Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. క్యాన్సర్ గురించి తాజాగా బయటపడిన షాకింగ్ నిజం..!
posted on: Feb 4, 2026 2:07PM
.webp)
క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య. క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు. ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షలా 50వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి.
ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం కంటే.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా ఉండటం మంచిదని చెబుతున్నారు.
క్యాన్సర్ కు చికిత్స మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్ కు హాజరు కావడం, జీవనశైలి మార్చుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం, శరీరంలో ఏదైనా అసౌకర్యం అనిపించినా, ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం, శరీరంలో మార్పులు వంటివి జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది. పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది.
ప్రభుత్వ విధానాలు..
తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు, దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి బడ్జెట్ లో ఉన్నాయి.
ప్రజలు చేయాల్సినది..
క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి, శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి. ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.
*రూపశ్రీ.






