ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఔట్‌

కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 50 వేల ఉద్యగాలు ఇచ్చింది’ ఈ మంత్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు’ రోజూ జపిస్తూనే ఉంటారు.  మరో వంక ఇందులో గత ప్రభుత్వం ఘాతాలోకి ఎన్ని పోతాయి,కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి ఎన్ని వస్తాయి అనే చర్చ ఒకటి జరుగుతూనే వుంది. ప్రక్రియ మొత్తం పూర్తి చేసి,ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన, నియామాకాలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఖాతాలో కలుపుకున్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మేము వండి సిద్ధం చేసిన వ్నకలను వడ్డించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.   ఇలా  అటు కారు పార్టీ, ఇటు హస్తం పార్టీ క్రెడిట్ మాదంటే మాదని వాదులాడుకోవడం కూడా రోజు చూస్తున్నదే. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పడు నిరుద్యోగ యువత కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంతన్న సర్కార్’ , ఉన్నదీ పోయింది ..ఇంకొకటీ పోయింది అన్నట్లు, కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న చిరుద్యోగాలను గుజుజునేందుకు సిద్డంమవుతోంది. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏదో చెప్పలేని వ్యతిరేకత ఇబ్బంది ఉన్నట్లుది. బయటకు చెప్పినా చెప్పక పోయినా ప్రభుత్వ ఉద్యోగులు అంటే తెల్ల ఏనుగులు అనే అభిప్రాయం ఏదో ఆయనలో అంతర్లీనంగా ఉన్నట్లు కనిప్స్తోందని ఉద్యోగులు అంటున్నారు. అందుకే, ఆయన  రాష్ట్ర క్లిష్ట పరిష్టిలో ఉన్న ప్రస్తుత సమయంలో డిఏలు అడగకండి, ఫస్ట్ తేదేకి జీతాలు ఇవ్వడానికే, నెలనెల రిజర్వు బ్యాంకు ముందు చేయి చాచ వలసి వస్తోంది. సో ... మీ జీతాలు మీకు  ఇస్తున్నదుకు సంతోషించి, రోజుకో రెండు గంటలు ఎక్కువ పనిచేసి ప్రభుత్వ ఋణం తీర్చుకోండి,అన్నట్లు ఓ చిన్న చిరునవ్వుతో  చురక వేశారు. అలాగే, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్.కొండలా పెరిగి పోయాయి, ఎక్కడ నుంచి తేవాలి,అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండానే’ మరో చురక వేశారు.రిటైర్డ్ ఉద్యోగుల నోటికి తాళాలు కూడా వేశారు.సరే, ఉద్యోగులు, నిరుద్యోగ యువకులతో పెట్టుకుంటే ఏమవుతుందో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత అర్థమయ్యే ఉంటుంది. పంతుళ్ళు చెప్పే పాఠం పూర్తిగా అర్థం అయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుంది కావచ్చును.     అదలా ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ కన్ను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై పడిందని అంటున్నారు. దశలవారీగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిలో సగం మందిని తొలిగించేందుకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.  అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం  పొదుపు చర్యల్లో వివిధ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్‌) తొలిగించే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి, ఇప్పటికే,  వేర్వేరు శాఖల్లో సంబంధిత  ఏజెన్సీల ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఉద్వాసనలు మొదలయినట్లు సమాచారం. ఒకేసారి, అందరికీ ఉద్వాస పలికితే, బాధిత యువత ఆందోళనకు దిగే అవకాశం ఉన్నందున గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడి కక్కడ, తమచేతికి మట్టి అంటకుండా, ఏజెన్సీల ద్వారా  కాగల కార్యం కానిస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తం 60 ప్రభుత్వ శాఖల్లో కలిపి, పీఆర్సీ నివేదిక ప్రకారం  1,20,367 మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. ఇందులో  సగం మందిని ఇంటికి పంపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దమయిందని అంటున్నారు.   కాగా, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలో 75 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసియన్ నేపధ్యంలో, తమను ఉద్యోగాల నుంచి తొలిగించి, తమ కుటుంబాలను బజారుకు ఈడ్చవద్దని వేడుకుంటూఆ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. రవాణా శాఖలో మొదటి విడత కింద 62 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసినట్టు సమాచారం. కార్మిక శాఖలో ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలిగింపు మొదలైనదని, కాంట్రాక్టు గడువు ముగిసిన ఉద్యోగుల కాల పరిమితి తిరిగి రెన్యూవల్‌ చేయకుండా ఇంటికి పంపిస్తున్నట్టు తెలిసింది. తాజాగా మరో 50 మంది ఉద్యోగుల తొలిగింపునకు నివేదిక రూపొందించినట్టు సమాచారం. ఎక్సైజ్‌ శాఖ, టీజీబీసీఎల్‌ నుంచి 80 మంది ఉద్యోగులను తొలిగించడానికి అధికారులు లిస్టు సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నిజానికి, తెలంగాణ ఉద్యమ సమయంలో,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత  ఔట్‌ సోర్సింగ్‌’ అనేదే ఉండదని చాలా గట్టిగా నామం బలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలోనూ కేసీఆర్, ఔట్‌ సోర్సింగ్‌’, కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని వాగ్దానం చేశారు. కొంత మందిని చేసారేమో కూడా, కానీ, ఇప్పడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అసలుకే ఎసరు తెచ్చిందని ఔట్‌ సోర్సింగ్‌’ ఉద్యోగులు ఆందోళన వ్యక్త పరుస్తునారు.
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఔట్‌ Publish Date: Mar 22, 2025 5:04PM

బరువు తగ్గింది  భారం పెరిగింది

తెలంగాణ  ప్రభుత్వం ఈ నెల ( మార్చి) 19 న 2025 – 2026 వార్షిక బడ్జెట్’ ను సభకు సమర్పించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రూ’ 3.04,965 కోట్ల అంచనాలతో,బరువు ‘తక్కువ’ బడ్జెట్’ను సభకు సమర్పించారు. అవును,గతంతో పోల్చుకుంటే, భట్టి విక్రమార్క’ ఎక్కువలకు పోలేదు. గాలిలో దీపం పెట్టి, దేవుడా రక్షించు అన్నట్లు కాకుండా బడ్జెట్ అంచనాలను అంతగా పెంచలేదు. గత సంవత్సరం రూ.2.91కోట్ల బడ్జెట్’ ప్రవేశ పెట్టి, ఆశించిన అంచనాల మేరకు ఆదాయం లేక భంగ పడిన అనుభవంతో కావచ్చును, ఈసారి కొంత జాగ్రత్త పడ్డారు. అంకెల గారడీ జోలికి పెద్దగా పోకుండా బడ్జెట్ రూపొందించారు. అలాగని, పూర్తి వాస్తవిక దృక్పధంతో బడ్జెట్ రూపొందించారా,అంటే లేదు. అనవసర గొప్పలకు పోకుండా, గత సంవత్సరపు రూ. 2.91 కోట్లకు నాలుగు శాతం అదనంగా కలిపి రూ’.3.04,965 కోట్ల అంచనాలతో బడ్జెట్’ను సమర్పించారు. నిజానికి, అప్పులు కూడా పుట్టని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో, ఈ బరువు కూడా ప్రభుత్వానికి మోయలేని  భారమే అవుతుంది.జుట్టున్నమ్మ ఏ కొప్పు అయినా పెడుతుంది, అది లేనమ్మకు కొప్పు కుదరదు. సవరమో, విగ్గో తప్పవు.  రాష్ట్ర ప్రభుత్వానిది అదే పరిస్థితి,   కేంద్ర ప్రభుతం కరుణించి, ఏపీలో గత వైసీపీ ప్రభుత్వానికి అప్పుల విషయంలో కల్పించిన వెసులు బాటు కల్పిస్తే ఏమో కానీ, లేదనే కష్టమే అంటున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుగ్వం ప్రభుత్వ భూముల మ్మకం మీద  చాలా ఆశలు పెట్టుకుంది.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్, అంచనాలను భారీగా,(సగటున 14 శాతం వంతున పెంచుకుంటూ పోయింది. అయితే, అలా అవాస్తవిక అంచనాలతో పెరిగిన బడ్జెట్ బరువు, గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాలేదు, అనుబహంలో తెలిసింది,. అయిన చివరి వరకు అదే పంథాలో వెళ్ళింది. అయినా, వాస్తవ వ్యయం అంచనాల దరిదాపుకు కూడా వెళ్ళలేదు. అందుకు ఒకే ఒక్క మినహాయింపు అప్పులు.. ఈ ఒక్క విషయంలో మాత్రం, అంచనాలను  మించి అప్పులు చేశారు. అందుకే, ఇప్పడు అప్పులు కూడా పుట్టని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరిందని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ జనం ముందు ఘోల్లు  మంటున్నారు. అవును. నిజమే, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నట్లుగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేసింది. అందులో అనుమానం లేదు. అందుకే రాష్ట్ర అప్పుల్లో కూరుకు పోయిది. అయితే అదేదో, ఇప్పడే వెలుగులోకి వచ్చిన విషయం కాదు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో చేసిన, పెంచిన అప్పుల భారం కూడా రహస్యం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పడు ముఖ్యమంత్రి ‘విప్పి’ చెపుతున్న, అప్పుల లెక్కలే, ప్రతిపక్షంలో ఉన్నప్పడు, చెప్పారు. అంటే, రాష్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది, తెలిసే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికల గెలుపే లక్ష్యంగా.కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్’కు మించి ఆరు గ్యారెంటీలను, ఇంకా ఎన్నో హామీలను ఇచ్చింది. ఇక్కడే, రాజకీయ ప్రత్యర్దులే కాదు, ఆర్థిక వేత్తలు, చివరకు సామాన్యులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. సంక్షేమా పథకాలకు పెద్ద పీత వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డే, అప్పట్లో, ఎట్లో పారేసినా ఎంచి పారేయాలని అనేవారు,. నిన్నటి బీఆర్ఎస్, ప్రభుత్వం గానీ,  ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఓటు  బ్యాంకు రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆర్థిక క్రమశిక్షణకు ఇవ్వలేదు. సంక్షేమం ప్రభుత్వ బాధ్యత, అదే గీత దాటితే ఆర్థిక సంక్షోభం అనివార్యమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదే జరిగంది అదే జరుగుతోంది. ప్రభుత్వాలు మారినా,పంథా మారటం లేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని, అప్పుల కుప్ప మారిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే చట్రంలో ముందుకుసాగుతోంది. ఒక లక్ష్యం,గమ్యం లేకుండా ఎటు పోతున్నామో తెలియకుండా, గత  ప్రభుత్వం పరిచిన అప్పుల బతాలో పడిపోతోంది, అందుకే ముఖ్యమంత్రి అప్పులు పుట్టడం లేదని గగ్గోలు  పెడుతున్నారు.   ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చేసన అప్పుల పద్దులో, రూ. 1.53 లక్షల కోట్లు చెల్లించిందని ఆర్థిక మంత్రి  స్వయంగా చెప్పారు. మరో వంక గడచిన 15 నెలల కాలంలో రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేశామని ఆయనే చెప్పారు. నిజానికి, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన దారిలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందనేందుకు ఇంతకూ మించిన ఉదాహరణ అవసరం లేదు. ఆప్రభుత్వం ఈ ప్రభుత్వానికి
బరువు తగ్గింది  భారం పెరిగింది Publish Date: Mar 22, 2025 4:57PM

ఒకే వేదిక పంచుకున్న రేవంత్‌రెడ్డి, కేటీఆర్

సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌  వర్నింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తుంటాయి. అలాంటిది వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం ఆసక్తి రేపుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ఈ అరుదైన కాంబినేషన్ కనిపించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ ‌గౌడ్‌, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపైనా పార్టీలన్నీ సమాలోచనలు చేస్తున్నాయి. ఆ క్రమంలో  రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ ఒకే వేది పంచుకోవాల్సి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ తీరును రేవంత్ రెడ్డి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, పథకాలను కేటీఆర్ విమర్శించుకుంటూనే ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్లు తిన్నారని అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంటే.. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రాజెక్టు చేపట్టారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు చేసిందని.. రైతు బంధు, రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి చెప్తుంటే.. సగానికి పైగా లబ్ధిదారులకు కాంగ్రెస్ ఇచ్చే పథకాలు అందడం లేదని కేటీఆర్ మండిపడుతుంటారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని అధికార పార్టీ నేతలు అంటుంటే.. రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే అంశంపై ఏకాభిప్రాయానికి రావడం ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. వారిద్దరూ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరుకావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అంతా ఒక్కటిగా చేతులు కలుపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు తెలంగాణ ఉద్యమమే ఉదాహరణ అంటున్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అంతా కలిసి రోడ్లపైకి వచ్చి మరీ తెలంగాణ సాధించుకున్నారని.. ఇప్పుడు డీలిమిటేషన్ అంశంలోనూ అదే స్ఫూర్తి కనిపిస్తోందంటూ చెప్తున్నారు. కాగా, స్టాలిన్‌ నేడు ప్రతిపాదించే జేఏసీలో కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్‌ కూడా భాగస్వామిగా మారితే, ఈ అంశంపై ఇరు పార్టీలూ కలిసి పోరాట కార్యాచరణలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది.
ఒకే వేదిక పంచుకున్న రేవంత్‌రెడ్డి, కేటీఆర్ Publish Date: Mar 22, 2025 4:48PM

ఉప్పల్ లో  ఐపిఎల్ బ్లాక్ టికెట్ల దందా... ఒకరి అరెస్ట్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపిల్ రానే వచ్చేసింది. ఆదివారం  ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సన్ రైజర్స్ హైద్రాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్ శనివారం నాడు ప్రారంభమైంది. ఆదివారం జరుగనున్న రెండో మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  టీవీల్లో కాకుండా నేరుగా ఉప్పల్ స్టేడియంలో లైవ్ చూడాలన్న ఉబలాటం కూడా ఎక్కువగానే ఉంది. ఈ మ్యాచ్ కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఎక్కువమందికి టికెట్లు దొరకక ఎదురు చూస్తున్నవారు లేకపోలేదు.  దీన్ని ఎన్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారు. టికెట్ల కోసం వెళ్లిన వారికి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నభరద్వాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భరద్వాజ్ నుంచి నాలుగు టికెట్లు స్వాధీనం చేసుకుని కేసు  నమోదు చేశారు. 
ఉప్పల్ లో  ఐపిఎల్ బ్లాక్ టికెట్ల దందా... ఒకరి అరెస్ట్ Publish Date: Mar 22, 2025 4:09PM

తెలంగాణలో సెల్ ఫోన్ల వినియోగం ఎక్కువే 

మత్తు పదార్థాల వలె సెల్ ఫోన్లకు అతుక్కుపోయేవారి సంఖ్య  రోజురోజుకి పెరిగిపోతుంది. ట్రాయ్ 2024  సెప్టెంబర్ నివేదిక ప్రకారం తెలంగాణలో 4.19 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడైంది.  ఇందులో సెల్ ఫోన్ లు వినియోగించేవారు 4.4 కోట్లు ఉంటే ల్యాండ్ లైన్ వినియోగించేవారు 15.25  లక్షల వరకు ఉన్నారు. సెల్ ఫోన్ లు వినియోగించే వారు పట్టణాల్లో 59 శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 39 శాతం ఉన్నారు. ల్యాండ్ లైన్ వినియోగించే వారు పట్టణాల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు వెల్లడైంది.  ప్రతీ వందమందిలో 105  సెల్ ఫోన్లు ఉంటున్నాయి. అంటే జనాభా కంటే సెల్ ఫోన్లు ఎక్కువగా ఉంటున్నాయి. సెల్ ఫోన్లు వినియోగించడం వల్ల మెదడు సంబంధిత రుగ్మతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. 
తెలంగాణలో సెల్ ఫోన్ల వినియోగం ఎక్కువే  Publish Date: Mar 22, 2025 3:34PM

జగన్ పై మందకృష సంచలన వ్యాఖ్యలు 

ఎంఆర్ పిఎస్ అధ్యక్షుడు  మందకృష్ణ వైకాపా అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ కోసం  ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్నారు జగన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఆ పార్టీలోని మాదిగ నేతలు పునరాలోచించుకోవలన్నారు.  ఎపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్ సి వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమన్నారు.  శాసనమండలిలో వైకాపాకు బలమున్నప్పటికీ  చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో ఏకగ్రీవం చేయగలిగారన్నారు.  దశాబ్దాలుగా నలుగుతున్న వర్గీకరణ తీర్మానంలో  చంద్రబాబు  కీలక పాత్ర పోషించారన్నారు.  ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ముఖ్యమంత్రి న్యాయం వైపే నిలబడ్డారన్నారు. 
జగన్ పై మందకృష సంచలన వ్యాఖ్యలు  Publish Date: Mar 22, 2025 2:23PM