Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నీతి సూత్రాలు ఏమయ్యాయి జగన్ గారూ?
posted on: Jul 14, 2014 1:01PM
.jpg)
వైసీపీ నాయకుడు జగన్ గారు గత పది రోజుల నుంచి అన్యాయం జరిగిపోయింది, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అన్యాయం చేసింది, న్యాయం కావాలి అని మొత్తుకుంటూ రాష్ట్ర గవర్నర్ దగ్గరకి, ఢిల్లీకి వెళ్ళి చాలా గడపలు ఎక్కి చాలా సీన్ క్రియేట్ చేశారు. జగన్ గారు సీన్ క్రియేట్ చేయడం వెనుక రీజన్ ఏమిటయ్యా అంటే, స్థానిక సంస్థల అధ్యక్ష ఎన్నికలలో తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని, అందువల్ల చాలాచోట్ల తమ పార్టీ అధ్యక్ష పీఠాలను గెలుచుకోలేకపోయిందని జగన్ చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల అధ్యక్ష ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ బోలెడన్ని ఘోరాలు చేసేసిందని కనబడిన ప్రతి ఒక్కరికీ చెప్పుకుంటూ తిరిగారాయన. తెలుగుదేశం పార్టీని చూసి తాను భయపడిపోతున్నానని, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలంటేనే భయం వేస్తోందని జగన్ చాలా అమాయకుడిలా చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారా లేదా అనే విషయం అలా వుంచితే, జగన్ పార్టీ తీరు మాత్రం కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకినట్టుగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆదివారం జరిగిన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా స్థానిక అధ్యక్ష పీఠాల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యకాండ, ప్రకాశం జిల్లా అధ్యక్ష పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి దక్కించుకున్న తీరును రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మా పార్టీకి చెందిన నాయకులను తెలుగుదేశం పార్టీ లాక్కుందని నిన్నటి వరకు జగన్ చెప్పిన నీతి సూత్రాలు ఇప్పుడేమయ్యాయని అంటున్నాయి.



.jpg)


