వైసీపీకి భంగ‌పాటు.. బిజెపీకి ఆయాసం!

ప‌రిస్థితులు బాగోన‌పుడు వున్న‌దానితోనే సంతృప్తిప‌డాలి. వ‌చ్చేది ఎలాగూ వ‌స్తుంది గ‌నుక మ‌న స‌త్తా చూపించి ఇత‌రుల‌ను భ‌య‌పెట్టి, కానుక‌లు ఇచ్చి సాధించాల‌న్న ఆతృత‌తో సాధించేది ఏదీ గొప్ప విజ‌యం అనిపించు కోదు. ఇపుడు ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల విష‌యంలోనూ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోని వైసీపీ గెలిచినా గెలిచిన సంతృప్తి లేకుండాపోయింది. దివంగత మంత్రి మేకపాటిగౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయంప్రకారం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీకి  దూరంగా ఉంది. ఇక ఆది వైసీపీ, బీజేపీ, బీఎస్సీలతోపాటు మొత్తం 14 మంది బరిలో నిలిచారు. టీడీపీ బరిలో లేక పోవడంతో లక్ష ఓట్ల  మెజారిటీ వస్తుందని వైసీపీ అగ్రనాయకులు భావించారు. ఆ లక్ష్మసాదనే ధ్యేయంగా మంత్రులు, ఎమ్మెల్వేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఆత్మకూరులోనే మకాం వేసి ప్రచారాన్ని ఊదరగొట్టారు. 

నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో మండలానికి ఓ మంత్రి, ఎమ్మెల్యేను  ఇన్ఛార్జులుగా  నియ మించారు. ఇంత చేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంత్రుల  రోడ్ షోలు వెల వెల బోవ డం, తాయిలాలు వ్య‌ర్ధ‌మ‌వ‌డ‌మే మిగిలి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఎంత‌చేసినా చివ‌రికి  82,888  ఓట్ల తో వైసీపీ గెలిచింది. పోటీలో వైసీపీకి చుక్క‌లు చూపాల‌నుకున్న బిజేపీ 19,332 ఓట్ల‌తో స‌రిపెట్టుకుంది. 

 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు వేల పైచిలుకు నోటాకు రాగా ఇప్పుడు రెండింతల ఓట్లు వేసి అభ్యర్థులందరినీ తిరస్క రించడం గమనార్హం. లక్ష మెజారిటీ కోసం సర్వశక్తులూ ఒడ్డిన వైసీపీ మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా  ఆత్మకూరులోనే! బసచెసినా..గతం కంటే 18 శాతం పోలింగ్ తగ్గుదల వచ్చింది. దీంతో 82.888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి విజయసాధించారు. 19,332 ఓట్లతో  బీజేపీ సరిపెట్టుకోక తప్పలేదు. పాల‌నాప‌ర వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో వెల్లువెత్త‌డంతో వారిని సుముఖం చేసుకో వాల్సి వ‌చ్చి ఓట‌రుకు రూ.500 చొప్పున నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 80 శాతం మందికి పంచిన‌ట్లు స‌మా చారం.  ఇందుకు బాధ్యులుగావలంటీర్లు, పొదుపు వీఏవోలను నియమించు కున్నారు.ఇందుకుగాను వీరికి రూ.5 వేలు చొప్పున ముట్టజె ప్పారు.

ఏదో అభివృద్ధి ప‌నుల‌కు ఇచ్చిన‌ట్టు ఇలా పంప‌కాలు చేయ‌డ మేమిటో ప్ర‌భుత్వంవారే సెల‌వియ్యాలి.  ఇక్క‌డ పెద్ద విడ్డూర‌మేమంటే.. ఆత్మ‌కూరు రైతాంగానికి బకా యిలు వెంట‌నే చెల్లించేయ‌డం. జిల్లా మొత్తం మీద ఎంతోమంది రైతులు బ‌కాయిల కోసం వేచి చూస్తుం టే, ఆత్మ‌కూరువారికి మాత్ర‌మే ఆ సౌక ర్యం వెంట‌నే క‌ల్పించ‌డం కేవ‌లం వారి ఓట్ల‌కు గాలం వేయడ మేన‌ని అర్ధ‌మ‌వుతుంది. మ‌రో వంక కాంట్రా క్ట‌ర్ల నుంచి కూడా వ్య‌తిరేక‌త రాకుండా వారికీ బిల్లులు  మం జూరు చేయ‌డం! పోనీ ఇంత‌జేశారు ల‌క్ష మెజారిటీ క‌ల నెర‌వేరిందా అంటే అది కాలేదు. అస‌లు పోలింగ్ శాత‌మే ఆశించిన స్థాయిలో పెర‌గ‌క పోవ‌డ‌మూ గ‌మ‌నార్హ‌మే.  2019 ఎన్నికలతో పోల్చితే 18 శాతం పోలింగ్ తగ్గింది. ఈ ప్రభావం మెజారిటీ పై పడింది.   ఈ ఉప ఎన్నికలో నోటాకు ఎక్కువ మంది.ఓట్లు వేశారు. 2019లో 2 వేల పై చిలుకు ఓటర్లు మాత్రమే నోటాకు ఓటు వేస్తే ఇప్పుడు 4179 మంది నోటాకు ఓటు వేసి అభ్యర్థులందరినీ తరస్క రించడం గమనార్హం. టీడీపీ పోటీలో లేకపోవడం వైసీ పీపై వ్యతిరేకతతో ఎక్కువగా నోటావైపే మొగ్గు చూపారు. బ్యాలెట్ ఓట్లలో సైతం నోటాకు మూడు ఓట్లు రావడం గమనార్హం.

ఇక బిజేపీ వారి విష‌యానికి వ‌స్తే, ఆత్మ‌కూరులో గ‌ట్టిపోటీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. 40 నుంచీ 50 వేల ఓట్లు సాధించి రాష్ట్ర‌ పార్టీలో కొత్త వూపు తీసుకురావాల‌నుకున్నారు. అందుకు మేమేమీ త‌క్కువ  తిన్న వాళ్లం కావ‌ని హేమాహేమీల‌ను ప్ర‌చార రంగంలోకి దింపారు.  ఒక దశలో గెలు తమదేనన్నారు . అయితే వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆ పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి పోరాడినాకేవలం 19, 332 మాత్రమే సాధించగలిగారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ పార్టీకి 2వేల పైచిలుకు ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ మూడేళ్ల కాలంలో బీజేపీ బలపడిందని చెప్పడానికి  వీలులేని పరిస్థితి ప్రధాన ప్రతిపక్షమైన  టీడీపీ ఎన్నికల బరిలో లేదు కాబట్టి అనంతృప్తి  ఓట్లు బీజేపీకి పడ్డాయనే వాదన ఉంది. ఇక  బీఎస్సీకి  కేవలం 4, 897 ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో వైసీపీ విజ‌యం గ్యారంటీ అని తేలేక  బెట్టింగ్‌రాయ‌ళ్ల హ‌డావుడి  అంతా యింతా  కాకుండా పోయింది.  టిడీపీ పోటీలో లేదుగ‌నుక, ఇక్క‌డ బిజెపీకి అవకాశం లేదుగ‌నుక నిజంగానే వైసీపీ పెద్ద మెజారిటీతో  గెలుస్తుంద‌ని బెట్టింగ్ బాబులు పందాలు కాయ‌డంలో త‌ల‌మున‌క‌ల‌య్యారు.  వైసీపీ అబ్య‌ర్ధి త‌ప్ప‌కుండ ల‌క్ష మెజారిటీతో గెలుస్తాడ‌ని రెండింత‌ల ఉత్సాహంతో పందాలు కాసిన వారం తా పోలింగ్ ప్రక్రియ‌, ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌ల‌తో నీరుగారిపోయారు. అస‌లు పార్టీవారు ఆశించిన ల‌క్ష మెజా రిటీకి క‌నీసం ద‌గ్గ‌ర‌లో కూడా ఓట్లు ప‌డ‌లేదు.  పోలింగ్ ప్రక్రియపూర్తయినప్పటి నుంచి వైసీపీ మెజార్టీపై కొందరు, బీజేపీకి 15 వేలఓట్లు కూడా దాటవని మరి కొందరు బెట్టింగులు కాశారు. జిల్లాలోనే ఇతర జిల్లాల్లో సైతం బెట్టింగ్ల జోరు కొనసా గింది. పోలింముందు నుంచే కొంతమంది ఆత్మకూరు నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో సర్వే చేసుకుని వెళ్లడం గమనార్హం. వైసీపీకి  అత్యధిక మెజార్టీ వస్తుందని కొందరు, ప‌ది వేలకు పైబడి మెజారిటీ దక్కదని మరికొందరు పందేలు కాసినవారికి ఎదురుదెబ్బ తగిలింది.