ఇంత‌కంటే రెచ్చ‌గొట్టే చ‌ర్య ఉంటుందా?

త‌మ పార్టీ నిర్మాత విగ్ర‌హం వ‌ద్ద వైసీపీ ప్ర‌భుత్వం డివైడ‌ర్లు ఏర్పాటు చేసింద‌ని టిడీపీ శ్రేణులు రెచ్చి పోయారు. డివైడ‌ర్ల‌ను కాళ్ల‌తో త‌న్ని కూల్చేసిన సంఘ‌ట‌న నెల్లూరు న‌ర్త‌కీ సెంట‌ర్ లో జ‌రిగింది.  ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం టిడీపీని రాజ‌కీయంగా ఎదుర్కొన‌లేక వైసీపీ ప్ర‌భుత్వం ఈ విధ‌మైన దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డు తోందని టీడీపీ వ‌ర్గీయులు తీవ్ర‌స్థాయిలో నిల‌దీశారు.
అస‌లే రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు అన‌నుకూలించ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం టీడీపి వ‌ర్గాల‌కు అన్ని విధాల స‌మ‌స్య‌లు క‌ల్పించాల‌న్న త‌లంపుతోనే ప్ర‌తీ చిన్న అంశాన్ని ర‌చ్చ‌చేసి వీధి పోరాటాల‌కు దిగు తున్నారు. వాస్త‌వానికి న‌ర్త‌కి  సెంట‌ర్‌లోని ఎన్టీఆర్  విగ్ర‌హం ద‌గ్గ‌ర డివైడ‌ర్ ఏర్పాటు  పార్టీ వర్గీయుల‌ను రెచ్చగొట్ట‌డానికి చేప‌ట్టిన చ‌ర్యేన‌ని న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులు  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టిడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లూ  రోడ్డ‌పై  బైఠాయంచారు. కార్పోరేష‌న్ అధికారుల‌ను తీవ్ర‌స్థాయి లో నిల‌దీస్తూ భారీ నినాదాలు చేశారు.

పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితుల‌ను అదుపు లోకి తెచ్చారు.ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ విగ్రహం వద్ద అడ్డంగా డివైడర్ కడితే నేనే పగలగొట్టా.. ఏం పీకుతారు?’ అంటూ సవాల్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాజకీయం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఒక వైపున రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం వద్ద డివైడర్ ను అడ్డంగా ఎలా కడుతుందని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతి లేదని, జిల్లా వ్యాప్తంగా అనేక  ప్రాం తాల్లో ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. నర్తకి సెంటర్లో డివైడర్ కావాలని  ఎవ రడిగారని, ఎందుకు నిర్మిస్తున్నారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సూటిగా ప్రశ్నించారు.