ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేస్తారా?

Publish Date:Dec 9, 2021

Advertisement

చట్టం ముందు అందరూ సమానమే కానీ, రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువ సమానమని సామాన్యులు అనుకుంటే, కాదనేందుకు కారణాలు కనిపించవు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మొదలై, ఇంచుమించుగా పుష్కరకాలం పూర్తయింది. అయినా, విచారణ సాగుతూనే వుంది.. ఓ వంక రాజకీయ నాయకుల మీద వున్న కేసులును విచారణ వేగంగా పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడోనే చెప్పిందంటారు.కానీ, వాస్తవంలో ఏమి జరుగుతున్నదో వేరే చెప్పనక్కరలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ క్రతువు చూస్తే, చట్టం ముందు అందరూ సమానం కాదు అనుకోవలసి వస్తుందని సామాన్యులు అనుకుంటున్నారు. 

నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద ఒకటి కాదు, 11 ఈడీ కేసులు, 12 సీబీఐ కేసులు మొత్తం 23  కేసులున్నాయి. అయినా ఆయన రాజకీయ,ఆర్థిక,వ్యాపార కార్యకలాపాలు ఎలాంటి అవరోధం లేకుండా సాగిపోతున్నాయి.ఓ పదహారు నెలలు జైల్లో ఉన్నా, బెయిలు పై బుయటకు వచ్చిన తర్వాత ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని, కోర్టు విచారణకు హాజరు కాకుండా మినహయింపు పొందుతున్నారు. ఈ మినహాయింపు వలన విచారణ మరింత జాప్యం అవుతోంది సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. దీంతో ఈ కేసులోఏం తీర్పు రాబోతుందన్నది ఆసక్తిగా మారింది. సీఎం జగన్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం అదేశిస్తే ఈ కేసులో కీలక పరిణామాలు జరగవచ్చని తెలుస్తోంది.

విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది పలు అంశాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో జగన్ ఇదే అభ్యర్థన చేస్తే సీబీఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని తెలిపారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఈ కారణంగానే గతంలో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరించినట్టు కోర్టుకు వివరించి  ప్రస్తుతం జగన్ హోదా మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది.ఈ నేపద్యంలో కోర్టు ఎలా ఉంటుంది అనేది అత్యంత కీలకంగా మారిందని అంటున్నారు. తీర్పు తిరగబడితే రాజకీయంగా తీవ్ర పరిణామాలు తప్పవని అంటున్నారు.  

హై కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏమి చేయాలనే దానిపై ఇప్పటికే,  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉన్నాఆమార్గంలో వెళ్లరాదని, నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంలో అ వసరం అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు ముఖ్యమంత్రే కేంద్ర బిందువుగా ఉన్నారు. మంత్రులు సలహాదారులు ఎందరున్నా, ప్రభుత్వ పాలనా సింగిల్ మ్యాన్ షో గానే సాగుతున్న నేపధ్యంలో, పేస్ మారిస్తే ప్రయోజనం ఉంటుందని  పీకే. జగన్ ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ ఆలోచనకు కొనసాగింపుగా  కోర్టులకు సహకరించడం ద్వారా జగన్ వ్యక్తిగత ఇమేజిని పెంచుకునే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే, బీహారు మాజీ  ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రూట్ లో శ్రీమతి భారతిని ముఖ్యమంత్రి చేయడం కాదంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రూట్లో, నమ్మినబంటుకు బాధ్యతలు అప్పగించి రిమోట్ కంట్రోల్ పాలన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  ఏదైనా, అంతిమ నిర్ణయం హై కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. 

By
en-us Political News

  
కమలనాథులు తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదంటూ ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బి.జె.పి రాష్ట్ర నాయకత్వంపై విజయ శాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫ్రైర్ బ్రాండ్ అయిన తనను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో అన్ని వ‌ర్గాల‌వారిని ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భార‌త్ జోడో యాత్ర‌ను త‌లపెట్టిం ది.
తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది. విద్యుత్ బకాయిల కారణంగా కేంద్రం 11 రాష్ట్రాలకు విద్యుత్ విక్రయాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఆ 11 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా3 ఉన్నాయి.
భగవద్దీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన గురువారం (ఆగస్టు 18) జనగామలో అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలతో సమావేశమయ్యారు. భగవద్గీత వినిపిస్తే ఎవరైనా మరణించారా అని అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడుస్తున్న సెల్ఫీని పోస్ట్ చేసినందుకు వైరల్‌గా మారిన సీఈఓ తొలగించిన ఉద్యోగి ఒకరు జాబ్ ఆఫర్లతో ముంచెత్తారు.
ఇటీవల, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌లో పెట్టుబ‌డులు పెట్టారు. ఇది వృద్ధులను యువకులు, చదువు కున్న గ్రాడ్యుయేట్‌లతో జతచేయడం ద్వారా అర్ధవంతమైన సహ చర్యం కోసం వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఉంది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాస్టారుగా మారి మాంచి లెక్చర్ ఇచ్చారు. హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య గురువారం లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొట్నూరు ఉన్నత పాఠశాలఆవరణలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యాసంస్థలకు ఎల్ఈడీ టీవీలు పంపిణీ చేశారు.
ఇటీవ‌లి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలే న్యాయ‌స్థానం ప‌నులు చేసేస్తూ కేసులు మాఫీ చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. త‌మ వారిని కాపాడుకునే ల‌క్ష్యంతో ప్రభుత్వాలు జీవో జారీచేయ‌డం ప‌ట్ల హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
తెలంగాణా లో ఆపరేషన్ ఆకర్ష్‌ని కాషాయ దళం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాషాయ దళంలోకి వెళ్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆగస్టు 21న మునుగోడు సభ వేదికగా కొందరు టీఆర్ఎస్ కీలక నేతల చేరికలు ఉండేలా వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణా కమలదళం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకి హాజరు అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అలుపు, సొలుపు, విసుగు, విరామం లేకుండా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. తమ ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.
ర‌ష్యాలో అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం మ‌ళ్లీ పిల్ల‌ల సంద‌డి అవ‌స‌ర‌మ‌ని భావించారు. అంటే జ‌నాభా పెరు గుద‌ల‌ను ఆశిస్తున్నారు. కోవిడ్ వ‌ల్ల  అనేక దేశాల్లో జ‌నాభా త‌గ్గి పోయింది.
రాజకీయంగా ఎత్తులు వేయడంలో బీజేపీ అందెవేసిన చెయ్యి అనడంలో సందేహం లేదు. అందులోనూ మోడీ- షా ద్వయం ఇలాంటి విషయాల్లో ప్రదర్శించే చాణక్య నీతి గురించి చెప్పనక్కర్లేదు. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప ఇంకెక్కడా కాలు మోపేందుకు వీలు లేక బీజేపీ నేతలు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూనే ఉన్నారు. బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో బలపడాలని చూస్తోంది.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీలో పోటీ పెరిగిపోతోంది. ఉపఎన్నిక ఇన్‌చార్జ్ అయితే అమిత్ షా వద్ద పరపతి పెరుగుతుందనే ఆలోచనతో నేతలు కసరత్తులు చేస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.