Publish Date:Jul 11, 2025
బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఇటీవల సంతకం చేసిన అమెరిక అధ్యక్షుడు ట్రంప్ భారత్ సహా ఇతర దేశాలకు మరో షాక్ ఇచ్చారు. వీసా ఫీజులను భారీగా పెంచారు. ఈ ఫీజు వల్ల భారతీయులపై సైతం తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ యాక్ట్ కింద నాన్ ఇమిగ్రేషన్ వీసాల ఫీజును పెంచింది. ఈ ఫీజును రూ. 26 వేలకు పెంచింది. ఇది వచ్చే ఏడాది అంటే.. 2026 నుంచి అమల్లోకి రానుంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు సైతం ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది. అంటే.. యూఎస్‌లో పర్యటన, ఉన్నత విద్య, ఉద్యోగం కోసం వెళ్లే వారు ఈ ఫీజు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పర్యాటన కోసం వెళ్లే వీసా ఫీజును రూ. 16 వేల నుంచి రూ. 40 వేలకు పెంచింది.
యూఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజ్ కింద 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 21,400 చెల్లించాలి. అయితే వీటిని వెనక్కి ఇవ్వరు. దీనికి సర్ ఛార్జ్ సైతం అదనంగా వసూల్ చేస్తారు. వీసా జారీ సమయంలో ఈ మొత్తాన్ని తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ ఫీజు ధరల్లో హెచ్చు తగ్గులు ఉండనున్నాయి.బీ 1, బీ 2 అంటే.. టూరిజం, బిజినెస్ వీసాలు.. ఎఫ్, ఎమ్ అంటే.. స్టూడెంట్ వీసాలు.. హెచ్ 1 బీ అంటే వర్క్ వీసాలు.. జె అంటే విజిటర్ వీసాలకు తప్పకుండా ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక డిప్లమాటిక్ వీసా కలిగిన వారికి అంటే.. ఏ, జీ వీసా కలిగి వారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పర్యటకులు, వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే వారిపై ఈ ఫీజుల ప్రభావం పడనుంది.
బీ2 టూరిస్ట్ వీసా ఖర్చు ప్రస్తుతం సుమారు రూ. 15 వేలు ఉంటే.. దీనికి అదనంగా వీసా ఇంటిగ్రిటీ పీజు కింద రూ. 21 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో మొత్తం ఖర్చు రూ. 35 వేల వరకు ఉండనుంది. 2025లో హెచ్ 1 బీ రిజిస్ట్రేషన్ ఫీజు స్వల్పంగా ఉంటే.. ప్రస్తుతం ఆ ధర భారీగా పెరిగినట్లు అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఈ తరహా ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల హెచ్ 1 బీ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గాయి.ఇక వీసా ఇంటిగ్రిటి ఫీజును కొన్ని సందర్భాల్లో మాత్రమే వెనక్కి చెల్లించనున్నారు. వీసా హోల్డర్ అమెరికాలో ఉన్న సమయంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించిన వారికి చెల్లించనున్నారు. అలాగే ఐ-94 గడువు ముగియడానికి ఐదు రోజుల కన్నా ముందుగా అమెరికాను విడిచి వెళ్లేవారికి తిరిగి చెల్లిస్తారు.
అదే విధంగా ఐ-94 గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగించే వారితోపాటు శాశ్వత నివాస అనుమతి పొందిన వారికి కూడా ఈ ఫీజును తిరిగి చెల్లించే అవకాశముంది. వీసా దుర్వినియోగాన్ని అరికట్టేడంతోపాటు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రంప్ సర్కార్ ఈ కొత్త ఫీజు విధానాన్ని ప్రవేశపెట్టానంటోంది. అలాగే ఈ ఫీజు ద్వారా అమెరికా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని సేకరించాలని చూస్తోంది. ఇది ఇమ్మిగ్రేషన్ సంబంధిత ఖర్చులు భరించడానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది. కానీ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఎంతో మంది అమెరికా వెళ్లాలనుకునే సామాన్యుల కలలను ఛిద్రం చేసినట్లు అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/donald-trump-25-201787.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.