కేసీఆర్‌పై RRR ఫైట్.. అసెంబ్లీలో అబ్ ఆయేగా మజా...
Publish Date:Nov 3, 2021
Advertisement
RRR. రాజమౌళి తీస్తున్న సినిమా గ్లిమ్స్ ఎంత సెన్సేషనల్‌గా మారిందో.. హుజురాబాద్ పొలిటికల్ గ్లిమ్స్ కూడా అంతే సంచలనంగా నిలిచింది. RRR. రాజాసింగ్. రఘునందన్‌రావు. ఈటల రాజేందర్. బీజేపీ తరఫున ముగ్గురు మొనగాళ్లు. అసెంబ్లీలో కేసీఆర్‌ను కుమ్మేసేందుకు కాలు దువ్వుతున్న పోట్లగిత్తెలు. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసేందుకు.. సర్కారు వైఫల్యాలను సభలో ఎండగట్టేందుకు.. కేసీఆర్ పాలనా రీతిని నిగ్గదీసి అడిగేందుకు.. అవినీతిని నిప్పులతో కడిగేసేందుకు.. కదనోత్సాహంతో సిద్ధమవుతున్నారు ఆ ముగ్గురు. మదపుటేనుగు లాంటి కేసీఆర్‌ను.. తన విజయంతో బంధించేలా ఈటల రాజేందర్ అసెంబ్లీకి దూసుకొస్తున్నారు. రాజ్యం తన యావత్ బలాన్ని, బలగాన్ని మోహరించి.. కుట్రలు, కుతంత్రాలకు తెగించి.. పథకాలు, పైసలు వెదజల్లినా.. హుజురాబాద్ మాత్రం ఈటలకు జీహుజూర్ అంది. తమ బిడ్డను కడుపులో పెట్టుకుని సాదుకుంటామని తేల్చిచెప్పేసింది. ఈటల విజయం కేసీఆర్ పతనానికి నాంది అంటున్నారు. హుజురాబాద్ గెలుపుతో కేసీఆర్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా దెబ్బకొట్టిన రాజేందర్.. ఇక అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడేందుకు తన మిగతా ఇద్దరు సహచరులతో కలిసి రెడీ అవుతున్నారు. RRRలో మొదటి R..రాజాసింగ్. ఓల్డ్‌సిటీకా రాజా. పాతబస్తీ గబ్బర్‌సింగ్. ఏళ్లుగా మజ్లిస్‌పై సింగిల్ హ్యాండ్‌తో పోరాడుతున్న నిఖార్సైన లోటస్ వారియర్. గో సంరక్షణ కోసం తీవ్రంగా పాటుబడుతున్న నాయకుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. సింహం సింగిల్‌గా అన్నట్టు.. హౌజ్‌లో బీజేపీకి మౌత్స్పీకర్గా నిలిచారు. మొదట్లో ఒంటరి పోరాటం చేసినా.. ఆ తర్వాత రఘునందన్ తోడయ్యారు. ఇప్పుడు గజేంద్రుడిలా రాజేంద్రుడు జత కలిశారు. ఆ ముగ్గురి కలయికతో అసెంబ్లీలో అబ్ ఆయేగా మజా.. అంటున్నారు. RRRలో రెండో R.. రఘునందన్‌రావు. బీజేపీ నేతల్లోకెల్లా బలమైన వాయిస్. స్వతహాగా లాయర్ అయిన రఘునందన్.. ప్రభుత్వ లోటుపాట్లను.. లా పాయింట్లను.. బయటకు లాగి కేసీఆర్ సర్కారును గట్టిగా ప్రశ్నించే సమర్థవంతమైన నాయకుడు. హుజురాబాద్లానే దుబ్బాకలో జరిగిన హోరాహోరీ ఫైట్‌లో నెగ్గి.. అసెంబ్లీలో కేసీఆర్ నోటితోనే రఘునందన్‌రావుకు మంచి భవిష్యత్తు ఉందని పొగిడించుకునేలా పనితీరు కనబరుస్తున్నారు. ఇన్నాళ్లూ అసెంబ్లీలో బీజేపీ తరఫున మేజర్ వాయిస్ వినిపించిన రఘునందన్‌కు.. కేసీఆర్ అంతటిస్థాయి ఉన్న ఈటల రాజేందర్‌లాంటి ఉద్యమనాయకుడు తోడవడం వెయ్యి ఏనుగుల బలం కలిసొచ్చినట్టే. RRRలో మూడో R.. రాజేందర్. ఒకప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటివారు. ఉద్యమాన్ని ముందుండి ఉరకలెత్తించిన నాయకుడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి. కీలక శాఖలకు మంత్రులుగా పని చేసిన అనుభవం. కేసీఆర్‌ను రెండు దశాబ్దాలుగా దగ్గరగా గమనించిన రైట్‌హ్యాండ్. కేసీఆర్ గుట్టు.. లోటుపాట్లు.. సర్వం తెలిసిన ఆంతరంగికుడు. గులాబీ పాలనలో సాగుతున్న ధనయజ్ఞానికి ప్రత్యక్ష సాక్షి. కేసీఆర్ నియంతృత్వం.. మంత్రులను డమ్మీ చేసే గుణం.. అధికారుల బేలతనం.. ప్రగతిభవన్ అరాచకత్వం.. ఇలా కేసీఆర్ ఆయువుపట్టు తెలిసిన సమర్థమైన నేత. అలాంటి ఈటల ఇప్పుడు కేసీఆర్‌కు అగెనెస్ట్‌గా.. బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడితే.. ఇప్పుడుంటుంది అసలైన మజా..అంటున్నారు. గతంలో వైఎస్సార్ లాంటి బలమైన నాయకుడినే ధిక్కరించి.. అసెంబ్లీలో దడదడలాడించిన ఈటల రాజేందర్.. ఇప్పుడిక కేసీఆర్‌ను గడగడలాడించేందుకు కాషాయకండువాతో సభలో అడుగుపెడుతున్నారు. ఇలా ముగ్గురు బీజేపీ మొనగాళ్లు.. RRR రూపంలో అసెంబ్లీలో కేసీఆర్‌తో భీకర యుద్ధం చేసేందుకు సై.. అంటే సై సైరా.. అంటూ కలిసొస్తున్నారు. ఇక, గులాబీ బాస్‌కు ముందుందంతా.. ముసళ్ల పండగే..అంటున్నారు.
http://www.teluguone.com/news/content/-rrr-war-against-kcr-in-ts-assembly-25-125758.html