మహిళను బెదిరించాడు ..బుల్డోజర్ వెంటాడుతోంది
Publish Date:Aug 8, 2022
Advertisement
దొంగ తాళాలతో వెళతాడు, ఆర్ధిక నేరస్తుల్ని వెంటాడుతుంది ఈడీ, నోయిడాలో బుల్డోజర్ మాత్రం త్యాగి వెంటబడింది. నోయిడా గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలోని సెక్టర్ 93 బి .బిజెపీ కిసాన్ మోర్చా సభ్యుడు శ్రీకాంత్ త్యాగీ నివాసం. ఆయన చాలా రోజుల నుంచి కనిపించడం లేదు. ఆయన తన ప్రాంతంలోనే ఒక మహిళను బెదిరించడమే కాకుండా గొడవపడ్డాడు. ఏకంగా హౌసింగ్ సొసైటీలో పెద్ద దుమారం లేచింది. ఇంతకీ ఇంత గొడవ, ఆయన కనపడకుండా పోవడానికి కారణం సూదిలోంచి దారం లాంటి సంగతి. త్యాగి తన నివాసం ఆవరణలో ఏదో మొక్క నాటాలనుకున్నాడు. కానీ సొసైటీ నిబంధనలకు విరుద్ధమంటూ పక్క ఫ్లాట్ మహిళ హెచ్చరించింది. అంతే అసలే బీజేపీ నాయకుడినన్న ఆవేశంలో త్యాగి ఏకంగా గొడ వకు దిగాడు. చిలికి చిలికి గాలివానై అది కాస్తా పోలీసు కేసు అయింది. త్యాగి తన పరిమితులను మించి ప్రవర్తించాడని అక్కడి వారి ఆరోపణ. పైగా ఆమెను బెదిరించడం వారు సహించ లేకపోయారు. తాను రాజకీయనాయకుడినన్న ధీమాతోనే అలా దురుసుగా ప్రవర్తిస్తుంటారన్న ఆరోప ణలు ముందునుంచే ఉన్నాయి. పైగా తనకు పెద్ద పెద్ద వారితో సంబంధాలున్నాయని తన జోలికి వస్తే పరిస్థితులు సరిగా ఉండవని అంటూ బీజేపీ సీనియర్ నేతలతో తానున్న ఫోటోలు చూపించి జనాన్నిభయపెట్టడం బాగా అలవాటుగా మారింది. కాగా ఇటీవల తన నివాసం ప్రాంతంలోనే మహిళలతో గొడవపడి పోలీసు కేసు కావడంతో త్యాగి ఎటో వెళిపోయారు. అసలీ సంగతి తెలిసిన బీజేపీ వర్గాలు కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు. దీనికి తోడు ఆయన నివాసమే అక్రమ నిర్మాణం అనే ఆరోపణలూ ఉన్నాయి. దీనికి సంబం ధించిన కేసులో నోయిడా ఫేజ్2 ఇన్ఛార్జ్ సుజిత్ ఉపాధ్యాయా పాత్ర కూడా ఉందని ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. త్యాగి నివాసాన్ని నోయిడా పురపాలక సంస్థ కూల గొట్టాలన్నఆదేశాలూ జారీ చేసింది. ఆ ఆదేశాల మాట విన్నప్పటి నుంచే ఆయన కనపడకుండా పోయారు. ఆయన్ను కనిపిస్తే అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ కూడా డిమాండ్ చేస్తోంది.
http://www.teluguone.com/news/content/bulldozer-rolling-for-tyagi-39-141506.html