Publish Date:Jul 19, 2022
మాథ్యూపదకండో ఏట జబ్బు చేసి చనిపోయాడు. అతని తల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసినపుడల్లా పోనీ అక్కడకి వెళ్లాలనే వెళ్లాడనే అనుకుంటోంది. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభస్మాన్ని చంద్రుడి మీదకి పంపడానికి సిద్ధపడింది కోరి. వచ్చే ఏడాది ఆమె కోరిక ఫలించవచ్చు
Publish Date:Jun 19, 2022
పాలన ఎప్పుడూ జనరంజకంగా వుండాలి. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలూ ప్రజాసంక్షేమాన్ని ఆశించాలి గాని ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నపుడు మంచి పాలనను అందిస్తున్నామని ప్రభుత్వాలు ప్రచారం చేయించుకోవడం నవ్వులపాలే అవుతుంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ గ్రాఫ్ ఇప్పటికే ప్రజల దృష్టిలో పడిపోతోంది. అయినా అగ్నిపథ్ వంటి దుర్మార్గపు ఆలోచనలతో యువ తను దెబ్బతీయడం కేవలం మూర్ఖపు పాలనే అవుతుంది. అసలు బిజెపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే ప్రజావ్యతిరేకత వెల్లువెత్తే పరిస్థి తులే వున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కొత్త పార్టీ వెనుక కూడా ఎన్నికల వ్యూహమే ఉందా? ఆ వ్యూహం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.
ఉరుము లేని పిడుగులా ప్రశాంత్ కిశోర్ తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వీటిని కేవలం ఊహాగాన సభలుగా కొట్టి పారేయడానికి వీల్లేదని పరిశీలకులు అంటున్నారు.
ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరపడం ఇందు కోసం ఆయన ప్రగతి భవన్ లో రెండు రోజుల బస చేయడాన్ని తార్కానంగా చూపిస్తున్నారు.
Publish Date:Apr 27, 2022
ఓ యువకుడి ఆత్మహత్యకు కారకురాలైందని ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఓ యువతిపై అత్యంత క్రూరంగా రివెంజ్ తీర్చుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జీషీటును మంగళవారం కోర్టుకు సమర్పించారు. 21 మందిపై దాఖలైన చార్జిషీట్లో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
Publish Date:Apr 27, 2022
భక్తికి ఎల్లలు ఉండవంటారు. భగవంతునిపై తన భక్తిని ప్రదర్శించేందుకు ఏకంగా కన్నులు పెకలించుకున్నాడు కన్నప్ప. ప్రాణాలనే తృణ ప్రాయంగా అర్పించేశాడు మార్కండేయులు. భగవంతుని పై తనకున్న భక్తిప్రపత్తులను బియ్యపు పై గింజ అక్షరాలుగా మలిచి ఆ దేవుడికే తలంబ్రాలుగా అర్పించాడు ఈ భక్తుడు. నిజామాబాద్ ఇందూరు ఆర్టీసీ కాలనీకి చెందిన బిల్ల బాబు, పదవి విరమణ అనంతరం ఆధ్యాత్మిక చింతనతో శ్రీరాముడి పై తనకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది లక్షల యాభై ఒక్క వెల బియ్యపు గింజల పై శ్రీరామ నామాన్ని రాశారు. ఇందు కోసం ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానాంతరం భగవంతునికి పూజ చేసి జెల్ పెన్‌తో రామ నామాన్ని తెలుగు, హిందీ భాషలలో లిఖిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు లిఖించిన బియ్యపు గింజలను ఇందూరు ఖిల్లా రామాలయంలో శ్రీసీతారాముల వారి కళ్యాణానికి రెండు మార్లు, ఇందూరు సుభాష్ నగర్ రామాలయంలో ఒక సారి, భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణంలో తలంబ్రాలలో కలపటం జరిగింది.
Publish Date:Apr 23, 2022
దేశవ్యాప్తంగా సుమారు డజను రాష్ట్రాల్లో చీకట్లు కమ్ముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజూ 8 గంటల పైగా విద్యుత్తు కోతలు అమలవుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్తాన్ లకు పట్టిన దుస్థితే భారతదేశంలోనూ తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Publish Date:Apr 22, 2022
ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్’ వయసు ఉంటే ఓ 40 ఏళ్ళు ఉండవచ్చును. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు, 2012 ఆ ప్రాంతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా దేశానికి పరిచయం అయ్యారు. అంటే, ఓ దశాబ్ద కాలంగా మాత్రమే దేశ రాజకీయాలలో ఆయన పేరు వినిపిస్తోంది.నిజానికి గత సంవత్సరం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఆయన బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగి పోయింది. ఇంతలోనే పీకే, ఇంతింతై ..అన్నట్లుగా ఎదిగిపోయారు. ఎంతగా అంటే, కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ మొదలు, వైసీపీ, తృణమూల్. ఎన్సీపీ వంటి పిల్ల కాంగ్రెస్ పార్టీలు అలాగే, తెరాస, డీఎంకే వంటి ప్రాంతీయ, కుటుంబ పార్టీలు... ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న లౌకికవాద పార్టీలన్నీ క్యూకట్టి మరీ పీకేని శరణు వేడుతున్నాయి.
Publish Date:Nov 18, 2021
సమీర్ వాంఖడే. ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి. డ్రగ్స్ కేసులో షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసినప్పటి నుంచీ.. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఆర్యన్‌ఖాన్ కేసు నుంచి తప్పించినా.. ఎన్సీపీతో, మంత్రి మాలిక్‌తో వివాదం మాత్రం కంటిన్యూ అవుతోంది. తాజాగా, సమీర్ వాంఖడే హిందువు కాదు ముస్లిం అంటూ ఆధారాలు సైతం చూపించారు.
కదం కదం కదిపారు. అలుపెరగకుండా పోరాడుతున్నారు. వారి లక్ష్యం ఒకటే. వారి గమ్యం ఒకటే. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించడం. ఆంధ్రుల కలల కేపిటల్‌ను మూడు ముక్కలు చేసే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం విరమించుకోవడం. ఇందుకోసం రెండేళ్లుగా ఉద్యమిస్తున్నారు. ధర్నాలు, దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అయినా.. పాలకుల తీరు మారడం లేదు. జగన్ సర్కారు వెనకడుగు వేయడం లేదు. దీంతో.. జగన్‌రెడ్డి బండరాయి హృదయాన్ని ఆ దేవుడే మార్చాలంటూ.. కలియుగ వెంకన్న స్వామికి మొక్కుకోవడానికి అమరావతి రైతులు దండుగా కదిలారు. తమ గోడు మిగతా జిల్లాల వారికీ తెలిసేలా.. మహా పాదయాత్ర చేస్తున్నారు. ఉరిమే ఉత్సాహంతో.. సడలని సంకల్పంతో.. అడుగులో అడుగు వేస్తున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుమల బాట పట్టారు అమరావతి రైతులు.
Publish Date:Oct 22, 2021
పులులు కాదు పిల్లులు.. గంట కళ్లు మూసుకుంటే.. మాకూ బీపీ.. టాప్‌న్యూస్ @7pm
Publish Date:Aug 21, 2021
ట్రింగ్..ట్రింగ్.. వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది. ఇటునుంచి కాల్ లిఫ్ట్ చేస్తే.. అటునుంచి మంత్రి గారు వాయిస్ వినిపిస్తుంది. తెలిసిన గొంతే కావడంతో.. చాలా క్యాజువల్‌గా డిష్కసన్ సాగుతుంది. బాగున్నావా.. ఎక్కడున్నావ్ నుంచి మొదలై.. వెంటనే అసలు మేటర్లోకి వచ్చేస్తారు మినిస్టర్ గారు. కట్ చేస్తే.. మంత్రి గారి ఆడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతుంది
Publish Date:Jul 26, 2021
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడానికి మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనారోగ్య కారణంగా కౌంటర్ ధాఖలు చేయలేక పోయామని తెలిపారు.
Publish Date:Jun 24, 2021
మొన్న కడప జిల్లా.. నిన్న కర్నూల్ జిల్లా.. తాజాగా ప్రకాశం జిల్లా... ఏపీలో హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు బలవుతున్నారు. రోజు ఏదో ఒక చోటు అధికార పార్టీ నేతలు , కార్యకర్తలు తెగబడుతూనే ఉన్నారు, టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో వైసీపీ దాడులు తీవ్రమయ్యాయి.