నిర్వహించిన ప్రపంచంలోనే మొదటి మైదానంగా ది ఓవల్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. గతంలో 2023 WTC ఫైనల్ కూడా ఇదే ది ఓవల్ మైదానంలో జరగ్గా, ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన WTC ఫైనల్స్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, 2021లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించి ప్రథమ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2023లో ది ఓవల్‌లో జరిగిన రెండో ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం పాలైంది. ఇక 2025లో లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో ఫైనల్ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని బలమైన ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా జట్టు సంచలన రీతిలో విజేతగా నిలిచింది. ప్రస్తుతం కొనసాగుతున్న డబ్ల్యూటీసీ 2025–27 పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లే మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు, టీమిండియా ఫైనల్ రేసులో నిలవడం కాస్త కష్టతరంగా కనిపించినప్పటికీ, రాబోయే 9 నెలల్లో జరగబోయే పలు టెస్ట్ సిరీస్‌ల ఫలితాలతో పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. icc shifts 2027 wtc final from lords to oval,wtc final 2027 england oval schedule,wtc 2027 final match dates icc update

Publish Date: Jul 24, 2026 8:38AM

political-news-img

ఫ్లాక్ సేఫ్టీ కెమెరాల రహస్యం: వీడియో రికార్డింగ్ నిజమేనా?

టెక్నాలజీ రంగంలో రక్షణ, నిఘా పేరుతో మన చుట్టూ అమర్చే కెమెరాలు అసలు ఏం చేస్తున్నాయి? అవి మనల్ని ఎలా పర్యవేక్షిస్తున్నాయి? ఈ ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. అమెరికాలో స్వయంచాలక లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ (ALPR) సాంకేతికతను అందించే ప్రముఖ సర్వైలెన్స్ సంస్థ 'ఫ్లాక్ సేఫ్టీ' (Flock Safety) చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం చెలరేగింది. లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD) ఫ్లాక్ సంస్థతో ఉన్న కాంట్రాక్ట్‌ను పొడిగించకుండా రద్దు చేసుకోవడంతో ఈ రగడ మొదలైంది. ఈ పరిణామంపై ఫ్లాక్ సీఈఓ గారెట్ లాంగ్లీ (Garrett Langley) ప్రముఖ మీడియా సంస్థ ABC7 తో మాట్లాడుతూ, తమ టెక్నాలజీ గురించి ప్రజలకు సరిగ్గా అవగాహన లేదని వ్యాఖ్యానించారు. తమ కెమెరాలు చాలా సరళమైనవని, రోడ్డుపై వెళ్లే వాహనాల నుంచి కేవలం ఒక స్టాటిక్ పిక్చర్ (స్థిరమైన ఫోటో) మాత్రమే తీసి లైసెన్స్ ప్లేట్ నంబర్‌ను చదువుతాయని, అంతకుమించి ఏమీ చేయవని ఆయన స్పష్టం చేశారు. అయితే, సీఈఓ గారెట్ లాంగ్లీ చెప్పిన మాటలకు, సదరు కంపెనీ గతంలో చేసిన మార్కెటింగ్ ప్రకటనలకు అస్సలు పొంతన లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గడిచిన ఒక ఏడాది కాలంగా ఫ్లాక్ కంపెనీ తమ వద్ద ఉన్న అన్ని ఎల్పీఆర్ కెమెరాలకు లైవ్ వీడియో రికార్డింగ్ అప్‌గ్రేడ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం చేసింది. గత జూన్ నెలలో "మీ ఎల్పీఆర్ ప్రోగ్రామ్‌లో వీడియో ఎందుకు కీలకమైన లింక్?" అనే పేరుతో ఒక బ్లాగ్ పోస్ట్‌ను ప్రచురించిన ఆ సంస్థ, 2025 చివరి నాటికి ఉచిత క్లౌడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా అన్ని లైసెన్స్ ప్లేట్ రీడర్ కెమెరాలను లైవ్ వీడియో స్ట్రీమింగ్ కెమెరాలుగా మారుస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది. ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ ఖర్చు లేకుండా, కొత్త పర్మిషన్లు అవసరం లేకుండా క్లౌడ్ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తామని ఫ్లాక్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ బెయిలీ క్వింట్రెల్ కూడా గతంలో ధృవీకరించారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార పత్రిక ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో సీఈఓ స్వయంగా మాట్లాడుతూ, ఏదైనా సంఘటన జరిగినప్పుడు సమీపంలోని 5 కెమెరాలను రియల్ టైమ్‌లో ఓపెన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో పోలీసులు నేరుగా చూడవచ్చని వివరించడం గమనార్హం. ఈ వైరుధ్యాన్ని మరింత స్పష్టంగా బయటపెడుతూ జార్జియాలోని డన్‌వుడీ (Dunwoody) నగరం నుంచి సేకరించిన పబ్లిక్ రికార్డ్స్ టెక్స్ట్ మెసేజ్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ రికార్డుల ప్రకారం, ఈ ఏడాది జనవరి నెలలో డన్‌వుడీ పోలీసు అధికారి మరియు ఫ్లాక్ ఉద్యోగి మధ్య జరిగిన సంభాషణలో, తమ ప్రాంతంలో ఎల్పీఆర్ కెమెరాల లైవ్ వీడియో స్ట్రీమింగ్‌ను దాదాపు 1 నెల రోజులుగా ఉపయోగిస్తున్నామని, ఇది ఘటనలను ప్రత్యక్షంగా చూడటానికి చాలా ఉపయోగకరంగా ఉందని సదరు పోలీస్ అధికారి పేర్కొన్నారు. ప్రజల గోప్యత, వ్యక్తిగత హక్కులపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, తమ కెమెరాలు వీడియోలు తీయవని సీఈఓ సత్యదూరంగా మాట్లాడటంపై నిపుణులు మండిపడ్డారు. flock ceo garrett langley video claims,alpr cameras live video streaming truth,flock safety surveillance privacy issues.

Publish Date: Jul 24, 2026 8:33AM

political-news-img

మెటా, గూగుల్ అప్పుల గుట్టు రట్టు! AI డేటా సెంటర్ల సబ్‌ప్రైమ్ క్రైసిస్ నిజమేనా?

చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకుని మనం అడుగుతున్న ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు ఇస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వెనుక ఒక భారీ ఆర్థిక ప్రమాదం పొంచి ఉందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థల నివేదికలు. నేడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఏఐ విప్లవం వెనుక బిలియన్ల కొద్దీ డాలర్ల రుణాల పర్వతం పేరుకుపోతోంది. సరిగ్గా 2008 నాటి 'సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్' ఆర్థిక సంక్షోభాన్ని గుర్తుచేసేలా, ఇప్పుడు 'సబ్‌ప్రైమ్ డేటా సెంటర్ సంక్షోభం' గ్లోబల్ ఎకానమీని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం కోసం దాదాపు 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 200 బిలియన్ డాలర్లు ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్ ద్వారా సేకరించబడ్డాయి. మరో వైపు నిక్కీ ఆసియా అందించిన నివేదిక ప్రకారం, మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ మరియు ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలు గత ఐదేళ్ల కాలంలో ఏకంగా 1.65 ట్రిలియన్ డాలర్ల మేర రుణాలను పోగుచేసుకున్నాయి. అయితే అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశం ఏంటంటే, ఈ భారీ అప్పులలో ఎక్కువ భాగం ఆయా కంపెనీల ప్రధాన బ్యాలెన్స్ షీట్లలో కనిపించకుండా రహస్యంగా దాచిపెట్టడమే. ఈ అప్పులను దాచడానికి టెక్ కంపెనీలు 'స్పెషల్ పర్పస్ వెహికల్స్' (SPVs) అనే ప్రత్యేక శెల్ సంస్థలను ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు, కోర్‌వీవ్ (CoreWeave) అనే ప్రముఖ క్లౌడ్ సంస్థ మెటా కాంట్రాక్ట్‌తో అనుసంధానించి దాదాపు 8.5 బిలియన్ డాలర్ల నిధులను వేర్వేరు ఎస్‌పీవీల ద్వారా సమీకరించింది. అంతేకాకుండా, మెటా నిర్మిస్తున్న భారీ 'హైపరీయన్ డేటా సెంటర్'లో మెటా వాటా కేవలం 20 శాతం మాత్రమే. మిగిలిన 80 శాతం వాటా(Blue Owl) అనే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ చేతిలో ఉంది. దీనివల్ల ఆర్థిక ప్రమాదం మెటా బ్యాలెన్స్ షీట్‌లో నమోదు కాకుండా బయటి ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి మళ్లుతోంది. గూగుల్ కూడా ఫ్లూయిడ్‌స్టాక్, సైఫర్ మైనింగ్, టెరావుల్ఫ్ వంటి సంస్థలతో కలిసి ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రమాదకర విధానాన్ని ప్రముఖ గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ 'అర్న్స్ట్ & యంగ్' (Ernst & Young) ఇప్పటికే తీవ్రంగా తప్పుపట్టింది. ai data center debt bubble explained,global economy threat ai data centers.

Publish Date: Jul 24, 2026 8:30AM

political-news-img

గూగుల్ సంచలనం: ఇకపై సెల్ఫీ వీడియోతోనే జీమెయిల్ లాగిన్!

పాస్‌వర్డ్ మరచిపోయి గూగుల్ అకౌంట్ లాక్ అయిపోవడం మనం తరచూ చూస్తుంటాం. జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోలు లాంటి అత్యంత ముఖ్యమైన సమాచారం అందులో నిల్వ ఉండడంతో చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ఫోన్ నంబర్ లేదా రికవరీ ఈమెయిల్ ఐడీ అందుబాటులో లేనప్పుడు అకౌంట్‌ను తిరిగి పొందడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ జూలై 23, 2026న ఒక వినూత్నమైన సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఇకపై పాస్‌వర్డ్ గుర్తులేకపోయినా లేదా టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పరికరం చేతిలో లేకపోయినా, ఒక చిన్న సెల్ఫీ వీడియోతో మీ అకౌంట్‌లోకి అత్యంత సులభంగా లాగిన్ అవ్వవచ్చు. డిజిటల్ ప్రొఫైల్ భద్రతను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, లాక్ అయిన ఖాతాలను క్షణాల్లో రికవర్ చేసుకోవడానికి ఈ 'సెల్ఫీ వీడియో రికవరీ' ఫీచర్ ఒక వరంగా మారనుంది. ఈ కొత్త సెల్ఫీ వీడియో సైన్-ఇన్ ఫీచర్‌ను కాన్ఫిగర్ చేయడం చాలా సులభం. దీనిని సెటప్ చేయడానికి వినియోగదారులకు కేవలం 5 నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే పడుతుంది. అకౌంట్ లాక్ అవ్వడానికి ముందే యూజర్లు ముందుజాగ్రత్తగా తమ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి దీనిని ఒకసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం గూగుల్ అకౌంట్‌లోని 'సెక్యూరిటీ & సైన్-ఇన్' విభాగంలోకి వెళ్లాలి లేదా నేరుగా 'g.co/signin-selfie' అనే వెబ్‌సైట్ లింక్ ద్వారా కూడా ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఈ సెటప్ సమయంలో మీ మొబైల్ లేదా కంప్యూటర్ కెమెరా ముందు నిలబడి, స్క్రీన్‌పై వచ్చే సూచనల ప్రకారం తలను ఎడమ, కుడి వైపులకు తిప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వివిధ కోణాల్లో మీ ముఖాన్ని రికార్డ్ చేసి ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో భద్రపరుస్తుంది. భవిష్యత్తులో మీరు పాస్‌వర్డ్ మరచిపోయినప్పుడు, ప్రత్యక్షంగా మరో సెల్ఫీ వీడియో తీసుకుంటే చాలు. గూగుల్ సిస్టమ్ మీరు కొత్తగా ఇచ్చిన వీడియోను, గతంలో సేవ్ చేసిన వీడియోతో పోల్చి చూసి సెకన్ల వ్యవధిలో మిమ్మల్ని అకౌంట్‌లోకి అనుమతిస్తుంది. టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి, డీప్‌ఫేక్ వీడియోలు మరియు నకిలీ ఫోటోలతో అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని చాలామందికి అనుమానం రావచ్చు. కానీ గూగుల్ ఈ విషయంలో అత్యంత కఠినమైన బహుళ-స్థాయి భద్రతా వ్యవస్థను (Multi-layer security) ఏర్పాటు చేసింది. లైవ్‌నెస్ డిటెక్షన్ (Liveness detection) మరియు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్ ద్వారా యూజర్ కేవలం ప్రత్యక్షంగా కెమెరా ముందు ఉన్నారా లేక ఏదైనా ఫేక్ రికార్డింగ్ చూపిస్తున్నారా అనేది గూగుల్ క్షణాల్లో పసిగడుతుంది. రికార్డింగ్ సమయంలో రియల్ టైమ్‌లో వినియోగదారులను నిర్దిష్టమైన తల కదలికలు (Guided head movements) చేయమని కోరడం ద్వారా ఆర్టిఫిషియల్ డీప్‌ఫేక్స్ లేదా ఫోటోల దాడిని గూగుల్ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అంతేకాకుండా, ఈ వీడియో సమాచారం అంతా క్లౌడ్‌లో సురక్షితంగా ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. how to login google account with selfie,google account recovery selfie video guide.

Publish Date: Jul 24, 2026 8:27AM

MOVIE NEWS