![]() |
![]() |
దంత సంరక్షణ మన ఆరోగ్య సంరక్షణలో ఒక భాగం. కానీ చాలామంది ఆరోగ్య సంరక్షణకు ఇచ్చినంత ప్రాధాన్యత దంత సంరక్షణకు ఇవ్వరు. చక్కని దంతాలు చక్కనైన రోజును నడిపిస్తాయనడంలో సందేహం లేదు. దంతాలు బాగుంటేనే రోజువారీ అవసరమైన ఆహారాన్ని సరిగ్గా తీసుకోగలుగుతాం. అదే పంటి నొప్పి, పన్ను ఊగడం, పళ్ళ మధ్య దూరం, పిప్పి పన్ను మొదలైనవి ఉన్నప్పుడు దేన్నీ సరిగ్గా తినలేం, తాగలేం. అందుకే దంత ఆరోగ్యం చాలా ముఖమైంది. దంతాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే..
పుట్టకముందే దంతాలు ఏర్పడటం మొదలవుతుంది:
పిల్లలు పళ్లతో పుట్టకపోయినప్పటికీ, అవి తల్లి కడుపులో పిల్లలు ఉన్నట్టే ఏర్పడటం ప్రారంభిస్తాయి. ఈ దంతాలు శిశువు పుట్టకముందే అభివృద్ధి చెందడం మొదలవుతుంది. సాధారణంగా శిశువుకు 6 మరియు 12 నెలల వయసులో పళ్ళు రావడం ప్రారంభమవుతుంది.
దంతాలే స్ట్రాంగ్..:
మన దంతాల మీద ఉండే ఎనామిల్ మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం, మన ఎముకల కంటే కూడా ఇది చాలా గట్టిది. పంటి ఎనామిల్‌లో కనిపించే ప్రధాన ఖనిజాన్ని హైడ్రాక్సీఅపటైట్ అంటారు.
దంతాలను స్ట్రెయిట్ చేయవచ్చు:
వంకరగా ఉండటం, ఎత్తు పళ్ళు, పన్ను మీద పన్ను రావడం వంటి సమస్యలను సరిచేయవచ్చు. వీటిని అలైన్‌నర్‌లతో స్ట్రెయిట్ చేయవచ్చు. ఈ ఆర్థోడోంటిక్ చికిత్సలు దంతాలను క్రమంగా సరైన స్థానాల్లో పళ్ళు ఉండేలా చేయడానికి సున్నితమైన ఒత్తిడిని తీసుకొస్తాయి.
ప్రతి వ్యక్తికి దంతాలు ప్రత్యేకంగా ఉంటాయి:
మన వేలిముద్రల మాదిరిగానే, మన దంతాలు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల దంతాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, వాటిని గుర్తించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.
మాటకు ముఖ్యం:
దంతాలు కొన్ని పదాలను స్పష్టంగా ఉచ్చరించడంలో సహాయపడతాయి. దంతాలు సరిగా లేకపోయినా, తొందరగా వీటిని కోల్పోయిన కొన్ని పదాలను పలకడంలో ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది నత్తి అనే భావన చాలామందిలో ఏర్పడిపోతుంది. తెలుగు వ్యాకరణంలో నోటిలో ఏ భాగం దంతాలతో ఏ అక్షరాలు ఉత్పన్నం అవుతాయనే విఆహాయం కూడా ఉంటుంది. కాబట్టి దంతాలు మన మాటకు మూలం.
నోటి పరిశుభ్రత ఉంటే:
సాధారణ దంత సంరక్షణతో పాటు అప్పుడప్పుడు వైద్యులను కలవడం, దంతాల ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడం ముఖ్యం. దంతాలు తొందరగా పాడయ్యేందుకు సహకరించే ఆహారాలు, కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు ఎక్కువ తీసుకోరాదు.
ఓరల్ హెల్త్ మొత్తం ఆరోగ్యంతో ముడిపడి ఉంది:
పేలవమైన నోటి ఆరోగ్యం ద్వారా గుండె జబ్బులు, మధుమేహం మరియు అల్జీమర్స్ వ్యాధితో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ముడిపడి ఉంటాయి. మీ దంతాల సంరక్షణ మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దోహదం చేస్తుంది.
నోటి పరిశుభ్రత, చక్కని అలవాట్లు, సమతుల్య ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా దంతవైద్యుడిని కలవడం మొదలైనవి చేయడం వల్ల మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు. చక్కగా నవ్వుతూ..
◆నిశ్శబ్ద
![]() |
![]() |