Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రీల్స్ మోజా.. ఆత్మహత్యా
posted on: Mar 17, 2026 4:30PM

ఢిల్లీలో ఓ వ్యక్తి తన కజిన్ తో వీడియో తీయించుకుంటూ లైవ్ లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 28 ఏళ్ల ఆ యువకుడు అలా లైవ్ లో తనను తాను కాల్చుకుని మృత్యు వాత పడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హస్తినలోని దల్లూపురా ప్రాంతంలో సోమవారం (మార్చి 16) ఈ ఘటన జరిగింది. అతడు తుపాకీని లోడ్ చేస్తుండగా అతని కజిన్ ఈ వీడియోను చిత్రీకరించాడు. తుపాకీని లోడ్ చేసిన ఆ యువకుడు వీడియో చిత్రీకరణ జరుగుతుండగానే లైవ్ లో తనను తాను కాల్చుకుని మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రీల్స్ మోజా, లేక ఆత్మహత్యా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
కాగా ఈ ఘటన జరిగిన విధానం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. పలువురు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. మరి కొందరు అతడి మానసికస్థితి సరిగా ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు అయితే ఆ తుపాకీ ఆ యువకుడి చేతికి ఎలా వచ్చిందన్న కోణంలో ఆరాతీస్తున్నారు.
ఆ యువకుడి స్నేహితులు బంధువులను విచారిస్తున్నారు. అలాగే యువకుడు లైవ్ లో తనను తాను కాల్చుకుని మరణించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆ యువకుడు నవ్వుతూ ఉత్సాహంగా ఉండటం, అంతలోనూ తనను తాను కాల్చుకుని మరణించడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో యువకులు తమ తుపాకితో ఫొటోలు, వీడియోలు, రీల్స్ తీసి సామాజిక మాధ్యమంలో పోస్టులు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడు.. రీల్స్ మోజులో పడి ఆకతాయితనంగా కాల్చుకున్నట్లు పోజిద్దామనుకుని పొరపాటున తుపాకి పేలడంతో మరణించాడా అన్న సందేహాలు సైతం వ్యక్తమౌతున్నాయి.
లైసెన్స్ లేకుండా తుపాకీలను కలిగి ఉండటం నేరం అన్న విషయాన్ని ప్రజలలో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రా యపడుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.






