మాజీ మిత్రులపై సిన్హా ఆశలు ... కమలం ఓటు క్రాస్ అవుతుందా?

ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా, ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఒక్కప్పుడు  బీజేపీలో ఉన్న  సిన్హా, ఆ  పార్టీలో ఉన్న మాజీ మిత్రుల మద్దతు కోరతానని చెప్పారు. నిజమే, రాష్ట్రపతి ఎన్నికల్లో, రాజకీయ పార్టీలు విప్. జారీ చేయవు. ఎలెక్టోరల్ కాలేజీలో ఓటర్లుగా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసేందుకు సంపూర్ణ స్వేఛ్చ ఉంటుంది. అయితే, సహజంగా పార్టీ నిర్ణయం ప్రకారమే, ఓటింగ్ ఉంటుంది.అక్కడక్కడా క్రాస్ ఓటింగ్ జరిగిన సందర్భాలు లేక పోలేదు. కానీ, క్రాస్ ఓటింగ్’ అన్ని సందర్భాలో అయ్యే పని కాదు. ఇంతవరకు  దేశ చరిత్రలో,  క్రాస్ ఓటింగ్’తో, రాష్ట్రపతి అభ్యర్ధి గెలిచిన సందర్భం ఒకే ఒక్కటి కనిపిస్తుంది. 

1969 రాష్ట్రపతి ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ నీలం సంజేవ్  రెడ్డిని తమ అభ్యర్ధిగా పోటీకి దించింది. అయితే, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగిన వీవీగిరికి మద్దతుగా ఆత్మప్రభోదం పిలుపు ఇవ్వడంతో, అధికార కాంగ్రెస్ అభ్యర్ధి సంజీవ రెడ్డి ఓడి పోయారు. స్వతంత్ర అభ్యర్ధి వీవీ గిరి విజయం సాధించారు. అందుకే, రాష్ట్ర పతి ఎన్నికల్లో అదొక వైచిత్రిగా నిలిచి పోయింది. అయితే, కాంగ్రస్ పార్టీ రెండుగా చీలిపోయిన నేడ్పహయ్మ్లో జరిగిన ఆ  ఎన్నికాలో తప్ప, ఇకేప్పుడు అలాంటి సందర్భం ఎదురు కాలేదు. 

అదలా ఉంటే, ఇప్పుడు యశ్వంత్ సిన్హా సహజంగా అందరితోపాటుగా బీజేపీ మద్దతు కూడా కోరతానని అంటే, అదొక రకం, అందరూ చేసేదే, రేపు ఎన్డీఎ అభ్యర్ధి  ద్రౌపది ముర్ము కూడా, కాంగ్రెస్ సహా, అన్నిపార్టీల నాయకులను కలిసి, మద్దతు కోరతారు.కానీ, యశ్వంత్ సిన్హా, ప్రత్యేకించి బీజేపీ  మిత్రులను మద్దతు కోరతానని చెప్పడం, రాజకీయ చర్చకు  తెర తీసింది  ఇటు అధికార కూటమిలో అటు విపక్ష కూటమిలోనూ ఆసక్తికర చర్చకు జరుగుతోంది, అనుమనాలూ  వ్యక్తమవుతున్నాయి. 

ఓ వంక ప్రతిపక్ష కూటమికి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్  గాంధీ,  సహా సిన్హాకు మద్దతు ఇస్తున్న పార్టీలు, “రాష్ట్రపతి ఎన్నిక.. ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు  రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరు” గా చూస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే, మరో అడుగు ముందుకేసి, రాష్ట్రపతి ఎన్నిక, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా  జరుగుతన్న విపక్షాల ఉమ్మడి పోరాటంగా అభివర్ణించారు.

మరో వంక యశ్వంత్ సిన్హా, బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం వల్లనే తాను పార్టీ వదిలివచ్చానని చెప్పడం ద్వారా, తనకు సంఘ్ పరివార్’ సిద్ధాంతాలతో విభేదాలు లేవని  చెప్పకనే చెప్పారు. అది చాలా వరకు నిజం కూడా మంత్రి పదవి ఆశించి, రాలేదన్న దుగ్ధతో అయన బీజేపీని వదిలేశారనే ఆరోపణలు లేక పోలేదు.  మరోవంక సిన్హా బీజేపీలోని మిత్రుల మద్దతు కోరతానని ప్రకటించారు. ఈ అన్నిటినీ మించి, అయన కుమారుడు జయంత్ సిన్హా ఇప్పటికీ  బీజేపీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. కొంతకాలం  మోడీ మంత్రివర్గంలోనూ ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా, ఆర్ధిక మంత్రిత్వ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అంటే, యశ్వంత్ సిన్హా బీజేపీ నుంచి బయటకు వచ్చినా, ‘ఇంగువ కట్టిన  గుడ్డకు వాసనా వదలనట్లు సంఘ పరివార్ వాసనలు మాత్రం ఇంకా పూర్తిగా పోలేదని అనుకోవచ్చని అంటున్నారు. 

అదోకకటి అలా ఉంటే, పాత వాసనలు యశ్వంత్ సిన్హాకు మేలు చేస్తాయా అంటే, అనుమానమే అంటున్నారు. యశ్వత్ సిన్హానే అన్నట్లు, అప్పడు ఆయన ఉన్నప్పుడు ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి పొంతనే లేదు. సో.. వ్రతం  చెడ్డా సిన్హాకు ఫలితం దక్కక పోవచ్చని, ముఖ్యంగా మహారాష్ట్ర పరిణామాలు, ఇటీవల జరిగిన, రాజ్య సభ ఎన్నికల ఫలితాలు, కొద్ది రోజుల క్రితం యూపీ సహా మరికొన్ని రాష్ట్రాలలో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో బీజేపీలోని అసంతృప్తులు క్రాస్ ఓటింగ్’ కు పాల్పడే సాహసం చేయక పోవచ్చని, పరిశీలకులు అంటున్నారు.