నేను మరదలు అయితే కవిత ఏమవుతుందిరా కుక్క! 

తెలంగాణ రాజకీయాల్లో మాటలు హద్దులు దాటుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నిక కేంద్రంగా సాగిన మాటల యుద్దం చల్లారకముందే వైఎస్ షర్మివ, టీఆర్ఎస్ నేతల మధ్య గరంగరం యుద్ధం సాగుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డికి కౌంటరిచ్చారు వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని నిలదీసారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని ఆమె తెలిపారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయన్నారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని ఆమె అన్నారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు.

 ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు.

మంత్రి నిరంజ‌న్‌రెడ్డి వైఎస్సార్‌టీపీ అధినేత్రిపై బుధవారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ష‌ర్మిల పేరును నేరుగా ప్ర‌స్తావించ‌కున్నా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ష‌ర్మిలను ఉద్దేశించేన‌ని ఈజీగా తెలిసిపోతున్నాయి. దీంతో ఆయనకు ఘాటుగా బదులిచ్చారు షర్మిల.