యోగా చేయండి గుండెపోటు నుండి కాపాడుకోండి...

 చలికాలం లో గుండె పోటు  నుండి కాపాడుకోండి. చలికాలం లో గుండె పోటు రాకుండా రక్షించ బడాలంటే  తప్పకుండా వ్యాయామం లేదా యోగ చేయాలి. అంటున్నారు నిపుణులు. గుండె సమస్యతో బాధ పడే వారు చలికాలం లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది నిపుణులు శాస్త్రజ్ఞులు గుండె పై చేసిన పరిశోదనలో తెలిసిన రహస్యం ఏమిటి  అంటే చల్లటి వాతావరణం లో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని  ఈ వ్యాసం లో నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా రోజుకి అరఘంట పాటు నడిచిన చాలని, అలాగే చిన్న పాటి వ్యాయామం చేసినముఖ్యంగా యోగా చేయడం ద్వారా ఎలాంటి సమస్య నుండి అయినా రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చలికాలం లో ఎండవేడిమి తగ్గడం వల్ల  శరీరం లో రక్త ప్రవాహం సరిగా లేక రక్త నాళాలు కుంచించుకు పోతాయి.

దీనిఫలితంగా బిపి  తో పాటు కొలస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఈ పరిస్థితిలో చలికాలం లో గుండె సమస్యలు  ఉన్న వారు తమ ఆహారం లో అప్రమత్తం గా ఉండాలని వ్యాయామం తో పాటు యోగ సాధన చేయాలని. యోగా ప్రాణా యామం కలిపి చేయడం ద్వారా శరీరం మనసు,ఆత్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏదైనా యోగా నిపుణులైన గురువుల సమక్షం లో యోగ సాధన చేస్తే గుండె పోటు వంటి వి జీవన శైలి సంబందించిన సమస్యలు నిలువరించవచ్చు.హార్ట్ అట్టాక్ ను నివారించ వచ్చు మూడురకాల యోగా పద్దతులు ఆసనాలు తప్పనిసరిగా చేయాల్సిందే ముందుగా యోగ చేసే పద్దతులు విధివిధానం,సాధన చేయాలి,అలాగే వజ్రాసనం,పవన ముక్తాసనం, మండూక ఆ సనం, వంటివి సాధన చేస్తే రక్త ప్రసారం సరిగా జరిగి గుండె పోటును నివారించవచ్చు. 

మాండుకాసనం....

యోగ సాధనకు ముందు వజ్రాసనం లో కూర్చోవాలి.దీనిని వజ్రాసన ముద్ర అని అంటారు.మన శరీరంలో ని మోకాళ్ళ పై కూర్చుని వేసే సులభమైన ముద్ర.ఆ తరువాత మీ చేతుల లోని నాలుగు ఉంగరాల లోని లోపలి భాగాలను బాగా నొక్కండి. పిడ్ఫికిలిని మీ మొక్కకు రెండు వైపులా ముందుకు వంగండి.మీ పిడికిలి తో మీ నాభి భాగాన్ని నొక్కడం ప్రారంభించండి.

మీ పొట్టను ఎంతవరకూ వీలైతే అంతనిలివుగా ఉంచండి.ఒంగిన తరువాత ముందుకు చూడండి.ఈ ముద్రలో మీ ఊపిరి ని బయటికి పంపండి.ఇలా కొంత సేపు చేయండి.ఇది కొంతమేర మీరు ఉపసమనం  కలిగిస్తుంది. ఈ ముద్రనుండి బయటికి వచ్చే టప్పుడు స్వాస తీసుకోండి.మీ వెనుక వైపు నుక్కును మోకాళ్ళ పైన  మెల్లగా పైకి తీయండి మీ చేతులను మీ భుజాల పైకి తీసుకోండి.మరల యధాస్థితికి రండి.