ఏ1 గారి పార్టీలో ఏ సర్టిఫికెట్ ఎంపీ!
Publish Date:Aug 9, 2022
Advertisement
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం సోషల్ మీడియాను పట్టి కుదిపేస్తోంది. ఇంత ఛండాలంగా, సిగ్గు లేకుండా వ్యవహరించిన మాధవ్ ను ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే.. ఇలా న్యూడ్ వీడియోతో దొరికిపోయిన మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వైసీపీ అధినేత ఎందుకు తాత్సారం చేస్తున్నారని, తాత్సారం వెనుక కారణం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. బరితెగించి మరీ ఇంతలా దరిద్రపుగొట్టు న్యూడ్ వీడియో చేసిన గోరంట్ల మాధవ్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. మాధవ్ తోనే సరిపెట్టకుండా వైసీపీ అధినేత ను, ఆ పార్టీ నేతలు రోజా తదితరులపై కూడా అదే స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ‘అరె ఏంట్రా ఇది.. మాధవా.. నువ్వు పోలీసు స్టార్ వే అనుకున్నా.. పోర్న్ స్టార్ వా..? నీ ఏజేంటి.. నీ గేజేంటి..?.. ఎంత A1 గారి పార్టీలో ఉంటే మాత్రం A సర్టిఫికెట్ వీడియో కాల్సా..’ అంటూ ఓ నెటిజన్ ఒక రేంజ్ లో ఏసుకున్నాడు. గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ పై మంత్రి రోజా మాట్లాడాలి.. దిశ చట్టం అన్నారు.. గన్ కంటే ముందే జగన్ అని పేలారు.. ఏవమ్మా.. రోజా.. ఏంటీ ఎంపీ పరిస్థితి.. కవరేజ్ ఏమైనా మొదలుపెట్టావా లేదా..??’ అంటూ మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. ఆ అశ్లీల వీడియోను ఎంపీ మాధవ్ భార్యకి, ఆయన కూతురుకి, కోడలికి ఎంపీ బంధువుల్లో ఉన్న ఆడవాళ్లు అందరికీ చూపించి పండగ చేసుకోమని చెప్పండి’ అంటూ ఇంకో నెటిజన్ విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడు వాడిని అంటే గోరంట్ల మాధవ్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తారా, చేయరా?’ అంటూ మరో నెటిజన్ వైసీపీ అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. ‘పోర్స్ స్టార్ ఎంపీ.. ‘ఛీ రెడ్డి’ దగ్గరకు ఓసారి పోయి వస్తే బాగుండునేమో.. ఆలోచించు మాధవా’ అంటూ ఇంకో నెటిజన్ ఎద్దేవా చేశారు. ‘గోరింట పూచింది.. కొమ్మా లేకుండా’ ఒకప్పటి పాట అయితే.. ‘గోరంట్ల దొరికాడు బట్టలు లేకుండా’ అనేది వైరల్ అవుతున్న ఇప్పటి పాట అంటూ మరో నెటిజన్ తూర్పారపట్టారు. మన దేశంలో మన ఇష్టప్రకారం జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఆ హక్కుతోనే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలానే ఉంటాడు. బజారులో ఇలాగే తిరుగుతాడు.. ఆయన ఇష్టం. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఎవరూ విమర్శలు చేయకండి.. చెప్పులతో సత్కరించాల్సిందే’ అంటూ ఇంకో నెటిజన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంకా నయం.. గుడ్డలు విప్పి తిరగలేదు అంటూ మరో నెటిజన్ భయాందోళన వ్యక్తం చేశారు. ‘పరువా.. పాడా.. 16 నెలలు చిప్పకూడు మెక్కినోడిని బెయిలిచ్చి.. కోర్టు వాయిదాలను ఎగ్గొట్టమని సీఎంగా చేసిన నేరం కంటే ఇది పెద్ద నేరం కాద’ని ఇంకో నెటిజన్ జగన్ నేరం కంటే పెద్దదేమీ కాదంటూ ముక్తాయించారు. గోరంట్ల మాధవ్ మొదటి నుండీ చెడ్డోడే. అయితే.. అతను ఎంపీ పదవి చేపట్టినప్పటి నుంచి ఈ విషయాలను ఎందుకు దాచిపెట్టారో వివరించాలి’ అని మరో నెటిజన్ నిలదీశాడు. వైసీపీలో మంచి అర్హత గోరంట్ల మాధవ్ పొందాడు కాబట్టి.. మాధవన్నకు ఒక ఏడాది సీఎంగా ఎన్నుకోవాలనే ఆలోచనలో వైసీపీ వారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కుదరకపోతే 2024లో అయినా సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని వైసీపీ వారు అంతర్గత సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది’ అంటూ నెటిజన్ దుమ్ము దులిపేశారు. ‘మాధవ్ మీద ఉన్న రేప్ కేస్, మర్డర్ కేస్ గురించి చెప్పలేదేం.. 2012 అఫిడవిట్ లో కూడా ఆ విషయం ఉంది.. కొంచెం తెలుసుకోండి’ అంటూ మరో నెటిజన్ వివరించారు. ‘వైసీపీలో అంతా వెధవలే.. బుద్ధీ.. జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా.. ఇలాంటి వారికి ఎంపీ టికెట్ ఇస్తారా?’ అంటూ ఇంకో నెటిజన్ నిప్పులు చెరిగారు. గోరంట్ల మాధవ్ లో ఇలాంటి పనికిమాలిన అర్హతలు ఉన్నాయి కాబట్టే వైసీపీ అధినేత మెచ్చి మరీ తమ పార్టీ ఎంటీ టికెట్ ఇచ్చారంటూ మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. మాధవ్ వ్యవహారం ఇంత బహిరంగం అయింది కదా.. అసలిప్పుడు పార్లమెంట్ స్పందన ఏమిటి?.. తమకేం సంబంధం లేదంటూ పార్లమెంట్ లోకి యధావిధిగా రానిస్తారా? లేక సభ నుంచి బహిష్కరిస్తారా?.. రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ‘ఇటువంటి వాళ్లకు జగన్ వెతికి మరీ టికెట్ ఇస్తాడు.. వెధవ పార్టీకి వెధవలే కావాలి’ అని మరొకరు తూర్పాపట్టారు. ‘మనోడి ట్రాక్ మామూలుగా లేదు.. అయినా ఏం పర్వాలేదు. పక్కన జగన్ ఉన్నారు. ఏం పీకలేరు’ అంటూ ఇంకో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులంటే జలగన్నకు ఇష్టం. అందుకేనేమో సీనియర్లను పక్కనపెట్టి మాధవ్ కు ఎంపీ టికెట్ ఇచ్చారు అంటూ మరో నెటిజన్ విమర్శించారు. వైసీపీ నాయకులంతా ఇలాంటి వారే కాబట్టి ఎవరూ ఖండించకపోగా ఏమీ తప్పు జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారంటూ ఇంకొకరు వ్యాఖ్యలు పెట్టారు. మొత్తానికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కారణంగా ఆ పార్టీ అధినేతపైనా, ఆ పార్టీ నేతలపైనా నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టి కబడ్డీ ఆడేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/a-certificate-mp-in-a1s-party-39-141570.html