ఉపాధి చూపుతున్న ఉద్యమాలు

Publish Date:Jan 31, 2013

Advertisement

 

తెలంగాణా కోసం నెల రోజుల సకల జనుల సమ్మెతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన తెలంగాణా ఉద్యోగీ సంఘాల నాయకుడు స్వామీ గౌడ్, ఆ నెలరోజుల సమయంలోనే తన రాజకీయ జీవితానికి బలమయిన పునాది కూడా వేసుకోగలిగారు. పదునయిన వ్యాఖ్యలతో చక్కటి ప్రసంగాలు చేస్తూ, ఉద్యోగీ సంఘాలనన్నిటినీ నెలరోజులపాటు ఏకతాటిపై నడిపించి మంచి నాయకత్వపటిమను కూడా ప్రదర్శించుకోవడంతో సహజంగానే ఆయన తెరాస దృష్టిని ఆకర్షించారు.

 

ఆ నెల రోజుల సమయంలో ఆయన ఒక్క తెరాస పార్టీతోనే కాక, తెలంగాణా రాజకీయ జేయేసీ అధ్యక్షుడు ప్రొఫసర్ కోదండరాం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వంటి అందరితో మంచి పరిచయాలు పెంచుకొన్నారు. ఆ తరువాత క్రమంగా తన ఉద్యోగం, ఉద్యోగ సంఘాలకు దూరం జరుగుతూ, మొదట తెరసాలోకి ఆ తరువాత తెలంగాణా రాజకీయ జేయేసీలోకి ప్రవేశించి అంచలంచలుగా పైకి ఎదిగి ఇప్పుడు ప్రముఖనాయకుడిగా గుర్తింపు పొందారు.

 

మళ్ళీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలో మరో మెట్టుపైకి ఎక్కుతూ అయన మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. అయితే, బీజేపీతో రాష్ట్ర నాయకత్వంతో అయన ఏర్పరుచుకొన్న సత్సంబందాలు ఇప్పుడు ఆయనకి అక్కర కొచ్చాయి. పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్ రావులు ఆయనపై పోటీగా తమ అభ్యర్ధీ నిలబెట్టకూదదని నిర్ణయించడంతో స్వామీ గౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నిక అవడం ఇక లాంచన ప్రాయమే.

 

అయితే, తెలంగాణా ఉద్యమం, సాధన సంగతి ఎలాఉన్నపటికీ ముందు పదవులు మాత్రం ఆయాచితంగా వచ్చి ఆయన ఒళ్లోవాలుతున్నాయి. బహుశః ఇదే కారణంతో నేడు అనేక ఉద్యోగ సంఘ నేతలు, గల్లీ స్థాయి నాయకులు, విద్యార్దీ నాయకులూ కూడా, అందుబాటులో ఉన్న కొంత మందిని పోగేసుకొని ఏదో ఒక జేయేసీ అంటూ ఉద్యమాలంటూ మీడియా ముందు హంగామా చేయడం పరిపాటి అయిపోయింది.

 

ఇందుకు స్వామీ గౌడ్ ని తప్పు పట్టవలసిన పనిలేదు. గానీ, అయన రాజాకీయ ఎదుగల మాత్రం పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న జేయేసీలకు, వాటి నాయకులకు చక్కటి ప్రేరణ కల్గిస్తోందని చెప్పకతప్పదు. ఉద్యమాలు అవి ఏ ప్రాంతానివయినా ఇప్పుడు కాస్త చొరవ, వాగ్దాటి ఉన్న ప్రతీ ఒక్కరికీ మంచి ఉపాధి కల్పించడమే గాకుండా, అతి తక్కువ సమయంలో జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగే మార్గాన్ని కూడా చూపిస్తున్నాయి.

 

అందుకే ఉద్యమాలు కలకాలం సాగాలని కోరుకొందాము. ఉన్నవి సమసిపోతే అనకాపల్లి, ఆముదాలవలస, అన్నవరం కూడా ప్రత్యేక రాష్ట్రాలు చేయాలనీ కొత్త ఉద్యమాలు మొదలుపెడదాము. ఉద్యమం జిందాబాద్..

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. వర్షాలు తగ్గినా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా వరదల్లోనే ఉన్నాయి. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి స‌మీర్ శ‌ర్మ‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు
ఏపీ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి స‌మీర్ శ‌ర్మ‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. వ‌ర‌ద‌ల్లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యంపై న్యాయ విచార‌ణ‌కు డిమాండ్  చేశారు. ప్ర‌భుత్వ అంచ‌నా మేర‌కు రూ.6,054 కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.
ఇంతటి తీవ్రమైన అంశంపై విపక్షాలు సైలెంటుగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. విపక్షాలను దళిత బంధు నుంచి సీఎం కేసీఆరే సైడ్ ట్రాక్ చేశారని అంటున్నారు. ్ందుకే వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారని, విపక్షాలు కూడా అన్న వదిలేసి వరి ధాన్యం కేంద్రంగానే ఉద్యమం చేస్తున్నాయని చెబుతున్నారు. అలా దళిత బంధు గురించి విపక్షాలు మాట్లాడకుండా కేసీఆర్ తనదైన శైలిలో సైడ్ చేశారని అంటున్నారు.
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీ భగ్నమైంది. అయితే పోలీసుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. ఇప్పటివరకు కాలేజీ విద్యార్థులు ఎక్కువ రేవ్ పార్టీల్లో పాల్గొంటున్నట్లు బయటపడగా.. తాజాగా పట్టుబడిన వారిలో హోమో సెక్సువల్ ఎక్కువగా ఉండటం సంచలనంగా మారింది
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి కార్యచరణ ప్రకటించింది ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ. డిసెంబర్ 1 నుంచి పల్లెపల్లెకు వెళ్లనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు డిమాండ్స్ తో కూడిన ఎజెండాను సిద్ధం చేసింది.
అతనో ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపై బాగా స్పందిస్తుంటారు. ఆయనకు ఓ అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆయన దృష్టికి వచ్చాయి.
వాళ్లు ముగ్గురు స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్లలో ఒకరు నాలుగు రోజుల క్రితం కారు కొన్నాడు. దీంతో మూడు రోజుల నుంచి ముగ్గురు స్నేహితులు కొత్త కారులో షికారు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే శనివారం రాత్రంతా కారులో హైదరాబాద్ తిరిగారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చాతీ నొప్పిగా ఉండడంతో పరీక్షల కోసం గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు
ఆంధ్రప్రదేశ్’లో వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం జోరుగా సాగుతోందనే ప్రచారం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అలాగే, జగన్ రెడ్డి ప్రభుత్వం లౌకికవాద మూల సూత్రాన్ని పక్కన పెట్టి, మత వివక్షకు పాల్పడుతోందనే ఆరోపణలు తరచూ వినవస్తూనే ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం మరోసారి సీరియస్ అయింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానిక సమాధానం ఇవ్వలేదు. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని ఏపీని కేంద్రం ఆదేశించింది.
న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్సులో భారత్ కు 49 పరుగుల కీలక ఆధిక్యత లభించింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది.
ప్రభుత్వాలు ఏవైనా ఉపాధికల్పను ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుంటాయి. తమ రాష్ట్రంలోని యువతకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటాయి. ఇందుకోసం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుంటాయి. కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి లభిస్తుంది కాబట్టి.. పారిశ్రామిక వేత్తలకు వివిధ రాయితీలు ప్రకటించి తమ వైపు తిప్పుకోవాలని చూస్తాయి. అందుకే దిగ్గజ సంస్థలను ఆకర్షించడానికి రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం అలాంటిదేమి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల (నవంబర్) 29 న ప్రారంభమవుతాయి. సుమారు పక్షం రోజులకు పైగా జరిగే సమావేశాలు, ఒక విధంగా ప్రభుత్వానికి చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోందని రాజీకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక అధికార ప్రతిపక్షలు రెండూ కూడా అస్త్ర శస్త్రాలతో యుద్దానికి సిద్ధమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.