Publish Date:May 28, 2022
అందరూ ఊహిస్తున్నట్లుగానే ఆనం ఫ్యామిలీ మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. నిన్న మొన్నటి వరకు ఆనం రామనారాయణరెడ్డితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కైవల్యారెడ్డి ఒక్కసారిగా టీడీపీ మహానాడు సందర్భంగా భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వెళ్లి లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ సంఘటన వైసీపీ నేతల్లో కలవరం రేపింది.
కొంత కాలంగా ఆనం ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గత కొద్ది కాలంగా ఆనం రామనారాయణరెడ్డి అధికారులు, వైసీపీ నేతల తీరుపై విమర్షలు గుప్పిస్తుండటమే ఈ ప్రచారానికి కారణం. సందు దొరికినప్పుడల్లా పరోక్షంగా వైసీపీ అధిష్టానాన్ని ఎండగడుతున్నారు ఆనం. మహానాడు సందర్భంగా లోకేష్ పర్యటించే ప్రాంతానికి వెళ్లి ఆనం కుమార్తె కైవల్యారెడ్డి, అల్లుడు రితేశ్ రెడ్డి కలిశారు. దాదాపు అరగంట పైగా చర్చలు జరిపారు. దీంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు.
ఆత్మకూరు నియోజకవర్గం నుండి రామనారాయణరెడ్డి కుమార్తె తెలుగుదేశం తరఫున బరిలో దిగుతారని ఇప్పటికే ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే చంద్రబాబు ఆత్మకూరుకు పార్టీ ఇన్ ఛార్జ్ ని కూడా నియమించలేదని చెబుతున్నారు. ఈ రోజు ఆత్మకూరు తనకు కేటాయించాలని లోకేష్ ను కైవల్యారెడ్డి కోరినట్టు సమాచారం . త్వరలో ఆమె ఆత్మకూరు బాధ్యతలు చేపట్టనున్నారన్న టాక్ నెల్లూరు జిల్లాలో జోరుగా నడుస్తోంది.
కైవల్యారెడ్డి ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే బద్వేలు విజయమ్మ కోడలు. ఆ కుటుంబం ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతోంది. కానీ పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడూ టీడీపీ కార్యక్రమాల్లో కైవల్యారెడ్డి పాల్గొనలేదు. కైవల్యారెడ్డి తన వారసురాలిగా రాజకీయాల్లోకి రావాలనేది వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కోరిక. అందులో భాగంగా ఈమధ్య కాలంలో ఆమె ఆనం రామనారాయణరెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఇప్పుడు కైవల్యారెడ్డి లోకేష్ తో భేటీ కావడంతో ఆమె తెలుగుదేశం గూటికి చేరనున్నారన్న చర్చ మొదలైంది.
కైవల్యారెడ్డికి ఎనభై ఏళ్ల రాజకీయ చరిత్ర గల కుటుంబం ఆడపడుచు. ఆమె దేశం తీర్ధం పుచ్చుకుంటే.. ఆనం కుటుంబం నుంచి తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన మహిళ అవుతారు. ఆమె మెట్టినింటిది కూడా రాజకీయ నేపథ్యమే కావడంతో కైవల్యారెడ్డి లోకేష్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anam-daughter-kaivalya-reddy-meets-lokesh-39-136586.html
బీజేపీ దక్షిణాదిలో వేళ్లూనుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విదంగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా నలుగురు దక్షిణాది వారికి నామినేట్ చేసింది. ప్రముఖ తెలుగు సినీ రచయత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, అలాగే పరుగుల రాణి, ఒలింపిక్ పతక విజేత పీటీ ఉష, ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేలను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు
తమిళనాడు రాజకీయాల్లో ఏ క్షణానైనా ఏదన్నా జరగవచ్చునని, ఇక్కడ కూడా ఒక షిండే తలెత్తవచ్చని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కే. అన్నామలై అనడం ఇపుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహా రాష్ట్ర లో మాదిరిగా ఇక్కడా రాజకీయ పరిస్థితులు మారే అవకాశాలున్నాయని బిజెపి చూచాయిగా ఈ ప్రస్థావన చేసింది. అయితే డిఎంకే సీనియర్ నేత, పార్టీ నిర్వాహక కార్యదర్శి ఆర్.ఎస్. భారతి మాత్రం అన్నామలై మాటలను పెద్దగా సీరియస్‌గా పట్టించుకోనవసరం లేదన్నారు.
మహారాష్ట్ర, తమిళనాడులలో రాజకీయ పరిస్థితులను గురించి ప్రస్థావిస్తూ, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్‌థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ సినీరంగ ప్రవేశం అచ్చం తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి ఎం.కరుణానిధి కుమారుడు ముత్తు సినీరంగ ప్రవేశం ఒకేలా వుందని అంటూ, వారిద్దరి తొలి సిని మాలూ పెద్దగా ఆడలేదని అన్నామలై అన్నారు.
కాస్త వినసొంపుగా పాడుతూంటే ఓ క్షణం వినాలనిపిస్తుంది.. ఎవరన్నా ఫ్లూటో, వీణో వాయిస్తుంటే వీనుల విందుగా వుంటే .. మరో పాటనో, కీర్తననో వాయించమని కోరుతూంటారు. పాడటం, వాద్య నైపుణ్యాలు సరస్వతీ కటాక్షం అంటారు పెద్దలు. అది అందరికి అబ్బే విద్య కాదు. వంద మంది పాడేవారుండవచ్చు.. ఏ ఇద్దరు ముగ్గురి గొంతో అమృతం పోసినట్టు వుంటుంది.
అన్నీ అనుకున్నట్టే జరగవు. కాలం కటువుగానే సాగుతూంటుంది. ఏది ఎప్పుడైనా జరగవచ్చు. నిన్నటి ప్రేమికులు ఏదో కారణంతో విడిపోవచ్చు. పిల్లలు తల్లిదండ్రులను విడిచీ పోవచ్చు. కాలం విలువల్ని మార్చేస్తుంటుంది. ఊహలోకంలో విహరించడం కృష్ణశాస్త్రిగారి కవితల్లోనే సాగుతుంది. వాస్తవం శ్రీశ్రీ చెప్పి నట్టుగానే వుంటుంది. కానీ ఎక్కడో ఎప్పుడో ఒక్కరు మాత్రం ఆదుకోవడానికి అమాంతం అమృతహస్తం అందించవచ్చు
దేశరక్షణ అంశాన్ని పరిశీలిస్తే ఒకింత భయమేస్తుంది. మనం నిజంగానే సురక్షితంగా వున్నామా అన్న ప్రశ్న పెద్దదయి వొణికిస్తోంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉగ్రదాడులకు ఆస్కారం వుంటోం ది. ఒకదాని తర్వాత మరొకటి పెనుముప్పులు పొంచి వుంటున్నాయి. ప్రభుత్వాలు మారినా, సైన్యం మూడు విభాగాలూ ఎంతో అప్రమత్తంగా వున్నన్నా.. ఉగ్రదాడుల ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది.
ఒక్కప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కమ్యూనిస్ట్ పార్టీలు కీలక భూమికను పోషించాయి. అయితే, అంతతా గతించిన చరిత్ర. ఈరోజు, ఏపీలోనే కాదు,దేశంలో (ఒక్క కేరళలో మినహా) కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వ వైభాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచు కోటలుగా నిలిచిన, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోనూ లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టులు ఇంకా అధికారంలో ఉన్నారు.
ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, లెఫ్ట్ పార్టీలు పూర్వ వైభవాన్ని ఎప్పుడో కోల్పోయాయి. అయినా, ఇటు ఏపీలో అటు తెలంగాణాలో లెఫ్ట్ పార్టీ నేతలు, చింత చచ్చినా పులుపు చావలేదు
అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో ఫోర్బ్స్ కంపెనీకి చోటు లభించింది. అమరరాజా బ్యాటరీస్ గుంటూరు ఎంపీ, తెలుగుదేశం నాయకుడు గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన కంపెనీ అన్న సంగతి విదితమే.
కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నారా? ఓ వంక శాఖపరమైన సమస్యలు, మరోవంక రాజకీయ సవాళ్ళు ఒకేసారి దండయాత్ర చేయడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, అంటే, అవును, ఆమె ఒక్కసారిగా ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు. ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్నారని, అంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించే క్రమమలో విద్యార్ధుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెనే సిల్లీ మంత్రిని చేశాయి.
మహా వికాస్ అఘాడీ (ఎంవీఎ) ప్రభుత్వ వ్యతిరేకత కొత్త స్పీకర్ ఎన్నిక విషయంలో స్పష్టమయింది. షిండే, ఫడ్నవీస్‌ల ప్రయాణం మున్ముందు అంత సులభసాధ్యంగా సాగకాపోవచ్చు.
కొంచం విరామం అంతే మళ్లీ చమురు సంస్థలు తమ బాదుడు మొదలెట్టేశాయి. తాజాగా గృహావసరాలను వినియోగించే గ్యాస్ సిలెండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు వడ్డించాయి. ఈ వడ్డింపు బుధవారం నుంచే అమలులోకి వస్తుంది. ఇటీవలే అంటే ఈ నెల 1వ తేదీన వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే బండపై 7వ తేదీ నుంచి 50 రూపాయలు వడ్డించడం విశేషం.
ప్రజలలో వ్యతిరేకత వైసీపీపై కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలపై కాదు వ్యతిరేకత అంతా వాలంటీర్లపైనే.. ఇదీ వైసీపీ నేతలు ఇప్పుడు ముక్తకంఠంతో చెబుతున్న మాట. మనం నియమించిన వాళ్లు వాలంటీర్లు ఇప్పుడు వారి వల్లే మనకు ఇబ్బంది ఎదురౌతోందనుకుంటే వాళ్లని తొలగించేద్దాం అదెంత సేపు అన్నదే ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్న మాట. పార్టీ ప్లీనరీలకు ముందు నిర్వహించిన జిల్లాల ప్లీనరీలలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇదే విషయం చెప్పారు. పార్టీ బలోపేతం, పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా వేటి గురించీ జిల్లా ప్లీనరీలలో చర్చించలేదు.
నీకిది.. నాకిది అన్న ఒప్పందం.. సంబంధం కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో తమకు ఉందని వైసీపీ ఎంపీ ఒకరు కుండ బద్దలు కొట్టేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గత మూడేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీసీ మద్దతు ఇస్తున్నదని అంగీకరించారు. అందుకు ప్రతిగా కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పేశారు. దీంతో ఇప్పటి దాకా గుట్టుగా ఉన్న బీజేపీ- వైసీపీ క్విడ్ ప్రోకో సంబంధం లేదా అనుబంధం ఇప్పుడు బట్టబయలైపోయింది.