అవినీతి అధికారుల మధ్య లెక్క తేలని వాటాలు,వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు......

Publish Date:Oct 17, 2019

Advertisement

 

కష్టపడి పని చేసే శ్రామికుల వేతనాలు అధికారుల చేతి వాటం ప్రదర్శించారు. అందినకాడికి దోచుకున్నారు. చివరకు వాటాల్లో తేడా వచ్చే సరికి అక్రమార్కుల బండారం బైటపడింది. అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిన్న మొన్నటివరకు కేవలం టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మాత్రమే అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు పారిశుధ్య విభాగానికి కూడా పాకే రోజంతా శ్రమించి పని చేసే కార్మికుల జీతాలను కూడా స్వాహా చేయడం మొదలు పెట్టారు కొందరు అధికారులు.

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు వాటా పంపకాల్లో తేడా రావడంతో చివరకు అవినీతి పుట్ట కదిలింది. విజయవాడ నగర పాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు మూడు వేల మంది డ్వాక్రా సభ్యులు పనిచేస్తున్నారు. వీరికి ఇరవై నెలల క్రితం వరకూ పది వేల రూపాయల వేతనం చెల్లించేవారు. ఇరవై నెలల కిందట కార్మికుల జీతాన్ని పదకొండు వేల రూపాయలకు పెంచారు.

జీతమైతే పెంచారు కానీ వాటిని అమలు చేయకుండా కాగితాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక్కో కార్మికుడికి ఇరవై వేల వరకు వేతన బకాయిలు చెల్లించాల్సి వుంది. అందరికీ కలిపి ఇరవై నెలలకు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల క్రితం మొత్తం వేతన బకాయిలు యాభై శాతం అంటే మూడు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.

కొంత మంది అవినీతి అధికారులు కుమ్మక్కై ఈ నిధుల్లో ముప్పై లక్షల వరకు పక్కదారి పట్టించారు. వాస్తవంగా పని చేసే కార్మికుల కన్నా రికార్డుల్లో ఎక్కువ సంఖ్య ను చూపి నిధులను దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తూ వచ్చాయి.

దీనికి చెక్ పెట్టేందుకు కార్మికులకు ఐరిష్ హాజరును ప్రవేశపెట్టారు దీన్ని సైతం తప్పు దారి పట్టించేలా రికార్డు సృష్టించారని సమాచారం. కేవలం రికార్డుల్లో మాత్రమే ఉండి క్షేత్ర స్థాయిలో లేని కార్మికులకు ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జీతాలు డ్రా చేశారు.  ఇప్పుడు వారి వేతన బకాయిలను కూడా చడీచప్పుడూ లేకుండా స్వాహా చేసేందుకు పథకం వేసుకున్నారు. అదే సమయంలో అవినీతి అధికారుల మధ్య వాటాలు పంచుకోవడంలో విబేధాలు తలెత్తాయి.

ఇప్పటి వరకూ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం కాస్త కమిషనర్ దృష్టికి వెళ్లింది. కార్పోరేషన్ లో జరుగుతున్న అవినీతి భాగోతంపై కమిషనర్ రహస్యంగా విచారణ జరిపారు. నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణ లో వాస్తవం ఉందని నిర్థారించుకున్నారు. సంబంధిత విభాగం ఉన్నతాధికారి కి షోకాజ్ నోటీస్ తో పాటు విభాగం సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యను తీసుకోబోతోందో వేచి చూడాలి.

By
en-us Political News

  
జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం.
రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి. ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.
ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం.
పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి. గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు.
చంద్ర‌బాబు నాయుడు స్కెచ్ వేశారంటే ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నారా చంద్రబాబునాయుడు.. పార్టీని న‌మ్ముకున్న వారికి.. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలిచిన వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారని పేరుంది. తాజాగా మ‌రోసారి ఆ విష‌యం రుజువైంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఏప్రిల్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌డానికి ఎలాంటి డ్రామాలు ఆడేందుకైనా వెనుకాడ‌రు. ఈ విష‌యం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రుజువైంది. కోడిక‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందిన జ‌గ‌న్‌.. బాబాయ్ హ‌త్య‌ను చంద్ర‌బాబుపైనెట్టి ప్ర‌జ‌ల సానుభూతి ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు.
బీజేపీ హ్యాట్రిక్ ధీమా సడలినట్లు కనిపిస్తోంది. మోడీత్వ మేనిఫెస్టో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని తొలి దశ పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
నాయకుడు పార్టీని ముందుండి నడిపించడమే కాదు.. క్లిష్ట సమయాల్లోనూ, సంక్షోభంలోనూ కూడా పార్టీ నేతలూ, క్యాడర్ లో తనపై విశ్వాసం, నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకోవాలి. చంద్రబాబు ఆ విషయంలో ఏ ఇతర రాజకీయ నేతకన్నా ముందు ఉంటారు.
అనూహ్యంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన మాధవీలత కు పార్టీ హైకమాండ్ ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. దీంతో ఎంత అనూహ్యంగా తెరమీదకు వచ్చారో.. అంతే అనూహ్యంగా తెరమరుగు కానున్నారా? అన్న సందేహాలు బీజేపీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో కోల్ కతా హైకోర్టు సోమవారం (ఏప్రిల్ 22) సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష నియామక ప్రక్రియ చెల్లదని పేర్కొంటూ ఆ పరీక్ష, ఆ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది.
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ముందే విజయం ఎవరిదో ఖరారైపోయింది. ఈ విషయంలో ఇంకా నమ్మని వాళ్లెవరైనా ఉంటే.. ప్రచారంలో భాగంగా అధికార పార్టీ అభ్యర్థికి అడుగడుగునా ఎదురౌతున్న పరాభవాల పరంపరను చూస్తే అర్ధమైపోయింది. మంగళగిరి నియోజవకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.