Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సిట్ చార్జిషీట్..వైసీపీ సంబరాలు.. విషయమేంటంటే?
posted on: Jan 31, 2026 10:01AM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో వైసీపీ చేస్తున్న హడావుడి చూస్తుంటూ.. ఆ పార్టీ అగ్రనేతలు నిండా మునిగినట్లేనన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే భక్తులు అత్యంత పవిత్రంగా భావించి స్వీకరించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యిందన్న విషయాన్నిసిట్ నిర్ద్వంద్వంగా ధృవీకరించి చార్జిషీట్ లో పొందు పరిచింది. ఇప్పుడు ఆ చార్జిషీట్ నే తమకు క్లీన్ చిట్ గా ఆపాదించుకుంటూ వైసీపీ చేస్తున్న అతి ప్రచారం. చూపుతున్న అత్యుత్సాహం అందరినీ విస్మయ పరుస్తోంది.
సిట్ చార్జిషీట్ లో లడ్డూ తయారీలో వినియోగించింది అసలు నెయ్యే కాదని పేర్కొంది. రసాయినాలు కలిపారని స్పష్టం చేసింది. అయితే నెయ్యి కల్తీ వ్యవహారాన్ని పక్కన పెట్టి.. వైసీపీ మాత్రం తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నిర్ధారించిందంటూ హడావుడి చేస్తున్నాయి. సిట్ ఛార్జిషీట్‌పై వైసీపీ చేస్తున్న అతి ముందు ముందు ఆ పార్టీ మెడకే చుట్టుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం వైసీపీ నేతలు సిట్ ఛార్జిషీట్‌లో జంతు కొవ్వు అనే పదం లేదని సంబరపడుతూ, సిట్ చార్జ్ షీట్ ను సమర్ధిస్తున్నారు. సిట్ చార్జిషీట్ లో పేర్కొన్న అంశాలు నూటికి నూరు శాతం నిజం అన్నట్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే సిట్ చార్జ్ షీట్ ను ఆమెదిస్తున్నారు.
ఇక్కడే ఆ పార్టీ నేతలు పప్పులో కాలు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ నెయ్యి అని సిట్ చార్జ్ షీట్ విస్పష్టంగా పేర్కొంది. జంతు కొవ్వు అన్న పదం లేదన్న కారణంతో దానిని ఆమోదిస్తున్న వైసీపీ ఒక వేళ కోర్టులు సిట్ నివేదిక ఆధారంగా నిందితులపై చర్య తీసుకుంటే.. వైసీపీ ఇక నోరెత్తే అవకాశం ఉండదు. జంతు కొవ్వు ప్రస్తావన లేదు కానీ, సిట్ చార్జిషీట్ అసలు అది నెయ్యే కాదని, కేవలం కెమికల్స్ , వెజిటబుల్ ఆయిల్స్‌తో చేసిన మిశ్రమమని పేర్కొంది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ మాటేమిటన్న ప్రశ్నకు వైసీపీ ఏం బదులిస్తుంది?
వైసీపీ అత్యుత్సాహం, విమర్శలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడాన్ని వ్యూహాత్మకమనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ సిట్ చార్జిషీట్ ను ఆమోదించడమంటే.. ఆ పార్టీ కెమికల్ కల్తీ, టెండర్ల అక్రమాలు జరిగినట్లు అంగీకరించినట్లునని తెలుగుదేశం కూటమి సర్కార్ అంటున్నది. ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ తాము సిట్ చార్జ్ షీట్ ను క్లీన్ చిట్ గా పరిగణించి అతి చేయడం వల్ల ఎదురయ్యే ముప్పు ఏమిటన్నది టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అర్థమైనట్లు కనిపిస్తున్నది. అందుకే వైసీపీ నేతలంతా సిట్ చార్జిషీట్ ను స్వాగతిస్తుంటే, ఆయన ఒక్కరూ మాత్రం తనకు సిట్ పై నమ్మకం లేదంటున్నారు.


.webp)



