కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో లేడి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..? 

అతడు  కాంగ్రెస్ ఓ  ఎమ్మెల్యే. మాజీ మంత్రి కూడా. అతని పేరు ఉమాంగ్ సింఘార్.  అతని బంగళాలో 38 ఏళ్ల మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. అక్కడ ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. అందులో కీలక విషయాలు ఉన్నాయి. ఎమ్మెల్యే జీవితంలో చోటు కోసం ఎంతో ప్రయత్నించానని.. కానీ అది సాధ్యం కాదని అర్ధమైందని ఆమె పేర్కొంది. అందుకే జీవితం మీద విరక్తి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. ఎమ్మెల్యే బంగళాలో మహిళ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎమ్మెల్యే సింఘార్ బంగళాలో ఆ మహిళతో పాటు పని మనిషి, అతడి భార్య ఉంటున్నారు. ఆదివారం ఉదయం పని మనిషి భార్య ఆమె మహిళ గది తలుపుతట్టారు. కానీ ఎంత సేపటికీ అవతలి నుంచి స్పందన రాలేదు. కంగారుపడిన పని మనిషి వెంటనే ఎమ్మెల్యే సింఘార్‌కు సమాచారం ఇచ్చారు. కానీ అప్పుడు ఆయన భోపాల్‌లో లేరు. ఏం జరిగిందో చూడాలని.. తన బంధువు ఒకరిని బంగళాకు పంపించారు. ఆయన బంగళాకు వెళ్లి ఆరా తీశారు. ఆ మహిళ ఉంటున్న గది డోర్‌ను బద్దలు కొట్టారు. లోపల ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. అని భోపాల్ అడిషనల్ ఎస్పీ బదోరియా పేర్కొన్నారు.

ఎమ్మెల్యే స్పందన.. 

ఉమాంగ్ సింఘార్ గంధ్వాని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళ ఆత్మహత్యపై ఆయన స్పందించారు. ఆమె తనకు మంచి స్నేహితురాలిని. ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఆమె మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం ఈ మధ్యే తనకు తెలిసిందని ఆయన తెలిపారు. తాను మూడు రోజులుగా భోపాల్‌లో లేదని.. ఆమె మృతి వార్త విని షాక్‌కు గురయ్యానని ఆయన అన్నారు. కాగా, మృతురాలి స్వస్థలం హర్యానాలోని అంబాల. ఏడాది క్రిత నుంచి ఆమె భోపాల్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వచ్చి పోతుండేది. గత నెల రోజులుగా ఎమ్మెల్యే బంగళాలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె హత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎమ్మెల్యే సింఘార్ రెండు రోజులుగా భోపాల్‌లో లేరు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఈఘటన చోటుచేసుకుంది.