ఢిల్లీ సరిహద్దుల్లో  రైతుల ధర్నా ముగిసింది 

Publish Date:Dec 9, 2021

Advertisement

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సర కాలం పైగా, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిన నేపధ్యంలో ఆందోళన విరమించాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. ఆ ప్రక్రియ అంతా చకచకా సాగిపోయింది.

నూతన సాగు చట్టాలు రద్దయ్యాయి. అయినా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా ఇతర డిమాండ్లు నెరవేర్చాలని చెబుతూ రైతులు నిరసనలు కొనసాగిస్తూ వచ్చారు. వీటిపైనా సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే సంయుక్త కిసాన్ మోర్చా సమావేశమైంది. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి.. తుది నిర్ణయం తీసుకుంది. నిరసనలకు ముగింపు పలికినట్లు మోర్చా ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో రైతులు.. తమ టెంట్లను తీసివేస్తున్నారు. దిల్లీ- హరియాణా సింఘూ సరిహద్దు వద్ద నిరసన స్థలాల వద్ద ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను తొలగిస్తున్నారు.రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. అయితే, డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో.. వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు. హామీల అమలుకు సంబంధించిన విషయాలు లిఖితపూర్వకంగా ఉండాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ తర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని కేంద్రం మరో హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను విరమించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతులు దిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేయనున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఘాత్మకంగా, రాష్ట్రానికే తలమానికంగా అభివర్ణించిన వాయు వేగంతో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పుడు వివాదాల ముసురు కమ్ముకుంటోంది. ఇటీవలి భారీ వరదల్లో ఆ ప్రాజెక్టు పంప్ హౌజ్ లు మునిగిపోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి. అయితే కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన భారీ వరదల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెరాస సర్కార్ చెబుతున్నప్పటికీ విపక్షాల నుంచి మాత్రం కమిషన్ల కక్కూర్తి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.
భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం ఒకదానితో ఒకటి చాలా దగ్గరగా ముడిపడి  ఉ న్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.
కమలనాథులు తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదంటూ ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బి.జె.పి రాష్ట్ర నాయకత్వంపై విజయ శాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫ్రైర్ బ్రాండ్ అయిన తనను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో అన్ని వ‌ర్గాల‌వారిని ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భార‌త్ జోడో యాత్ర‌ను త‌లపెట్టిం ది.
తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది. విద్యుత్ బకాయిల కారణంగా కేంద్రం 11 రాష్ట్రాలకు విద్యుత్ విక్రయాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఆ 11 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా3 ఉన్నాయి.
భగవద్దీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన గురువారం (ఆగస్టు 18) జనగామలో అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలతో సమావేశమయ్యారు. భగవద్గీత వినిపిస్తే ఎవరైనా మరణించారా అని అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడుస్తున్న సెల్ఫీని పోస్ట్ చేసినందుకు వైరల్‌గా మారిన సీఈఓ తొలగించిన ఉద్యోగి ఒకరు జాబ్ ఆఫర్లతో ముంచెత్తారు.
ఇటీవల, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌లో పెట్టుబ‌డులు పెట్టారు. ఇది వృద్ధులను యువకులు, చదువు కున్న గ్రాడ్యుయేట్‌లతో జతచేయడం ద్వారా అర్ధవంతమైన సహ చర్యం కోసం వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఉంది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాస్టారుగా మారి మాంచి లెక్చర్ ఇచ్చారు. హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య గురువారం లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొట్నూరు ఉన్నత పాఠశాలఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యాసంస్థలకు ఎల్ఈడీ టీవీలు పంపిణీ చేశారు.
ఇటీవ‌లి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలే న్యాయ‌స్థానం ప‌నులు చేసేస్తూ కేసులు మాఫీ చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. త‌మ వారిని కాపాడుకునే ల‌క్ష్యంతో ప్రభుత్వాలు జీవో జారీచేయ‌డం ప‌ట్ల హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
తెలంగాణా లో ఆపరేషన్ ఆకర్ష్‌ని కాషాయ దళం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాషాయ దళంలోకి వెళ్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆగస్టు 21న మునుగోడు సభ వేదికగా కొందరు టీఆర్ఎస్ కీలక నేతల చేరికలు ఉండేలా వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణా కమలదళం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకి హాజరు అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అలుపు, సొలుపు, విసుగు, విరామం లేకుండా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. తమ ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.
ర‌ష్యాలో అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం మ‌ళ్లీ పిల్ల‌ల సంద‌డి అవ‌స‌ర‌మ‌ని భావించారు. అంటే జ‌నాభా పెరు గుద‌ల‌ను ఆశిస్తున్నారు. కోవిడ్ వ‌ల్ల  అనేక దేశాల్లో జ‌నాభా త‌గ్గి పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.