కేసినో అంటే ఏంటి? గ్యాంబ్లింగ్ గురించి తెలుసా? గుడివాడ‌కు ఎలా వ‌చ్చింది?

Publish Date:Jan 27, 2022

Advertisement

కెషినో.. గ్యాంబ్లింగ్ హౌస్.. ఇప్పుడు ఏపీలో మాంచి కాక రేపుతున్న వివాదం. తెలుగు ప్రజలు.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్లలో కొద్దిరోజులుగా తరచుగా వినిపిస్తున్న మాట. తెలుగు ప్రజలకు ముందెప్పుడూ ప్రత్యక్షంగా తెలియని సంస్కృతి.. ఈ కెషినో గురించే ఇంతగా చర్చల్లోకి రావడానికి ఒకే ఒక్కడు కారణం.. మహామహుల పురిటిగడ్డ గుడివాడ నడిబొడ్డున కెషినో నిర్వహించిన ఘనుడు.. అతనే బూతుల మంత్రి.. డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా ఆయనెవరో ఇప్పటికే గుర్తు వచ్చే ఉంటుంది.. సంక్రాంతి పండుగ సంబరాల నెపంతో గుడివాడలో.. తన సొంత కన్వెన్షన్ సెంటర్ లో కెసినో నిర్వహించిన ఆయనపై విపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. జూదరుల స్థాయిని మరో మెట్టుకు ఎక్కించిన మంత్రిని ఆ పదవి నుంచి తప్పించాలని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్.

నిజానికి కెసినో సంస్కృతి మన దేశంలోని ఒక్క గోవాలో తప్ప మరెక్కడా లేదు. అందుకు విదేశీ పర్యాటకులను ఆకర్షించడం అనే కారణం కూడా గోవా విషయంలో ఉండి ఉండొచ్చు. కెసినో సంస్కృతికి పెట్టింది పేరు అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ వెగాస్. ప్రతి ఏటా అక్కడ వచ్చినంత కెసినో ఆదాయం ప్రపంచంలో మరెక్కడా రాదంటే అతిశయోక్తి కాదు. అట్లాంటిక్ సిటీ, షికాగో, న్యూయార్క్ సిటీ, డెట్రాయిట్, బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, మిసిసిపీ, సెయింట్ లూయీస్, కన్సాస్ సిటీ తదితర సిటీల్లోనూ కెసినోలు నడుస్తుంటాయి. అమెరికా చరిత్ర తొలి రోజుల్లో కెసినోలు అంటే సెలూన్ లు అని మాత్రమే జనానికి తెలుసు. లాస్ వెగాస్ వచ్చిన పర్యాటకులు ఒకరినొకరు పరిచయాలు పెంచుకోడానికి, కలిసి మద్యం సేవించడానికి, కలిసి గ్యాంబ్లింగ్ ఆడేందుకు కెసినోలకు వెళ్లే సంప్రదాయం ఉండేది.

భారత దేశానికి చుట్టుపక్కల శ్రీలంక, సింగపూర్, మలేషియాల్లో కూడా కెసినోలు నడుస్తుంటాయి. బ్రిటన్ లో కూడా కెసినో సంప్రదాయం ఉంది. ఆయా దేశాలకు మన దేశం నుంచి వెళ్లే కొందరు సరదాగా కెసినోలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. కెసినోల్లో రకారకాల గ్యాంబ్లింగ్ లకు సౌకర్యం కల్పిస్తారు నిర్వాహకులు. సాధారణంగా కెసినోలు హొటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్ లు, రిటెయిల్ షాపింగ్, క్రూయిజ్ షిప్పులు, పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో నిర్వహిస్తుంటారు. వాటిలో  గ్యాంబ్లింగ్, డ్యాన్స్ లు, కామెడీ షోలు, ఆటల పోటీలు లాంటివి అందుబాటులో ఉంటాయి. కొన్ని కొన్ని కెసినోల్లో అందమైన అమ్మాయిలు కూడా అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. అందు వల్లే కాలక్రమేణా కెసినోలు వ్యభిచార గృహాలు అనే పేరు కూడా తెచ్చుకున్నాయి. అసలక్కడ ఏమి జరుగుతోందో తెలియకుండా గందరగోళానికి గురిచేసేలా పెద్ద పెద్ద శబ్దాలతో గేమ్ లు నిర్వహించే చోటును ఇప్పుడు కెసినో అంటున్నారు.

కెసినో అనే మాట ఇటలీ నుంచి వచ్చింది. కెసినో అంటే హౌస్ అని అర్థం. 19 వ శతాబ్దం నుంచి ఆహ్లాదకరమైన కార్యక్రమాలు జరిగే కొన్నిప్రాంతాల్లో కెసినోలు నిర్వహించేవారు. ఐరోపాలో మొట్టమొదటి సారిగా వెలుగు చూసిన గ్యాంబ్లింగ్ హౌస్ ను కెసినో అని పిలిచేవారు కాదు. 1638 లలో ఇటలీలోని గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ వెనిస్ లో కార్నివాల్ సమయంలో మాత్రమే కెసినోలు నిర్వహించేవారు. స్థానికులను పేదలుగా మార్చేస్తోందనే కారణంతో కెసినో సంప్రదాయాన్ని అక్కడ 1774లో నిలిపివేశారు. 20వ శతాబ్దంలో కెసినోలను అమెరికా బ్యాన్ చేసింది. అయితే.. 1931లో నెవాడా రాష్ట్రంలో కెసినోలకు మళ్లీ అనుమతి ఇచ్చింది. అమెరికాలోని న్యూజెర్సీలో 1976లో న్యాయబద్ధమైన కెసినోలు ఏర్పాటయ్యాయి. వాటిలో గ్యాంబ్లింగ్ ను అనుమతించారు. అట్లాంటిక్ సిటీ ఇప్పుడు అమెరికా మొత్తం గ్యాంబ్లింగ్ జరిగే రెండో అతి పెద్ద నగరంగా నిలుస్తోంది.

గ్యాంబ్లింగ్ హౌస్ లేదా కెసినోలోకి న్యాయబద్ధమైన ప్రవేశ అనుమతి కావాలన్నా, గ్యాంబ్లింగ్ ఆడాలన్నా కనీసం 18 నుంచి 20 ఏళ్ల వయస్సు పూర్తయి ఉండాలి. ఇదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక నిబంధన. నిజానికి కెసినోల్లో గేమ్ లు ఆడే వారికి చక్కని బుద్ధి నైపుణ్యం ఉండాలి. కెసినోల్లో సర్వ సాధారణంగా క్రాప్స్, రౌలెట్, బకారెట్, బ్లాక్ జాక్, వీడియో పోకర్ గేమ్ లు ఉంటాయి. ఈ గేమ్ లు ఆడే వారి నుంచి కెసినో హౌస్ ‘రేక్’ పేరుతో కొంత మొత్తం కమీషన్ గా తీసుకుంటుంది. అది కాకుండా గెలిచిన వారికి వచ్చిన సొమ్ము నుంచి ‘పే అవుట్’ పేరుతో కూడా కెసినో నిర్వాహకులు వసూలు చేస్తారు. అన్ని విదేశీ కెసినోల్లో సభ్యత్వ రుసుము ఉంటుంది. ఏడాదికి కొంత మొత్తం సభ్యత్వ ఫీజు చెల్లించిన వారు కెసినోలోకి ప్రవేశించవచ్చు. గ్యాంబ్లింగ్ సహా ఇతర గేమ్ లలో పాల్గొనవచ్చు. వాటితో పాటుగా ఇతర వినోద కార్యక్రమాలు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదంటే.. ఎప్పుడైనా ఒకసారి కెసినోకు వెళ్లాలంటే కొంత మొత్తం ప్రవేశ రుసుం కట్టాల్సి ఉంటుంది.

ఇక గుడివాడ కెసినో విషయానికి వస్తే.. ఒక్కొక్కరి నుంచి 5 వేల రూపాయలు ప్రవేశ రుసుముగా నిర్వాహకులు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పేకాట, రౌలెట్, చీర్ గర్ల్స్ డ్యాన్సులు, అర్ధనగ్న నృత్యాలు ఇతరత్రా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు మీడియాలో విజువల్స్ చూస్తేనే అర్థం అవుతుంది.

గుడివాడ కే.కన్వెష్షన్ లో నిర్వహించిన కేసినో కోసం కోట్లాది రూపాయల విలువైన కెసినో సామగ్రిని  రప్పించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఆ కోట్లాది రూపాయలను ఎవరు చెల్లించారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మన దేశంలో అనుమతి లేని కెసినోను మంత్రి కొడాలికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో ఎలా నిర్వహించగలిగారనేది ప్రశ్న. కే. కన్వెన్షన్ లో కెసినో నిర్వహిస్తున్నట్లు పబ్లిగ్గానే ప్రచారం చేసినా.. సీఎంకు, డీజీపీకి, ఇతర అధికారులకు తెలియదంటే నమ్మాలా? అసలు అనుమతే లేని కెసినో నిర్వహించేందుకు గుడివాడలో ఎలా పర్మిషన్ వచ్చింది? అనేది పలువురి మీమాంస. లేదా అంగబలం, అర్థబలంతో.. అధికార మదంతో తామేదైనా చేయగలనని చాటేందుకు కెసినో నిర్వహించారా అనే అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

By
en-us Political News

  
తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వరంగల్‌లో భూ సమీకరణకు వ్యతిరేకంగాద ఆందోళనకు దిగిన రైతులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న మల్లన్నను వరంగల్ జిల్లా ఆరేపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వరంగల్‌లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మల్లన్న మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
చెప్పేదొకటి.. చేసేదొకటి ఏపీలో బీజేపీ తీరు సరిగ్గా ఇలాగే ఉంటోంది. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో పోటీలోకి దిగుతామంటూ బీజేపీ చేసిన ప్రకటన వెనుక వ్యూహమేమిటన్నది రాజకీయ పండితులకు సైతం అంతుబట్టడం లేదు. సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంటే.. రాజకీయ పార్టీలు పోటీకి దిగకుండా ఉండటమన్నది ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. అయితే బీజేపీ మాత్రం పోటీకి దిగుతామంటూ చేసిన ప్రకటన ఏ ఉద్దేశంతో అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నది.
అందరూ ఊహిస్తున్నట్లుగానే ఆనం ఫ్యామిలీ మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. నిన్న మొన్నటి వరకు ఆనం రామనారాయణరెడ్డితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కైవల్యారెడ్డి ఒక్కసారిగా టీడీపీ మహానాడు సందర్భంగా భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వెళ్లి లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ సంఘటన వైసీపీ నేతల్లో కలవరం రేపింది.
కర్ణాటక శాసన సభ గడువు ముగుస్తోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లో, ఆ రాష్ట్ర్ర శాసన సభకు ఎన్నికలు జరగవలసి వుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయా, అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నిండా రెండేళ్ళ గడువుంది. తెలంగాణ అసెంబ్లీకి సంవత్సరం పైగానే సమయముంది. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజు పెరుగతున్న నేపధ్యంలో, ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి.
దోచుకోవడం, దాచుకోవడం వైసీపీ నైజం. ఈ విషయం గణాంకాలతో సహా మరోసారి రుజువు అయింది. వైసీపీకి 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 107.99 కోట్ల రూపాయలు విరాళంగా, అందగా వాటిలో కేవలం ఎనిమిది కోట్ల ఏడు లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. అంటే విరాళంగా వచ్చిన మొత్తం నుంచి 99.25 శాతం నిధులు ఖర్చు చేయకుండా మిగుల్చు కుంది. అదే ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాలు 3 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే. కానీ.. తెలుగుదేశం ఖర్చు చేసింది మాత్రం 54 కోట్ల 76 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అంటే.. వచ్చిన విరాళాల ద్వారా అందిన ఆదాయం కన్నా తెలుగుదేశం 1,584 కోట్ల రూపాయలు అదనంగా వ్యయం చేసింది.
మహానాడు.. తెలుగుదేశం జరుపుకునే పండుగ. ఈ పండుగను తెలుగుదేవం పార్టీ 1983 నుంచి క్రమం తప్పకుండా జరుపుకుంటోంది. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా మహానాడు పండుగను జరుపుకోలేదు కానీ, పార్టీ ఆవిర్భావం నుంచి క్రమం తప్పకుండా మహానాడుకు తెలుగుదేశం పార్టీ ఒక పండుగలా, ఒక ఉత్సవంగా నిర్వహించుకుంటూ వస్తోంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తెలుగు తమ్ముళ్లు అదే ఉత్సాహంతో, అదే చైతన్యంతో మహానాడుకుహాజరౌతూనే ఉన్నారు. అయితే మహానాడు తొలి సారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత 1982 మే 26, 27, 28 తేదీలలో నిర్వహించుకుంది. ఆ మహానాడు దేశ రాజకీయాలలో ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది.
తెలుగుదేశం మహానాడులో యువజోష్ ఉరకలెత్తుతోంది. పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు యువతకు వచ్చే ఎన్నికల్లో 40 శాతం స్థానాలు కేటాయిస్తామని అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. నాలుగు దశాబ్దాల నాడు తెలుగుదేశం యువరక్తంతో కదంతొక్కిన సంగతి ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకంగా ఇంత కాలం నిలుస్తూ వచ్చిందంటే ఆ నాడు పడిన పునాదుల మీద.. తెలుగువారి ఖ్యాతి, సత్తా, సమర్ధతా చాటుతూ వారి అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ సాగుతుండటమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల పండుగను సగర్వంగా నిర్వహించుకుంటోంది. అయితే రానున్న కాలంలో పార్టీ మరింత దూకుడుగా, పోరాట పటిమతో ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది.
తెలుగుదేశం మహానాడుకు వచ్చిన ప్రతినిథుల కోసం ఏర్పాటు చేసిన విందు భలే పసందు అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగిన మహానాడుకు వచ్చిన అతిధుల కోసం ఆహార కమిటీ అద్భుతమైన మెనూ సిద్ధం చేసింది.
ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ తనయుడు, హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాల కృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శత జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ఎన్టీఆర్ పేరు వింటేనే ప్రతి తెలుగు వాడిలో ఓ పులకింత. సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా, సంక్షేమ సారథిగా, పేదవాడి చేతి అన్నంముద్దగా, మహోన్నత మానవతా మూర్తిగా ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్న నిలువెత్తు చైతన్యం ఎన్టీరామారావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఒక సంచలనం.
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. నైరుతి ఆదివారం కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈ ఏడాది మూడు రోజులు ముందుగానే తొలకరి పలకరించనుంది.
నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ ఈ పేరు ఒక ఉత్సాహం. ఈ పేరు ఒక ఉద్వేగం. ఈ పేరు ఒక చరిత్ర. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు జనం హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహామనిషి. ఆయన శత జయంతి నేడు. కృష్ణా నదీతీరాన జన్మించిన నందమూరి తారక రామా బాల్యం నుండీ శ్రమజీవి. కుటుంబానికి అండగా, పొరుగువారికి సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉండేవారు. ఇక చలన చిత్ర రంగం లో కి ప్రవేశించిన తరువాత ఆయన అశేష ఆంధ్రుల ఆరాధ్య దైవం అయ్యారు.
వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట చేస్తున్న బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. గడపకూ మన ప్రభుత్వం అంటూ జనం వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడప గడపలోనూ నిరసనలు ఎదురైతే ఇప్పుడు సామాజిక న్యాయ భేరి అంటూ 17 మంది చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. విజయ నగరంలో జనం లేకపోవడంతో వర్షం నెపం చెప్పి అర్థంతరంగా సభను రద్ధు చేసుకున్న మంత్రులకు రాజమండ్రిలో జనం లేకపోవడంతో మళ్లీ నిరాస తప్ప లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.